కారుణ్యమూర్తి ముహమ్మద్ (స)

విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ మక్కా విజయం ప్రాప్తించిన రోజున, ఆనాడు శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షమించివేశారు. శత్రువులు ఆయనను హింసించి, హతమార్చాలని కుట్రలు పన్నారు. ప్రవక్త పిన తండ్రిని హతమార్చి, పచ్చి కాలేయాన్ని నమిలినటువంటి కర్కశులు సైతం ప్రవక్త సమక్షంలో నిస్సహాయులై ఉండగా ఆయన (స) ఎంతో ఔదార్యంతో - ''ఈ రోజు మీపై ఎలాంటి నిందాలేదు. ఇకనుండి మీరంతా స్వతంత్రుల''ని ప్రకటించిన గొప్ప క్షమాశీలి ముహమ్మద్‌ ప్రవక్త (సల్లం).

విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ మక్కా విజయం ప్రాప్తించిన రోజున, ఆనాడు శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షమించివేశారు. శత్రువులు ఆయనను హింసించి, హతమార్చాలని కుట్రలు పన్నారు. ప్రవక్త పిన తండ్రిని హతమార్చి, పచ్చి కాలేయాన్ని నమిలినటువంటి కర్కశులు సైతం ప్రవక్త సమక్షంలో నిస్సహాయులై ఉండగా ఆయన (స) ఎంతో ఔదార్యంతో – ”ఈ రోజు మీపై ఎలాంటి నిందాలేదు. ఇకనుండి మీరంతా స్వతంత్రుల”ని ప్రకటించిన గొప్ప క్షమాశీలి ముహమ్మద్‌ ప్రవక్త (సల్లం).

మానవ నైతిక నిధిలో అత్యంత విలక్షణమైన అరుదైన సుగుణం శత్రువులను కనికరించటం, మన్నింపుల వైఖరిని అవలంబించటం విశ్వకారుణ్య మహామనిషి ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహివసల్లం) అని చెప్పక తప్పదు.
అల్లాహ్ ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ఈ విధంగా సెలవిచ్చాడు ”ప్రవక్తా మంచి చెడు ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడై పోవడాన్ని గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు.”
విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ మక్కా విజయం ప్రాప్తించిన రోజున, ఆనాడు శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షమించివేశారు. శత్రువులు ఆయనను హింసించి, హతమార్చాలని కుట్రలు పన్నారు. ప్రవక్త పిన తండ్రిని హతమార్చి, పచ్చి కాలేయాన్ని నమిలినటువంటి కర్కశులు సైతం ప్రవక్త సమక్షంలో నిస్సహాయులై ఉండగా ఆయన (స) ఎంతో ఔదార్యంతో – ”ఈ రోజు మీపై ఎలాంటి నిందాలేదు. ఇకనుండి మీరంతా స్వతంత్రుల”ని ప్రకటించిన గొప్ప క్షమాశీలి ముహమ్మద్‌ ప్రవక్త (సల్లం).

ఒకరోజు తాయెఫ్‌ ఆనే పట్టణానికి సనాతన ధర్మ సందేశాన్ని ప్రజల్లో అందజేయడానికి వెళ్లారు. అక్కడ ప్రజలు అసలు దేవుడంటేనే నమ్మేవారు కాదు. వారు మహా మూర్ఖులుగా సైకోలుగా ప్రవర్తన ఉండేది. దైవానికి కృతజ్ఞతతో దైవ భక్తితో జీవించే బదులు, దైవాగ్రహం కలిగించేలా ప్రవర్తిస్తుండేవారు. వారు చెప్పిందే వేదం అన్నట్లు వారి వ్యవహారం ఉండేది. అలాంటి గర్వికుల జనం దగ్గరికి వెళ్లి దైవ సందేశం చెబుతుంటే ఆ ఊరి జనం దైవ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లం)పై రాళ్ల వర్షం కురిపించారు.
జనం రాళ్ల వర్షం కురిపిస్తున్న తరుణంలో దైవాదేశం మేరకు విచ్చేసిన దైవదూత, ఓ ప్రవక్తా ఒక్క అనుజ్ఞ ఇవ్వండి. చాలు ఈ పట్టణాన్ని చుట్టు పక్కల పర్వతాల ద్వారా పిండి, పిండి చేస్తాను అని అన్నప్పుడు దానికి బదులుగా ‘శరీరం గాయపడి, తల నుండి పాదాల వరకు రక్తం కారుతున్న దయనీయ స్థితిలో ఉండికూడా విశ్వకారుణ్య మూర్తి (సల్లం) ఆ దైవదూతతో ‘వీరు సన్మార్గగాములుగా మారక పోయినప్పటికీ వీరి సంతానమైన ఆదైవాన్ని’ తెలుసుకుంటారేమో అని పలికేవారు.

