ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా)

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

అంతిమ దైవ గ్రంథమైన ఖుర్‌ఆన్‌లో పలువురు ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. కాని దైవ ప్రవక్త ఈసా (యేసు క్రీస్తు)ను గురించి ఖుర్‌ఆన్‌ ఎప్పుడు ప్రస్తా వించినా విశిష్ఠమైన రీతిలోనే ప్రస్తావించింది. యేసు మాత అయిన మర్యమ్‌ గొప్పతనాన్ని ప్రత్యేకంగా కొనియాడింది. అంతేకాదు, మర్యమ్‌ పేరుతో ఖుర్‌ఆన్‌లో ప్రత్యేకంగా ఒక అధ్యాయమే అవతరించింది.

మీరెప్పుడైనా ఆలోచించారా!

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స)కు ప్రాణసఖి అయిన ఆయిషా (ర) పేరుతోగానీ, ముద్దుల పుత్రిక ఫాతిమా (ర) పేరుతో గానీ ఖుర్‌ఆన్‌లో ఏ అధ్యాయమూ అవతరించలేదు. అయితే మేరీ మాత పేరుతో ప్రత్యేకంగా ఒక సూరా అవతరించటం, ఆమె సౌశీల్యం గురించి, భక్తీప్రపత్తుల గురించి, పసితనంలో ఆమెపై కురిపించబడిన ప్రత్యేక అనుగ్రహాల గురించి దేవుడు విడమరచి చెప్పటం ఒక విశేషం!
69018.imgcache

ఆమెకు ప్రసాదించిన వరాలలో అన్నిటికన్నా విచిత్రమైనది, అద్భుతమైనది తండ్రి లేకుండానే ఆమెకు బిడ్డను ప్రసాదించటం. కన్య అయిన తాను గర్భవతి కాబోతున్నట్లు దైవ దూత జిబ్రయీల్‌ ద్వారా తెలుసుకున్నప్పుడు మర్యమ్‌ నిలువెల్లా కంపించింది. గర్భవతి అని తెలుసుకున్న ఆమె జాతివారు ఒక్క సారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. నానా యాగీ చేశారు. యదార్థానికి ఆమె ఏ పాపం ఎరుగని అమాయకురాలు. సౌశీల్యవతి. అయినవాళ్ల దూషణలను భరించలేక ఆమె జనవాసానికి దూరంగా వెళ్లినప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యేక సదు పాయాలు కల్పించాడు.

నేను దేవుని దాసుడను, దైవ ప్రవక్తను

ప్రసవానంతరం ప్రజలు ఆమెను ఆడి పోసుకున్నపుడు ఆమె ఏమీ మాట్లాడ లేదు. ఉయ్యాలలో ఉన్న తన పుత్ర రత్నం వంక సైగ చేసింది మర్యమ్‌. అభం శుభం తెలియని ఆ పసివాడ్ని అడిగి ఏం లాభం? అని జనులు అన్న ప్పుడు ఉయ్యాలలో ఉన్న ఆ బాలుడు అల్లాహ్‌ా ఆనతితో అద్భుతంగా పలికాడు: ”నేను అబ్దుల్లాహ్‌ను (దేవుని దాసుడను). ఆయన నన్ను తన ప్రవక్తగా ఎంపిక చేశాడు. నేనెక్కడ ఉన్నా నన్ను శుభవం తునిగా చేశాడు” అని చెప్పేసరికి ప్రజలు మీమాంసలో పడిపోయారు. ఇస్రాయీలు సంతతిలో ఒక వర్గం వారు మర్యమ్‌ కుమారుడగు యేసు (ఈసా -అ)ని తిరస్కరించగా, మరొక వర్గం వారు ఆయన్ని విశ్వసించి, ఆయన ప్రబో ధనలను అనుసరించారు. తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే అప్పుడూ జరిగింది. సత్యాసత్యాలకు మధ్య సంఘర్షణ మొదలయింది. తిరస్కార జనులు యేసు (ఈసా)ను హతమార్చాలని కుట్ర పన్ని నప్పుడు అల్లాహ్‌ా విచిత్రమైన రీతిలో యేసును తన వైపుకు ఎత్తుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో కొందరు యేసు తెచ్చిన నిజ ధర్మంలో మార్పులు చేెర్పులు చేెయగా, మరి కొందరు యేసుపట్ల ప్రేమలో అతిశయిల్లారు. యేసును ‘ప్రవక్త స్థానం’ నుంచి ‘దైవ స్థానం’లో ప్రతిష్ఠించారు.
ఈ కారణంగానే దివ్యఖుర్‌ఆన్‌ మర్యమ్‌ కుమారుడగు యేసును గురించి కాల చక్రంలో భ్రమిస్తున్న అనేక సందేహాలకు, ఆక్షేపణలకు తనదైన రీతిలో సమాధాన మిచ్చింది. ప్రేమలో అతిశయిల్లిన వారికి కూడా వాస్తవాలను విడమరచి చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే దివ్యఖుర్‌ఆన్‌ యేసు (ఈసా) వారి జీవితాన్ని ఒక తెరచిన పుస్తకంలా మన ముందుంచింది.
రండి, ఖుర్‌ఆన్‌ వెలుగులో దాన్ని స్థూలం గానయినా అవలోకన చేద్దాం –

