మానవ మహోపకారి ముహమ్మద్‌ (స) వారి ఆదర్శ జీవితం

 

 

మొదటి అధ్యాయం:

అరేబియా ద్వీపకల్పం ఇస్లాంకు పూర్వం  పవిత్ర జీవితం  తొలి పలుకులు ”సర్వలోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యం” అని దైవం కితాబిచ్చిన మానవ మహోపకారి ముహమ్మద్‌ (స) గారి సుచరితము సమస్త మానవాళికి ఒక మహత్తర సందేశం. ఈ సందేశం ద్వారా ఆయన  (స)  మానవతను కటిక చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు చూపించారు. వ్యక్తి పూజా సంకెళ్ళ నుండి విముక్తి ప్రసాదించి, దైవ దాస్యం వంటి అత్యుత్తమమైన మార్గాన్ని నిర్దేశించారు. కేవలం ఆధ్యాత్మిక రంగాన్నే కాక మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విభాగాన్ని అపురూపంగా, అద్వితీయంగా సంస్క రించారు. కనుక దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (లి) గారి సంస్కరణోద్యమం గురించి కుణ్ణంగా తెలుసుకోవాలంటే, ఆనాటి అరేబియా సమాజ స్థితిగతులను, ఆయన రాకకు గల కారణాలను కూలంకషంగా తెలుసు కోవడం ఎంతైనా అవసరం.

అరేబియా భౌగోళిక పరిస్థితి

అరేబియా ద్వీపకల్పానికి పడమరన ఎర్ర సముద్రం, సినాయ్‌ ద్వీపం ఉండగా, తూర్పు భాగాన పర్షియన్‌ జలసంధి, దక్షిణాన హిందూ మహా సముద్రాన్ని తాకిన సువిశాల అరేబియా సముద్రం ఉంది. ఉత్తరాన సిరియా ఇరాక్‌ పట్టణాలున్నాయి. ప్రకృతి పరంగానూ, భౌగోళికం గానూ అరేబియా దేశం ఎంతో కీలకమైనది. ఇక అంతర్గ తంగా చూస్తే లోపలి భూభాగం నలువైపుల నుండి ఎడారి, ఇసుక తిన్నెలతో కూడినది. ఈ కారణంగానే అరేబియా ఓ సురక్షితమైన కోటలా తయారయ్యింది. విదేశీయుల వెత్తనానికి అది అవకాశమివ్వలేదు. తత్కారణంగా అరబ్బులు జీవితపు అన్ని రంగా ల్లోనూ (ఆనాడు) స్వేచ్ఛాపరులై ఉండటం మనం చూస్తాం. వారి చుట్టూ పర్షియా రోము లాంటి గొప్ప సామ్రాజ్యాలున్నప్ప టికీ అవేవీ అరబ్బులను వశపరచుకోలేకపోయాయి.

అరేబియా రాజ్యం

అరేబియా ద్వీపం అసంఖ్యాకమైన తెగలతో కూడుకున్నది. ఒక్కో తెగకి ఒక్కో నాయకుడుండేవాడు. ప్రతి తెగ తన స్థానంలో ఒక ప్రత్యేక ప్రభుత్వాన్ని పోలి ఉండేది. రాజులకు ఉన్నంత వైభవం, ఘనత ఆ తెగ నాయకులకు ఉండేది. యుద్ధ సమయాల్లోనైతెనేమీ, విరామ సమయాల్లోనైతేనేమీ ప్రతి తెగ తన నాయకుడి తీర్పునే అమలు పర్చేది. ఇక మక్కా నగరం గల హిజాజ్‌ ప్రభుత్వం విషయానికొస్తే, అక్కడ నివసించే తెగల్లో ప్రముఖులు ఖురైషులు. పవిత్ర ‘కాబా’ మూలంగానూ, ఆ ప్రతి ష్ఠాలయ నిర్వహణా బాధ్యత వహించటం మూలంగా కూడా ఖురైష్‌ వంశానికి అరబ్బుల్లో విశిష్ఠ స్థానం ఉండేది. అరబ్బు లంతా వారిని గౌరవించేెవారు. అలాగే మక్కా నగరం, తూర్పు – పడమరల నుంచి, ఉత్తర దక్షిణాల నుంచి వచ్చేపోయే వర్తక బృందాలకు కేంద్ర బిందువుగా ఉండేది.

