ప్రథమ ఖలీఫా హజ్రత్‌ అబూ బకర్‌ (ర)

'ఒక సారి మా నాన్నగారు నన్ను విగ్రహాలున్న గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ ఒక విగ్రహాన్ని చూవిస్తూ 'ఈ విగ్రహమే నీ దేవుడు. దీని ముందు సాష్టాంగపడు' అని చెప్పారు. నేనా విగ్రహం దగ్గరికెళ్ళి 'నాకు ఆకలిగా ఉంది అన్నం తెవ్పించు' అన్నాను. కానీ విగ్రహం మాట్లాడలేదు. తర్వాత 'నాకు బట్టలు కావాలి తెచ్చివ్వు' అన్నాను మళ్ళీ, దానికి విగ్రహం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. చివరికి నేను ఒక రాయి తీసుకొని 'చూడు, నేనిప్పుడు నిన్ను ఈ రాయితో కొడ్తాను. చేతనైతే నిన్ను నీవు కాపాడుకో' అని చెప్పాను.   దానికీ   ఆ  విగ్రహం  నుండి  ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. అప్పుడు నేను ఆ రాయిని దాని తల మీద బలంగా విసిరికొట్టాను. దాంతో అది బోర్లా పడి పోయింది'' అని స్వయంగా తెలిపారు.   నిజమే మరి! విగ్రహాలు ఎలాంటి శక్తీ లేనివి. భక్తులకు సహాయం చేయడం అటుంచి, తమకు తామే సహాయం చేసుకోలేవు. అందువల్ల వాటిని పూజించడం వ్యర్థమని తలంచారాయన.

‘ఒక సారి మా నాన్నగారు నన్ను విగ్రహాలున్న గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ ఒక విగ్రహాన్ని చూవిస్తూ ‘ఈ విగ్రహమే నీ దేవుడు. దీని ముందు సాష్టాంగపడు’ అని చెప్పారు. నేనా విగ్రహం దగ్గరికెళ్ళి ‘నాకు ఆకలిగా ఉంది అన్నం తెవ్పించు’ అన్నాను. కానీ విగ్రహం మాట్లాడలేదు. తర్వాత ‘నాకు బట్టలు కావాలి తెచ్చివ్వు’ అన్నాను మళ్ళీ, దానికి విగ్రహం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. చివరికి నేను ఒక రాయి తీసుకొని ‘చూడు, నేనిప్పుడు నిన్ను ఈ రాయితో కొడ్తాను. చేతనైతే నిన్ను నీవు కాపాడుకో’ అని చెప్పాను. దానికీ ఆ విగ్రహం నుండి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. అప్పుడు నేను ఆ రాయిని దాని తల మీద బలంగా విసిరికొట్టాను. దాంతో అది బోర్లా పడి పోయింది” అని స్వయంగా తెలిపారు. నిజమే మరి! విగ్రహాలు ఎలాంటి శక్తీ లేనివి. భక్తులకు సహాయం చేయడం అటుంచి, తమకు తామే సహాయం చేసుకోలేవు. అందువల్ల వాటిని పూజించడం వ్యర్థమని తలంచారాయన.

ముహమ్మద్ బిలాల్

 

దైవ ప్రవక్త (స) పరమ పదించిన తరువాత ఆయన వారసులుగా నలుగురు అనుచరులు ఖలీఫాలు అయ్యారు. ఆ నలుగురు : 

