జీవితం వున్నది జీవించడానికే!

కథా, కథనాలు దైవ సంకల్పితాలు.
మనకు తెల్వని ముగింపుని
మన చేతుల్లోకి తీసుకోకూడదు .
బతుకు విషాదం కానీయకూడదు .
దేవుడిచ్చిన దీప్పాన్ని ఆర్పేయడం అసలే కూడదు. .
చీకటిగా మిగిలిపోకూడదు .

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
చేజేతులా నాశనం కొనితెచ్చుకోకండి. సత్కార్యాలు చేయండి. సత్కార్యాలు చేసేవారిని అల్లాహ్ తప్పకుండా ప్రేమిస్తాడు. (అల్ బఖరః – 195)
వాడిపోతున్న విద్యా కుసుమాలు
నేడు ఎవరిని చూసిన ఏదొక విధంగా మానసిక ఒత్తిడికి లోనయి ఉండటం మనం గమనిస్తాము. ముఖ్యముగా విద్యార్థులు…
దేశంలోని ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్ , కేంద్రీయ విశ్వ విద్యాలయాలు తదితర ఉన్నత విద్యా సంస్థల్లో గడిచిన ఐదేళ్లలో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడ్డారు అంటే ఈ సమస్య ఎంత తీవ్రతరమవుతుందో అర్థం చేసుకోవచ్చు.19 నుంచి 29 ఏళ్ల లోపు వయస్సు వారిలో ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
చదువు ఒత్తిడి భరించలేక అనేక మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతూ.. కన్నవారికి కన్నీటిని మిగులుస్తున్నారు.
అదృశ్యాలు.. ఆత్మహత్యలు – సెల్‌మోజు.. సామాజిక మాధ్యమాల మాయ అపరిపక్వ ఆలోచనలు, ఆకర్షణలతో చదువుకుంటున్న బాలికలు, యువతులు అదృశ్యమవుతున్న సంఘటనలు ఇటు తల్లిదండ్రులకు మనస్తాపాన్ని మిగులుస్తోంది. పరిచయమైన యువకుల మాటల మాయలో పడి ఇంటి నుంచి వెళ్లిపోతున్న వీరు మోసపోతున్న సంఘటనలు అధికంగా జరుగుతున్నా ఇలా వెళ్లిపోతున్న బాలికలు, యువతులు సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సెల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన విద్యార్థులు ఆ మోజులో పడిపోతున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్‌డ్‌ఇన్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెరుగుతుండడం, ఆలోచ నల్లో పరిపక్వత లేకపోవడంతో వీరు ఆ మాయలో చిక్కుకుంటున్నారు.

ఆలోచనలు స్థిరంగా లేనివారిని హిస్ట్రియానిక్‌ పర్సనాలిటీ అంటారు. ఇంట్లో ప్రేమ కరువై బయటివారు కొంచెం ప్రేమ చూపించేసరికి వారితో త్వరగా కలిసిపోతారు. అక్కడ కూడా ఎక్కువకాలం ఉండలేరు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారిని తల్లిదండ్రులు గుర్తించాలి. సైక్రియాట్రిస్ట్‌ వద్దకు తీసుకెళ్లాలి. వారితో ప్రేమగా ఉండాలి. టెన్షన్‌ పడేవారికి ధైర్యం చెబుతూ ఉండాలి. వారి సామర్ధ్యాలను గుర్తు చేస్తుండాలి. దీనికి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి.

సమాజంలోని ఇతర కారణాల్ని ఓ సరి నెమరు వేసుకున్నట్లయితే –

అధిక శాతం జీవితంలో ఎదురయ్యే ప్రతికూల సంఘటనలు, అనుభవాలు, వైఫల్యాలు ప్రధాన కారణాలు అని చెప్పాలి. దీని వల్ల కలిగే నిరాశ నిస్పృహల వల్ల బ్రతకాలనిపించదు. శరీరం నించి ప్రాణం వెళ్ళిపోతేనే తప్ప ఆత్మకి శాంతి దొరకనంత ఖశాంతి వల్ల, ఆత్మహత్య చేసుకోదానికి సిద్ధపడతారు. ఎలాటి పరిస్థితుల్లోనైనా ఊపిరి అగిపోవాలి అనే బండ నిర్ణయం వల్ల ఈ కఠినమైన శిక్ష విధించుకుంటారు.

  • ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైనా, లేదా సంబంధాలు తెంచుకున్నా, తెగిపోయినా, శాశ్వతంగా విడిపోయినా, మరణించినా తట్టుకోలేని పరిస్థితులు ఆత్మహత్యకి పురిగొల్పుతాయి.
  • విదేశాలలో అయితే, పిల్లల సంరక్షణ నుంచి దూరం చేసినా, లేదా పిల్లల బాధ్యతంతా తమ నెత్తి మీదే వుందన్నా, కలిగే ఉద్రిక్తతల వల్ల ఆత్మహత్య మరణాలు జరుగుతున్నాయని ఒక సర్వే వెల్లడించింది.
  • చేస్తున్న ఉద్యోగం నించి హఠాత్తుగా తొలగింపబడటం ఒక కారణం.
  • పెళ్ళి కాకుండా మిగిలిపోవడం, ఒంటరితనం, పెళ్లైన వారికి సంతానం కలగకపోవడం. పోషించే భాగస్వామి మరణించడం, అంగవైకల్యం గల సంతానాన్ని కలిగి వుంటం, కుటుంబ తగాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఇవన్నీ వ్యక్తిగత కారణాలుగా నిలుస్తాయి. అనైతిక సంబంధాలు, శారీరక రుగ్మతలు, ఎలాటి వైద్యానికీ నయం కాని దీర్ఘ కాల జబ్బులు, భరించుకోలేని బాధలు, – గ్రహించలేని మానసిక వ్యాధులు, భయ భ్రాంతులు, అపోహలు, అనుమానాలు, మూఢ నమ్మకాలు, అజ్ఞానం ఇవన్నీ కూడా కారణం. ఇవి ఎక్కువ గా పల్లెల్లో నివసించే వారిని బాధిస్తున్న సమస్యలు.

ఒత్తిడిని జయించడం అసాధ్యమేమీ కాదు. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఒత్తిడిని అదుపులో ఉంచుకునే మార్గాలు అనేకం ఉన్నాయి. అవేంటంటే….

టైమ్‌ మేనేజ్‌మెంట్‌:
సమయమే మన జీవితానికి ముడిసరుకు.
సమయం వృధా చేయడం మరణం కంటే ఘోరమైనది ఎందుకంటే సమయం వృధా చేయడం మనల్ని దేవుని నుండి మరియు పరలోకం నుండి వేరు చేస్తుంది మరియు మరణం మనల్ని కేవలం ఈ ప్రపంచం మరియు ప్రజల నుండి వేరు చేస్తుంది.
కాలం నీరు లాంటిది, మనం దానిని త్రాగకపోతే, అది మనల్ని మింగేస్తుంది, మనల్ని ముంచివేస్తుంది మరియు మన జీవితాన్ని నాశనం చేస్తుంది.
విచిత్రం ఏమిటంటే, సమయం మనకు చాలా అవసరం కానీ మనమే దాన్ని చాలా చెత్తగా ఉపయోగిస్తాము
ప్రాధామ్యాలను క్రమానుగుణంగా ఏర్పరుచుకోవడంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఏ పని ముందు చేయాలి? ఏ పనిని వాయిదా వేయవచ్చు? ఏ పని ముఖ్యం? అనే విశ్లేషణ కొరవడి, కంగారు పడిపోతూ ఉంటాం. ఈ కంగారులో ప్రాముఖ్యత లేని పనుల కోసం సమయం వృథా చేస్తాం. ఫలితంగా ముఖ్యమైన పనులకు సమయం కేటాయించలేక ఒత్తిడకి లోనవుతాం. ఇలా అనవసర ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే పనులను ప్రాఽధాన్యతాక్రమంలో పూర్తి చేసే అలవాటు అలవరుచుకోవాలి.

అలాగే అప్పుడప్పుడు కాసేపు ఆగి ఆలోచించాలి…ఏం సాధించాము ? జీవితం మొత్తం లెక్కలేసుకుంటు – ఏమస్వాదించాము ? .ఏం మూటగట్టుకున్నాము? గజం లెక్కన భూమిని పోగుల్లెక్కన అమ్మి – ఎంతెత్తు ఎదిగాము – వెను తిరిగి చూస్తే కన్నీళ్లే. .. కష్టాలే …కడగండ్లే … వడగండ్లే … దుఃఖాలే … బాధలే … శోకాల సంద్రాల జాతరే – ముందుకెళదామంటే మోసాలే ..నేరాలే … ఘోరాలే … దారుణాలే …కల్మషాలే … కాలుష్యాలే … మేక వన్నె పులుల సంచారాలే.