యేసు పుట్టుక ఒక అద్భుతం

మర్యమ్‌ పోషణ బాల్యం నుంచే ఒక ప్రత్యేక తరహాలో దేవుని పర్యవేక్షణలో పెరిగింది. దైవ ప్రవక్త జకరియ్యా (అ) గారి సంరక్షణ ఆమెకి లభించింది. ఆ పసిపిల్ల బస చేసే ఏకాంత మందిరంలోనికి వెళ్ళి నప్పుడు, అక్కడ ఆ సీజనులో పండని పండ్లు ఫలాలు ఉండటం చూసి జకరియ్యా నిర్ఘాంత పోయేవారు. ఈ విధంగా దేవుని పర్య వేక్షణలో పెరిగి, యౌవనానికి చేరిన ఆ శీలవతి ఒకసారి జనుల నుంచి, ఏకాంత స్థలంలోనికి వచ్చినప్పుడు జరిగిందేమిటో ఖుర్‌ఆన్‌ ఇలా వివరించింది:
”ఆమె వారికి చాటుగా తెరవేసు కున్నప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ (జిబ్రయీల్‌ -అ)ను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవా కారంలోనే ప్రత్యక్షమయ్యాడు. (ఆందో ళన చెందిన మనసుతో) ‘నేను నీ బారి నుంచి కరుణామయుడైన అల్లాహ్‌ా శరణు కోరుతున్నాను. నీవు ఏమాత్రం దైవభీతి కలవాడవైనా (ఇక్కణ్ణుంచి వెళ్ళిపో)’ అని ఆమె చెప్పింది. ‘నేను నీ ప్రభువు తరఫున పంపబడిన దూతనమ్మా! నీకు పరిశుద్ధు డైన ఒక మగ బిడ్డను ఇవ్వటానికి వచ్చా నమ్మా!’ అని అతనన్నాడు. దానికామె, ‘అయ్యో! నాకు పిల్లవాడు కలగట మేమిటి? నన్ను ఏ మగాడూ కనీసం తాకనైనా లేదే! నేను దుర్నడత గల దాన్ని కూడా కానే’ అని వాపోయింది. ‘జరిగేది మాత్రం ఇదే. అది నాకు చాలా సులువు. మేమతన్ని ప్రజల కోసం ఒక సూచనగా, మా కటాక్షంగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం’ అని నీ ప్రభువు సెలవిచ్చాడు” అని అతనన్నాడు. (మర్యమ్: 16-21)
పై వాక్యాలలో అల్లాహ్‌ మానవాళికి చెప్పదలిచిందేమిటంటే; మేము ఏది చేయగోరినా అది మాకేమాత్రం కష్టం కాదు. మేము ఆ బాలుణ్ణి సృష్టి ప్రక్రియలో ఓ వినూత్న ఘట్టంగా, ఓ కొంగ్రొత్త ఆవిష్కరణగా చేయదలిచాము. ఇంతకు మునుపు మేము మీ పితామహు డైౖన ఆదామును ‘స్త్త్రీ – పురుషుడు’ లేకుండానే సృజించాము. మీ మాతృ మూర్తి అయిన హవ్వాను కేవలం పురుషుని నుండి సృష్టించాము. మరి మీ అందరినీ స్త్రీ-పురుషుని జంట ద్వారా అవనిలో వ్యాపింపజేశాము. ఇప్పుడు యేసు (ఈసా – అ)ను నాల్గవ తరహాలో పురుషుడు లేకుండానే – కేవలం స్త్రీ ద్వారానే – సృష్టించి మా శక్తియుక్తులను మీకు చూపెట్టదలిచాము. సృష్టికి సంబం ధించిన ఈ స్వరూపాలన్నీ కూడా మా శక్తిసామర్థ్యాలకు ప్రతీకలే.
ఆ విధంగా దైవ దూత జిబ్రయీల్‌ అల్లాహ్‌ా ఆజ్ఞతో ఆమెలో ఒక ప్రాణాన్ని ఊదిన సంఘటనను ఖుర్‌ఆన్‌ ఈ విధంగా పేర్కొన్నది – ” ఇమ్రాన్‌ కుమార్తెయగు మర్యమ్‌ తన మానాన్ని కాపాడుకున్న స్త్రీమూర్తి. మరి మేము మా తరఫున ఆమెలో ప్రాణాన్ని ఊదాము. మరి ఆమె తన ప్రభువు వచనాలను, ఆయన గ్రంథాలను సత్యమని ధృవీకరించింది. ఎంతైనా ఆమె వినయవిధేయతలు గల మహిళా రత్నాల రాసికి చెందినది”. (66: 12)

