ఉత్తమ ఆశయం ఉత్ప్రేరకం కావాలి…!

ఉత్తమ ఆశయం ఉత్ప్రేరకం కావాలి..

వజ్ర సంకల్పం గల ప్రవక్తలు నహనం. వహించి నట్లు నీవూ సహనం వహించు (దివ్యఖుర్ఆన్ 46:35)
అల్లాహ్ మనకు “ఖైరు రు ఉమ్మహ్” (శ్రేష్ట సముదాయం) అని బిరుదు ఇచ్చాడు. సంపూర్ణ .. ధర్మం రూపంలో ఇస్లాంను కానుకగా ప్రసాదించాడు. ఇక విజయాలు మన సొంతమవ్వాలన్నా, సకల శుభాలు మనల్ని కోరి రావాలన్నా, ప్రపంచంలో శాంతిని నెలకొనాలన్న గొప్ప ఆశయం మనకున్నా దేవుడు మనల్ని నమ్మి విజయాన్నివ్వబోయే ముందు మనం దైవం అప్పగించిన అమూల్యమైన అమానతు (ఖుర్ ఆన్)ని నిభాయించుకోగలమని వినయపూర్వ కంగా నిరూపించుకోవాలి. ఈ కార్యసిద్ధికోసమే రోజుకి ఐదు పూటల ప్రార్ధనను విధిగావించాడు అల్లాహ్.

ప్రార్థన ముఖ్య ఉద్దేశాలలో ఒకటి మనిషిలో గల సృజనాత్మక భావాన్ని మేల్కొల్పడం. జయప్రదంగా జీవితాన్ని జీవించడానికి అవసర మైందంతా మనిషి మనసులోనే ఉంది. మనిషి తన అంతరంగంలో ఉన్న ఆలోచనలు ఎదగడానికి, రూపుదిద్దుకోవడానికి అవకాశమిస్తే విజయానికి దారి తీయగలడు. మన సృష్టికర్త మన మనసుల్లో, వ్యక్తిత్వాన్ని అపారమైన శక్తి సామర్థ్యాన్ని నిక్షిప్తం చేశాడు. వాటిని వెలికితీసి వృద్ధి చెందించుకోవడానికి ప్రార్ధన దోహద పడుతుంది.

ప్రార్థన ముఖ్య ఉద్దేశాలలో ఒకటి మనిషిలో గల సృజనాత్మక భావాన్ని మేల్కొల్పడం. జయప్రదంగా జీవితాన్ని జీవించడానికి అవసర మైందంతా మనిషి మనసులోనే ఉంది. మనిషి తన అంతరంగంలో ఉన్న ఆలోచనలు ఎదగడానికి, రూపుదిద్దుకోవడానికి అవకాశమిస్తే విజయానికి దారి తీయగలడు. మన సృష్టికర్త మన మనసుల్లో, వ్యక్తిత్వాన్ని అపారమైన శక్తి సామర్థ్యాన్ని నిక్షిప్తం చేశాడు. వాటిని వెలికితీసి వృద్ధి చెందించుకోవడానికి ప్రార్ధన దోహద పడుతుంది.

ఈ జీవన యాత్రలో వైఫల్యాలున్నాయి. ఆశా భంగాలున్నాయి. తోవ తప్పడాలూ ఉన్నాయి. కాని దారి తప్పిన ప్రతిసారీ ఖుర్ఆన్ మనకు మార్గదర్శకం కావాలి. ప్రవక్త (స) గారి జీవన సరళి మనల్ని మరలా సరిగా నిలబెట్టాలి. ఇత రుల్ని అర్ధం చేసుకున్నవాడు విజ్ఞాని. కాని తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకంలేని విజ్ఞానం ప్రయోజనశూన్యం అన్న వాస్తవం దృష్ట్యా ముందు మనల్ని మనం గెలవ గలగాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు “విశ్వసించే వారికి ధరణిపై అనేక నిదర్శనాలున్నాయి. స్వయంగా మీ (అస్తిత్వం)లో కూడా ఉన్నాయి. మీరీ విషయం గురించి యోచించరా? (దివ్య ఖుర్ఆన్-20:21)

పంప్రపంచంలోని గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాను ఒక అంగలో, ఒక్క రోజులో అధిరోహించ లేదు. ప్రపంచమంతా గాఢ నిద్రలో, విశ్రాంతిలో ఉన్న నిశిధ సమయంలో కూడా వాళ్ళు ఎన్నో సుఖాలను వదులుకొని ఒక్కొక్క మెట్టూ పైకెదిగారు. కనుక ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగాలి, తీవ్రంగా శ్రమించాలి చేయాలన్న తపన, చేయగలమన్న నమ్మకం, చేసే దైర్యం, దానికి తగ్గ పట్టుదల అన్నది ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ప్రతీదీ సాధ్యమే.