ధ్యానం: మానసిక ప్రశాంతతతో ఒత్తిడిని జయించవచ్చు. దైవనామ స్మరణ, దైవాజ్ఞలపాలన
మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ తొలిచేస్తున్న అశాంతి, అలజడి దూరం కావా లంటే దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. దైవా జ్ఞలనుగుణంగా జీవించాలి.
విశ్వాసుల హృదయాలే అల్లాహ్ స్మరణ వల్ల తృప్తిచెందుతాయి. గుర్తుంచుకోండి, అల్లాహ్ స్మరణ వల్లనే మనశ్శాంతి లభిస్తుంది. (అర్ రఅద్ : 28) అంటున్నాడు విశ్వ ప్రభువు అయిన అల్లాహ్‌.
ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగం, గొప్ప జీతం, అందమైన ఇల్లు, ఖరీదైన కారు, ఇవన్నీ ఉన్నంత మాత్రాన జీవితంలో సుఖం, సంతోషం ఉంటుందనుకుంటే పొరపాటే. విశ్వప్రభువు అంటున్నాడు:

నా హితబోధ నుండి ముఖం తిప్పుకునేవాడు ప్రపంచంలో (మనశ్శాంతికి దూరమై) దుర్భర జీవితం గడుపుతాడు. ప్రళయదినాన మేమతడ్ని అంధుడిగా చేసి లేపుతాం.” (122-124)
అప్పుడతను “ప్రభూ! ప్రపంచంలో నేను కళ్ళున్న వాడినే, ఇక్కడ నన్ను ఎందుకు అంధుడిగా చేసి లేపావు?” అని అడుగుతాడు. దానికి దేవుడు “నీదగ్గరికి మాసూక్తులు వచ్చినప్పుడు నీవు ఇలాగే (అంధుడైపోయి) వాటిని విస్మరించావు. అందువల్ల ఈరోజు మేము నిన్ను (అంధుడిగా చేసి) విస్మరిస్తున్నాం” అని సమాధానమిస్తాడు. (125-126)
అలాగే హద్దుమీరే, తమ ప్రభువుసూక్తులు తిరస్కరించేవారికి (ఇహలోకంలో వాటి) పర్యవసానం చవిచూపిస్తాం. పరలోకశిక్ష మరింత కఠినంగా, సుదీర్ఘంగా ఉంటుంది (తాహా: 127)

అలాగే బ్రీదింగ్‌ ఎక్సర్‌సైజులు చేయవచ్చు. ఒత్తిడి వల్ల మనం ఊపిరి తీసుకునే తీరు మారుతుంది. త్వరత్వరంగా ఊపిరి పీల్చడం, వదలడం చేస్తాం. గాలిని కూడా శక్తి మేరకు లోపలికి పీల్చం. ఫలితంగా సరిపడా ఆక్సిజన్‌ రక్తంలో కలవదు. దాంతో మెదడు పనితీరు తగ్గుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఊపిరి మీద దృష్టి పెట్టాలి. రోజులో వీలైనన్నిసార్లు గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని వదులుతూ ఉండాలి. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు కొన్ని క్షణాలు బిగించి ఉంచి, వదలడం సాధన చేయాలి.
చిన్న చిన్న ఆనందాలు:
వారు తమకు అల్లాహ్ దయతో ప్రసాదించిన దానిపట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. (ఆల్ఇమ్రాన్:170)
అదే పనిగా గంటల తరబడి పనిలో మునిగి తేలడం సరి కాదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలపాటు బ్రేక్‌ తీసుకోవాలి. ఆ బ్రేక్‌లో నచ్చిన వ్యక్తులతో కలిసి ఆహ్లాదంగా నవ్వుకోవాలి. నవ్వు తెప్పించే పుస్తకం తిరగేయాలి. అవేవీ వీలు కాకపోతే కొన్ని నిమిషాలు నడవాలి. అప్పుడప్పుడు మనల్ని మనం సమీక్షించుకోవడం చాలా అవసరం.
మనసారా నవ్వుకొని … కళ్లారా చూసుకొని. ..గుండెలకు హత్తుకొని గౌరవంగా బతికి ఎన్నేళ్ళో అయ్యింది…
ఆ కుశల ప్రశ్నలు వేసి కలిసి భోజనం చేసి… ఎన్నేళ్ళో గడిచాయి… మనము కడుపు నిండా తిని
కళ్ళార నిదరొయి ఎన్నేళ్ళో గడిచాయి… తేలియనేలేదా మనకూ … ఏం సాధించాము?
బలమైన ఆహారం:
“ప్రవక్తలారా! పరిశుద్ధ పదార్థాలు తింటూ సత్కార్యాలు చేస్తూ ఉండండి. మీరు చేసేదంతా నాకు తెలుసు. (మోమినూన్: 51)
ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఆహారం కూడా ఎంతో ఉపయోగ పడుతుంది. బలమైన ఆహారం తీసుకోవడంవల్ల మెదడు చురుగ్గా మారుతుంది. దీనివల్ల చెడు ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు రావు. శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. అందుకే విటమిన్లు, మినరల్స్ వంటి మంచి పోషకాలుండే ఆహారం తీసుకోవాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
అతిగా ఆలోచించకూడదు:
కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా పదే పదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. ఒక్కోసారి అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ఖాళీ లేకుండా పనులు చేస్తూ ఉంటే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. పని చేసేటప్పుడు మధ్య మధ్యలో కాస్తంత విరామం తీసుకుంటుండాలి.

