బనూ సఅద్‌లో…

paint_1062Roshni - Evening in an Indian village

మౌలానా సఫీయుర్రహ్మన్ ముబారక్పూరీ

సాధారణంగా అరేబియా పట్టణ వాసుల్లో తమ పిల్లల్ని పాలు త్రాగించి పోషించడానికి ఆయాలకు అప్పగించి పల్లె వాసాలకు పంవే ఆచారం ఉండేది. కారణం –

1) పల్లెల్లో సహజ వాతావరణంలో పిల్లలు వ్యాధులకు దూరంగా ఆరోగ్యంగా వెరుగుతారని, దృఢకాయులుగా,  ధైర్యవంతులుగా తయారవుతారని వారి నమ్మకం.

2) తమ పిల్లలు పసితనం నుంచే స్వచ్ఛమైన అరబీ భాష నేర్చుకోవాలని, అరబీ లోకోక్తులవై ప్రావీణ్యం సాధిం చాలని.

అబ్దుల్‌ ముత్తలిబ్‌ గారు మహా ప్రవక్త (స) కోసం ఆయాల అన్వేషణ ప్రారంభించారు. చివరికి సాద్‌ తెగకు చెందిన స్త్రీ- అబూ జువైబ్‌ కుమార్తె హలీమా, ముహమ్మద్‌ (స)కు పాలు తావించే, పోషించే బాధ్యతను స్వీకరించింది. ముహమ్మద్‌ (స)తో పాటు పాలు త్రాగిన వారిలో హారిస్‌ కుమారుడు అబ్దుల్లాహ్‌ా, హారిస్‌ కుమార్తె షీమా ఉన్నారు. ఆయా హలీమా ముహమ్మద్‌ (స) ద్వారా ప్రాప్తమయిన శుభాలను కళ్ళారా తిలకించింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, ఆమె బాల ముహమ్మద్‌ (స)ను ఒడిలో తీసుకున్న మరుక్షణమే ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. ఆమె గొర్రెలు లావెక్కాయి. వాటి పాలు రెట్టింపయ్యింది. గొర్రెలు మేసే చోట కూడా గడ్డి దట్టంగా మొలిచింది. పూర్వం అదే నేల బీడువారి ఉండేది. మహనీయ ముహమ్మద్‌ (స) పెరిగి పెద్ద వారవుతున్న కొద్దీ ఆ శుభాలు కూడా అధికమవ్వసాగాయి. రెండేళ్ళు నిండాక హలీమా ఆ బాలుడ్ని అమ్మ ఆమినా వద్దకు తీసుకు వచ్చింది. కాని అక్కడ అంటు వ్యాధి ప్రబలి ఉన్న కారణంగా మళ్ళీ హలీమా సాదియా, తల్లి ఆమినా కోరికవై బాల ముహమ్మద్‌ (స)ను మరోసారి తన పల్లెకు తీసుకుపోయింది.

ఇలా మహా ప్రవక్త (స) బనూ సఅద్‌తో పల్లె వాతావరణంలో ఉండసాగారు. ఆయనకు నాలుగు లేదా ఐదు ఏళ్ళు నిండి ఉంటాయి. రొమ్ము చీల్చిన (షఖ్ఖె సదర్‌) సంఘటన జరిగింది. ముస్లిం హదీసు గ్రంథంలో హజ్రత్‌ అనస్‌ (స) గారి కథనం ఇలా ఉంది: ”నిశ్చయంగా దైవ ప్రవక్త (స) బాల్యంలో తోటి  విల్లలతో ఆడుకుంటూ ఉండగా, ఆయన వద్దకు జిబ్రయీల్‌ దూత వచ్చారు. వచ్చీ రాగానే ప్రవక్త (స) గారిని పరుండబెట్టి వడిసి పట్టుకున్నారు. ఆయన రొమ్ము పరికరంతో చీల్చి గుండెకాయను బయటికి తీసారు. దాని నుండి ఓ భాగాన్ని వేరుపర్చి ఇది మీలోని షైతాన్‌ భాగం అన్నారు.  ఆ తరువాత పసిడి పళ్ళెంలో ఉంచి గుండెకాయను జమ్‌జమ్‌ జలంతో శుభ్రంగా కడిగి, దాన్ని మళ్ళీ దాని స్థానంలో వెట్టి అమర్చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన విల్లలంతా ఆయా హలీమా దగ్గరకు వచ్చి – ”ముహమ్మద్‌ హత్య చెయ్య బడ్డాడు, వెళ్ళి చూడండి” అన్నారు.

మాతృమూర్తి ఒడికి

ఈ సంఘటన తరువాత ఆయా హలీమాకు ముహమ్మద్‌ (స) గురించి చింతన ఎక్కువయింది. చివరికి ఆయన (స) గారిని తీసుకొచ్చి తల్లి ఆమినాకి అప్పగించింది. ప్రవక్త (స) తన శిక్షణలో ఆరేళ్ళు నిండేంత వరకూ ఉన్నారు. అమ్మ ఆమినా అనాథ ముహమ్మద్‌ (స)ను వెంట బెట్టుకుని మరణించిన తన భర్త స్మృతి చిహ్నాలు చూసి రావడానికి, భర్త సమాధిని దర్శించడానికి మక్కా నుండి బయలుదేరి, యస్రిబ్‌  (మదీనా)కి చేరుకున్నారు. ఆమెతోపాటు ఉమ్మె ఐమన్‌ కూడా ఉంది. దాదాపు ఒక నెల రోజుల పాటు అక్కడ గడివి మక్కాకు తిరుగు ప్రయాణమయ్యారు. కాని మార్గ మధ్యంలో ఓ మహమ్మారి రోగం చుట్టుముట్టింది. దాని ప్రభావంతో మదీనా మక్కాల మధ్య అబ్వా అనే ప్రాంతంలో ఆమె పరమపదించారు (అక్కడే ఆమెను సమాధి చేశారు).

Related Post