ప్రోత్సాహం – ప్రశంస

మనిషి చేసే ఏ ప్రస్థానంలోనయినా తోటి బాట సారుల సాంగత్యం సహకారం, ప్రోత్సాహం, ప్రశంస, కలిసిపోయే మిత్రత్వం తప్పనిసరి. అయితే ప్రశంస లభించినందుకు జానెడు పొంగి పోవడం, విమర్శ ఎదురయినప్పుడు బారెడు కృంగి పోవడం ఒక విశ్వాసికి ఏ మాత్రం శోభించనిది.

మనిషి చేసే ఏ ప్రస్థానంలోనయినా తోటి బాట సారుల సాంగత్యం సహకారం, ప్రోత్సాహం, ప్రశంస, కలిసిపోయే మిత్రత్వం తప్పనిసరి. అయితే ప్రశంస లభించినందుకు జానెడు పొంగి పోవడం, విమర్శ ఎదురయినప్పుడు బారెడు కృంగి పోవడం ఒక విశ్వాసికి ఏ మాత్రం శోభించనిది.

ప్రశంస పన్నీరు వంటిదే కానీ;
ఎవరో మెచ్చుకోవాలని ఏ పూవు పూయదు. పువ్వు పూయడం, పరిమళించడం, పరిమళాలను వెదజల్లడం దాని స్వభావం. ఆయినా ప్రశంస లభించినప్పుడు దానికంటూ ఓ గుర్తింపు లభిస్తుంది. ప్రశంసకు ప్రాణం లేని పాషాణాలు చలించకపోయినా, ప్రాణం గల పశువులు స్పందించడం, మనుషులు ఇష్ట పడటం మనం చూస్తూ ఉంటాము. ‘ప్రశంస పన్నీరు వంటిది. దాన్ని చల్లుకోవడానికే గానీ, త్రాగడానికి కాదు’ అని మన పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం. ”ముఖం మీద ప్రశించడం మనిషిని వెన్నుపోటు పోటు పొడవడంతో సమానం, అలా చేసేవారిని ముఖాన మట్టి కొట్టండి” (అంటే ఆ భజన ద్వారా వారు ఆశిస్తున్న దాన్ని వారికి ఇచ్చేసి వారి నోరు మూయించండి).(ముస్లిం) అని ప్రవక్త (స) వారి మాట కూడా దివ్యావిష్కృతిలో అంతర్భాగమే. అదే సందర్భంలో ”మంచి పనికి లభించే ప్రశంస విశ్వాసికి లభించే అడ్వాన్స్‌ (ముందస్తు) శుభవార్త” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం).

దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ప్రశంస కోసం అదే పనిగా ఎదురు చూడటం అంత మంచది కాదు. మనం ఆశించకుండా లభించే ప్రశంసకు ఉబ్బి తబ్బిబ్బవ్వడమూ మంచిది కాదు. అయితే ప్రశంసని ఉత్తేజాన్ని ఇచ్చేదిగా, మరింత ఉత్సాహాన్ని కలుగజేసి అంకితభావంతో పురోగమించేలా చేసేదిగా భావించడం ఆ ప్రశంసను నిర్మాణాత్మక ప్రశంసగా మార్చి వేస్తుంది.మనిషి ఎదిగే క్రమంలో ప్రశంస ఎంతో అవసరం. ప్రశంస, మెప్పుకోలు ఎంతో శక్తినిస్తాహయి. తనలోని శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకత ను, నైపుణ్యాలను వెలికి తీసి సాన బెట్టుకోవడానికి ప్రశంస ఎంతో ఉప యోగ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి దిన, వార, మాస పత్రికలు, బ్లాగులు, ఫేస్‌బుక్‌,ట్విట్టర్లు వంటి సోషల్‌ మిడియా ఎంత మాత్రం అతీతం కాదు.

