New Muslims APP

సామూహిక నమాజ్‌ ప్రాముఖ్యత

సామూహికంగా నమాజ్‌ చేయమని ఆదేశిస్తూ అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:
”రుకూ (నమాజ్‌) చేసే వారితో కలిసి రుకూ (సామూహిక నమాజు) చేయండి”. (దివ్య ఖుర్‌ఆన్‌-2: 43)

మస్జిద్‌లో ప్రవేశించిన తర్వాత సామూహిక నమాజు కోసం అతను ఎంత సేపు నిరీక్షిస్తాడో అంత సేపూ అతను నమాజ్‌లో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (అంటే అతనికి అంత పుణ్యం లభిస్తుందన్న మాట.) (బుఖారీ, ముస్లిం)

సామూహిక నమాజు ఘనత

హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: మనిషి తన ఇంట్లో గానీ, వీధిలోగాని, ఒంటరిగా చేసే నమాజు కన్నా సామూహికంగా చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది.వేరొక ఉల్లేఖనంలో ”ఇరవై ఏడు రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది” అని ఉంది. (బుఖారీ, ముస్లిం)

ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణమేమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో మస్జిద్‌కు వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు దేవుడు ఒక్కొక్కి చొప్పున అతని అంతస్థులను పెంచుతాడు. అంతే కాదు, అతనివల జరిగిన పాపాలను కూడా ఒక్కొక్కిగా తుడిచి వేస్తాడు. అతను నమాజు చేస్తూ వుజూతో ఉన్నంతవరకు దైవ దూతలు అతని మీద శాంతిని కురిపిస్తారు. ఇంకా అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ”దేవా! ఇతనిపై శాంతి కురిపించు. దేవా! ఇతణ్ణి కనికరించు” అని అంటూ ఉంటారు. మస్జిద్‌లో ప్రవేశించిన తర్వాత సామూహిక నమాజు కోసం అతను ఎంత సేపు నిరీక్షిస్తాడో అంత సేపూ అతను నమాజ్‌లో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (అంటే అతనికి అంత పుణ్యం లభిస్తుందన్న మాట.) (బుఖారీ, ముస్లిం)

దైవప్రవక్త (స) ఆగ్రహం

ఒకసారి దెవప్రవక్త (స) ఇలా అన్నారు: నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ ప్రభువు సాక్షి! అగ్నిని రాజేయమని చెప్పి, నమాజ్‌ గురించి ఆజ్ఞాపించి, ఆ తర్వాత అజాన్‌ ఇవ్వగానే నమాజ్‌ చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి సామూహిక నమాజులో పాల్గొని వారి దగ్గరకు వెళ్ళి వారి ఇళ్ళను తగలబెడదామని నేను (ఎన్నోసార్లు) అనుకున్నాను. (బుఖారీ, ముస్లిం)
దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఏ పట్టణంలోనైనా ముగ్గురు వ్యక్తులుండి, వారు సామూహిక నమాజు చేయకపోతే షైతాన్‌ వారిని ఆవహిస్తాడు”. (అబూ దావూద్‌, నసాయీ)
ఆయన ఇంకా ఇలా అన్నారు: ”అందరికన్నా ఎక్కువ దూరం నడిచి వెళ్ళి సామూహిక నమాజ్‌లో పాల్గొనే వ్యక్తికి అందరికంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం)

నమాజు కోసం పరుగెత్తకూడదు 

మనిషి నమాజు కోసం బయలుదేరినప్పి నుండి అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. కనుక సామూహిక నమాజులో చేరుకోవడానికి మస్జిద్‌కు పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు. అలా గాకుండా ప్రశాంతంగా, నింపాదిగా నడిచి వెళ్ళాలి. అందుకే దెవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు:
”మీరు నమాజు కోసం వచ్చినప్పుడు ప్రశాంతంగా నడిచి రండి. సామూహిక నమాజులో మీకు ఎన్ని రకాతులు లభిస్తే అన్ని రకాతులు చేయండి. మిగిలిన రకాతుల్ని వ్యక్తిగతంగా చేసుకొని నమాజు పూర్తి చేసుకోండి”. (బుఖారీ, ముస్లిం)

హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”మీరు నమాజు కోసం వచ్చినప్పుడు మేము సజ్దా స్థితిలో ఉంటే, మీరు కూడా సజ్దా చేసి మాతో చేరిపోండి. కాని దాన్ని పూర్తి రకాత్‌ లభించినట్లుగా మాత్రం భావించకండి”. (అబూ దావూద్‌)
”సామూహిక నమాజులో ఒక్క రకాతు లభించినా సామూహిక నమాజు పుణ్యాన్ని పొందినట్లే”. (అబూ దావూద్‌)

గుడ్డివారు కూడా సామూహిక నమాజుల్లో పాల్గొనాలి

అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమ్మె మక్తూమ్‌ (ర) తాను అంధుణ్ణనీ, అంచేత ఇంట్లో నే నమాజు చేసుకోవడానికి తనకు అనుమతి ప్రసాదించమని దెవప్రవక్త (స)ను అభ్యర్ధించుకున్నారు.
దెవప్రవక్త (స) ఆయన్ని ”నీకు అజాన్‌ వినబడుతుందా?” అని అడిగారు. అబ్దుల్లాహ్‌ా ‘వినబడుతుంద’ని బదులిచ్చారు. అందుకు దెవప్రవక్త (స) ”అలాగయితే అజాన్‌కు హాజరు పలుకు (అంటే తప్పకుండా మస్జిద్‌కు వచ్చి సామూహికంగా నమాజు చెయ్యి)” అని అన్నారు. (ముస్లిం)

స్త్రీలు మస్జిద్‌కు వచ్చి సామూహిక నమాజుల్లో పాల్గొనటం

ఉమ్మె సలమా (ర) కథనం దెవప్రవక్త (స) ఇలా అన్నారు: ”స్త్రీల కొరకు వారి ఇండ్లలోని కుీరమే అన్నికంటే ఉత్తమ మస్జిద్‌”. (ముస్నద్‌ అహ్మద్‌)
ఒకవేళ స్త్రీలు మస్జిద్‌కు వెళ్ళి సామూహిక నమాజులో పాల్గొనదలిస్తే దానికి అనుమతి ఉంది.
దైవ ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: ”మీ స్త్రీలు (తరావీహ్‌, జుమా తదితర నమాజులు చేసుకోవటం కోసం) మస్జిద్‌కు వెళ్ళానికి అనుమతి కోరితే వారికి అనుమతి ఇవ్వండి”. (బుఖారీ, ముస్లిం)

ఫర్జ్‌ నమాజు జరుగుతున్నప్పుడు సున్నత్‌ నమాజులు చేయకూడదు

దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”సామూహిక నమాజు మొదలైన తర్వాత ఫర్జ్‌ (విధి) నమాజు తప్ప మరే ఇతర నమాజూ చేయకూడదు”. (ముస్లిం)

 

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.