(1) హజ్రత్‌ అబూ బకర్‌ సిద్దీఖ్‌ (రజి)
(2) హజ్రత్‌ ఉమర్‌ ఫారూఖ్‌ (రజి)
(3) హజ్రత్‌ ఉస్మాన్‌ గని (రజి)
(4) హజ్రత్‌ అలీ (రజి).
ఈ నలుగురినే ఖులఫాయె రాషిదీన్‌ (సన్మార్గగాములైన ఖలీఫాలు) అంటారు. అరబీ భాషలో ఖలీఫా అంటే ప్రతినిధి, వారసుడు అని అర్థాలున్నాయి. ఖలీఫాకు బహు వచనం ఖులఫా. రాషిద్‌ అంటే సన్మార్గంలో నడిచేవాడని అర్థం. రాషిద్‌కు బహువచనం రాషిదీన్‌. ఖులఫాయె రాషిదీన్‌ అంటే సన్మార్గగాములైన ప్రతినిధులు అని అర్థం. మన ప్రియ ప్రవక్త (స) దైవాభీష్టం ప్రకారం ఇస్లామీయ వ్యవస్థను ఏవిధంగా నడిపారో ఆ నలుగురు ఖలీఫాలు కూడా అదే విధంగా పరిపాలన చేశారు. వారు తమ తరఫున ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. ఆ నలుగురు ధర్మ ఖలీఫాలలో మొదటివారు హజ్రత్‌ అబూ బకర్‌ సిద్దీఖ్‌ (ర).
అసలు వేరు : అబ్దుల్లాహ్‌ (అబూ బకర్‌గా విలువబడ్డారు)
బిరుదులు : సిద్దీఖ్‌, అతీఖ్‌
తండ్రి వేరు : ఉస్మాన్‌ (అబూ ఖహాఫాగా విలువబడ్డారు)
తల్లి వేరు : సల్మా (ఉమ్ముల్‌ ఖైర్‌గా విలువబడ్డారు)
తండ్రి తండ్రి వేరు : ఆమిర్‌, తల్లి తండ్రి వేరు : సఖర్‌
వంశం: ఖురైష్‌ తెగలోని ఉప తెగ బనూ తమీమ్‌కు చెందినవారు. మక్కా ప్రజలు తమీమ్‌ తెగవారిని ఎంతగానో గౌరవించే వారు. ఆయన వంశావళి ఆరవ సంతతిలో దైవప్రవక్త (స) వంశంతో కలుస్త్తుంది. తల్లి సల్మా (రజి) గారు ప్రారంభంలోనే ఇస్లాం స్వీకరించారు. తండ్రి మక్కా విజయం తర్వాత ఇస్లాం స్వీకరించారు.

పుట్టుక, బాల్యం
హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) క్రీ. శ. 573 జూన్‌ నెలలో జన్మించారు. ప్రవక్త మహనీయులకన్నా రెండున్నర సంవత్సరాలు చిన్నవారు. చిన్నప్పటి నుండి ప్రవక్త (స) గారిని అనుసరించేవారు. బాల్య మిత్రులు కూడా. ప్రవక్త (స) ఎంతో బిడియస్తులు. హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) కూడా అశ్లీల విషయాలను అసహ్యించుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్ననాటి నుంచే ఎంతో మంచివారుగా, దయార్ధ్ర హృదయులుగా, పరోపకారిగా, వెద్దలను గౌరవించే వ్యక్తిగా వేరుపడ్డారు. అందుచేత మక్కావాసులు ఆయన్ని ఎంతగానో అభిమానించేవారు, గౌరవించేవారు.
చిన్ననాటి నుండే బహుదైవారాధనకు దూరంగా ఉండేవారు. ఆయన ఇంట్లో ఒక గదిలో విగ్రహాలు ఉండేవి. ఇంట్లో వారంతా విగ్రహాలను పూజించేవారు. ”ఒక సారి మా నాన్నగారు నన్ను విగ్రహాలున్న గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ ఒక విగ్రహాన్ని చూవిస్తూ ‘ఈ విగ్రహమే నీ దేవుడు. దీని ముందు సాష్టాంగపడు’ అని చెప్పారు. నేనా విగ్రహం దగ్గరికెళ్ళి ‘నాకు ఆకలిగా ఉంది అన్నం తెవ్పించు’ అన్నాను. కానీ విగ్రహం మాట్లాడలేదు. తర్వాత ‘నాకు బట్టలు కావాలి తెచ్చివ్వు’ అన్నాను మళ్ళీ, దానికి విగ్రహం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. చివరికి నేను ఒక రాయి తీసుకొని ‘చూడు, నేనిప్పుడు నిన్ను ఈ రాయితో కొడ్తాను. చేతనైతే నిన్ను నీవు కాపాడుకో’ అని చెప్పాను. దానికీ ఆ విగ్రహం నుండి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. అప్పుడు నేను ఆ రాయిని దాని తల మీద బలంగా విసిరికొట్టాను. దాంతో అది బోర్లా పడి పోయింది” అని స్వయంగా తెలిపారు. నిజమే మరి! విగ్రహాలు ఎలాంటి శక్తీ లేనివి. భక్తులకు సహాయం చేయడం అటుంచి, తమకు తామే సహాయం చేసుకోలేవు. అందువల్ల వాటిని పూజించడం వ్యర్థమని తలంచారాయన.