సాహనం, నైపుణ్యం – ఇవి రెండూ వేర్వేరు అంశాలు. 1) ప్రకృతి పరమైనది అంటే….. “దానుడికి దేవుడు ప్రసాదించినవి. వీటిని అభివృద్ధి చేసుకోవచ్చు. లేదా అశ్రద్ధ, బద్ధకం ద్వారా వృధా కూడా చేసుకోవచ్చు. ధైర్య సాహసాలనేవి మనిషి పుట్టుకతోనే వస్తాయి. సమయ సందర్భాన్ని బట్టి అవి పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. అలా ధైర్యసాహసాలు కొరవడిన ప్రతిసారి అల్లాహ్ ను వేడుకోవాలి. దైవాన్ని మన సత్కార్యాల్లో అండగా నమ్మాలి. ఉత్తమ ఫలితాన్ని సాధించడమనేది మన శక్తికి మించిన పని అని తెలుసుకోవాలి. అల్లాహ్ మాత్రమే ఆ శక్తిని ఇవ్వగలడని తెలిసి సహాయం కోసం ఆయన్ని అభ్యర్థిస్తూ ఉండాలి. మన సామ ర్థ్యాన్ని అంచనా వేసుకుని దాన్ని మరొక యాభై శాతం పెంచి మనల్ని దైవానికి ఒప్పచెప్పుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ కు విధేయత చూపడమే విజయం, ఆయన అవిధేయత అన్నదే పరాజయం అని అంటారు. “ఇబ్నుల్ జౌజీ” (రహ్మ).

2. కష్టపడి సంపాదించుకున్నది అంటే… దైవ ప్రసాదితమైన ధైర్యసాహసాలను సరైన సమ యంలో, సరైన మార్గంలో ప్రదర్శించి అద్భు తాలు చేయటం. ఊహించని విజయాలు సాధించటం. ఇమామ్ ఇబ్బుల్ ఖైయ్యిమ్ (రహ్మ) ఇలా అన్నారు : కీర్తిశిఖరాలకు చేర్చ . డంలోనైతే నేమీ, అధఃపాతాళానికి నెట్టి వేయటంలోనైతేనేమి మనిషి ధైర్యసాహసాలు వహించే పాత్ర కీలకమైనది. ఓ ఆశయం దైవ సింహాసనంతో ముడిపడి ఉంటే, మరో ఆశయం చెత్తా చెదారంలా భూమ్మీద చతికిలపడి ఉంది.” అంటే మనిషి ఆత్మహోదా అతని తీరుతెన్నుల్ని బట్టి ఉంటుంది.

అల్లాహ్ ఎలా పోల్చాడో గమనించండి! “ఒక మేలుజాతి వృక్షం ఉంది దాని వేళ్ళు నేలలో బాగా లోతుకు దృఢంగా పాతుకుపోయాయి. దానిశాఖలు ఆకాశందాకా విస్తరించి ఉన్నాయి. అనుక్షణం అది తన ప్రభువాజ్ఞతో సుమధుర ఫలాలు అందజేస్తుంది. దీనికి భిన్నంగా దుష్ట వచనాన్ని నేల ఉపరితలం నుండి పెరికివేసే నాసిరకం చెట్టుతో పోల్చవచ్చు. దానికి ఎలాంటి స్థిరత్వమూ ఉండదు. (దివ్య ఖుర్ఆన్-14: 24-26)