  1. మీ పట్ల దయ చూపండి
    మనం ఇతరుల పట్ల దయ చూపినట్లే మనపట్ల కూడా దయ చూపడం ఎంత ముఖ్యమో మనం కొన్నిసార్లు మరచిపోవచ్చు.
    మన మనస్సు మనతో కఠినంగా ఉండనివ్వకూడదు., మనం ఇతరులతో కఠినంగా ప్రవర్తించనప్పుడు , మనతో ఎందుకు కఠినంగా ఉండాలి?
  2. ప్రతికూల ఆలోచనల మూలాన్ని కనుగొని వాటిని నిర్మూలించుకోవాలి.
  3. మీ గురించి పట్టించుకునే వారితో మాట్లాడండి
    మీరు ఏదైనా విషయంలో కలత చెందితే, మీ గురించి పట్టించుకునే వ్యక్తులతో మాట్లాడటం చాలా ముఖ్యం. మిమ్మల్ని ప్రేమించే వారు మీకు సలహా ఇస్తారు మరియు జీవితంలో మీరు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి సహాయం చేస్తారు.
  4. మీ గురించి మీకు చెడుగా అనిపించే వారిని వదిలించుకోండి
  5. మీ బాధను వ్యక్తీకరించడానికి మరొక అవుట్‌లెట్‌ను కనుగొనండి – అంటే ఆ సమయంలో కూడా సానుకూల ఫలితాన్నిచ్చే పనులు చేయండి.
  6. మీకు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోండి
    అధిక పనిని నివారించాలి, మీరు విరామం తీసుకోవాలనుకుంటే, దాని కోసం అడగడానికి సిగ్గుపడకండి. మీ ఆరోగ్యం క్షీణిస్తే మీరు ఏమీ చేయలేరని గుర్తుంచుకోండి, కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
  7. మిమ్మల్ని మంచి మూడ్‌లో ఉంచే విషయాల్ని చూడటం వినడం చేయండి
  8. మిమ్మల్ని మీరు సానుకూలంగా సంబోధించండి
  9. మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి
  10. మీ ప్రతికూల ఆలోచనలను కాగితంపై వ్రాసి, దానిని చింపివేయండి
  11. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి
  12. మీ విషయాలలో జోక్యం చేసుకునే అనుమతికి ఎవ్వరికి ఇవ్వకండి
  13. “లేదు” అని చెప్పడం నేర్చుకోండి
    ఒత్తిడిని పెంచుకోవద్దు:
    ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను చూడటం, వినడంకానీ చేయవద్దు. ప్రతి చిన్న విషయాన్ని అదేపనిగా ఆలోచించడంవల్ల మానసికంగా కుంగిపోతాము. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒత్తిడి పెరిగితే దాంతోపాటు రోగాలు కూడా పెరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒంటరితనం వద్దు:ఎక్కువ సమయం ఒంటరిగా ఉండొద్దు. స్నేహితులను కలుస్తూ, వారితో మాట్లాడుతూ ఉండాలి. అవకాశమున్నప్పుడల్లా అందరితో కలిసిపోవాలి. సమస్యలేమైనా ఉంటే వారితో పంచుకుంటే కొంత ఒత్తిడి తగ్గుతుంది. చీకటిలో ఉండొద్దు. సరిగా నిద్ర లేకపోవడం కూడా మానసిక అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఒత్తిడికి అనేక కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటి. కొందరు రోజుకు 4 నుంచి 5 గంటలే నిద్రిస్తుంటారు. కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
    ప్రస్తుత కాలంలో అధిక ఒత్తిడికి గురయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు తదితర కారణాల వలన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు..
    అనుబంధాల ప్రాముఖ్యత
    సంఘజీవనంలో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉంది. తల్లిదండ్రులు, అన్న దమ్ములు, అక్కాచెల్లెల్లు, ఆత్మబంధువులు అంతా పరస్పరం ప్రేమానురాగాలు కలిగి ఉంటూ ఒకరినొకరు తోడుగా ఉండటంలో ఆనందం, తృప్తి ఎంతైనా ఉంటుంది. ”అండలుంటే కొండలు దాటవచ్చ”ని సామెత ఉంది. ఆపదల్లో నేనున్నానని అండగా నిలిచే కుటుంబ సభ్యులు తోడుంటే మనిషి నిశ్చితం గా ఉండగలుగుతాడు. ఆత్మ పీడన నుండి, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొంద వచ్చు. అయితే డబ్బజబ్బు సోకినప్పి నుంచి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతానురా గాలు తగ్గిపోయాయి. నాలుగు గోడల మధ్య పలకరించేవారు కరువయ్యారు.
    అంతిమ దైవప్రవక్త(స) ఎప్పుడో నొక్కి చెప్పారు: ”బంధువులు స్నేహితులు పరస్పరం ఆప్యాయతగా వ్యవహరించాలని, వ్యాధి గ్రస్తుల్ని పరామర్శించాలని, కానుకలు ఇచ్చు పుచ్చుకుంటూ ఉండాలని, సుఖదుఖాలలో పాలు పంచుకుంటూ ఉండాలని,” ఎందు కంటే మానసిక ఒత్తిడిని అధికమించాలంటే కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలుం డాలి అని మానసిక శాస్త్రవేత్తలూ అంటున్నారు.
    ఎలా అంటే,
    మట్టితో మొక్కలా … నదులతో ఒడ్డులా … మబ్బుల్తో చినుకులా …చెట్లతో గాలిలా ..
    పలకరించమెందుకు..మనకెవరున్నా లేకున్నా / తోడుండే వాళ్ళను పట్టించుకోమెందుకు
    బలవంతుడైనానాము, కన్న తల్లి పాలు తాగి / రొమ్ము గుద్దేటంత గుణవంతులైనాము
    పిడికెడు ప్రాణాలకు గుప్పెడు అన్నం పెట్టలేని ధనవంతులైనాము / మనం సచ్చిపోతే పూడ్చి పెట్టలేని జాగ లేనోళ్ళయ్యాము / ఏం సాధించాము .. / జీవితం మొత్తం లెక్కలేసుకుంటు / ఏమస్వాదించాము