యువకుడిగా ఆయన వ్యక్తిత్వం:
మంచితనం, పరోపకార స్వభావం వల్ల ఖురైష్‌ తెగలోని ప్రతి మనిషీ ఆయన్ను ఎంతగానో అభిమానించేవాడు. వంశంలో ఎవరైనా హత్య చేయబడితే ఆ వ్యవహారం హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) గారికి అప్పగించబడేది. ఆ వ్యవహారాన్ని ఎంతో నేర్పుగా పరిష్కరించేవారు. ఆ తీర్పు ఉభయులకూ సంతోషాన్ని కలిగించేది. జీవనోపాధి కోసం ఆయన వ్యాపారం చేసేవారు. ఆయన నిజాయితీకి ప్రజలు ఎంతగానో ప్రభావితులయ్యేవారు. అనతి కాలంలోనే మక్కా ధనికుల్లో ఒకరయి పోయారు. ఆయన వ్రియ ప్రవక్త (స) గారితో కలిసి అనేక వాణిజ్య పర్యటనలు జరిపారు.
ముహమ్మద్‌ (స) గారు దైవ ప్రవక్తగా నియమించబడిన తర్వాత తన దగ్గరి బంధు మిత్రులకు ఇస్లాం సందేశం అందజేయడం ప్రారంభించారు. తన కుటుంబీకుల తర్వాత మొదటగా అబూ బకర్‌ (రజి) గారికి ఇస్లాం సందేశం అందజేశారు. సందేశం వినగానే ఎలాంటి తటపటాయింపు లేకుండా వెంటనే ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన స్వేచ్ఛాపరులైన పురుషులలో మొదటివారై చరిత్రలో చిరస్మరణీయులైనారు. అప్పటికి ఆయనగారి వయస్సు 37 సంవత్సరాలు.
ధర్మప్రచారం
హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) ఇస్లాం స్వీకరించగానే ఇతరులు కూడా తనలాగే ఇస్లాం స్వీకరించి అల్లాహ్‌ా వ్రియదాసులలో చేరిపోతే బాగుంటుందని మధన పడేవారు. తన స్నేహితులకు ధర్మాన్ని పరిచయం చేసేవారు. ప్రవక్త (స) అనుమతితో జన సమూహాలలో బహిరంగంగా ప్రచారం చేయడం మొదలెట్టారు. సత్య తిరస్కారులు ఒక్కసారిగా ఆయనవై విరుచుకుపడి చితకబాదేవారు. దాంతో ఆయన రక్తసిక్తమై స్పృహ తవ్పి పడిపోయేవారు. స్పృహ రాగానే ప్రచారం మొదలెట్టేవారు. ”సోదరులారా! మనకు, యావత్తు విశ్వానికి సృష్ట్టికర్త, స్వామి, ప్రభువు, యజమాని అల్లాహ్‌ా మాత్రమేనని, ఆయనే మనకు ఉపాధి ఇస్తున్నాడని, చివరికి మనమంతా కర్మల విచారణ కోసం ఒక రోజు ఆయన దగ్గరికే పోవలసి ఉంద”ని తనదైన శైలిలో చెవ్పేవారు. హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) గారి బోధనలకు ప్రభావితులై ఇస్లాం స్వీకరించిన ప్రముఖులు :
(1) హజ్రత్‌ ఉస్మాన్‌ బిన్‌ అప్ఫాన్‌ (రజి) (2) హజ్రత్‌ జుబైర్‌ బిన్‌ అవ్వామ్‌ (రజి)
(3) హజ్రత్‌ అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌ (రజి) (4) హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబీ వఖ్ఖాస్‌ (రజి)
