యథో ధర్మః తథో జయః

మతమనేది మనకంటికి మసకైతే, మతమన్నది మన మనస్సుకు మబ్బయితే, మతమన్నది మనల్ని తుంచేదయితే, మతమన్నది కలహాలు, కక్షలు కలిగించేదయితే, మతమన్నది రాగ ద్వేషాలను రాజేసేదయితే అలాంటి మతం , అభిమతం భారత సమాజాభ్యుదయానికి గొడ్డలి పెట్టు అన్న యదార్థాన్ని గుర్తుంచుకోవాలి. వెన్నెలది ఏ మతమని, కోకిలది ఏ కులమని, గాలిది ఏ గోతమ్రని, నీతికి ఏ వర్ణమని-వేికి లేవు ఈ భేదాలు. తిరంగాలోని రంగుల్లా కలివిడిగా ఉండాల్సిన మనుషులకే ఎందుకీ తగాదాలు, కుల మత భేధాలు?

మతమనేది మనకంటికి మసకైతే, మతమన్నది మన మనస్సుకు మబ్బయితే, మతమన్నది మనల్ని తుంచేదయితే, మతమన్నది కలహాలు, కక్షలు కలిగించేదయితే, మతమన్నది రాగ ద్వేషాలను రాజేసేదయితే అలాంటి మతం , అభిమతం భారత సమాజాభ్యుదయానికి గొడ్డలి పెట్టు అన్న యదార్థాన్ని గుర్తుంచుకోవాలి. వెన్నెలది ఏ మతమని, కోకిలది ఏ కులమని, గాలిది ఏ గోతమ్రని, నీతికి ఏ వర్ణమని-వేికి లేవు ఈ భేదాలు. తిరంగాలోని రంగుల్లా కలివిడిగా ఉండాల్సిన మనుషులకే ఎందుకీ తగాదాలు, కుల మత భేధాలు?

”శాంతి, సామరస్యానికి పత్రీక ఇస్లాం ధర్మం. అల్లాహ్‌కు గల 99 నామాల్లో ఏది కూడా హింసను పబ్రోధించే దిగా లేదు. ఖుర్‌ఆన్‌ పార్రంభంలో వచ్చే రెండు నామాల – రహ్మాన్‌, రహీమ్‌కు అర్థం – అనంత కరుణా పద్రాత, అపార దయానిధి” అంటూ భారత పధ్రాని మోడీ జీ ఢిల్లీలో జరిగిన సూఫీ సమావేశంలో ఇచ్చిన స్టేట్మెంట్ ముదావహం. అస్సామ్‌లో ‘అజాన్‌’ సందర్భంగా మౌనం వహించడం హర్షణీయం. సూఫీ సమావేశంలో ఆయన సూఫీతత్వాన్ని సర్వవ్యాప్తం చేయాలని పిలుపు కూడా ఇచ్చారు. ఇస్లాం స్వచ్ఛమయిన ధర్మమయితే, చాలా కాలం తర్వాత బలవంతాన జొప్పొంచ బడిన- ద్వెత, అద్వైత, తైత్ర సిధ్దాంతాల కలగూర గంప సూపీ ఇజానికి మద్దతు తెలుపడం నిజమమైన లౌకిక వాదానికి లోబడి జరిగిందా, ధ్వంద్వ లౌకిక వాదానికి లోబడి జరిగిందా, సాయిన్టి ఫిక్‌ లౌకిక వాదానికి లోబడి జరిగిందా, గాంధీ లౌకిక వాదానికి లోబడి జరిగిందా, వాచ్‌పాయ్‌ లౌకిక వాదానికి లోబడి జరిగిందా, సుబమ్రణ్యం స్వామీ వాదానికి లోబడి జరిగిందా? అన్న మీమాంసను దేశ భవితవ్యం గురించి బాగా తెలిసిన మేధావులకు అప్పగించి, అదే వేదిక ఆధారంగా ‘భారత్‌ మాతాకి జై’ అన్న నినాదంపై బాబా రామ్‌ దేవ్‌ చేసిన అనుచిత వాఖ్యలు ”చట్టంపై గౌరవంతో (!) ఆగిపోయాం. లేదంటే ఒక్కడిదేంటి లక్షలాది తలల్ని తెగ నరక గలం” (!?) కూసింత మ్లాడుకోవడం మంచిది.

