నిలకడ విజయ రహస్యం

ఇస్లాం అగోచర విషయాలపై సైతం దృష్టి సారిస్తుంది. అందులోని నిజానిజాలను వేరు పర్చి, వాటి పట్ల ప్రజలలో ప్రబలివున్న అపోహాలు, మూఢవిశ్వాసాల్ని ప్రక్షాళనం గావిస్తుంది.. ఇస్లామీయ సిద్ధాంతాలన్నీ ‘ఈ నిఖిల జగత్తుకి ప్రభువు ఒక్కడే’ అన్న కేంద్రాంశంతో ముడిపడి వుంటాయి.

ఇస్లాం అగోచర విషయాలపై సైతం దృష్టి సారిస్తుంది. అందులోని నిజానిజాలను వేరు పర్చి, వాటి పట్ల ప్రజలలో ప్రబలివున్న అపోహాలు, మూఢవిశ్వాసాల్ని ప్రక్షాళనం గావిస్తుంది.. ఇస్లామీయ సిద్ధాంతాలన్నీ ‘ఈ నిఖిల జగత్తుకి ప్రభువు ఒక్కడే’ అన్న కేంద్రాంశంతో ముడిపడి వుంటాయి.

నిలకడ కూడా ఓ గొప్ప వరమే. భూమిపై నివసించే వారిలో భిన్న మనస్తత్వాలు కల వారున్నారు. వారి స్వభావాన్ని బట్టి మార్గాలు నిర్థారితమవుతాయి. వీరిలో శ్రేష్ఠులు ఇహం లోనే పరలోక మార్గాన్ని ఎంచుకుంటారు. వారు సత్యవంతులుగా పరగణించబడతారు. రండి! వారి మార్గాన్ని గురించి తెలుసుకుం దాం!! నిలకడలోని మహత్యం ఎటువంటిదో గ్రహిద్దాం!!!
మహా ప్రవక్త (స) సన్నిధికి ఓ సహచరుడు వచ్చి ‘ఇస్లాంలోని ఒక సమగ్రమయిన ఉపదే శం చేయండి. ఆ తరువాత నేను ఎవ్వరిని ప్రశ్నించే పరిస్థితి రాకూడదు’ అని అన్నారు. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ాను విశ్వ సించానని చెప్పు, దానిపై నిలకడ కలిగి ఉండు”. అంటే-మనసులో అల్లాహ్‌ాని ధ్యాని స్తూ నోటితో పలుకుతూ, మన విశ్వాసాన్ని మనం చక్క దిద్దుకుంటూ ఉండాలి. నిలకడ కలిగి ఉండాలి. మంచి కార్యాన్ని చేపట్టాలి. చెడు కార్యాన్ని, చెడు ప్రవర్తనని విడనాడాలి. వక్రత గల ఏ పనినీ మనం చెయ్యకూడదు. ఈ వచనాన్ని సదా దృష్టిలో పెట్టుకోవాలి:
‘నిస్సందేహంగా ఎవరైతే ‘మా ప్రభువు అల్లాహ్‌ాయే’అని పలికి, తర్వాత దానిపై గట్టి గా నిలబడ్డారో వారికె లాంటి భయంగానీ, దుఃఖంగానీ లేదు’. (అహాఖప్‌;13)

నిలకడ అంటే ఏమిటి?