(5) హజ్రత్‌ తల్హా బిన్‌ అబ్దుల్లాహ్‌ా (రజి) (6) హజ్రత్‌ ఉస్మాన్‌ బిన్‌ మజ్‌వూన్‌ (రజి)
(7) హజ్రత్‌ అబూ ఉబైదా బిన్‌ జర్రాహ్‌ా (రజి)
(8) హజ్రత్‌ అబూ సలమా(రజి)
(9) హజ్రత్‌ ఖాలిద్‌ బిన్‌ సయీద్‌ బిన్‌ ఆస్‌ (రజి).
ధర్మ ప్రచారం కోసం ప్రవక్త (స) గారికి కావలసిన వైకమంతా హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) గారే సమకూర్చేవారు. ఇస్లాం కోసం తన యావత్‌ సంపాదనను మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసేవారు. ఏమాత్రం వెనకాడేవారు కాదు. బానిసలలో చాలా మంది ఇస్లాం స్వీకరించారు. ఈ కారణంగా వారి అవిశ్వాస యజమానులు వారిని శరీరం గగుర్పొడిచే విధంగా చిత్రహింసలు వెట్టేవారు. హజ్రత్‌ అబూబకర్‌ (రజి) ఈ పరిస్థితిని చూసి చలించిపోయేవారు. వారి యజమానులతో మాట్లాడి వారడిగినంత వైకం చెల్లించి కొని వారికి స్వేచ్ఛను ప్రసాదించారు. అలా స్వేచ్ఛను పొందిన వారిలో ముఖ్యులు :
(1) హజ్రత్‌ బిలాల్‌ (రజి),
(2) హజ్రత్‌ నజీరా (రజి),
(3) హజ్రత్‌ బిన్త్‌ నహ్‌ాదియా (రజి),
(4) హజ్రత్‌ ఆమిర్‌ బిన్‌ ఫుహైరా (రజి), (5) హజ్రత్‌ జారియా(రజి)
ఇస్లాం ధర్మ ప్రచారంలో ప్రవక్త (స) గారికి వెన్నంటి ఉండి అల్లరి మూకల నుండి విరుచుకుపడే అఘాయిత్యాల నుండి రక్షణ కవచమై నిలిచేవారు. ఈ ప్రయత్నాలలో రక్త సిక్తమయ్యేవారు కానీ ప్రవక్త (స) గారివై ఈగను సైతం వాల నిచ్చేవారు కాదు.
ప్రవక్త (స) గారి వెంట మదీనాకు వలస (హిజ్రత్‌)కు తన సర్వాన్నీ వదలి బయలు దేరారు. దారిలో సౌర్‌ గుహలో 3 రోజులు గడపవలసి వచ్చింది. ప్రవక్త (స) గారు అబూ బకర్‌ (రజి) గారి తొడమీద తల ఉంచి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక కన్నంలో నుండి పాము బయటికి రావడాన్ని గమనించి ఎక్కడ ప్రవక్త (స) గారిని కాటేస్తుందోనని తన కాలిని అడ్డం వెట్టారు. ఆ పాము తనను కాటేసింది. అయినప్పటికీ భయంకరమైన బాధను భరించారేగాని ప్రవక్త (స) గారికి నిద్రాభంగం కానివ్వలేదు. బాధతో కళ్ళ నుండి కారే కన్నీరు ప్రవక్త (స) గారి చెక్కిళ్ళవై పడ్డాయి. ప్రవక్త (స) గారు మేల్కొని విషయం తెలుసుకొని తన లాలాజలంను పూసి బాధ విముక్తుణ్ణి చేశారు. అలా ప్రవక్త (స) వారి గుహ సహవాసిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు.