మనసు కొరుకునే గుర్తింపు ప్రశంస:
మనిషి చాలా సందర్భాల్లో ఒక విధమయినటువంటి అచేతనావస్థకు లోనయి ఉంటాడు. అలాంటి సందర్భంలో కాసింత ప్రోత్సాహం, నేనున్నానన్న భరోసా అతనికి కొండంతటి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే బాగా ప్రోత్సహించి, స్ఫూర్తిదాయక హితోక్తులతో విద్యా ర్థులు ప్రగతి పథాన నడిపించే వారు ఉత్తమ గురువులయితే, కేవలం పాఠం వరకు మాత్రమే చెప్పే వారు మధ్యస్థాయి గురువులయితే, పాఠం అర్థమ య్యిందా లేదా అని ప్టించుకోకుండా వ్టి బ్టి ప్టించే వారు ఉత్తుత్తి గురు వులయితే, అది జ్ఞాపకం చేెసుకు రాలేదని కొట్టి , హేళన చేసే వారు అధమ స్థాయి గురువులు. మన దురదృష్టం ఏమిటంటే ఇలాంటి గురువులే మనకు అధిక శాతం దర్శనమిస్తారు.మనిషి చేసే ఏ ప్రస్థానంలోనయినా తోటి బాట సారుల సాంగత్యం సహకారం, ప్రోత్సాహం, ప్రశంస, కలిసిపోయే మిత్రత్వం తప్పనిసరి. అయితే ప్రశంస లభించినందుకు జానెడు పొంగి పోవడం, విమర్శ ఎదురయినప్పుడు బారెడు కృంగి పోవడం ఒక విశ్వాసికి ఏ మాత్రం శోభించనిది. కనుకనే పెద్దలన్నారు: ”విమర్శ అనేది..వేషం మార్చుకుని వచ్చిన ప్రశంస లాంటిది” అని.

మనిషి మంచి చేయాలన్న ప్రోత్సాహం అవసరం. చెడు నుండి దూరంగా ఉండాలన్నా ప్రోత్సాహం అవసరం. మంచి చేసిన మీదట ప్రశంస అవసరం. చెడు నుండి దూరంగా ఉన్నా ప్రశంస అవసరం. కనుకనే అల్లాహ్‌ మరియు అల్లాహ్‌ ప్రవక్త అనేక సందర్భాల్లో స్వర్గ నరకాలను ప్రస్తావించి ప్రజల్ని మంచికై పురిగొల్పారు, చెడు నుండి వారించారు. అలా మంచిని గరించి ఆదేశించిన వారిని, చెడు నుండి ఆగి ఉండటమే కాక, అన్యుల్ని వారించిన వారిని ప్రశంసించారు కూడా. మచ్చుకు కొన్ని ఉదాహరణల్ని తెలుసుకుం దాం!

ప్రోత్సాహం-ప్రశంస ఖుర్‌ఆన్‌లో:
”మీ ప్రభువు క్షమాభిక వైపునకు పరుగెత్తండి. ఇంకా భూమ్యాకాశాలంత విశాలమయిన స్వర్గం వైపునకు పరుగిడండి”. (అల్‌ హదీద్‌: 21) అని అల్లాహ్‌ ప్రోత్సహించడమే కాక అలా నడుచుకున్నవారిని ప్రశించాడు కూడా. ”ఇక విశ్వాసంలో ముందంజ వేసినవారు! ఎంతైనా వారు మున్ముందు ఉండే వారే. వారే అల్లాహ్‌ా సామిప్యం పొందినవారు. వారు అనుగ్రహభరితమయిన స్వర్గ వనాలలో ఉంారు”. (అల్‌ వాఖిఅహ్‌: 10-12) అని ప్రశంసించాడు కూడా.
పోత్సాహం-ప్రశంస హదీసులో:

