వై దిస్వివక్ష?

why this?

ఆరోగ్యమయిన దేహాన్ని వదలి పుండు మీద వాలి ఈగ గాయాన్ని కెలికి నట్టు మత, రాజకీయ, ఛాందసవాదులు కొందరు అన్య మతాల పట్ల ప్రజల్లో గల అవగహానా లేమిని ఆసరాగా చేసుకొని జనస్రవంతిలో అశ్రాంతి, అలజడులు సృష్టిస్తున్నారు. ‘మంచి చెడ్డలు – రెండే మత ములు’ అని తెలియని మేధా(తా)వులు కొందరు ఇస్లాం ధర్మ అద్వితీయ సౌందర్యాన్ని వదలి ఎక్కడో ఎవరో పాల్పడే దుష్చర్యల్ని ఇస్లాం ధర్మంతో ముడి పెట్టేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు.

లోకంలో కాకుల హంగామా అధికమయింది. వీటికి ఆకలీ ఎక్కువే. ఆరుపులూ ఎక్కువే. వీటి గూటిలో విధి లేక పుట్టిన కోకిల బతుకులే దుర్భరంగా తయారయ్యాయి. ఆరోగ్యమయిన దేహాన్ని వదలి  పుండు మీద వాలి ఈగ గాయాన్ని కెలికి నట్టు మత, రాజకీయ, ఛాందసవాదులు కొందరు అన్య మతాల పట్ల ప్రజల్లో గల అవగహానా లేమిని ఆసరాగా చేసుకొని జనస్రవంతిలో అశ్రాంతి, అలజడులు సృష్టిస్తున్నారు. ‘మంచి చెడ్డలు – రెండే మత ములు’ అని తెలియని మేధా(తా)వులు కొందరు ఇస్లాం ధర్మ అద్వితీయ సౌందర్యాన్ని వదలి ఎక్కడో ఎవరో పాల్పడే దుష్చర్యల్ని ఇస్లాం ధర్మంతో ముడి పెట్టేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఓ సారి పరదాను, ఓసారి టోపి-గడ్డాన్ని, ఓ సారి ఇస్లామీయ చట్టాలను చర్చావేదికగా మార్చుతూ ఇస్లాంను ఓ ఫోబియాగా చిత్రీకరించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. వార్త అది వ్యక్తగతమ యినదయినా, సామాజికమయినదయినా, భాషాపరమయినదయినా, జాతి పరమయినదయినా, అంతర్జాతీయమయిన దయినా దాన్ని ఎలాగయినా ఇస్లాం వైపు, ముస్లింల వైపు మళ్ళించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చివరికి ఏ పాపం ఎరుగని పిల్లల విషయంలో సయితం అమానుషంగా వ్యవహరించడం జరుగుతోంది. ‘ముస్లింలందరూ ఉగ్రవా దులు కాకపోవచ్చుకానీ, ఉగ్రవాదులంతా ముస్లింలే’ అన్న స్లో పాయిజన్‌ని సామాన్య ప్రజలకు ఇంజెక్ట్‌ చేయడం జరుగుతోంది.  దీనికి తోడు ‘కడివెడు పాలను ఒక ఉప్పు కల్లు పాడు చేసినట్లు’ కొందరు ఛాందసవాదులు, స్వార్థపరులు, రాజ కీయవాదులు మతం ముసుగు ధరించి  ‘సర్వేజనా సుఖినోభవంతు’ వంటి శాంతి వాతావరణాన్ని సృష్టించ గలిగే శక్తి ఉన్న ఇస్లాం అమృత కలశాన్ని హాలహల సంద్రంగా ఫీలయ్యేలా కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.  ఉగ్రవాదానికి కారణాలు ఎన్నో – పేదరికం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య అనుభవాలు, నైతిక శిక్షణా లేమి, స్వార్థం, అధికార కాంక్ష, న్యాయం అందని ద్రాక్షలా తయారవ్వడం – ఇలా చెప్పు కుంటూపోతే ఎన్నెన్నో. ఏది ఏమయినా, మనం ఏ మతానికి చెందిన వారమయినా ‘మనం మన మతధర్మాన్ని గరళంగా మార్చకుండా, అమృత పానం’గా అందించగలగాలి. అప్పుడే ప్రజల్లో సోదరభావం, సహిష్ణుతాభావం, సామరస్యం వేళ్ళూనుకుని విశ్వ శాంతికి మార్గం సుగమమం కాగలదని నమ్మగలం. ఆ నిమిత్తం వాస్తవ అవగాహనను, ఆలోచనను ఈ వ్యాసం కలిగిస్తుందన్న విశ్వాసం. 