మనుషులు మూడు రకాలు 1. బద్ధకస్తులు, 2, ఇతరులపై ఆధారపడే వారు. 3. విప్లవ వాదులు, కొందరు గొప్పగొప్ప హోదాల్లో రాణించాలనీ, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించా ని మాత్రం ఆశిస్తారు. కాని ఆ స్థాయికి చేర గలిగే మార్గాన్ని ఎరుగరు. అన్నీ చేయాలను
కుంటారుగాని ఏమీ చేయలేరు. కారణం ఎప్పుడైనా చేయవచ్చులే అన్న ధీమాయే. కనుక తానేం చేయాలో కరెక్టుగా నిర్ధారించుకోవటం, ఆ పని చేయటానికి ఏ మార్గం అనుసరించాలో తెలుసుకోగల్గటం, ఆ తర్వాత గమ్యం చేరుకోవటం అనేవి క్రమానుసారం జరగాలి. ఏ గమ్యానికైనా ఎన్నో దారులుంటాయి. సరయిన దారి వెతికి పట్టుకోవడమే. మన పని. దీన్ని ఈ విధంగా అర్ధంచేసుకోవచ్చు. మెరిసేదంతా బంగారంకాదు. కాని బంగారం నిశ్చయంగా మెరుస్తుంది. మెరిసేదాంట్లోంచి బంగారం పరికించి తీసుకోవడమే మన కర్తవ్యం. అలాగే కేవలం ఉత్తమమైన లక్ష్యాలు కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి. ధైర్యం, దూరదృష్టి, కార్యవిచారణ, సామర్థ్యం- ఈ నాలుగు ఎవరిలో ఉంటాయో వారు తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా నెలవేరుతాయి. “ప్రతి వ్యక్తి తాను చేసుకున్న కర్మలను బట్టి అతని హోదా అంతస్తులుంటాయి” (దివ్య ఖుర్ఆన్-6:132).

కొందరు తమ దైనందిన కార్యాలను నెరవేరుస్తారు. వ్యాపార లావాదేవీల కోసం ప్రయాణాలూ చేస్తారు. తమ విధి నిర్వహణను ఎంతో
చక్కగా పూర్తి చేస్తారు. ఆ తరువాత అంతటితో సంతృప్తి చెందుతారు. ఒక పని పూర్తి చేసేయడంతో సంతృప్తి చెందడంకన్నా, ఆ పని ఆ రంగాన్ని సరికొత్త హంగులతో అభివృద్ధి చేస్తూ పోతే దానివల్ల ఎక్కువ తృప్తి, ఉల్లాసమూ కలుగుతుంది. కొందరు పనిని మొదలుపెట్టినా… మధ్యలో ఏవన్నా అడ్డంకులు ఎదురైన వెంటనే పనిని వదిలిపెట్టేస్తారు. కనుక మనం చేసే పనుల్లో సత్ఫలితాన్ని రాబట్టడానికి నాలుగు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి అవి 1) లక్ష్య నిర్దేశం, 2) నిర్మాణాత్మక ఆలోచన, 3) దార్శనికత, 4) అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ ఇలా ప్రభోదిం చారు. “ఏదైనా పని గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు అల్లాహ్ మీద భారం వెయ్యి. అల్లాహ్ తనను నమ్ముకున్నవారినే ప్రేమిస్తాడు. (దివ్యఖుర్ఆన్-3:159)

ఇతరులతో పోల్చుకుని చూసుకోవడం మంచిదే, కాని వారిని మించి పని చెయ్యడానికి ప్రయత్నించాలి. పనిలో సామర్థ్యాన్ని దిగజార్చే అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక్క సారిగా అత్యధిక ఫలితాన్ని ఆశించకూడదు. కొందరు అసాధ్యమనిపించే వాటిని సైతం అధిగమిస్తారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ నిరాశ చెందరు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే… మొదలుపెట్టిన కార్యాన్ని అంతకంతకూ రెట్టింపు ఉత్సాహంతో పూర్తిచేసి తీరతారు. అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా దాని జ్వాలలు పైకి ప్రసరిస్తాయి. అలాగే కార్యశూరులకు ఎన్ని ఇక్కట్లు కలిగినా వారి పట్టుదల సడలనివారు అనుకున్న సమయం కన్నా ముందే తమ లక్ష్యాలను ఛేదిస్తారు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు అది పూర్తయ్యే వరకూ వదలరు. తలపెట్టిన పని చిన్నదైనా. పెద్దదైనా దానిని ఖచ్చితంగా చేసిచూపిస్తారు. వీరు కష్టాల నుండి పారిపోయేవాళ్ళు కాదు. వాటిని అధిగమించే గొప్ప సాహసవీరులు. కార్య శూన్యు;లు అలా కాదు. దారిలో ఏమన్నా ఆటంకాలు ఎదురవుతాయేమో అన్న భయంతో వీరు అసలు పనినే మొదలుపెట్టరు. ఉత్తముడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. వివేకవంతుడు ఎన్నడూ చిక్కుల్లో పడడు. సాహసవంతుడు ఎన్నడూ భయపడడు. అన్న మాట వీరి విషయంలో అక్షరాలా నిజమౌతుంది. కొండగుండె నుండే సెలయేరు || పడుతుంది. హాలాహలం తర్వాతే అమృతం అందుతుంది, “కష్టంతోపాటే సుఖముంది.” (దివ్య ఖుర్ఆన్-94:6)

