నాకు టీవీలా జీవించాలనుంది!

'నిజంగా ఇది ప్రతి తల్లిదండ్రుల మనసును కదిలించే విషయమే. కానీ నువ్వంతలా ఎందు ఏడుస్తున్నట్లు?' అని ఓదార్చే ప్రయత్నం చేసిన ఆ భర్తకు ఆమె ఇచ్చిన సమాధానంతో షాక్‌ తిన్నంత పనయింది....!!

‘నిజంగా ఇది ప్రతి తల్లిదండ్రుల మనసును కదిలించే విషయమే. కానీ నువ్వంతలా ఎందు ఏడుస్తున్నట్లు?’ అని ఓదార్చే ప్రయత్నం చేసిన ఆ భర్తకు ఆమె ఇచ్చిన సమాధానంతో షాక్‌ తిన్నంత పనయింది….!!

ప్రాథమిక స్థాయి పిల్లల్ని ఓ చిరు వ్యాసం వ్రాసుకు రావాల్సిందిగా టీచరమ్మ పురమాయించింది. అందులో వారు దైవం నుండి ఏమేమి కోరుకుంటారో వాటిని మాత్రమే పేర్కొనాల్సిందిగా షరతు పెట్టింది. అందరూ వారికిష్టమయినది రాసి ఇచ్చారు. టీచరమ్మ ఇంటికి చేరు కున్న తరువాత ధరణీ తారలు వ్రాసిన వ్యాసాల్ని చదవనారంభిం చింది. అందులో ఓ అబ్బాయి వ్రాసిన వ్యాసం ఆమెను బాగా కదిలిం చింది. ఆమె బాగా ఏడుస్తుండగా ఆమె భర్త ఇంట్లో ప్రవేశించాడు. భార్యను ఏడుస్తూ చూసి ఎంతో ప్రేమగా – డియర్‌! ఏమయింది? ఎందుకు ఏడుస్తున్నావు? అని ఆరా తీశాడు. సమాధానంగా గృహిణి తను అంత క్రితమే చదివిన వ్యాసాన్ని భర్తకు అందిస్తూ చదవమని సైగ చేసింది. భర్త చదవనారంభించాడు….!

దేవా! నేనీ రోజు నీతో ఓ ప్రేత్యకమయిన కోరికను కోరుకుంటున్నాను. ఆలకిస్తావు కదూ! ఫ్లీజ్‌! నన్ను టీవిలా మార్చేయవూ! నేను అచ్చం టీవీ లానే జీవించాలనుకుంటున్నాను. టీవీలానే నా ఇంట్లో నాకు ఓ ప్రత్యేక స్థానం ఉండాలి. నా పరివారమంతా నా చుట్టూ గుమిగూడాలి. నేను చెప్పేది, చేసేది శ్రద్ధగా వినాలి, చూడాలి. నేను వారందరి దృష్టిని ఆకర్షించే క్రేందబిందువునవ్వాలి. కన్నార్పకుండా వారందరూ నన్నే చూస్తుండాలి. ఎదురు ప్రశ్న వేయకుండా నా మాటలు వింటుండాలి. టీవీ కాసేపు పని చెయ్యకపోయినా వారెంతగాయితే పరేషాన్‌ అవు తారో నాకు కాసింత జబ్బు చేసినా వారు అలానే తల్లడిల్లాలి. టీవీ పని చేసినా, చేయకపోయినా దాని పట్ల ఉన్న శ్రద్ధే వారికి నా యెడల కూడా కలగాలి.

నాన్న ఆఫీసు నుండి ఇంటి రాగానే ఆయన ఎంత అలసిసొలసి ఉన్నా టీవీ ముందర కూర్చున్నట్లే నాతో కూర్చోవాలి. అమ్మ బాధలో ఉన్నప్పుడు, చిరాకు కలిగిప్పుడు టీవీతో కాలకేపం చేసినట్లే నాతో సమయం గడపాలి. నా తమ్ముళ్లు, చెల్లెల్లు టీవీ ఛానల్స్‌ కోసం పోట్లాడుకున్నట్లే నా సహచర్యం కోసం పోటీ పడాలి. టీవీ చూడటానికి ఎలాగయినా సమయాన్ని తీసి దాన్ని చూస్తారో అలానే నా కోసం సయితం వారు సమయం తీసి నాతో గడపాలి. వారి అలసటకు విశ్రాంతిగా, వారి బాధకు ఓదార్పుగా, వారి ఒంటరితనానికి తోడుగా, వారి సంతోషానికి సాధనంగా వారు నన్ను భావించాలి. చివరిగా దేవా! నేను నీ నుండి కోరుకునేది – వారిని ఎంటర్‌టైన్‌ చేసే, వారిని సంతోష పర్చే, వారిని నవ్వించే టీవీలా నన్ను మార్చవూ ఫ్లీజ్‌! ఇది తప్ప నేను నీ నుండి మరేమీ ఆశించను. నన్ను కూడా అచ్చం టీవీలా మార్చేయవూ ఫ్లీజ్‌…!!
భర్త చదవడం పూర్తి చేసి ఓ వేడి నిట్టూర్పు వదులుతూ….దేవా! పాపం పసివాడు! ఎంత యాతనను అనుభవించాడో!! అతని పారెంట్స్‌ కూడా ఓ పారెంట్సేనా? అందరూ ఉన్న అనాథలా ఉన్నాడు పాపం!!! అని తనవంతు సానుభూతిని తెలియజేశాడు. భర్త మాటలు విన్న భార్య రెండు చేతుల మధ్య ముఖాన్ని దాచుకుని ఎక్కి ఎక్కి ఏడ్వనారంభించిం ది.
‘నిజంగా ఇది ప్రతి తల్లిదండ్రుల మనసును కదిలించే విషయమే. కానీ నువ్వంతలా ఎందు ఏడుస్తున్నట్లు?’ అని ఓదార్చే ప్రయత్నం చేసిన ఆ భర్తకు ఆమె ఇచ్చిన సమాధానంతో షాక్‌ తిన్నంత పనయింది….!!

ఏమండీ!……
అది…..మన….అబ్బాయి….రాసిన…వ్రాసమే…నండి!!
అంతా…………శ్మశాన….నిశ్శబ్దం…………………………..!!!

అవును టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌తో మనకున్న అనుబంధం, దాని కోసం మనం కేటాయించే సమయం మన పిల్లల కోసం, వారి ఆలనాపాలన కోసం కేటాయించడం లేదు. టీవీ,స్మార్ట్‌ఫోన్ల రూపం ఈ పరికరాలు మన బంధాల మీద, అనుబంధాల మీద పెత్తనం చెలాయిస్తున్నాయి. మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆధ్యాత్మిక జీవనాన్ని శాసించే స్థాయికి అవి చేరుకున్నాయి. అవి లేకుండా శ్వాసించలేము అన్న అధో స్థికి అవి మనల్ని చేర్చాయి. ఏమిటి? కాంతి కళ్ళు తెరిచే సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఈ కేసులో ముద్దాయి మీరే, న్యాయవాది మీరే, జర్జీ మీరే. పరికరాల్ని వాడుకొని పరివారాన్ని ప్రేమిస్తారో, పరి వారాన్ని వాడుకొని పరికరాల్ని ప్రేమిస్తారో నిర్ణయం మాత్రం మీదే!!

Related Post