ఇస్రా:మేరాజ్‌

ఇస్రా:మేరాజ్‌ ‘తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరి శుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభ వంతం చేశాము. ఎందుకంటే, మేమతనికి మా (శక్తికి సంబంధిం చిన) కొన్ని సూచనలను చూప దలచాము.

దివ్య గ్రంథాల సారాంశ మకరందాన్ని రసీకరించుకున్న రసూల్‌గా, మానవాత్మ ధాత్రిని షిర్క్‌ నుండి విముక్తం చేెసి, తౌహీద్‌ తన్మయ తరంగాలలో ఓలలాడించిన మానవ మహో పకారిగా, తన పసిడి పలుకే మేలుకొల్పుగా మనుజ జాతిని నడిపించిన వక్తృత్వమూర్తిగా, వారధిగా, రథసారధిగా ముహమ్మద్‌ (స) వారి వ్యక్తిత్వం మానవాళికే మచ్చుతునక, మానవత్వానికే తలమానికం. అందుకెే ఆ సుగుణాగ్రజుణ్ణి జీవితపు అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా పేర్కొన్నాడు అల్లాహ్‌: ”నీవు నిస్సందే హంగా మహోన్నతమైన శీల శిఖరాధిరోహుడవు -మహాగ్ర సౌశీల్యవంతుడవు”. (ఖలమ్‌: 4) ”నిశ్చయంగా దైవ ప్రవక్తలో మీ కొరకు ఉత్తమ ఆదర్శం ఉంది”. (అహ్జాబ్‌: 21)

