చూద్దామంటే చెద్దామంటే కాలం ఆగదు!

మనిషి తాను మరణించిన తర్వాత కూడా వారసుల హక్కు వారికివ్వడంతోపాటు, దానం చేసుకునేం దుకు వీలుగా ఇస్లాం అతనికి ఆస్తిలోని మూడో వంతును వసీయతు చేసుకునే వెసులుబాటును అతనికిచ్చింది. అదే అతనికి వారసులనే వారె వ్వరూ లేకపోతే మొత్తం ఆస్తిని అతను ధారాదత్తం చేస్తున్నానన్న వీలు నామా వెసులుబాటును సయితం ఇస్లాం అతనికిస్తొంది.

మనిషి తాను మరణించిన తర్వాత కూడా వారసుల హక్కు వారికివ్వడంతోపాటు, దానం చేసుకునేం దుకు వీలుగా ఇస్లాం అతనికి ఆస్తిలోని మూడో వంతును వసీయతు చేసుకునే వెసులుబాటును అతనికిచ్చింది. అదే అతనికి వారసులనే వారె వ్వరూ లేకపోతే మొత్తం ఆస్తిని అతను ధారాదత్తం చేస్తున్నానన్న వీలు నామా వెసులుబాటును సయితం ఇస్లాం అతనికిస్తొంది.

”మీలో ఎవరికయినా మరణ ఘడియలు సమీపించి, వారి వద్ద ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే, వారు తమ తల్లిదండ్రుల, సమీప బందువుల పేర ఉత్తమ రీతిలో వీలునామా వ్రాసి పోవడం విధిగా చేయబడింది. భయభక్తులు కలవారికి ఈ విధ్యుక్త ధర్మం మరింతగా వర్తిస్తుంది”. (దివ్యఖుర్‌ఆన్‌-2: 180)
వసీయతుకి సంబంధించిన ఈ ఆజ్ఞ వారసత్వ పంపకాల ఆయతు అవ తరించక ముందు వచ్చింది. అయితే ఇప్పుడీ ఆజ్ఞ రద్దు పరచబడింది. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ప్రబోధించారు: ”అల్లాహ్‌ా ప్రతి హక్కు దారునికీ అతని హక్కును ఇచ్చేశాడు.(అంటే వారసుల ఆస్తి భాగాలు నిర్థా రించబడ్డాయి). కాబ్టి ఇకమీదట ఏ వారసుని పేరిట కూడా వసీయుతు చేయడం (వీలునామా రాయడం) ధర్మసమ్మతం కాదు”. (తిర్మిజీ, ఇబ్ను మాజహ్‌ా-కితాబుల్‌ వసాయా) అయితే వారసత్వపు హక్కు లభించనటు విం బంధువుల పేర, నిరుపేదల పేర, సేవా సంస్థల పేర లేదా దైవ మార్గంలో ఖర్చు పెట్టే ఉద్దేశంతో వీలునామా వ్రాయవచ్చు. కానీ ఈ విల్లు గరిష్ట పరిమితి ఆస్తిలో మూడో వంతు మాత్రమే. అంతకు మించి విల్లు వ్రాసేందుకు అనుమతి లేదు. వీలునామా ఆదేశం ముస్తహబ్‌. (సహీహ్‌ బుఖారీ, కితాబుల్‌ ఫరాయిజ్‌)
