సర్వ రోగ నివారిణి ‘ఇస్తిగ్ఫార్‌’

  ''క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుండి మీపై ధారా పాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లో, మీ పుత్ర సంతతి పురోగతిలో తోడ్పడతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు''. (నూహ్‌: 10-12)

”క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుండి మీపై ధారా పాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లో, మీ పుత్ర సంతతి పురోగతిలో తోడ్పడతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు”. (నూహ్‌: 10-12)

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

‘ఇస్తిగ్ఫార్‌’ అంటే అర్థం క్షమాపణ కోసం అల్లాహ్‌ాను వేడుకోవటం. తన వైపుకు మరలి క్షమాభిక్ష వేడుకునే భక్తులను అల్ల్లాహ్‌ా అమితంగా ఇష్టపడతాడు. వారిపై తన కరుణానుగ్రహాలను పుష్కలంగా కురిపిస్తాడు. దైవ ప్రవక్తలు తమ జాతి ప్రజలకు పిలుపు ఇచ్చినప్పుడల్లా ఇస్తిగ్ఫార్‌ (క్షమాపణ) చేయమని నొక్కి వక్కాణించేవారు. ఉదాహరణకు:- దైవ ప్రవక్త నూహ్‌ (అ) తన జాతి వారితో ఇలా అన్నారు:

”క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుండి మీపై ధారా పాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లో, మీ పుత్ర సంతతి పురోగతిలో తోడ్పడతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు”. (నూహ్‌: 10-12)

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) తన అనుయాయుల నుద్దేశించి ఏమని ఉపదేశించారో చూడండి – ”ప్రజలారా! మీ ప్రభువు వైపునకు మరలండి. మీ పాపాల మన్నింపు కోసం ఆయన్ని ప్రార్థించండి. నన్నే చూడండి, నేను రోజుకు వంద సార్లు క్షమాపణకై అల్లాహ్‌ను వేడుకుంటూ ఉంటాను”. (ముస్లిం)

ఇస్తిగ్ఫార్‌ శుభాల సరోవరం. మరో విధంగా చెప్పాలంటే అది సర్వరోగ నివారిణి. పుణ్య పురుషులైన హజ్రత్‌ హసన్‌ బస్రీ (ర) వద్దకు ఒక వ్యక్తి వచ్చి తన ప్రాంతంలో కరువుకాటకాల గురించి బాధతో చెప్పుకుంటే ”ఇస్తిగ్ఫార్‌ చేయండి” అని ఆయన ఉపదేశించారు. మరో వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి దారిద్య్రం గురించి ఫిర్యాదు చేస్తే, అతనికి కూడా ”ఇస్తిగ్ఫార్‌ చేయండి” అని ఆ పుణ్యాత్ముడు సలహా ఇచ్చారు. ఇంకొక వ్యక్తి వచ్చి, తన తోట వానలు లేక ఎండిపోయిందని వాపోయాడు. ఆయన అతనికి కూడా అదే సలహా ఇచ్చారు. వేరొక వ్యక్తి వచ్చి తనకు సంతానం కలగటం లేదని బాధతో చెప్పుకోగా, ఆయన అతనికి కూడా ఇస్తిగ్ఫార్‌ చికిత్సనే ప్రతిపాదించారు. దీన్నంతటినీ గమనించిన ఒక శిష్యుడు, ‘తమరు అందరికీ ఒకే మందు (ఇస్తిగ్ఫార్‌ మందు) ఇస్తున్నారేమిటి?’ అని సందేహపడితే ”ఈ సమస్యలన్నింటికీ అల్లాహ్‌ా చూపిన పరిష్కార మార్గం ఇదే” అని ఆయన సమాధాన మిచ్చారు.

ఇస్తిగ్ఫార్‌ శుభాలు

దైవధ్యాన సంబంధిత అంశాలన్నింటి సర్దారు ‘ఇస్తిగ్ఫార్‌’!
ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తి నుండి షైతాన్‌ పారిపోతాడు – అల్లాహ్‌ ప్రసన్నుడవుతాడు.
ఇస్తిగ్ఫార్‌ వల్ల గుండె బరువు తగ్గుతుంది. ఆవేదన, దుఃఖం తొలగుతాయి.
జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది.
ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తి ముఖ వర్చస్సు పెరుగుతుంది.
ఉపాధి అతన్ని వెతుక్కుంటూ వస్తుంది.
దాసుడు దేవుని ప్రేమకు పాత్రుడవుతాడు. దైవ సామీప్యం లభిస్తుంది.
ఆంతర్యం ప్రకాశమానమవుతుంది. హృదయం నిత్యం సచేతనంగా ఉంటుంది.
దాసునికి – దైవానికి మధ్య భయాందోళన, వ్యాకులత వంటివి ఉండవు.
ఇస్తిగ్ఫార్‌ వల్ల పాపాలు ప్రక్షాళనం అవుతాయి.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తిపై అనిర్వచనీయమైన ప్రశాంతత ఆవరిస్తుంది. ఆతనికి దైవ దూతల రక్షణ (ప్రొటక్షన్‌) లభిస్తుంది.
ఇస్తిగ్ఫార్‌లో నిమగ్నుడై ఉండే వ్యక్తి చాడీలు, దురనుమానాలు, పరనింద నీతి బాహ్యతల నుండి సురక్షితంగా ఉంటాడు.
ఇస్తిగ్ఫార్‌ ప్రళయదినం నాటి బాధాకర పరిస్థితి నుండి మనిషికి ఉపశమనం ఇస్తుంది.
ఏకాంతంలో ఇస్తిగ్ఫార్‌తో కంట తడిపెట్టిన వానికి తీర్పుదినాన దైవ సింహాసనం (అర్ష్‌) నీడ లభిస్తుంది.
ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తి దైవాన్ని మరువడు. అజాగ్రత్తగా ఉండడు.
ఇస్తిగ్ఫార్‌ చేసేవాడు కాపట్యం వాతన పడడు. ఎందుకంటే

Related Post