యేసు కూడా అందరిలా మానవ మాత్రునిగానే జీవించారు:

మర్యమ్‌ కుమారుడగు ఏసు (ఈసా)కు దేవుడు మహిమలు ఇచ్చాడు. దేవుని ఆజ్ఞతో ఆయన కుష్టు రోగులకు స్వస్థతను ప్రసాదించేవారు. దేవుని ఆదేశంపై ఆయన మృతులను లేపి నిల బెట్టేవారు. అంధులకు చూపును ఇచ్చే వారు. అంత మాత్రాన ఆయన మానవా తీతులుగానీ, దైవాంశ సంభూతులు గానీ కారు. దేవుడు తన ప్రవక్తలలో కొందరికి, కొన్ని విషయాలలో ప్రాధాన్యతను ప్రసాదించాడు. ఇదంతా దైవ మహిమ. తండ్రి లేకుండా పుట్టినంత మాత్రానికే యేసుకు దైవత్వాన్ని ఆపాదించవలసి వస్తే, మరి తండ్రి-తల్లి ఇద్దరూ లేకుం డానే సృష్టించబడిన ఆదాముకు ఏ ‘స్థానం’ కల్పించాలి?

అదలా ఉంచితే యేసుక్రీస్తు వారు ఇస్రాయీల్‌ సంతతి ప్రజల మధ్య పెరిగి పెద్దవారయ్యారు. దైవాజ్ఞలను పాలిం చారు. ప్రజలకు దైవ సందేశాన్ని అంద
జేశారు. సాటి మనుషులు తిన్నట్లే అన్నం తిన్నారు. అందరిలాగానే పానీ యాలు పుచ్చుకున్నారు. అందరి మాదిరి గానే కాలకృత్యాలు తీర్చుకున్నారు. మానవ నైజానికి విరుద్ధమైన పద్ధతిలో ఏమీ ఆయన జీవించలేదు. అన్నపానీ యాలు భూమ్మీద నివసించే మానవుల తప్పనిసరి అవసరాలు. ఏసుక్రీస్తుగానీ, మరియమ్మగానీ దేవుళ్ళు కారని చెప్ప టానికి ఇవి ప్రబల తార్కాణాలు. ఒక్క దేెవుడు మాత్రమే మానవ సహజమైన ఈ దౌర్బల్యాలకు అతీతుడు. ఈ వాస్తవాన్నే దివ్య ఖుర్‌ఆన్‌ ఇలా విశదీకరించింది-

”మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీకొడుకులిరువురూ అన్నం తిన్న వారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను తేటతెల్లం చేెస్తు న్నామో! అయినా వారు ఎలా తిరిగిపోతు న్నారో చూడు”. (5: 75)

”అల్లాహ్‌ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. (అల్లాహ్‌) అతన్ని మట్టితో చేసి, ‘అయిపో’ అని ఆజ్ఞాపించగానే అతను (మనిషి) అయిపో యాడు”. (3: 59) (ఇంకా ఉంది)

Related Post