New Muslims APP

మదీనా – మస్జిదె నబవీ

'మూడు మస్జిద్‌లు తప్ప మరో దాని వైపు పుణ్యఫలాపేక్షతో వాహనాలను సిద్ధపరచరాదు. అవేమంటే - 1) మస్జిదె హరమ్‌ 2) మస్జిదె నబవీ 3) మస్జిదె అఖ్సా''.

‘మూడు మస్జిద్‌లు తప్ప మరో దాని వైపు పుణ్యఫలాపేక్షతో వాహనాలను సిద్ధపరచరాదు. అవేమంటే – 1) మస్జిదె హరమ్‌ 2) మస్జిదె నబవీ 3) మస్జిదె అఖ్సా”.

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

పూర్వం మదీనా నగరం ‘యస్రిబ్‌’గా పిలువబడేది. మక్కా నుండి హిజ్రత్‌ చేసిన తర్వాత ప్రవక్త మహనీయులు(స) ఈ నగరంలో స్థిరపడ్డారు. తన ఇంటి ప్రక్కనే ఆయన నిర్మించిన మస్జిద్‌ ‘మస్జిదె నబవీ’ (ప్రవక్త మస్జిదు)గా ప్రసిద్ధి చెందింది. మదీనా నగరం హరమె నబవీ (స)గా, దారుల్‌ హిజ్రత్‌గా ఖ్యాతి గడించింది. ఇంకా అది దైవాజ్ఞలు అవతరించిన కేంద్రంగా భాసిల్లింది. దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) మక్కాను పవిత్ర స్థలంగా ఖరారు చేసినట్లే మహా ప్రవక్త (స) మదీనా నగరాన్ని పుణ్య క్షేత్రంగా ఖరారు చేశారు. ఆయన (స) ఇలా విన్నవించుకున్నారు:
”ఓ అల్లాహ్‌! ఇబ్రాహీమ్‌ (అ) మక్కాను పవిత్ర స్థలం (హరమ్‌)గా ఖరారు చేశారు. నేను ఈ నగరం(మదీనా)లోని రెండు రాతి రపదేశాల నడుమ భాగాన్ని పుణ్య క్షేత్రంగా ఖరారు చేస్తున్నాను”. (సహీహ్‌ ముస్లిం)

దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు:
”పాము తన పుట్టలో శరణు పొందినట్లే విశ్వాసం (ఈమాన్‌) మదీనాలో శరణు పొందుతుంది. ఇక్కడి వైపరీత్యాలను, బాధలను ఓర్చుకున్నవాని కోసం నేను సిఫారసు చేస్తాను. సాక్షిగా ఉంటాను”. (సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం)
ఆయన (స) ఇంకా ఇలా వక్కాణించారు:
”మదీనా కొలిమి లాంటిది. అది తనవారిలోని తుప్పును దూరం చేస్తుంది. అందులోని మంచివారు మరింత నికార్సుగా తేలుతారు”. (సహీహ్‌ ముస్లిం)

మదీనా వాసుల గొప్పతనం

మదీనాలో నివసించేవారు దైవప్రవక్త (స)కు ఇరుగుపొరుగువారు. ఆయన (స) మస్జిదుకు వచ్చేవారు, ఆయన నగరంలో స్థిరపడేవారు, ఆయన (స) పుణ్య క్షేత్రంలో నిలకడ చూపేవారు. ఆయన (స) వెలిగించిన దీపాలకు రక్షకులు. అలాంటివారిని ఆదరించాలి. వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, వారిని అభిమానించాలి. వారితో స్నేహ సంబంధాలను కలిగి ఉండాలి. వారికి మనస్తాపం కలిగించ కూడదు. వారిని బాధించేవారిని హెచ్చరిస్తూ దైవప్రవక్త (స) ఇలా అన్నారు:
”మదీనా వాసులను మోసగించేవాడు నీటిలో ఉప్పు కరిగే విధంగా కరిగిపోతాడు”. (సహీహ్‌ా బుఖారీ)
మదీనా ప్రజల ప్రేమాభిమానాల, గౌరవాదరణల కారణంగా ఆయన (స) వారి కోసం ప్రార్థించేవారు. ఉదాహరణకు ఒక ప్రార్థన-
”ఓ అల్లాహ్‌! వీళ్ళ తూకాల్లో శుభాన్ని ఒసగు. వీళ్ళ కొలతలైన ‘సా’ ‘ముద్‌’లలో సమృద్ధిని ప్రసాదించు”. (సహీహ్‌ ముస్లిం)
మదీనా వాసుల పట్ల సద్వ్యవహారం చేయమని ఆయన (స) యావత్తు అనుచరులకు తాకీదు చేస్తూ ఇలా అన్నారు:
”మదీనా నా వలస కేంద్రం. ఇదే నా విరామ స్థలం. నా పునరుత్థానం ఇక్కడి నుంచే జరుగుతుంది. నా పొరుగువారు ఘోర అపరాధాలకు ఒడిగట్టకుండా ఉన్నంతవరకూ వారిని రక్షించవలసిన బాధ్యత నా అనుచర సమాజం (ఉమ్మత్‌)పై ఉంది. ఎవరైతే వారిని రక్షిస్తారో వారి కొరకు నేను సిఫారసు చేస్తాను, సాక్షిగా ఉంటాను”. (తిబ్రానీ).

మస్జిదె నబవీ (వ్రవక్త మస్జిదు) గొప్పతనం:

భూమండలంలోని మూడు గొప్ప మస్జిదులలో మస్జిదె నబవీ ఒకటి. దీని మహత్తును స్పష్టపరుస్తూ అంతిమ దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు:
1) ”నా ఈ మస్జిద్‌లో నమాజు చేయటం – ఒక్క మస్జిదె హరమ్‌ తప్పించి – వేరితర మస్జిద్‌లలో చేసే వెయ్యి నమాజులకన్నా ఘనమైనది”. (ముస్నదె అహ్మద్‌)
2) ”మస్జిదె హరమ్‌లో నమాజు చేయటం వేరితర మస్జిద్‌లలో చేసే లక్ష నమాజుకన్నా శ్రేష్ఠమైనది”. (ముస్నదె అహ్మద్‌)
3) ”మూడు మస్జిద్‌లు తప్ప మరో దాని వైపు పుణ్యఫలాపేక్షతో వాహనాలను సిద్ధపరచరాదు. అవేమంటే – 1) మస్జిదె హరమ్‌ 2) మస్జిదె నబవీ 3) మస్జిదె అఖ్సా”.
4) ”నా నివాస గృహానికి – (ఈ మస్జిద్‌లోని) నా వేదిక (మింబర్‌)కి మధ్య ఉన్న స్థలం స్వర్గ వనాలలోని ఒక వనం”. (సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం)

 

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.