అరేబియా మతాలు

అరబ్బుల్లో అధికులు ప్రవక్త ఇస్మాయీల్‌ (అ) గారి విలుపుని అంగీకరించినవారే. ఆయన (అ) వారిని తన తండ్రి ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) అందజేసిన జీవన విధానం వైపు విలిచారు. అది ‘దీనె హనీఫ్‌’ (ఏకాగ్రతా ధర్మం)గా ప్రసిద్ధి చెందింది. అరబ్బులు పూర్వం అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించేవారు. అయితే కాలక్రమేణా వారు ఈ మార్గాన్ని విస్మరిస్త్తూ, మరిచిపోతూ వచ్చారు. సిరియా దేశస్థులు విగ్రహాలను పూజించటం చూసి, వారు సయితం క్రమేణా విగ్రహారాధనకి పాల్పడ్డారు. ప్రతి తెగవారికీ వారి ప్రత్యేక విగ్రహం ఉండేది (భారత దేశంలో కుల దైవం లాంటిది). వారు పూజించే విగ్రహాల్లో ప్రసిద్ధమైనవి –  ‘లాత్‌’ – ఈ విగ్రహం తాయిఫ్‌ ప్రజల ఇష్ట దైవంగా పూజలందుకొనేది. ‘మనాత్‌’ నఖ్లా ప్రాంతంలో పూుజింపబడేది. ఇది చాలదన్నట్లు, (ఏకదైవారాధన ఉద్దేశ్యంతో నిర్మితమైన) పవిత్ర కాబాను సయితం అనేకానేక విగ్రహాలతో నింపేశారు. ప్రవక్త ముహమ్మద్‌ (స)గారు మక్కాలో విజేతగా ప్రవేశించినప్పుడు కాబా చుట్టూ 360 విగ్రహాలుండటాన్ని గమనించారు.  అప్పుడు వాటిని ‘కాబా’ గృహం నుండి బైట పడేసి కాల్చివేయడం జరిగింది. విగ్రహాలను పూజించడంలో కూడా అరబ్బులకు కొన్ని ప్రత్యేక ఆచారాలు, రీతి రివాజులుండేవి. ముఖ్యంగా కష్ట కాలంలో వారు తమ ఇష్ట దైవాలను ఆశ్రయించే వారు. సహాయం కోసం అర్థించే వారు. అవి తమ మొరలను ఆలకిస్తాయని, తమ కోరికల్ని తీరుస్తాయని భావించేవారు. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసే వారు. వాటి కోసం ప్రయాణాలు (హజ్‌) చేసేవారు. వాటి ముందు మోకరిల్లేవారు. అనేక రీతి రివాజులతో వాటికి దగ్గరవ్వాలని పరితవించేవారు.

ఆ విగ్రహాల వేరున బలులు ఇచ్చేవారు. వాటి వేరున రకరకాల నైవేద్యాలు వెట్టేవారు. ఇంకా తాంత్రికులు, జోతిష్కులు, నక్షత్రాల విద్య గలవారు చెవ్పే భవిష్య వాణుల్ని, అగోచర విషయాల్ని ఇట్టే నమ్మేవారు. అలాగే అరబ్బులు శకునాలు అప శకునాల్ని సయితం నమ్మేవారు. వారు ఏదైనా కార్యం చెయ్యాలంటే ఒక పక్షిని వదిలే వారు. అది గనక కుడి వైపు వెళితే మంచి శకునంగా భావించి తాము తలచిన కార్యాన్ని నెరవేర్చేవారు. ఒకవేళ అది ఎడమ ప్రక్కకు వెళితే అపశకునంగా భావించి తమ కార్యాన్ని వాయిదా వేసుకునేవారు లేదా మానుకునేవారు.