తాను నమ్మిన సత్యంపై, తాను అవలంబించే జీవన ధర్మంపై స్థయిర్యం కలిగి ఉండటం. మంచిని చెయ్యడం, చెడుని నిర్మూలించడం. నక్కలా ప్రవర్తిండం మాత్రం కాదు. ప్రజలలో కొందరు అల్లాహ్‌ాను ఆరాధిస్తారు. అయితే వారి భక్తి నక్క భక్తిని పోలి ఉంటుంది. కొంత కాలం ధర్మాన్ని అనుసరిస్తారు. తరువాత పెడ ద్రొవ పడతారు. ఎదుటివారి కూపీలు లాగ టం వీరి పనిగా మారుతుంది. చేసేది తక్కువే అయినా, చెప్పేది ఎక్కువ అనేలా ఉంటుంది వీరి ప్రవర్తన. కొన్ని సందర్భాలలో కోరికలకు దాసులయ్యే వీరు, ప్రతి చిన్న చప్పుడుకి చలిం చిపోయే వీరు, అల్లాహ్‌ ఆదేశాల్లోనే తప్పులు వెతకడం ప్రారంభిస్తారు. ఇలా అంటారు. వడ్డీ నేరమా? సారాయి నిషిద్ధమా? వ్యభిచారం పాపమా? మోసం దౌర్జన్యం, అక్రమ పద్ధతు ల్లో సొమ్ము కూడ బెట్టడం, నగ్నత్వం, అర్థ నగ్నత్వం అపమార్గమా? చాడీలు చెప్పటం పరోక్ష నిందలు మోపటం తప్పా? బడాయి చాటుకోవటం, ముఖస్తుతికి పొంగి పోవడం దోషమా? అని ప్రశ్నిస్తారు.
మళ్ళీ మా తప్పులు తెలుసుకున్నామని కొన్ని రోజులు ధర్మాన్ని చక్కగా అనుసరిస్తారు. కాని తళుకుబెళుకులు గల ప్రతి ఆచారదురాచారం
వారి చూపుల్ని ఆకర్షిస్తుంది నిజ మార్గాన్ని వదిలి మళ్ళి అపమార్గాన పడతారు. వీరి చం చల స్వభావానికి ఒక కారణం ప్రజల ముందు తామే సత్యప్రియులమని, మంచి గుణాలు తమకే సొంతమనీ, ప్రదర్శనాబుద్ధి. అందుకే వారు అప్పుడప్పుడు ధర్మాన్ని అనుచ రిస్తూ, నియమ నిబంధనలని పాటిస్తారు కూడా. కనుక వీరి నడవడిక నక్క నడకను పోలి ఉంటుంది. వీరి చూపులు కుడి ఎడమల వైపు ఉంటాయి. వారు తమ లోపాలను గ్రహించరు గాని ఎదుటి వారిపై, పండితుల పై వ్రేలు ఎత్తడానికి మాత్రం సిద్ధంగా ఉం టారు. వీరి ప్రవర్తనా శైలిని నక్క వినయంతో పోల్చవచ్చు.

ప్రేమే నిలకడకు మూలం:

అల్లాహ్‌ాపై ప్రేమ అంటే ? అల్లాహ్‌ాకు విధే యత చూపడం, ఆయన దాస్యాన్నే స్వీకరిం చడం. ఈ దరికి ఆ దరికి వెళ్లకుండా ఆయన దరికే చేరటం, ఆయన ముందరే తల వంచ డం. ఇది మనిషికి ఇహంలోనూ, పరంలోనూ నిలకడను ప్రసాదిస్తుంది. కాని ఈ స్వచ్ఛమైన ప్రేమ కలుషితమయితే! అంటే అల్లాహ్‌ాతో పాటు రాయి, రప్ప, మనిషి, మృగం కూడా తమను రక్షిస్తాయి అనుకుంటే అలాంటి మనిషి బ్రతుకు చాలా ఘోరంగా మారిపో
తుంది. కష్టాలు అతన్ని చుట్టుముడతాయి, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. శుభాలు దరి చేరవు. ఈ షిర్క్‌ భావ కాలుష్యం గనక మితిమీరినట్లయితే అతడు ఇహంలోనూ పరా జయాన్ని చవి చూస్తాడు. పరంలోనూ పరా భవం పాలవుతాడు. అతని జీవితంలో నిలకడ లేని కారణంగా వీధిన వెళ్ళే ప్రతి వాడు అతనికి చివాట్లు పెడతాడు. కనుక అల్లాహ్‌ా పై స్వేచ్ఛమైన ప్రేమ అన్నది మనిషి నిలకడకై దోహద పడుతుంది. అల్లాహ్‌ా కోసం మనం ఇతరులని ప్రేమించాలి కాని అల్లాహ్‌ాకు భాగ స్వాముల్ని కల్పించి ఎవ్వరినీ ప్రేమింపకూ డదు. మనిషిలో ఉన్న బలహీనతలను విడ నాడి, మనసుని పవిత్రమైన వెలుగుతో నింపు కునేవారే, ధన్యులు. అలాంటి వారు అరుదు గానే ఉంటారు.