నిశ్చయంగా అల్లాహ్‌ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు”. (బనీ ఇస్రాయీల్: 1)
దివ్య గ్రంథాల సారాంశ మకరందాన్ని రసీకరించుకున్న రసూల్‌గా, మానవాత్మ ధాత్రిని షిర్క్‌ నుండి విముక్తం చేెసి, తౌహీద్‌ తన్మయ తరంగాలలో ఓలలాడించిన మానవ మహో పకారిగా, తన పసిడి పలుకే మేలుకొల్పుగా మనుజ జాతిని నడిపించిన వక్తృత్వమూర్తిగా, వారధిగా, రథసారధిగా ముహమ్మద్‌ (స) వారి వ్యక్తిత్వం మానవాళికే మచ్చుతునక, మానవత్వానికే తలమానికం. అందుకెే ఆ సుగుణాగ్రజుణ్ణి జీవితపు అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా పేర్కొన్నాడు అల్లాహ్‌: ”నీవు నిస్సందే హంగా మహోన్నతమైన శీల శిఖరాధిరోహుడవు -మహాగ్ర సౌశీల్యవంతుడవు”. (ఖలమ్‌: 4) ”నిశ్చయంగా దైవ ప్రవక్తలో మీ కొరకు ఉత్తమ ఆదర్శం ఉంది”. (అహ్జాబ్‌: 21)
గగన విహారం: రాత్రి వేళ మస్జిదె హరామ్‌ నుంచి మస్జిదె అఖ్సా వరకు దివి దూతలతో భువి ప్రవక్త ముహమ్మద్‌ (స) చేసిన ప్రయాణాన్ని ఇస్రా అంటారు. అక్కడి నుండి ఏడు ఆకాశాల అధిరోహణను, అక్కడ తిలకించిన సంగతులను మేరాజ్‌ అంటారు అల్లాహ్‌ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి!….. అల్లాహ్‌ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు.
 స్వీకారానికి – ప్రతీకారానికి మధ్య సంఘర్షణగా ప్రవక్త (స) గారి ధర్మప్రచారం కొనసాగుతూ ఉండగా ‘ఇస్రా – మేరాజ్‌’  అద్భుత సంఘటన ఒకి కని, విని, ఎరుగని విధంగా జరిగింది. ప్రవక్త (స) గారి ఈ గగన యాత్ర, మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సాకు, అక్కడి నుండి ఏడు ఆకాశాలవై వరకు కొనసాగింది. ప్రవక్త (స) మస్జిదె
హరామ్‌ నుండి దైవ దూత జిబ్రయీల్‌ (అ)తో బురాఖ్‌ అనబడే ఓ దివ్యలోక వాహనంవై బయలుదేరి మస్జిదె అక్సాకు చేరుకున్నారు. అక్కడ దైవప్రవక్త లందరికీ నాయకత్వం వహించి నమాజు చేెశారు. బురాఖ్‌ని మస్జిద్‌ ద్వారానికి క్టివేశారు. అదే రాత్రి మస్జిదె అక్సా నుండి ప్రవక్త (స) గారిని వెంటబెట్టుకుని ఓ దివ్యమైన నిచ్చెన ద్వారా గగనానికి సాగిపోయారు హజ్రత్‌ జిబ్రయీల్‌ (అ) మొది ఆకాశంలో ఆదమ్‌ (అ)ఎదురయ్యారు. ప్రవక్త (స) ఆయనకు సలాం చేశారు. ఆయన అభివాదానికి ప్రతి అభివాదం చేస్తూ ‘స్వాగతం! స్వాగతం!!’ అని అమిత వాత్సల్యంతో ఆహ్వానించారు. ఆయన ముహమ్మద్‌ (స)  అంతిమ దైవ ప్రవక్తని సాక్ష్యమిచ్చారు.
  ఆ తర్వాత రెండవ ఆకాశానికి చేెరుకున్నారు. లోనికి ప్రవేశించాక అక్కడ హజ్రత్‌ జకరియ్యా కుమారుడగు యహ్యా (యోహాను) ప్రవక్త, మర్యం కుమారుడగు హజ్రత్‌ ఈసా (అ)  తారస పడ్డారు. ప్రవక్త (స) గారు వారికి సలాము  చేయగా, వారిద్దరూ బదులిస్తూ ఘనంగా స్వాగతించారు. ముహమ్మద్‌ (స)  దైవ అంతిమ  ప్రవక్త   అన్న  విషయాన్ని ధృవపర్చారు. దరిమిలా మూడో ఆకాశానికి చేెరుకున్నారు. అక్కడ హజ్రత్‌ యూసుఫ్  (అ)ను కలిశారు. మునుపిలాగే సలాం ప్రతి సలాం జరిగింది. నాల్గవ ఆకాశాన హజ్రత్‌ ఇద్రీస్‌ (అ)తోనూ, ఐదవ ఆకాశాన హజ్రత్‌ హారూన్‌ (అ)తోనూ, ఆరవ ఆకాశాన హజ్రత్‌ మూసా (అ)తోనూ, ఏడవ ఆకాశాన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ)తోనూ కలిశారు. వారందరూ కూడా సలాంకు బదులిస్తూ, స్వాగతం సత్ప్రవక్తా! అంటూ ఎంతో వ్రేమగా ఆహ్వానించారు.