ఇన్ని మూఢ నమ్మకాలు, అపసవ్యమైన పోకడలు వారిలో ఉన్నప్పటికీ, ప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) గారి ధర్మపు వారసత్వ ఛాయలు వారిలో ప్రస్ఫుటంగానే గోచ రించేవి.  ఉదాహరణకు ‘కాబా’ గృహ ప్రాశస్త్యాన్ని కాపాడటం, దాని పట్ల గౌరవ భావం కలిగి ఉండటం, దాని చుట్టు ప్రదక్షిణ (తవాఫ్‌) చేయటం,  హజ్‌ ఉమ్రాలు చేయటం, అరఫా ముజ్దలిఫాల్లో విడిది చేయటం లాంటివి చేసేవారు. అయితే వారి మతం విగ్రహారాధన మతమే. ఇక యమన్‌, మదీనా ప్రాంతాలలో యూదులు కూడా అక్కడక్కడా నివసించేవారు. క్రైస్తవులు మాత్రం అరేబియాకు దక్షిణ ప్రాంతాల్లోనూ, యమన్‌లోను ఉండేవారు. అలాగే కొన్ని అరబ్బు తెగలు ఈరాన్‌ మరియు బహ్‌ారైన్‌ పరిసరాల్లో మజూసీ (అగ్ని పూజారుల) మతాన్ని అవలంబించేవారు.

సామాజిక జీవితం

ఇస్లాంకు పూర్వం అరేబియా సమాజం అనేక వర్గాలతో కూడి ఉండేది. అగ్ర వర్గం అని, మధ్యమ వర్గమని, అధమ వర్గమని విభజితమై ఉండేది. వై వర్గానికి చెందిన వారికి మనసులోని మాట నిర్మొహమాటంగా చెవ్పే పూర్తి స్వేచ్ఛ ఉండేది. స్త్రీ పురుష సంబంధాలు కూడా సహజంగానే ఎంతో సంస్కారవంతంగా ఉండేవి. స్త్రీ పురుష సంబంధాలు బంధు మిత్రుల ఆధ్వర్యంలో ‘పెళ్ళి’ అనే  పవిత్ర బంధంతోనే ఏర్పడేవి. అయితే ఇతర వర్గాల్లో మాత్రం స్త్రీపురుష కలయిక వివిధ రకాలుగా ఉండేది. ఉదాహరణకు: విచ్చలవిడితనం, విశృంఖలత్వం, వ్యభిచారం, అక్రమ సంబంధం వగైరా. పూర్వం వారు లెక్కలేనన్ని వెళ్ళిళ్ళు చేసుకునేవారు. అక్కాచెల్లెళ్ళను ఏక సమయంలో వెళ్ళి చేసుకోవడం, తండ్రులు గనక విడాకులిస్తే లేదా మరణిస్తే సవతి తల్లుల్ని మనువాడటం  వారిలో సర్వ సాధారణ విషయం.

సంతానాన్ని సమ దృష్టితో చూసేవారు కాదు. అవమానం, వేదరికం భయంతో వారు తమ ఆడ విల్లల్ని సజీవ సమాధి చేసేవారు. కుటుంబ సభ్యులతోనూ, విన తండ్రి విల్లలతోనూ, వారి సంబంధం ఎంతో పటిష్టంగా ఉండేది. వారు అభిజాత్యం కోసం చావడానికైనా, చంపడానికైనా వెనుకాడేవారు కాదు. ”నీ  సోదరుడు  దౌర్జన్య  పరుడైనా, బాధితుడైనా రెండు సంద ర్భాల్లోనూ అతనికే వత్తాసు పలుకు” అనే సూత్రాన్ని పాటించేెవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అరబ్బుల సామాజిక వ్యవస్థ పతన స్థాయికి దిగజారి ఉండేది. పూర్వీకుల అంధానుసరణ వల్ల, అంధవిశ్వాసాలు, మూఢా చారాలను ఆశ్రయించడం మూలాన వారి బుద్ధీవివేకాలు స్థంభించాయి. తత్కారణంగా వారు పశువుల్లా జీవించేవారు. వారి సమాజంలో స్త్రీ అంగడి వస్తువులా అమ్ముడు పోయేది.