బహుమానం:
సత్యమార్గాన్ని అవలంబించేవారు, రుజు మార్గాన్ని ఎన్నుకున్నవారు, నిజధర్మంపై చిత్త శుద్ధితో కృషి చేసేవారు, వారికి వారి ప్రభువు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళక ముందే ఎన్నో శుభవార్తలను దైవదూతల ద్వారా తెలియ జేస్తాడు. అందులో ముఖ్యమైనవి ఐదు:

1) భయపడకండి: అంటే? తాను చేసిన పర లోక కార్యాల గురించి మనిషి, ముఖ్యంగా విశ్వాసి మృత్యువు సంభవించక ముందు, భయాందోళనలకి గురవుతూ ఉంటాడు. సమాధి శిక్ష గురించి, దూతల (మున్కర్‌నకీర్‌) వేసే ప్రశ్నల గురించి మధన పడుతూ ఉం టాడు. ప్రపంచంలో తన వల్ల జరిగిన పొర బాట్లను తలచుకుని కుమిలిపోతుంటాడు. తాను చేసిన పుణ్యాలలో చిత్తశుద్ధి ఉందో లేదోనని తడబడుతుంటాడు. తాను ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించానేమో భీతిల్లుతుంటాడు. ఇలాంటి స్థితిలో అతను కొట్టు మిట్టాడుతుం డగా పరమ ప్రభువు శుభవార్తను అంద జేస్తాడు: (మరణాంతరం సమాధి గురించి, బర్‌జఖ్‌ జీవితం గురించి) భయపడకు.

2)దుఃఖించకు: భూములు, నిధుల గురించి, బార్యాపిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి, బంధుమిత్రుల గురించి, ఉన్న అప్పు గురించి చింతించకు. నీ తర్వాత వీటన్నిటి బాధ్యతను మేము స్వీకరిస్తాము అని అల్లాహ్‌ా అభయమి స్తాడు. మనిషికి టెన్షన్‌ ఎక్కువ, ముఖ్యంగా అఖరి శ్వాస కాస్తంతయే మిగిలి ఉందని గ్రహించినప్పుడు. భార్యాబిడ్డల బ్రతుకు ఏమ వుతుందోనని, తను లేని వారి జీవితం ఎలా
సాగుతుందోనని బెంగ పెట్టుకుంటాడు. దాని కి షైతాన్‌ అతన్ని మరింత నిరాశకి గురి చేసి అవిశ్వాస స్థితికి నెట్టి వేయాలని ప్రయత్ని స్తాడు. వీరిని ఎవరు పోషిస్తారు? వీరితో మృదువుగా మాట్లాడేవారెవరు? ప్రేమతో పలకరించే వారెవరు? వారికి అండగా ఎవరు నిలుస్తారు? వారి మంచీచెడులను ఎవరు పట్టించుకుంటారు? ఈ వ్యాపారాన్ని ఎవరు సాగిస్తారు? దాచి పెట్టిన ఆ ధనాన్ని ఎవరు సంరక్షిస్తారు? అన్న అనేకానేక ప్రశ్నలను మనసులో లేవనెత్తుతాడు. తత్కారణంగా మనిషికి మరణం పట్ల భయము, విరక్తి ఏర్ప డతాయి. ప్రాపంచిక వ్యామోహం పెరుగు తుంది. అప్పుడు అల్లాహ్‌ా తరపు నుండి ఈ రండో శుభవార్త వినిపిస్తుంది. అది అతన్ని శాంత పరుస్తుంది. షైతాన్‌ సృష్టించిన అపో హాలను, అపార్థాలను, పారద్రోలుతుంది. ఇలా అనడం జరుగుతుంది. ‘సిరిసంపదలను భార్యాబిడ్డలను, వదలి వెళ్తున్నందుకు చింతిం చకు. వారి సంరక్షణా బాధ్యత మాపై ఉంది. కలత ఎందుకు? మరణించేది నువ్వు కాని దేవుడు కాదు కదా! నీవు తినే వాడివే కాని తినిపించేవాడవు కాదు కదా! ఉపాధిని ప్రసా దించే ప్రభువు సజీవంగానే ఉంటాడు.

3) మీరు ఇష్టపడే స్వర్గపు శుభవార్త:
అల్లాహ్‌ా దూతలు ప్రతి విశ్వాసికీ మృత్యువు కు ముందు మరియు సమాధిలో, మళ్ళీ బ్రతి కించబడిన పిదప ఈ శుభవార్తను అందజే స్తారు. దేని కోసమైతే మనిషి సతతం శ్రమిం చాడో ఆ స్వర్గం ఇదే. వీరు ఈ అఖరి క్షణా లలో కూడా రుజుమార్గంపై నిలకడ కలిగి ఉంటారు. వీరి తుది శ్వాస అల్లాహ్‌ా నామ స్మరణలోనే తీయబడుతుంది. ‘పుల్‌సిరాత్‌’ వారథిని సయితం వీరు అతి సునాయసంగా దాటి వెళ్తారు. వీరు ఎంత అదృష్టవంతులు! మరెంత భాగ్యశాలులు!!