ప్రవక్త (స) పేదవాడయిన రబీఅహ్‌ బిన్‌ కఅబ్‌ అల్‌ అస్లమీ (ర) అనే తన సేవకుడిని వివాహం కోసం ప్రోత్సహించడమే కాక వివాహానంతరం వలీమా కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే తరచూ అతను అందించే సేవను మెచ్చుకునేవారు. అంతే కాదు మస్జిద్‌లో చెత్త ఊడ్చే పని చేసే ఓ సామాన్య మహిళామూర్తి మరణించి ఖనన సంస్కారాలు కూడా పూర్తయ్యాయని తెలుసుకున్న ప్రవక్త (స), ఆ విషయాన్ని తనకు చెప్పనందుకు కాసింత అలిగారు కూడా. ఆ తర్వాత స్వయంగా ఆమె సమాధి వద్దకు వెళ్ళి నమాజు చేశారు. ఆయన ఒకరి కోసం నమాజు చేయడం అంటే వారికి ఇహపరాల ప్రశాంతత చేకూరమే.”ఓ ప్రవక్తా! వారి బాగు కోసం ప్రార్థించు. నిశ్చయంగా నీ ప్రార్థన వల్ల వారికి శాంతి లభి స్తుంది”. (అత్తౌబహ్‌: 103)
హునైన్‌ సంగ్రామ సందర్భంగా అన్సార్ల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసుకున్న ప్రవక్త (స) హిజ్రత్‌ సదర్భంగా వారు అందించింన సేవలను కొనియాడారు: ”నా తెగవాళ్లు నన్ను తిరస్కరించినప్పుడు మీరు నాకు మద్దతు నిచ్చారు. నా తెగవారు నన్ను బహిష్కరించినప్పుడు నన్ను చేరదీసి ఆశ్రయ మిచ్చారు. వ్టి చేతులతో నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించారు. ఇవన్నీ వాస్తవాలే. వీటిని నేను ఒప్పుకుంటు న్నాను”. ప్రవక్త (స) వారి ఈ ప్రశంస విన్నాక సకల సమస్యలను మరచి పోయారు. అప్పుడు ప్రవక్త (స) – ”ప్రజలు తమ ఇండ్లకు ఒంటెల్ని, మేకల్ని తీసుకెళుతుంటే, మీరు అల్లాహ్‌ను,ఆయన ప్రవక్తను మీతోపాటు తీసుకెళ్ళడం మీకు సంతోషదాయకం కాదా?” అని అడిగితే అందరూ ‘మాకు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తే చాలు’ అని సమాధానమిచ్చారు. ఆనక ప్రవక్త (స) వారిని మెచ్చుకుంటూ – ”ఓ అల్లాహ్‌! నా అనుచరులకు శాంతీ సౌభాగ్యాల ను ప్రసాదించు. వారిపై, వారి సంతానంపై నీ కరుణామృతాన్ని చిలికించు” అని దీవించారు.

స్వీయ ప్రశంస:

ప్రశంస అనేది మనిషిలోని శక్తిసామర్థ్యాలను, సృజనాత్మకత ను వెలికితీసే పాతాళ గరిగె వింది. ఇసుకను తోడి చల్లే చెలిమ వింది. ప్రతి మనిషికి ప్రోత్సాహం, ప్రశంస అవసరం. ఒకరు మనల్ని మెచ్చుకోక పోయినా ఓ మంచి కార్యం పూర్తి చేసినప్పుడు మనల్ని మనమే ప్రశంసిం చుకోవాలి. ఆఖరి క్షణాల్లో తన చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించి ఓ యూద బాలుని వద్ద నుండి బయటకి వస్తూ ప్రవక్త (స) ఇలా వేడుకున్నారు: ”అల్‌హమ్దు లిల్లాహిల్లజీ అన్‌ఖజహు బీ మినన్నార్‌” – నా మాధ్యమంగా ఈ బాబుని నరకాగ్ని నుండి కాపాడిన అల్లాహ్‌కు వేనవేల కృతజ్ఞతలు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వీయ ప్రశంస విషయంలో ఒక విశ్వాసి ప్రతి పని ప్రారంభించడానికి ముందు చెప్పే ‘బిస్మ్మిల్లాహ్‌’ ప్రోత్సాహం అయితే పని ముగిసాక చెప్పే ‘అల్‌హమ్దు లిల్లాహ్‌’ ప్రశంస వంటిది. సకల విధమయి నటువంటి ప్రశంసలకు సిసలయిన అర్హుడు సర్వలోకాలకు ప్రభువయిన అల్లాహ్‌యే.

Related Post