విశ్వాసులకు – అవిశ్వాసులకు జరిగిన మొదటి యుద్ధం (బదర్‌) లో విజయానంతరం బందీలుగా చిక్కినవారి విషయంలో వీరు మన సోదరులే, పరిహారం తీసుకొని వదిలి వెయ్యాల్సిందిగా మహోన్నతమైన సలహా ఇచ్చి అబూ బకర్‌ (ర) తన హుందాతనాన్ని చాటుకొని ప్రవక్త (స) హృద యాన్ని దోచుకున్నారు. హిజ్రీ శకం 9 వ సంవత్సరం రోమన్లతో జరిగే యుద్ధం కోసం విరాళాల కోసం ప్రవక్త (స) గారు ప్రకటన గావించగా అబూ బకర్‌ (ర)గారు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకొని మరీ తెచ్చిచ్చారు. ఇంటివారల కోసం అల్లాహ్‌ాను, దైవప్రవక్తను వదిలివెట్టాను అని చెవ్పి ప్రగాఢమైన విశ్వాసాన్ని చాటుకొన్నారు.

ప్రవక్త (స) గారు నమాజు చేయించలేనంతగా వ్యాధిగ్రస్త్తులై పోవడంవల్ల తన స్థానంలో అబూ బకర్‌ (ర) గారిని ఇమాముగా నియమించారు. స్వయంగా ప్రవక్త (స) గారు కూడా కలిసి నమాజు చేశారు. ప్రవక్త (స) చనిపోయిన తర్వాత అబూ బకర్‌ (ర) గారిని ఖలీఫాగా ఎన్నుకోవడం జరిగింది. మేధావులు ఎంతగానో నచ్చజెవ్పిన తర్వాత ఆయన ఈ బాధ్యతను స్వీకరించారు. తను చేస్తున్న వ్యాపారాన్ని మానేసి పూర్తి సమయాన్ని ఖిలాఫ¦త్‌ బాధ్యతలను ఏకాగ్రతతో నిర్వహించడానికి వెచ్చించారు.
హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారు ఖలీఫా అయిన తర్వాత కొన్ని తెగలు తిరుగుబాటు చేశాయి. వాటిని ఆయన సమర్థవంతంగా అణచివేశారు. అంత కష్ట కాలంలో కూడా ఆయన సైన్యానికి నీతిబోధనలు చేశారు.

వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
1. నిజాయితీగా వ్యవహరించండి. 2. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. 3. యుద్ధంలో హతులయినవారి అవయవాలు కోసెయ్యకండి, స్త్రీలను, విల్లలను, వృద్ధులను చంపకండి. 4. ఖర్జూరపు చెట్లను నరకడంగాని, కాల్చడంగాని చెయ్యకండి. 5. దొంగతనానికి పాల్పడకండి. 6. మేకలు, గొర్రెలు, ఆవులు, ఒంటెలను తినడానికి తప్ప చంపకండి. 7. చర్చీలలో ఉండి ఆరాధనల్లో నిమగ్నులై ఉండే వారి జోలికి పోకండి. 8. మీకెవరైనా భోజనం వెడ్తె మీరు అల్లాహ్‌ వేరు ఉచ్చరించి తినండి.