4) తోడు:

మేము ఇహంలోనూ మీకు తోడు గా ఉన్నాము, పరలోక జీవితంలోనూ తోడు గా నిలుస్తాము అన్న శుభవార్త అల్లాహ్‌ దూతలు విశ్వాసులకు వినిపిస్తారు. అంటే, మేము ఇహంలోమీకు మిత్రులుగా ఉన్నాము, మిమ్మల్ని రక్షించే, మంచి కార్యాల్లో ముందు కు నడిపించేవాళ్ళము, ధైర్యాన్ని ఇచ్చేవారము, ఇవన్నీ అల్లాహ్‌ ఆజ్ఞతో చేసేవారము. అలాగే, ఇప్పుడు కూడా మీకు తోడుగా ఉన్నాము. సమాధిలోనూ మీతోనే ఉంటాము. మీ భయాన్ని దూరం చేస్తాము.

ప్రళయ దినాన మీకు అండగా నిలుస్తాము. మళ్ళీ లేపబడినప్పుడు మిమ్మల్ని అన్ని విధాలా సంరక్షిస్తాము. మిమ్మల్ని అనుగ్రహాలతో నిండిన స్వర్గవనాలలోకి స్వాగతం పలుకు తాము. దైవదూతలు విశ్వాసులతో స్వర్గంలో ప్రవేశించేంత వరకూ ఉంటారు. బ్రతికి ఉన్న ప్పుడు అన్ని సంధర్భాలలోనూ, మరణించాక అన్ని మజిలీలలోనూ వారికి వెన్నంటి ఉం టారు. ఇదంతా నిజమార్గంపై నిలకడ కలిగి ఉన్నందుకు ప్రతిఫలంగా జరుగుతుంది.

5) కోరినవి:

మీ కోసం అక్కడ మనసైనవన్నీ ఉంటాయి. అంటే? స్వర్గంలో మీరు తలచిన వన్నీ లభిస్తాయి. మీకు నచ్చినవి, మీరు మెచ్చి నవి పుష్కలంగా లభ్యమవుతాయి. మీరు అడిగే ప్రతి వస్తువు ప్రసాదించబడుతుంది. అదే స్వర్గం. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మా ప్రభువు అల్లాహ్‌ా మాత్రమే” అని పలికి, దాని పై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవ దూతలు దిగివచ్చి, (ఇలా అంటూ ఉంటారు): ”మీరు భయ పడకండి. ఖేద చెందకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూ వచ్చాము. పర లోకంలో కూడా ఉంటాము.అందు (స్వరం) లో మీ మనసు కోరిందల్లా, మీరు అడిగిం దల్లా మీకు లభిస్తుంది. క్షమాశీలి, దయానిధి (అయిన అల్లాహ్‌ా) తరఫున లభించే ఆతిథ్య మిది”. (హామీమ్‌ సజ్జా: 30-32)

పోతే, సత్యమార్గంపై సహన స్థయిర్యాలు కలిగి ఉండటం అంటే, సాటి ప్రజలను అల్లాహ్‌ా వైపునకు ఆహ్వానించడంతోపాటు, తాను స్వయంగా ఇస్లాం జీవన విధానానికి కట్టుబడి జీవించాలి. ఈ మార్గంలో ఎదు రయ్యే దుర్మార్గాన్ని, చెడును మంచితనం ద్వారా ఎదుర్కోవాలి. అది అసలు విశ్వాసి ఉత్తమ నైతికతకు ప్రతీక.
అపకారాన్ని ఉపకారం ద్వారా పారద్రోలడం, కీడును మేలు ద్వారా త్రుంచడం, దౌర్జన్యాన్ని మన్నింపుల వైఖరి ద్వారా నిర్మూలించడం, అసభ్యకరమయిన విషయాలను హుందాగా దాట వేయడం, అవాంఛనీయ సంఘటనలను ఓపికతో ఎదుర్కోవడం-నిస్సందేహంగా సాహ సోపేతమయిన కార్యాలు. వీటి మూలంగా బధ్ధ శత్రువే ప్రాణ మిత్రుడవుతాడు.ఆ భాగ్యం గొప్ప అదృష్టవంతులకే ప్రాప్తిస్తుంది అంటున్నాడు అల్లాహ్‌: ”అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొంద గలుగు తారు”. (41: 35)
రండి! ఆ బృహత్తర కృషికి శ్రీకారం చుట్టి అల్లాహ్‌ా శ్లాఘించిన భాగ్యవంతుల్లో చేరదాం!!

Related Post