  ఆ విదప ‘సిద్రతుల్‌ మున్‌తహా’ వరకు ఎక్కి వెళ్ళారు. అక్కడ్నుంచి ‘బైతుల్‌ మామూర్‌’ (కాబాకు నేరుగా ఏడు ఆకాశాలవై ఉన్న దైవ గృహం) చేెరుకున్నారు. అక్కడి నుండి అల్లాహ్‌ా వైపునకు ఎక్కి వెళ్ళారు. అల్లాహ్‌ాకు చాలా దగ్గరయ్యారు. అప్పుడు అల్లాహ్‌ా తన దాసునికి అందజేయవలసిన దివ్య సందేశాన్ని అందజేశాడు. మహా ప్రవక్త (స) వారి సముదాయం కొరకు రోజుకు యాభై వేళల నమాజును విధిగా నియమించాడు. మహా ప్రవక్త (స) అక్కడి నుండి తిరిగి వస్తుండగా హజ్రత్‌ మూసా (అ) కలిశారు. విషయం తెలుసుకుని -”మీ సమాజం యాభై పూటల  (రేయింబవళ్లల్లో) నమాజు భారాన్ని మోయజాలదు. తిరిగి వెళ్ళండి, వెళ్ళి కొన్ని నమాజలు తగ్గించమని మీ ప్రభువును వేడుకోండి” అన్నారు హజ్రత్‌ మూసా (అ). ఇలా అనేక సార్లు దైవ సన్నిధికి వెళ్ళి రాగా చివరికి ఆ సంఖ్య తగ్గుతూ తగ్గుతూ 5 పూటల నమాజుగా ఖరారు అయింది, ఈ అయిదు పూటల నమాజు చేెసే వ్యక్తికి 50 పూటల నమాజు చేెసేంత పుణ్యం లభిస్తుందని అల్లాహ్‌ ఫ¦ర్మానా జారీ చేశాడు.
   ఈ యాత్ర సందర్భాన అనేక అద్భుతాలను చూశారు దైవ ప్రవక్త (స). ఈ యాత్రలోనే జిబ్రయీల్‌ (అ), ప్రవక్త (స) ఎదుట మధువు మరియు పాలున్న రెండు వేర్వేరు పాత్రలు ఉంచారు. మహా ప్రవక్త (స) పాల పాత్రను స్వీకరించారు. ఇది చూసి ”మీరు సహజ ధర్మాన్ని ఆశ్రయించారు” అన్నారు జిబ్రయీల్‌ (అ).ఈ యాత్ర మధ్యలోనే ఆగ్రహంతో అగ్ని జ్వాలను తలవిస్తున్న నరక పాలకుని ముఖం చూశారు. స్వర్గ – నరకాలను సందర్శించారు. అలా ముందుకు వెళుతుండగా – ఓ చోట ఇబ్బడిముబ్బడిగా వడ్డీ తినే జలగాగ్రేసరులను చూశారు. వారి పొట్టలు విపరీతంగా పెరిగి ఉండటం గమనించారు. అవి పాములతో, నరకపు తేళ్లతో నిండి ఉన్నాయి. మరో చోట – ఓ వైపు ఘుమఘుమలాడే షడ్రుచుల మాంసం వడ్డించబడి ఉంది. మరో వైపు కుళ్ళి కంపుకొడుతున్న మాంసం ఉంది. పర స్త్రీతో, పర పురుషునితో వెళ్లివోకుల్లేకుండానే సహజీవనం సాగించే పచ్చి వ్యభిచారులు మంచి మాంసాన్ని వదలి కంపుకొడుతున్న మాంసాన్నే తింటున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ యాత్రలోని వింతలు అగణ్యం! ఇందులోని అద్భుతాలు అసంఖ్యాకం!!
  మహా ప్రవక్త (స) గారు ఈ ప్రయాణ సందర్భంగా దారి మధ్యలో ఖురెషుకి సంబంధించిన ఓ వర్తక బృందాన్ని చూశారు. వారి దగ్గర నీళ్ళు కూడా త్రాగారు. తెల్లవారిన తర్వాత ఆయన(స) ఒకే ఒక్క రాత్రిలో జరిగిన అద్భుత విషయాలు, వింత విశేషాల గురించి ఖురైషు ప్రజలకు విన్పించారు. అయితే వారంతా దీన్ని ఖండిం చారు. ముక్త కంఠంతో ఆయన్ను వ్యతిరేకించారు. ఒక్క రాత్రిలో ఇదంతా ఎలా సాధ్యం అని పరిహసించారు. ముహమ్మద్‌ (స) అబద్ధమాడుతున్నారని తూలనాడారు. ఒకవేళ ఇది నిజంగానే జరిగి ఉంటే – బైతుల్‌ మఖ్దిస్‌ ఎలా ఉంటుందో వర్ణించమని పట్టు బడ్డారు. అప్పుడు ప్రవక్త (స) బైతుల్‌ మఖ్దిస్‌ గురించి వివరించడమే కాక, దారిలో తారసపడిన ఆ వర్తక బృందాలు ఎప్పుడు మక్కా చేరుకుాంయో కూడా విశద పర్చారు. ఇంత చెవ్పినా కూడా వారిలో వ్యతిరేకత వెరిగిందే తప్ప తరగలేదు. అయితే హజ్రత్‌ అబూబకర్‌ (ర) మాత్రం ఈ సంఘటనను అక్షర సత్యం అని ధృవీకరించారు. ప్రజలంతా అబద్ధం అని నోరు బాదుకుంటున్నా ఆయన వారి మాటను ఖాతరు చేయలేదు. ఈ కారణంగానే ‘సిద్దీఖ్‌’ (ధృవపరచినవాడు) అనే బిరుదు ఆయన సొంతమయ్యింది. ‘ఇస్రా – మేరాజ్‌’ అనే ఈ సంఘటన దైవ సూచనల్లోని ఓ అద్భుత సూచన.

 

Related Post