1) ఈ నినాదం వివాదాలకు నెలవయిన నవల ‘ఆనంద్‌మర’”్‌లోనిదే. ఈ నవలలో భారత్‌ దేశాన్ని దుర్గా మాతగా చితీక్రరించడం జరిగింది.
2) బనారస్‌ మరియు హరిద్వార్‌ తదితర పాంతాల్ని కలుపుకుని ‘భారత్‌ మాత’ పేరు తో కనీసం నాలుగు మందిరాలున్నాయి.
3) మాత అంటే కేవలం అమ్మ అన్న అర్థం మాత్రమే రాదు. దైవం అన్న భావనలో సయితం వాడ బడుతుంది. ఉదా-దుర్గా మాత, కాళి మాత, గోమాత..
4) మాతను సంస్కృతంలో (Ghataka), (visva) పదాలకు పర్యాయ పదంగా వాడటం జరిగింది. అంటే మరణానిచ్చేది, నమ్మదగినది. ఈ రెండు గుణాలు నిజదైవమయిన అల్లాహ్‌కు చెందినవి-ముమీత్‌, ముతవక్కిల్‌.
5) భారత్‌ మాతకి పజ్రలు ఇచ్చే రూపాలు ఎన్నో అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ పచ్రారం చేసే రూపం-సింహం మీద కూర్చుని, తీశ్రూలం చేతబూని, కాషాయ జెండాను ఎత్తుకొని ఉన్న స్త్రీ.
6) భారత్‌ మాత అన్న భావన ఒక మతానికి పరిమితమయినది. అందుకే జై హింద్‌ వంటి నినాదాలలో కనబర్చని ఉత్సుకత ఈ నినాద విషయంలో కనబడుతుంది.
7) జై అంటే జిందా బాద్‌ అని. ఈ మాట మనిషి, దేశం విషయంలో వాడినప్పుడు సాధారణ అర్థం కలదయితే, భారత్‌ను మాతగా భావిస్తూ అంటే వేరే అర్థం వస్తుంది. అంటే మాత ఆనంద్‌ మఠ్‌లో ఆపాదించిన సకల లక్షణాలతో సదా సజీవంగా ఉండుగాక అని. సదా సజీవంగా ఉండేది ఒక ముస్లిం విశ్వాసం ప్రకారం – అల్‌ హయ్యు – అల్లాహ్‌ మాతమ్రే.
అలాగే హిందూ సోదరుల్లో అధిక శాతం మాతృ భూమిని, మాతృ భాషను, విద్య-తదితర వాటిని దైవంగా భావించడం తెలిసిందే; అది వారి నమ్మకం. అలాగని ఒకరి నమ్మకాన్ని మరొకరిపై బలవంతాన రుద్దే పయ్రత్నం చేయడం, ఓ నినాదాన్ని అందరికీ వర్తింపజేసేందుకు పయ్రత్నించడం, అలా అనని వారిని దేశ దోహ్రుల కింద జమ కట్టే కుయుక్తి పన్నడం ముమ్మాటికి గర్హనీయం.
మతమనేది మనకంటికి మసకైతే, మతమన్నది మన మనస్సుకు మబ్బయితే, మతమన్నది మనల్ని తుంచేదయితే, మతమన్నది కలహాలు, కక్షలు కలిగించేదయితే, మతమన్నది రాగ ద్వేషాలను రాజేసేదయితే అలాంటి మతం , అభిమతం భారత సమాజాభ్యుదయానికి గొడ్డలి పెట్టు అన్న యదార్థాన్ని గుర్తుంచుకోవాలి. వెన్నెలది ఏ మతమని, కోకిలది ఏ కులమని, గాలిది ఏ గోతమ్రని, నీతికి ఏ వర్ణమని-వేికి లేవు ఈ భేదాలు. తిరంగాలోని రంగుల్లా కలివిడిగా ఉండాల్సిన మనుషులకే ఎందుకీ తగాదాలు, కుల మత భేధాలు?
‘యథో ధర్మః తథో జయః’ – ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది అన్నది అందరూ నమ్మిన సత్యం. అధిక పజ్రలు ఏ నినాదాన్ని ఆమోదించారు, అధికారంలో ఉన్న పభ్రుత్వాలు ఏ విధానాల్ని అమలు పర్చా లనుకుంటున్నాయి? అన్న విషయాన్ని కాసేపు ప్రక్కన బెట్టి ధర్మం ఏమంటున్నది? అన్న సమీక్ష పజ్రలందరి లో చోటు చేసుకుంటే ఒక హిందువు సోదరుడు కూడా విగహ్రారాధనా భావాలు కలిగి ఉండటం నేరం అని రుజువవుతుంది. ఉదాహరణకు- ”ఇంద్‌ంవో విశ్వతస్పరి హవామహే జనేభ్యంః అస్మాకమస్తు కేవలః” (ఋగ్వేదం: మండలం1,సూక్తం 7, మంతం – 10) మానవులారా! నన్ను వదలి ఇతర దైవాలెవ్వరినీ ఎన్నికీ ఆరాధనా యోగ్యులుగా చేసుకోకండి. ఎందుకంటే ఒక్కడనైన నేను తప్ప రెండవ దేవుడెవ్వడూ లేడు.