ఇక ఇంటి విషయాల్లో కుటుంబ యజమానిగా ఉత్తమ పురుషుడుగా వర్థిల్లినా మహామనిషి, ఇంటి పనుల్లో, సతీమణులకు చేదోడు, వాదోడుగా ఉండటంతో పాటు, వారి హక్కుల్ని ఎల్లవేళలా నెరవేర్చేవారు. మీ భార్య దృష్టిలో ఉత్తముడే. మీలో ఉత్తముడు అన్న స్వీయ ప్రవచనంలో పోతపోసినట్లు ఒదిగిపోయిన వ్యక్తిత్వం ముహ మ్మద్‌కే సొంతం అని చెప్పవచ్చు.
తల్లిదండ్రులు తమ సంతానానికి ఇచ్చే శ్రేష్టమైన కానుక చదువు సంస్కారాలేనని ప్రబోధించారు. తమ సంతానాన్ని ఎంతో ధర్మశీలురుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. దైవ ప్రవక్త ముహమ్మద్‌ విషయంలో ఎంతో మంది చరిత్రకారులు రాసారు.
ఉదాహణగా ప్రొఫెసర్‌ కె.యస్‌. రామకృష్ణారావు, ముహమ్మద్‌ ప్రవక్త రాజ్యాధినేతగా ఉన్నప్పటికీ ఆయన అతి సాధారణ పౌరుని స్థాయి నుండి అరేబియా పాలకునిగా ఖుస్రా, సీజర్‌లకు సమానుడిగా ఈ పధ్నాలుగు శతాబ్దాల కాలం గట్టిగా నిలిచిన మహా సామ్రాజ్య స్థాపకుడు, ఆ మహారాజు పదిలక్షల చదరపు మైళ్ల వైశాల్యం గల భూమికి ప్రభువు అయినప్పటికీ తన చెప్పులను తానే బాగుచేసుకున్నారని, తన దుస్తులను తానే కుట్టుకున్నారని తెలిపారు. అలాగే రెవరెండ్‌. బాస్వర్డ్‌ స్మిత్‌ కూడా పొగిడి ఉన్నారు. ముహ్మమ్మద్‌ ప్రవక్త రాజ్యాధపతిగా నేతగా ఆయన తన
లోనే ఓ సీజరు, ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపేగాని పోపులాంటి పటాటోపం లేదు. సీజరే కాని సీజర్‌ లాంటి వైభవం లేదు. ఆ స్థాయి సైన్యమూ లేదు. అంగరక్షకుడు లేడు. ఖజానా లేదు. ప్రపంచంలో ఎవరైనా నిజమైన దైవిక అధికారంతో పరిపాలించారని చెబితే అది ముహమ్మద్‌ ప్రవక్త (స) మాత్రమే. ఆయనకు అన్ని అధికారాలూ ఉండేవి. అయినా ఆ డాంబికాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఆయన (స) వ్యక్తిగత జీవితంలో నిరాడంబరత, ప్రజాజీవితంలో సాధారణతలను చరిత్ర చూసిందని తెలిపారు.

అల్లాహ్ తన అంతిమ గ్రంథం అయిన ఖుర్‌ ఆన్‌లో ఈ విధంగా సెలవిచ్చాడు. ప్రజలారా ముహమ్మద్‌ మీ పురుషులలో ఎవ్వరికీ తండ్రికారు, కాని ఆయన దేవుని సందేశహరులు, ప్రవక్తలందరికీ అంతిమ మయినవారు. అల్లాహ్ ప్రతి విషయ జ్ఞానం ఉన్న వాడు. ఈ వాక్యంలో దైవ తిరస్కారులు, కపటుల అభ్యంతరాలకు సమాధానం ఇచ్చాడు.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ ఇలా తెలిపారు. బనీ ఇస్రాయిల్‌ ప్రవక్తలు నాయకత్వమూ వహించేవారు. ఒక ప్రవక్త మరణిస్తే, మరో ప్రవక్త అతని స్థానంలోకి వచ్చేవాడు. కానీ నా తర్వాత మరో ప్రవక్త రాడు, కేవలం ప్రతినిధులే ఉంటారు.
మరో హదీసులో ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచ్చారు. నాకు పూర్వం గతించిన ప్రవక్తలకు గల ఉపమానం ఎటువంటిదంటే, ఒక వ్యక్తి ఒక కట్టడాన్ని నిర్మించాడు. దాన్ని బాగా అందంగా కనుల పండుగగా రూపొందించాడు. కాని ఒక మూలన ఒక ఇటుక మందం స్థలం వదలిపెట్టాడు. జనం ఆ కట్టడాన్ని చుట్టూ తిరిగి చూస్తారు, దాని చక్కదనానికి అబ్బుర పడతారు.కానీ అక్కడ ఇటుక ఎందుకు పెట్టలేదూ అని అడిగేవారు. అయితే ఆ ఇటుకను నేనే. నేను ‘ఖాతమన్నబీయ్యీన్‌’ ని (అంటే నా రాకతో దైవ దౌత్యపు కట్టడం పరిపూర్ణమయింది. మరెవరయినా వచ్చి నింపడానికి ఇక చోటు ఏమీ మిగుల లేదు..).
ఓ అల్లాహ్‌ ఈ ప్రపంచంలో దజ్జాల్‌ కీడు నుంచి మమ్ములను రక్షించు! నీ ప్రవక్తల్లో చిట్ట చివరి ప్రవక్త ముహ్మమ్మద్‌ ఉమ్మతగా జీవించే ఇహపర భాగ్యం కలిగించు ఆదర్శమూర్తి విశ్వకారుణ్యమూర్తి ఆశయాలకు అనుగుణంగా నీభక్తునిగా మంచి సద్భుద్దులు ప్రసాదించు. ఆమీన్‌!

Related Post