ఉగ్రవాదానికి మతమేది?
 1793 నాటి ఫ్రెంచీ విప్లవంలో ఉగ్రవాదం పూర్తిగా ఒక రాజ కీయ మహాస్త్రంగా ఉపయోగ పడటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల లో నిరంకుశ ఆరాచక పాలకులను దించడానికి ఉగ్రవాదానికి యువ కులు ఆకర్షితులయ్యారంటారు. అలా, 1881లో రష్యా చక్రవర్తి అలె గ్జాండర్‌-2ను అక్కడున్న మరో 21 మందిని  హత్య చేసిన ఆరాచక ప్రియులు ముస్లింలు కారు. 1901లో అమెరికా అధ్యక్షుడు మెక్‌ కిన్లే ను మరియు ఇటలీ రాజు హంబర్ట్‌-1ను దారుణంగా హత్య చేసిన ఉన్మాదులు ముస్లింలు కారు. ఆస్ట్రియా రాజు ఆర్క్‌డ్యూక్‌ ఫెర్డినాండ్‌ను హత్య చేసి 1914-1918లో మొదటి ప్రపంచ యుద్ధానికి కారకుల యి 20,000,000-70,000,00 మందిని పొట్టనబెట్టుకున్నవారు ముస్లింలు కారు. 1917-1921  మధ్య కాలంలో రష్యా అంతర్యు ద్ధం, బయటి దేశాల జోక్యంతో 5,000,000-9,000,000 మందిని చంపిన పాపా న్ని మూటగట్టుకున్నవారు ముస్లింలు కారు. 1937- 1945 మధ్య కాలంలో రెండవ చైనా జపాన్‌ యుద్దం 20,000,000 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారకులయిన వారు ముస్లింలు కారు. ప్రొటెస్టెన్ట్‌ మరియు కెథోలిక్‌ల మధ్య జరిగిన 30 సంవత్సరాల 1615-1815 యుద్ధంలో ముస్లింలు లేరు. రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) 60,000,000-70,000,000 మంది మరణించారు. కారకులు ముస్లింలు కారు. గెరిల్లా యుద్ధాలు చేసిన మావో జిదాంగ్‌ నుంచి హోచి మిన్హ్‌ మరియు ఫీడెలో క్యాస్ట్రో వరకు లక్షలాది సామాన్య ప్రజల మరణానికి కారకులయినవారు ముస్లిం కారు.
  రెండవ ప్రపంచ యుద్ధానంతరం పాలస్తీనాలో – హగన, ఇర్గున్‌   మరియు స్టెర్న్‌ గ్యాంగ్‌ మొదలయిన  ముఠాలు హోటళ్ళను, జన సం చార ప్రాంతాలను బాంబు దాడులతో పేల్చిన ఆద్యులు, కల్లోల జన కులు యూదులు ముస్లింలు కారు. తర్వాతి కాలంలో ఏర్పడిన ఇజ్రా యీల్‌ ప్రభుత్వానికి ఈ ఉగ్రవాద తెగల నాయకులే అధినాయకుల య్యారు. విచిత్రమేమిటంటే, స్వదేశ విముక్తి కోసం పోరాడుతున్న సామాన్య ప్రజానికాన్ని ఉగ్రవాద ముద్ర వేస్తున్నారు. ఇలా చెప్పుకుం టూ పోతే, జర్మనీలో బాదెర్‌ మైన్‌ హాఫ్స్‌ అనే ముఠా, ఇటలీలోని రెడ్‌ బ్రిగేడ్స్‌, జపాన్‌లోని ఆంష్రిన్రిక్యో అనే బౌద్ధమత తెగ, ఐరిష్‌ రిపబ్లికన్‌ ఆర్మీ (కాథలిక్‌ ఉగ్రవాద సంస్థ), స్ఫెయిన్‌ మరియు ఫ్రాన్స్‌ దేశాలలో ఈటీఏ-బాస్క్‌ ఉగ్రవాద సంస్థ, ఆఫ్రికా-ఉగాండాలోని లార్డ్స్‌ సాల్వేషన్‌ ఆర్మీ అనే క్రైస్తవ ఉగ్రవాద సంస్థ, శ్రీలంకలోని ఎల్‌.టీ.టీ.