అలుపెరుగని కృషి : అందరికీ నేర్పాలంటే. అందరి నుంచీ నేర్చుకోగలగాలి. గమ్యం చేరుకోవాలన్న దీక్షగల బాటసారి అలుపెరగడు. విజయం పొందాలన్న మనిషి నిరాశ చెందడు. కనుక మక ఈ కార్యసిద్ధికై దీక్ష, దుఆతో పాటు అల్లాహ్ పై ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి.
లక్ష్యం చేరించగలమనే సాహనంతోపాటు లోపాలను సరిదిద్దుకునే గుణం అలవడాలి. గతించిన మహాపురుషుల, పుణ్యాత్ముల, సంఘ సంస్కర్తల, ప్రవక్తల, వారి సహచరుల గాథలను అధ్యయనం చేయాలి. ధైర్యసాహసాలు గల వ్యక్తుల సాంగత్యం కోసం ఆరాట పడాలి, నిత్యం శుభాత్మల్ని అన్వేషిస్తూ ఉండాలి. అలాగే ఎదుటి వ్యక్తి నైపుణ్యాన్ని, అంతర్గత శక్తుల్ని సరిగ్గా అంచనా వేయగల్గటం, జ్ఞానాభివృద్ధి కోసం అవసరమైన మార్గాన్ని అవలంభించటం అనేవి తప్పనిసరి విషయాలు..

ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మృ) గారు ఇలా అన్నారు. నన్ను ప్రేరేపించే ఓ గొప్ప అంతరాత్మ శక్తి ఉంది. అది నన్ను “అబ్దుల్ మలిక్ బిన్ మర్వాస్” (అప్పటి ఖలీఫా) గారి కుమార్తెను మనువాడమని ప్రేరేపించింది కనుక నేను – ఆమెను వివాహమాడగలిగాను. మదీనాపై ముతపల్లీగా ఉండాలని ప్రేరేపించింది. అది కూడా సాధించాను. (పూర్తి ఇస్లామియా రాజ్యానికి) ఖలీఫా అవ్వాలని ప్రేరేపించింది ఆదీ అయ్యాను. ఇప్పుడు స్వర్గం కోసమని ప్రేరేపిస్తూ ఉంది. కనుక నన్ను స్వర్గంలో ప్రవేశింపజెయ్యమని అల్లాహ్ ను ఎంతో వినమ్రతతో వేడుకుంటున్నాను.” కనుక ప్రతి మనిషికి కష్టంలో సహాయ పడేవాడు, సమస్యల్లో సలహా ఇచ్చేవాడు. ఆనందంలో ఉత్సుకతని రుచి చూపించేవాడు, జీవితంలో పరిపూర్ణతకి అర్ధం – చెప్పేవాడు, ఒక స్నేహితుడుండాలి. అతను ఆ మనిషిలోనే ఉండాలి.