హజ్రత్‌ అబూ బకర్‌ (ర) ఖిలాఫ¦త్‌ కాలంలోనే (రాతి వ¦లకలు, చర్మపు ముక్కలు, ఖరూరపు మట్టలు, ఎముకలవై వ్రాయబడిన) ఖుర్‌ఆన్‌ భాగాలను ఒక చోట జమచేసి సమగ్ర గ్రంథంగా రూపొందించటం జరిగింది. హిజ్రీ శకం 13 వ సంవత్సరం, జమాదిల్‌ ఆఖిర్‌ నెలలో హజ్రత్‌ అబూ బకర్‌ (ర) జబ్బు పడ్డారు. ఆయన కోరిక ప్రకారమే ప్రవక్త (స) గారి మరణం లాంటి మరణాన్నే అల్లాహ్‌ ప్రసాదించాడు. ప్రవక్త (స) గారు పరమపదించే నాటికి 63 సంవత్సరాలు, హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారికి కూడా 63 సంవత్సరాలు. ప్రవక్త (స) గారు సోమవారం చనిపోయారు. హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) గారు కూడా సోమవారం (మగ్రిబ్‌, ఇషా మధ్యలో) చనిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌.
అబూ బకర్‌ (రజి) గారి భార్యలు:
హజ్రత్‌ అబూ బకర్‌ ((ర) నలుగురు స్త్రీలను వివాహమాడారు.
(1) ఖతీలా బిన్త్‌ అబ్దుజ్జా: ఈమె లూయా తెగకు చెందిన మహిళ. ఇస్లాం స్వీకరణకు పూర్వమే ఈమెను వివాహమాడారు.
(2) ఉమ్మె రూమాన్‌ బిన్త్‌ ఆమిర్‌: ఈమె బనీ కనానా వంశానికి చెందిన మహిళ. ఈమెను కూడా ఇస్లాం స్వీకరణకు పూర్వమే వివాహమాడారు.
(3) అస్మా బిన్త్‌ ఉమైస్‌ (ర): ఈమె ఖషామ్‌ వంశానికి చెందిన మహిళ. ముస్లిం అయిన తర్వాత ఈమెను వివాహమాడారు. మొదట ఈమె వివాహం హజ్రత్‌ జాఫ¦ర్‌ బిన్‌ అబీ తాలిబ్‌తో అయింది. హజ్రత్‌ జాఫ¦ర్‌ (ర) అమరగతులయిన తర్వాత ఆమెను హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) వివాహమాడారు.
(4) హబీబా బిన్త్‌ ఖారిజా (ర): ఈమె ఖజ్రజ్‌ తెగకు చెందిన మహిళ. ఈమెను కూడా ముస్లిం అయిన తర్వాతే వివాహమాడారు. సంతానం:
మొదటి భార్య ద్వారా హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ (ర), హజ్రత్‌ అస్మా (రజి) పుట్టారు.
(1) అబ్దుల్లాహ్‌ (ర): ఈయన ప్రారంభంలోనే ఇస్లాం స్వీకరించారు. తాయిఫ్‌ యుద్ధంలో దైవప్రవక్త (లి)తోపాటు పాల్గ్గొన్నారు. హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) పాలనా కాలంలోనే ఈయన చనిపోయారు.
(2) హజ్రత్‌ అస్మా (ర): ఈమె సౌర్‌ గుహలో దైవప్రవక్త (స) కు సేవ చేశారు. ప్రవక్త (స) గారు ఆమెను ‘జాతున్‌ నితాఖతైన్‌్‌’ అని ముద్దుగా విలిచారు. హజ్రత్‌ జుబైర్‌ బిన్‌ అవ్వామ్‌ (ర)తో వివాహం జరిగింది. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ జుబైర్‌ (ర) ఈమె కుమారులే. ఆమె వంద సంవత్సరాలు జీవించారు.

రెండవ భార్య ద్వారా హజ్రత్‌ అబ్దుర్రహ్‌ామాన్‌ (ర), విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ ఆయిషా (ర) గారు జన్మించారు.
(1) అబ్దుర్రహ్‌మాన్‌ (ర): ఈయన చాలా కాలం తర్వాత ఇస్లాం స్వీకరించారు. నాన్నగారి పరిపాలనా కాలంలో అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. హిజ్రీ శకం 53లో చనిపోయారు.
(2) ఆయిషా (ర): ఈమె వివాహం దైవప్రవక్త (స)తో జరిగింది. ఈమె ఎంతో తెలివితేటలు గల మహిళ. హదీసు విద్యలో గొప్ప పండితురాలు. దాదాపు 70 సంవత్సరాల వయసులో హిజ్రీ శకం 58లో పరమపదించారు. మూడవ భార్య ద్వారా హజ్రత్‌ ముహమ్మద్‌ బిన్‌ అబూ బకర్‌ (శి) పుట్టారు. హజ్రత్‌ అలీ (ర) పాలనా కాలంలో ఈజిప్ట్‌ గవర్నరుగా పని చేశారు. ఈజిప్ట్‌లోనే చనిపోయారు.నాల్గవ భార్య ద్వారా ఉమ్మె కుల్సూమ్‌ (రహ్మలై) జన్మించారు. ఈమె హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారు చనిపోయిన తర్వాత జన్మించారు.