ఈ (హిందువులు), బింద్రన్‌ వాలెన్‌ నాయకత్వంలో పని చేసిన పంజాబీ మిలిటెంట్లు (సిఖ్ఖులు), యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (హిందువులు), అస్సాం బోడోస్‌, మిజోలు, మావొయిస్టు ఉగ్రవాద సం స్థలు….వీటిలో ఏ ఒక్క సంస్థతో ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ గమనించాల్సిన కొసమెరుపు, జిత్తులమారి నక్కల ఎత్తు గడ ఏమిటంటే, అన్య మతాల, సిధ్ధాంతాల ఉగ్రవాద సంస్థల పేర్లు ఆంగ్లంలో కుదించబడి ఉండగా ముస్లిం ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటున్న వాటికి అరబీ పేర్లను అతికించే ప్రయత్నం జరుగు తోంది.  ఈ వివరణ వల్ల అర్థమయ్యేది ఏమిటంటే, ఉగ్రవాదం, యుద్ధోన్మాదం అనేది ఏ ఒక్క మతానికి సంబంధించిన ఎంత మాత్రం కాదు. మతాన్ని మత్తుగా పరిగణించే ప్రబుద్ధులు సయితం ఇందులో పెద్ద సంఖ్యలోనే ఉన్నారన్నది గమనార్హం. వాస్తవం ఇదయినప్పుడు కేవలం ముస్లింలనే నిందించడం, ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా ముందుగా వారి పేరునే వెల్లడించడం ఎందుకు జరుగుతోంది? ముస్లింల పట్ల ఎందుకీ కక్ష? సమాలోచనాపరులు సునిశితంగా ఆలోచించాలి!
వై దిస్‌ వివక్ష?
ఒక క్రైస్తవ సన్యాసిని తల నుంచి పాదాల దాకా నిండు వస్త్రాలు (బురఖా) ధరిస్తే నేటి ప్రపంచం ఆమెను గౌరవిస్తుంది. ఆమె దైవ సేవ కోసం అంకితమైందని చెబుతుంది. అదే ఒక ముస్లిం మహిళ నిండు వస్త్రాలు ధరిస్తే ఆమె అణచివేయ బడుతుందని కాకి గోల చేస్తోదీ లోకం. ముస్లిం మహిళ పట్ల ఎందుకీ వివక్ష?
ఒక యూదుడు, ఒక హిందువు,ఒక సిఖ్ఖు, ఒక శాస్త్రవేత్త గడ్డం పెంచితే అతను తన నమ్మిన సిద్ధాంతానికి అంకిత మయ్యాడు అంటారు. అదే ఒక ముస్లిం గడ్డం పెంచి తే అతన్ని తీవ్రవాదిగా, మత ఛాందస వాదిగా గగ్గొలు పెడతారు. ముస్లిం పౌరుల పట్ల ఎందుకీ దురనుమానం?
ఒక పాశ్యాత్త మహిళ ఇంటు పట్టున ఉండి కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటే ఆమె తన కుటుంబానికి మేలు చేస్తున్న త్యాగమూర్తి అంటారు. అదే ఒక ముస్లిం గృహిణి అలా చేస్తే  దిక్కులు పిక్కటిల్లేలా ‘వంటింటి కుందేల’న్టూ, ‘కుటుంబ
బానిసత్వం నుండి ఆమెకు విముక్తి కల్పించా లంటూ అరపులు. ముస్లిం గృహిణి పట్ల ఎందుకీ వైపరీత్యం?
తమ సబ్జెక్టుపై సాధన చేసే విద్యార్థులకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉందంటారు.  అదే ఇస్లాం విద్యార్థన గరిపేవారి భవిష్యత్తు అంధకారమయమని నిరుత్సాహ పరు స్తారు. ముస్లిం విద్యార్థుల పట్ల ఎందు కింత ఓర్వలేనితనం?