మరణం సమదర్శి. కుబేరులు, కూికి కరువయిన వారు, పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పురుషులు-ఏ ఒక్కరినీ అది వదలదు. భార్యాపిల్లలయినా, బంధుమిత్రులయినా కడదాకే, కాి మ్టిలో కలిసేదాకే! కానీ మనం వ్రాసుకునే వీలు మన తర్వాత కూడా బ్రతికే ఉంటుంది. మనం కన్న కలల్ని నిజం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంది. అవసరమయితే వారసులతో పోరాడుతుంది. తప్పనిసరయితే వ్యాజ్యం వేసి కోర్టు దాకా వెళుతుంది. ఈ కారణంగానే మరణించిన వ్యక్తి ఆస్తి పంపకాని ముందు అతనిపై ఉన్న అప్పు చెల్లించాలనీ, మూడో వంతు ఆస్తిలో అతను వసీయతు చేసి వెళ్లిన దాన్ని పూర్తి చేయాలని, ఆ తర్వాతే ఆస్తి పంపక జర గాలని పండితులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మనిషి తాను మరణించిన తర్వాత కూడా వారసుల హక్కు వారికివ్వడంతోపాటు, దానం చేసుకునేం దుకు వీలుగా ఇస్లాం అతనికి ఆస్తిలోని మూడో వంతును వసీయతు చేసుకునే వెసులుబాటును అతనికిచ్చింది. అదే అతనికి వారసులనే వారె వ్వరూ లేకపోతే మొత్తం ఆస్తిని అతను ధారాదత్తం చేస్తున్నానన్న వీలు నామా వెసులుబాటును సయితం ఇస్లాం అతనికిస్తొంది. ఫలితంగా మనిషి తన మరణానంతరం కూడా తను చేయదలచుకున్న మంచి పనులు మిగులుంటే పూర్తి చేయగలడు. అయితే కొందరికి విల్లు అంటేనే ముల్లులా గుచ్చుకుంటుంది. అదేదో వినకూడని మాటగా, మరణ వార్తగా భావి స్తారు. ‘ఆరవై దాకా అలోచిద్ధాంలే’ అని దాట వేసే ప్రయత్నం చేెస్తారు. ”వీలునామా వ్రాయాల్సిన అవసరం ఉన్న ముస్లిం మూడు రాత్రులు గడవక ముందే దాన్ని సిద్దం చేసి పెట్టుకోవాలి” అన్నారు ప్రవక్త (స). అబ్లుల్ల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర) అంటున్నారు: ‘ప్రవక్త (స) వారి నోట ఈ మాట విన్నప్పి నుండి ఇప్పి వరకూ వీలునామా నా వద్ద లేకుండా ఒక్క రాత్రి కూడా గడవ లేదు’ అని.