ఆర్థిక స్థితి

అరబ్బులకు వ్యాపారం అతి వెద్ద జీవనాధారంగా ఉండేది. అయితే వ్యాపారం సవ్యంగా కొనసాగేది కాదు. కారణం అశాంతి అలజడులే. పవిత్ర మాసాల్లో తప్ప ఎక్కడా శాంతిభద్రతలు అనేవి కనివించేవి కావు. ఈ మాసాల్లోనే ప్రసిద్ధి చెందిన ఉకాజ్‌, జిల్‌ మజాజ్‌, ముజ్నా వంటి అరబ్బు సంతలు నిర్వహించబడేవి. పోతే, వస్తుత్పత్తికి అరబ్బులు ఆమడ దూరం. యమన్‌, హియరా, సిరియా ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడా ఉన్ని పరిశ్రమలు ఉండేవి. అరబ్బు స్త్రీలు వ్యవ సాయం, గొర్రెలు మేపటం, చేెతిపని లాంటివి చేసేవారు. రాజ్యంలో ఎటు చూసినా దారిద్య్రం తాండవమాడుతున్నట్టే ఉండేది.

నైతిక స్థితి

పూర్వం అరబ్బుల్లో మద్య సేవనం, జూదం, మగువ లోలత్వం (వ్యభిచారం) లాంటి నీతిబాహ్యమైన అలవాట్లు ఉండేవన్న సంగతి మనం నిరాకరించలేము. అయితే వారిలో గొప్ప గుణాలు, మంచి లక్షణాలు, కూడా విశేషంగానే ఉండేవి. ప్రప్రథ మంగా అరబ్బులు ఉదాత్తులు. దాతృత్వంలో అగ్రగాములు. తమలోని ఈ గుణంవై వారు గర్వపడేవారు. వణుకు పుట్టించే చలిలో, ఆకలితో అలమటిస్తున్న స్థితిలో సయితం అతిథి గనక ఇంటికి వస్తే తమ వద్ద ఒకే ఒక్క ఒంటె తప్ప మరే సంపదా లేెకపోయినా, అదే వారి కుటుంబ పోషణకు మూలాధారమైనా, వారిలో ఉన్న దాతృత్వం కారణంగా ఆ జంతువును జిబహ్‌ా చేసి అతిథి మర్యాదలు చేెసేవారు.

వారిలో ఉన్న మరో గుణం ఆత్మాభిమానం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం. ఆడిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతటికైనా తెగించేవారు. చివరికి తమ సంతానాన్ని త్యాగం చెయ్యడానికి సయితం తటపటాయించేెవారు కారు. ఇంకా వారిలో ఆత్మ గౌరవం, నిరాడంబరత, సంకల్ప నిరతి, కార్య దీక్ష దక్షతలు ఉండేవి. తాము తలచిన దాన్ని సాధించడానికి తమ జీవితాన్ని సయితం ధారబోసేలా క్రియారంగంలో దిగేవారు. అరబ్బుల ఈ గుణగణాలు, విశేష లక్షణాలు, ప్రత్యేకతల మూలంగానే దేవుడు తన అంతిమ సందేశ ప్రచార బాధ్యత కోసం సర్వ మానవాళికి సంబంధించిన సంస్కరణోద్యమం కోసం వారిని ఎన్నుకున్నాడు.

 

Related Post