స్వార్థాన్ని విడిచిపెట్టాలి

‘‘మీరు మీకోసం ఇష్టపడినదాన్నే మీ సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకూ, మీలో ఎవరూ విశ్వాసులు కాజాలరు’ (సహీబుఖారీ, సహీమ్ ముస్లిం)’’. విశ్వాసం పరిపూర్ణస్థాయికి చేరాలన్నా, హృదిలో మానవీయ సుగుణం పరిమళించాలన్నా, విశ్వాసమాధుర్యంలోని శుభాలను పొందాలన్నా మానవులు స్వార్థప్రియత్వం నుండి బయట పడడం తప్పనిసరి. మనసులో స్వార్థం గూడుకట్టుకొని ఉంటే, తమ కోసం ఏ స్థితిని కోరుకుంటారో, అలాంటి స్థితినే వారి కోసం కూడా కోరుకోవడం అసాధ్యం. అందుకని ముందుగా స్వార్థం అనే చెదపురుగును నిర్మూలించాలి.

సమాజంలో మానవుల మధ్య సంబంధాలు సుహృద్భావ పూరితంగా, ప్రేమానురాగాలతో పరిఢవిల్లాలంటే ముందుగా వారు ప్రేమతత్త్వాన్ని అలవరచుకోవాలి. తమ మనసుతో తోటి మానవ సోదరుల పట్ల సదభిప్రాయాన్ని, సహనగుణాన్ని ప్రతిష్టించుకోవాలి. స్వయం కోసం ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉంటామో, ఎలాంటి స్థితిని కోరుకుంటామో ఇతరుల కోసం కూడా అలాంటి ఆలోచనలే కలిగి ఉండాలి.

ఈ విషయాన్నే ముహమ్మద్ ప్రవక్త (స) ఒక ప్రవచనంలో- ‘‘మీరు మీకోసం ఇష్టపడినదాన్నే మీ సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకూ, మీలో ఎవరూ విశ్వాసులు కాజాలరు’ (సహీబుఖారీ, సహీమ్ ముస్లిం)’’. విశ్వాసం పరిపూర్ణస్థాయికి చేరాలన్నా, హృదిలో మానవీయ సుగుణం పరిమళించాలన్నా, విశ్వాసమాధుర్యంలోని శుభాలను పొందాలన్నా మానవులు స్వార్థప్రియత్వం నుండి బయట పడడం తప్పనిసరి. మనసులో స్వార్థం గూడుకట్టుకొని ఉంటే, తమ కోసం ఏ స్థితిని కోరుకుంటారో, అలాంటి స్థితినే వారి కోసం కూడా కోరుకోవడం అసాధ్యం. అందుకని ముందుగా స్వార్థం అనే చెదపురుగును నిర్మూలించాలి. ఇది అనుకున్నంత తేలికగా అంతమయ్యే పీడ కాదు. దీనికోసం అచంచలమైన విశ్వాసబలం కావాలి. నిర్మలమైన మనస్తత్త్వం ఉండాలి. ముహమ్మద్ ప్రవక్త (స) వారి ఉపదేశాలను మనసా వాచా కర్మణా ఆచరించినప్పుడే ఇది సాధ్యం.

ఇతరుల ఉన్నతిని ఓర్వలేని వారు వారిని ఇబ్బందులకు గురిచేసేవారు లేక ఇబ్బందులు ఉంటే సంతోషించేవారు, సహాయం చేసే గుణం లేని శిలాహృదయులు… ఎట్టిపరిస్థితిలోనూ విశ్వాసులు కాజాలరు. అందుకే ప్రవక్త మహనీయులు ఒక సందర్భంలో-
‘‘ఎవరి నోటి దురుసుతనం వల్ల, చేతల వల్ల ప్రజలు సురక్షితంగా (ప్రశాంతంగా) ఉండరో వారు విశ్వాసులే కాదు. ఎవరి విషయంలోనైతే ప్రజలు తమ ధనప్రాణాలకు ఎలాంటి నష్టం కలగదని భావిస్తారో వారే నిజమైన విశ్వాసులు’’ అన్నారు. సాధారణంగా నోరు, చెయ్యి ద్వారానే అనర్థాలు సంభవిస్తాయి. అందుకని వీటిని అదుపులో ఉంచుకుంటే అనర్థాలను నివారించవచ్చు. పరస్పరం ప్రేమమయులై ఉండాలి.

మాటలవల్లగాని, చేతల వల్ల గాని మరొకరి మనసు గాయపరచరాదు. సాటి సోదరుల పట్ల సదవగాహన, సదభిప్రాయం ఉండాలి. ఎలాంటి మంచిని, ఎలాంటి మేలును, ఎలాంటి వరాలను తాము తమకోసం కోరుకుంటే, కచ్చితంగా అలాంటి స్థితినే తమ సాటివారికోసం కోరుకోవాలి. ఇలాంటి భావనలు, ఆలోచనలు మానవ హృదయాల్లో ప్రాణం పోసుకుంటే, ఈ సమాజం సమస్త దుర్మార్గాలకు అతీతంగా, ప్రేమానురాగాలతో ప్రశాంత ఆనందనిలయంగా రూపుదిద్దుకుంటుంది.

Related Post