”యుక్తి మరియు దూరదృష్టి ఏమిటంటే, మనిషి ఏదయినాఎవ్వరికయినా వసీయుతు చెయ్యాలనుకుంటే వీలునామాను తన వద్ద సిద్ధం చేెసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే, ఏ క్షణం మరణం అతనికి అతని ఆకాంక్షకి మధ్య వచ్చి అతన్ని కబళిస్తుందో ఎవ్వరికీ తెలీదు గనక” అన్నారు ఇమామ్‌ షాఫయీ (ర). ‘ప్రవక్త (స) వారు ఎలాంటి వసీయతు చేయలేదే’ అన్నది కొందరి వాదన, ధార్మికపరమయి వసీయతు ఆయన చేశారు. ప్రవక్త లందరూ చేశారు. ఉదాహరణకు: ”ఈ వసీయతే ఇబ్రాహిమ్‌ మరియు యాఖూబ్‌ తమ సంతానానికి చేశారు. (వారిలా అన్నారు:) ”నా బిడ్డలారా! అల్లాహ్‌ మీ కోసం ఈ ధర్మాన్నే ఇష్ట పడ్డాడు. కనుక మీరు ముస్లింలుగా తప్ప మరణించకూడదు సుమా!”. (బఖరహ్‌ా: 132) అలాగే మహా ప్రవక్త (స) వారు సయితం – తౌహీద్‌ గురించి, నమాజు గురించి, స్త్రీల గురించి, బానిసలు తదితర విషయాల గురించి వసీయతు చేశారు. అయితే ఆస్తి పరమయిన వసీయతు చెయ్య లేదు. ఎందుకంటే ఆయన వద్ద అంత ఆస్తే లేదు. ప్రవక్తలు ధర్మబద్ధమ యిన జ్ఞానాన్ని తప్ప దేన్ని వారసత్వంగా వదలి వెళ్లరు గనక.
బోలాస్నీ అనే ఆమెరికన్‌ మహిళ తన ఆస్తి మొత్తాన్ని పెంపుడు శునకానికి కట్టబెట్తింది అన్నట్టు వీలునామా గురించి ఇస్లాం ఏమంటుందో తెలియని చాలా మంది అన్య మతస్థుల్లానే వ్యవహరించడం గమనార్హం. ముగ్గురు కొడుకుల్లో ఎవరికి ముందు మగబిడ్డ పుడితే వారికే ఆస్తంతా దక్కుతుం దనో, సొంత బిడ్డలకు కాకుండా దత్తపుత్రునికి చెందుతుందనో, నా పెద్ద కుమారునికి, మనవడికి చెందుతుందనో, అనాథాశ్రమానికి చెందుతుం దనో వ్రాస్తుాంరు. ఇది ఎంత మాత్రం సమ్మతించదగిన విషయం కాదు. అలా వ్రాయాలనుకుంటే ఆస్తిలోని మూడోవంతుని మాత్రమే వ్రాసి ఇవ్వ గలరు. అలా కాని పక్షంలో వారు వ్రాసినా అ వీలునామా చెల్లదు.
సఅద్‌ బిన్‌ అబీ వఖాస్‌ (ర) కథనం-దైవప్రవక్త (స) మక్కాలో ఉన్న నన్ను సందర్శించడానికి ఏతెంచారు..”అల్లాహ్‌, అఫ్‌రా కుమారుణ్ణి కరుణించు గాక!” అని దీవించారు. అప్పుడు నేనన్నాను: ‘ఓ దైవప్రవక్తా! (స) నేను నా యావదాస్తిని ధారాదత్తం చేస్తున్నానని వీలునామా వ్రాస్తున్నాను’. అది విన్న ఆయన – ”లేదు” అన్నారు. ‘అందులోని ఓ భాగం’ అంటే, ”లేదు” అన్నారు. మూడోవంతు అని నేనడగ్గా-”సరే మూడోవంతు, మూడో వంతు కూడా ఎక్కువే. నువ్వు నీ వారసుల్ని అగత్యపరుల్ని చేసి, కనిస అవసరాల కోసం అన్యుల ముందర చేయి చాచే స్థితిలో వదలడంకన్నా కలిమి స్థితిలో వదలి వెళ్ళడం ఉత్తమం. నువ్వు ఎంత ఖర్చు ప్టిెనా అది ధర్మసమ్మత రీతిన సాగినంత వరకూ నీ పాలిట అది దానంగానే పరిగణించబడు తుంది. చివరికి నీ భార్యకు ప్రేమతో నువ్వు పెట్టే ముద్ద కూడా” అని సెలవిచ్చారు.
అలాగే వీలునామా ఎంత స్పష్టంగా ఉన్నా వ్యక్తి రాసిన వీలునామాను తారుమారు చేసే ప్రమాదం లేకపోలేదు. ”వీలునామా విన్న తర్వాత కూడా ఏ వ్యక్తయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది”. (బఖరహ్‌ా: 181) అని చెప్పడంతోపాటు వీలునామా వ్రాయ బడే సమయానికి నమ్మకస్తులయిన ఇద్దరు వ్యక్తులు దగ్గరుండటం అవ సరం అని కూడా ఖుర్‌ఆన్‌ నొక్కి చెబుతుంది. అలాగే వీలునామా తయారీలో గుడ్డిగా ఇతరుల మీద ఆధార పడకూడదు. లాస్ట్‌ బట్ నాట్ లిస్ట్‌ – పెద్దలు ఇచ్చి వెళ్లిన ఆస్తుల్నే కాదు, వారి ఆశయాల్ని సయితం గుండెలకు హత్తుకున్నవారే అసలు సిసలయిన వారసులు. వారి ఆశయం బతకాలి, ఆ ఆశయ రూపంలో మనం బతకాలి!

Related Post