ధైర్యసాహసాల్ని నీరుగార్చే, లేదా నాశనంచేసే ప్రతి విషయం నుండి దూరంగా ఉండాలి.. “జీవితం అగమ్యం, ఆస్పష్టం… ఆగోచరం…. అర్ధరహితం…. శూన్యంలో చీకటి ప్రజ్వలి స్తోంది… చీకటి ప్రజ్వలనుల్లో నిర్జీవ ఖడ్గం నాట్యం చేస్తోంది…… జీవితం ఇరుకైన ప్రదేశం… బ్రతుకు ఒక సందేహాల కూపం… గాలితో కత్తి యుద్ధం చేసే దీపం….. పరిగెత్తే కాలాన్ని నమ్మకూడదు.. కాలానికి బాధ తెలియదు…..” ఇట్టి భావాలు కాల్పనికి ఊహలకు ప్రతీక. ఇలాంటి ఆలోచనల్నిగాని, ఆలోచనాపరుల సాంగత్యాన్నిగానీ స్వీకరించకూడదు.

ఆత్మవిశ్వాసం విజయావకాశాలను వృద్ధి చేస్తుంది. మనమీద మనకే నమ్మకం లేకపోతే. పరాజయ పరంపరను ఎదుర్కోవలసి వస్తుంది.. మనకేం కావాలో మనోఫలకంపై చిత్రీకరించుకోవాలి. మన గమ్యాన్ని చేరుకోవడానికి స్పష్ట మైన మార్గాన్ని ఎన్నుకోవాలి. ఎదురవ్వబోయే అడ్డంకులను ఎలా అధిగమించాలో ముందుగానే పధకాలు తయారు చేసుకోవాలి. అవసరమైన ఒనరులను, ప్రత్యామ్నాయ వ్యూహాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత అంకిత భావంతో పురోగమిస్తే లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు.

మనం మన గడిచిన దినాల్ని ఒకసారి వెను దిరిగి చూసుకుంటే, అప్పట్లో మనకున్న, దాని కన్నా మించి మనల్ని మనం నిరూపించుకోవ టానికి ఉబలాటపడడం అనేది కన్పిస్తుంది. అది మనల్ని స్థిరంగా బలంగా ముందుకు తోస్తుంది. మనం మరింత అనుభూతి చెందాలనీ, మరింత నేర్చుకోవాలని కోరుకోవాలి. మనం ఎదగాలనీ, మెరుగుపడాలని, పునీతులం కావాలనీ, విస్తరించాలనీ నదా ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ఆశయాభ్యున్నతికి మనలోంచి మరింత తోడి తీసుకోవాలి. అంతేగాని ఎదుటివారిపై ఆధారపడే స్వభావం ఉండకూడదు. మన ప్రేరణ మనమెంత దూరం ప్రయాణించామన్నది కాకుండా, మనమింకా ఎంత దూరం ప్రయాణించాలన్నదై ఉండాలి.

ఇంకొక ముఖ్య విషయం తమ రంగాల్లో అత్యుత్తమ స్థానానికి చేరుకున్న వారిని మనం అభిమానించాలి. అభినందించాలి. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అంతేగాని వారిని దేవుళ్ళుగా పూజించకూడదు. వారు సంఘ సంస్కర్తలైనా, దైవప్రవక్తలైనా సరే! నిరంతర కృషితో వారు మానవ మహోపకారులయ్యారన్న విషయాన్నొకటే మనం గుర్తించాలి. వ్యక్తి పట్ల అభిమానం, గౌరవభావం కలిగి ఉండటం మంచిదే. అయితే మనం ఏం చేస్తే ఆ వ్యక్తిలా మారగలం అనేదాన్ని గురించి బాగా ఆలోచించాలి. అలాంటి ఆలోచన కోసం ఆ వ్యక్తి జీవితాన్ని చదవడం ద్వారా గానీ, దూరంగా ఉండి చూడటం ద్వారాగానీ, కరచాలనం ద్వారా , గానీ, సంభాషణ ద్వారాగానీ ప్రేరణ పొంద వచ్చు. ఈ విషయాన్నే అల్లాహ్ ఇలా తెలియ చేస్తున్నాడు: “(విశ్వాసులారా!) దైవప్రవక్త (జీవన సరళి)లో మీకు మంచి ఆదర్శంఉంది.. అల్లాహ్ ను అంతిమ దినాన్ని నమ్మి అల్లాహ్ ను అత్యధికంగా స్మరించేవారికి ఈ ఆదర్శం ఎంతో ఉపయోగపడుతుంది. (దివ్యఖుర్ఆన్-
33:21)