ప్రపంచ వ్యాప్తం నివసిస్తున్న 170 కోట్ల మంది ముస్లింలను విస్మరించి విశ్వశాంతి సాధ్యమా? ఒక యూదుడు కాని, ఒక క్రైస్తవుడు కాని, ఒక హిందువు కాని, ఒక సిఖ్ఖుకానీ, ఒక కమ్యూనిస్టుకానీ, ఒక ఫారసీయుడుకానీ, ఒక లౌకికవాదిగానీ నేరం చేస్తే అప్పుడు అతని మతం గురించి గానీ, అతని సిద్ధాం తం గురించి గానీ ఎవరూ మాట్లాడరు. అదే 170 కోట్ల మంది ముస్లింలలో ఎవడో ఒకడు ఏదయినా నేరం చేస్తే, 48 ముస్లిం దేశాలలో ఏదోక దేశం రాజకీయ స్వార్థాల కోసం ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే పాశ్చాత్య మీడియా నుండి మొదలు ప్రాంతీయ మీడియా వరకూ అందరూ ఇస్లాం మతాన్ని ఆడి పోసుకుం టారు. ఇస్లాం పట్ల ఎందుకింత కుళ్లు బోతుతనం?
ఇతర మతాలు, ఇతర సిద్ధాంతాలకు చెం దిన అమ్మాయిలు ఏ దుస్తులు నచ్చితే ఆ దుస్తులు ధరించి పాఠశాలకు వెళ్ళవచ్చు. వారికి ఆ వెసులుబాటు ఉంది. కాని అదే ముస్లిం అమ్మాయిలు నిండు వస్త్రాలు ధరించి కాలేజీలకు వెళితే యాజమాన్యం వారికి లోనికి రాకుండా అడ్డుకుంటు న్నారు. ముస్లిం విద్యార్థినుల విషయంలో ఏమిటీ అన్యాయం?
ఒక వ్యక్తి ప్రజల జీవితాల్ని, దేశ భవిష్యత్తు కాపాడే నిమిత్తం తన జీవితాన్ని త్యాగం చేస్తే అతను మహాత్మ, గొప్పవాడు, గౌర వార్హుడు. అదే ఒక ముస్లిం – తన పరి వారాన్ని, తన దేశాన్ని శత్రువుల చెర నుండి కాపాడటానికి, తన అక్లాచెల్లెల్ల మానాన్ని కాపాడటానికి ఆ పని చేస్తే అతను ఉగ్రవాది. ఎంత పక్షపాతం?
ఇస్లామీయ చట్టాలను, ఇస్లామీయ జీవన విధానాన్ని ఒక్క మారయినా పరిశీలిం కుండా పాశ్చాత్త సాహిత్యాన్ని, మీడియాను అనుకరిస్తూ నేడు మన ఆంధ్ర రాష్ట్రాన కూడా కొందరు కుమతులు, కుత్సిత బుద్ధి గల రచయితలు ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా రచనలు చేస్తూ కల్లోల జనకుల చేత సన్మానాలు పొందుతున్నారు.
 వీరు సయితం ఆలోచించాల్సిందేమిటంటే, భారత దేశంలో శాంతి సుస్థిరతల వాతావరణం నెలకొనాలంటే, 25 కోట్ల మంది ముస్లింల ను విస్మరించి అది సాధ్యమా? ఇదంతా ఎందుకు? కేవలం వారు ముస్లిం అయినందుకేనా? ”ఇంతకీ వారు చేసిన తప్పు-సర్వ శక్తుడు, స్తోత్రనీయుడయిన అల్లాహ్‌ను విశ్వసించడం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు”.  (దివ్య ఖుర్‌ఆన్-85: 8)
అయితే ఇలా చేసే వారిని నాటి నుండి నేటి వరకు ఒక విచిత్రం ఎగ తాళి చేస్తూనే ఉంది. గమనించారో లేదో! ఎవరు ఎంత అణచి      వేయాలని చూసినా, ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎవరు ఎంత రెచ్చిపోయి మాట్లాడినా నాటికీ, నేటికి ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ధర్మం ఇస్లాం మాత్రమే.
”వారు తమ నోళ్ళతో ఊది అల్లాహ్‌ అఖండ జ్యోతిని ఆర్పివేయ జూస్తున్నారు. అయితే అల్లాహ్‌ కూడా తన జ్యోతిని పరిపూర్ణం గావిం చిగాని వదలడు. అది అవిశ్వాసులకు ఎంత సహించరానిదయినా సరే”. (దివ్యఖుర్‌ఆన్-9:32)

Related Post