‘న తస్య కశ్చిత్పతిర స్తి లోకే
న చేశితా నైవ చ తస్య లిజ్గమ్‌
స కారణం కరణాధిపాధిపో
న చాస్య కశ్చిజ్జనితా న చాధిపః’

(శ్వేతాశ్వతరోపనిషత్తు, అధ్యాయం-6, శ్లోకం-9)
బ్రహ్మాండం లో ఆయనకు ప్రభువుగానీ, శాసన కర్తగానీ ఎవరూ లేరు. ఆయన ఇట్టి వాడు అని ఊహించటకు చిహ్నముగాని లేదు. ఆయన సమస్త జీవ జగత్తును (జీవరాశిని) సృష్టించినవాడు, వాటికి పభ్రువు అయి ఉన్నాడు. ఆయనకు జనకుడు గాని, ఆయనకంటే అధికుడు గాని ఎవ్వడూ లేడు.
జగమెరిగిన ఈ సత్యాన్నే ఖుర్‌ఆన్‌ ‘మీ ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు’ (బఖరహ్‌: 163) అంటుంది; దాన్నే ఒక ముస్లిం ‘లా ఇలాహ ఇల్లలాహ్‌ా’ అల్లాహ్‌ా తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడు అని మనసా, వాచా, కర్మణా – తిక్రరణ శుద్ధితో నమ్ముతాడు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ ఇదే ధర్మం. దైహిక, దైవిక, భౌతిక – ఈ మూడు విధాలా శాంతిని, ముక్తిని, మోక్షాలను పస్రాదించే ఏకైక ధర్మసూతం. పక్రృతి ధర్మమయిన ఇస్లాంను తన జీవన సంవిధానంగా చేసుకున్న ఒక ముస్లిం సహజంగానే తన మాతృభూమిని ప్రేమిస్తాడు. అవసరం వస్తే పాణ్ర త్యాగం చెయ్య డానికి సయితం సిద్ధంగా ఉంటాడు. కానీ, దేశాన్నే దైవంగా కొలవమంటే, దేశం పట్ల భక్తిని ప్రదర్శించమంటే పాణ్రాలు పోయినా ఆ పని మాతం చెయ్యడు. ఎందుకంటే ఇస్లాం ధర్మానికి పునాది – స్వచ్ఛమైన ఏక దైవ భావన-తౌహీద్‌ గనక. చివరిగా ఒక మాట – ‘మతం వేరయితే యేమోయి, మనము ఒకటై మనుషులుంటే, జాతియన్నది లేచి పెరిగి, లోకమున రాణించునోయి’ అన్న గురజాడ వారి మాటననుసరించి పజ్రలు శాంతి, సామరస్యం, ఐక్యత కలిగి జీవించాలన్నా, ఒకరి సంపద్రాయాలను ఒకరు అర్థం చేసుకోవాలన్నా పజ్రల ప్రయత్నంతోపాటు ప్రభుత్వ అండదండలు కూడా ఎంతో కొంత అవసరం. రండీ! మమతను సమతను పెంచుదాం! మోసం, ద్వేషం లేని దేశాన్ని నిర్మించుదాం! జై హింద్‌!!

Related Post