మౌదూదీ (రహ్మ) గారు ఇలా సందేశమిచ్చారు. “మీలోని ప్రతి ఒక్కరి అంతరంగంలో ఓ జ్వాల అనేది ప్రజ్వలిస్తూనే ఉండాలి. ఆ జ్వాల అనారోగ్యంతో విలవిల్లాడే కుమారుణ్ణి చూసి – వైద్యుడి వద్దకు తీసుకెళ్ళేంత వరకూ మీ హృదయాంతరాళాల్లో మండుతూ ఉండే ప్రేమాగ్ని జ్వాలలా, తన సంతానం కనీస అవసరాలను తీర్చడానికి ఇంట్లో ఏమీలేని స్థితిలో మిమ్మల్ని కలత చెందించి, మరింత శ్రమించేలా, మరింత సంపాదించేలా ఏ మనుతానురాగాల జ్వాలలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయో అలాంటిదే ఓ జ్వాల మీలో (ప్రజల్ని వారి ప్రభువుకి అప్పగించనంత వరకు) మండుతూనే ఉండాలి.”

మన చుట్టూ ఉన్న భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, మనుషుల పట్ల, జరుగుతున్న సంఘటనల పట్ల కనబర్చే శ్రద్ధాసక్తులు మన కర్తవ్యమైన సత్యధర్మ ప్రచారం పట్ల కనబర్చాలి. కనీసం అంతే శ్రద్ధతో అంతే నమ్మకంతో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే మనం అద్భుతాలు చేయగలం. మనం మన కర్తవ్యం పట్ల నిమగ్నులమై ఉంటే, మనకు అప్పగించబడిన సత్యధర్మ ప్రచార బాధ్యతను మనమొక దీక్షతో నెరవేర్చ గలిగితే మన అవసరాల సంగతి అల్లాహ్ చూసుకుంటాడు. దాన్నే మనం ధర్మాన్ని నువ్వు రక్షించు ధర్మం నిన్ను రక్షిస్తుంది అని అంటాము. ‘మీరు గనక అల్లాహ్ కు సహాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ పాదాలకు నిలకడను ప్రసాదిస్తాడు. (దివ్య ఖుర్ఆన్-47:7)

మరోచోట అల్లాహ్ ఇలా ప్రబోధించాడు: “మా (ప్రసన్నత) కోసం శ్రమించేవారికి మా (సన్నిధికి చేరుకునే) మార్గం చూపుతాం. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులకు తోడుగా ఉంటాడు (దివ్య ఖుర్ఆన్ 29:69)

మనం ఒక పని చేశామంటే ఆ పనికి కారణమైన వారందరినీ గుర్తుంచుకోవాలి. మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన పథ నిర్ణేతలు, తోడు నిల్చిన సహచరులు, మన చుట్టూతా వున్నారు. మనం వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం మన కనీస ధర్మం. అలాగే అణకువ కూడా ఎంతో అవసరం. అంటే మనం ఒక పని చేయడానికి. కావల్సిన నైపుణ్యం, శ్రద్ధ, అనుకూల పరిస్థితలు అన్నీ సమకూర్చుకున్నప్పుడు కూడా, మనం తదేకంగా ఆ పని చేస్తున్నప్పుడు కూడా, మన ఉద్దేశాలు నూటికి నూరుపాళ్ళు సమంజసమైనప్పుడు కూడా, ఫలితం ఆశించకుండా అంకితభావంతో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడో ఏదో ఒక పొరపాటు చేసే అవకాశం ఉండనే ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఆ పొరపాట్ల పట్ల మనం అలసత్వం చూపించడం వల్ల మన కృషి అంతా వృధా అయ్యే ప్రమాదం ఉంటుందని తెలుసుకోవాలి. ప్రేమ లేకుండా పెట్టిన రొట్టె చేదుగా ఉండటమే కాదు ఆది ఆకలిని సగమే తీరుస్తుంది. అన్నట్లు మనస్పూర్తిగా పని చెయ్యనివారి విజయం బోలుగా ఉండటమేకాక అది తన చుట్టూ వెగటును వ్యాపింపజేస్తుంది. అదే గొప్ప విజేతలు తమ వ్యక్తిత్వం వల్ల, సౌశీల్యం వల్ల, అంతరంగ ప్రేరణ వల్ల తమ హృదయాంతరాళాల్లో మెరుగుదిద్దుకున్న స్వప్నాల వల్ల తమ పనికి ఒక అద్భుత స్పర్శని, ఒక ఆత్మీయ పరామర్శని, ఒక ప్రత్యేక ఒరవడిని ప్రసాదిస్తారు.