రూపు రేఖలు, గుణగణాలు:

హజ్రత్‌ అబూ బకర్‌ (ర) తెల్లగా, బక్క పలచగా ఉండేవారు. బుగ్గలు సొట్టబోయి ఉండేవి. కళ్ళు కొంచెం లోపలికి ఉండేవి. బట్ట తల. గడ్డానికి గోరింటాకు పూసుకొనేవారు. కొంచెం వంగి నడిచేవారు. చేతి వ్రేలికి వెండి వుంగరం ఉండేది.హజ్రత్‌ అబూ బకర్‌ (ర) ఉదార స్వభావి, అధికంగా దానధర్మాలు చేసేవారు, వేదల వెన్నిధి, మృదు హృదయులు, దివ్య ఖుర్‌ఆన్‌ను పఠిస్తూ దు:ఖించేవారు. ఆయన ఎంతో ధైర్యశాలి, పరాక్రమవంతుడు. ఎక్కువగా అల్లాహ్‌ాకు భయపడేవారు, భక్తిపరులు. రాత్రిళ్ళలో ఆరాధనలలో గడివేవారు, పగటి వేళల్లో ఉపవాసాలు పాటిస్తుండేవారు. సంఘసేవ కోసం ముందుండే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్త (స)ను చాలా వరకు అనుకరించేవారు. దైవభీతి పారాయణత, ధనవ్యయంలో జాగ్రత్తలు, అధర్మ సంపాదనకు దూరం, నోటి దురుసు పట్ల జాగ్రత్త, సహచరుల పట్ల సద్వర్తనం, నిగర్వి, నిరాడంబరత ఆయనగారి గుణగణాలకు దర్పణం. ప్రజాసేవ, అతిథి సత్కారంలో అందెవేసిన చెయ్యి. కలల గూడార్థం చెవ్పేవారు. ఏ పుణ్యకార్యమూ వదిలే వారు కాదు.

ప్రపంచ మానవాళికి హజ్రత్‌ అబూ బకర్‌ (ర) చేసిన హితోక్తులు:

(1) దేవుని వ్రియ భక్తులయినవారు సిరిసంపదలన్నింటినీ దేవుని మార్గంలో ధారపోయాలి.
(2) ఇతరులవై నిందారోపణ చేయకండి, మీకు మనశ్శాంతి లభిస్తుంది.
(3) చెడ్డ పనులు చేసేవారికి తోడ్పడేవారు కూడా చెడ్డ పనులు చేస్తున్నట్లే.
(4) సత్కార్యాలు మనిషిని దుష్కార్యాల నుండి కాపాడుతాయి.
(5) మీ వల్ల ఏదైనా పాపకార్యాలు జరిగి ఉంటే వాటికి బదులుగా పుణ్యకార్యాలు చేసి మిమ్మల్ని మీరు దైవశిక్ష నుండి కాపాడుకోండి.
(6) చెడ్డ స్నేహితులతో కలిసి ఉండడం కన్నా మీరు ఒంటరిగా ఉండడమే మంచిది.
(7) పాపం చీకటి లాంటిది. దాన్ని దైవభీతి మాత్రమే తొలగిస్తుంది.
(8) పరలోకం కూడా చీకటి లాంటిది. దాన్ని సదాచరణ అనే వెలుగు పోగొడ్తుంది.
(9) మనసు లగ్నం చేసి చేసే నమాజే అసలైన నమాజు.
(10) జ్ఞానం అనేది దైవప్రవక్తల నుండి వారసత్వంలో లభించే సంపద.
(11) ఆపదను సహనం ద్వారా దూరం చేయవచ్చు.
(12) ఉదయం వెందలాడ లేవడంలో మీరు వక్షుల వెనుక ఉండి పోవడం ఎంతో సిగ్గుచేటయిన విషయం.
(13) మీరు గౌరవించబడాలంటే ఇతరులకు అతిథి మర్యాదలు చేయండి.
(14) పదవీ హోదాల ప్రలోభానికి గురి కాకుండా ఉంటే వేరు ప్రతిష్టలు మీ పాదాలను తాకుతాయి.
(15) మూడు విషయాలు మనిషికి ప్రాణ సంకటంగా మారుతాయి అవి: అన్యాయం, వాగ్దాన భంగం, మోసం.

Related Post