కత్తెరించడం వలన పూలకుంచెలు మరింత శోభాయమానమైనట్లు ఈ మార్గంలో విమర్శల వల్ల మనం మరింత ప్రకాశిస్తాము. కనుక మనల్ని నిలబెట్టిన వారిని స్మరించుకున్నంతగా మనల్ని నిలదీస్తున్న వారిని స్మరించకూడదు. మనకు తోడుగా నిల్చిన వారిని గుర్తు చేసుకున్నంతగా మనకు అడ్డు తగిలినవారిని తలచుకోకూడదు. కాని ఎందుకనో మనల్ని బాధించే వారిని, మనకు అడ్డుతగిలేవారిని, మనల్ని క్రుంగదీసేవారిని ఎక్కువ పట్టించుకోవడానికి మనం అలవాటు పడ్డాం. ఈ రకమైన నకారాత్మక (నెగెటివ్) ప్రేరకాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. చూడండి అల్లాహ్ ఏమంటున్నాడో! “మీరు గ్రంథప్రజల నుండి, బహు దైవారాధకుల నుండి కూడా మనస్సు నొప్పించే మాటలు అనేకం వినవలసివస్తుంది. కనుక అలాంటి స్థితిలో మీరు సహనం వహించి, భయభక్తులతో కూడిన జీవితం గడుపుతూ ధర్మ మార్గంలో స్థిరంగా ఉండాలి. నిజంగా ఇది ఎంతో సాహసోపేతమైన కార్యం. (దివ్య ఖుర్ఆన్ 3:156)

చివరి మాట ఇమామ్ ఇబుల్ జైయ్యిమ్ (రహ్మృగారు ఉత్తమ ఆశయానికి భాష్యం చెబుతూ ఇలా అన్నాడు. “ఉత్తమ ఆశయం. అంటే అల్లాహ్ పై తప్ప ఇతర వస్తువులపై మనసు లగ్నం కాకూడదు. ఆయనే కావాలన్న దీక్షతో పని చేయాలి. ఐహిక పరమైన స్వల్ప లాభాలపై దృష్టి నిలవకూడదు. అల్లాహ్ ప్రసన్నతకు వ్యతిరేకంగా దేనినీ కాంక్షించ కూడదు. అశాశ్వతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం సిరిసంపదల కోసం ప్రాకులాడటంకన్నా అల్లాహకు చేరువవడానికి తోడ్పడే కార్యాలకే ప్రాధాన్యతనివ్వాలి.. లక్ష్యం నిర్దిష్టంగా ఉంటే అవరోధాలు ఏమీ చేయలేవు. లక్ష్యం వుంది, కాని ఛేదించే ధైర్యసాహసాలు సన్నగిల్లితే – ఇక్కట్లపాలవ్వాల్సి వస్తుంది.”

అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్మ) గారు ఇలా హితబోధ చేశారు. ఓ యువకుడా! తినడం, త్రాగటం, మంచి దుస్తులు ధరించటం, అంద న మైన అతివను మనువాడటం, సుందరమైన భవనాల్లో నివసించటం, వజ్ర వైఢూర్యాలను కూడబెట్టడం ఇవే నీ జీవితపు లక్ష్యాలు కాకూడదు. ఇవన్నీ చంచలమైన మనస్సు ని అవసరాలు. మరి ఆత్మకు కావాల్సింది ఎక్కడ? కనుకనే నీ ప్రభువు. నీ ప్రభువు వద్దవున్న సమస్తం (స్వర్గం) నీ జీవిత లక్ష్యం కావాలి. ప్రవక్త (స) ఇలా నిర్దేశించారు: “మీరు గనక అల్లాహ్ను స్వర్గం అడిగితే “జన్నతుల్ – ఫిరోదౌస్”నే అడగండి! అదే కీర్తి ప్రతిష్ఠలకు – అత్యంత ఎత్తైన శిఖరం. అదే మనందరి జీవిత లక్ష్యం……!

Related Post