డబ్బే సర్వం కాదు:
ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది అంటుంటారు జనులు. డబ్బుంటే చాలు అన్నీ ఉన్నట్లే. అన్ని సౌఖ్యాలు వాటంతటవే వెతుక్కు ంటూ వస్తాయి అని చాలా మంది భావిస్తారు. కాని ”డబ్బుంటే సుఖం దక్కుతుందేమోగానీ సంతోషం కాదు” అన్నది అక్షర సత్యం. డబ్బు పిచ్చి ఒక్కొక్కసారి మనుషుల మధ్య అగాధాలు సృష్టించి పగలూ సెగలూ రేపుతుందని వివరించాడో పూర్వ కవి.
చెన్నైలోని ఓ -ఐటి కంపెనీలో పనిచేసే 26 ఏళ్ళ వర్ష అంటుంది ”నేనూ, నా భర్త కూడా సాప్ట్ వేర్‌ ఇంజనీరే. ఇద్దరం బాగా సంపాదిస్తున్నాం. కానీ జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించే తీరికే మాకు లేదు. మేమిద్దరం పేరుకు ఒకే ఇంలో ఉంటాం. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. ఆదివారం నాడు కూడా ఇంలో ఆఫీసు పని చేసుకోవాల్సి వస్తుంది. అది పూర్తయ్యేసరికి మానసికంగా చాలా అలసిపోతాం” అని (ఉద్యోగం వివాహ నాశాయ! ఈనాడు 23/07/2007)
డబ్బు…డబ్బు…డబ్బు…డబ్బే జీవిత లక్ష్యంగా భావించి, దాని కోసం నిరంతరం శ్రమిం చి, శారీరంగా మానసికంగా కుమిలి డిప్రేషన్‌ కు గురై ఎన్ని జీవితాలు అంత మయ్యాయో?! విశ్వప్రభువు అంటున్నాడు: ”వారి సిరిసంపదలనూ, వారి అధిక సంతానాన్నీ చూసి మోసపోవద్దు. అల్లాహ్‌ మాత్రం ఈ సిరిసంపదల ద్వారానే వారికి ప్రాపంచిక జీవితంలో కూడా శిక్షకు గురి చెయ్యాలని, వారు ప్రాణ త్యాగం చేసినా సత్య తిరస్కార స్థితిలోనే చెయ్యాలని కోరుతున్నాడు”. (9:55)
డబ్బు జీవితావసరం. జీవిత లక్ష్యం కాదని తెలుసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడ వచ్చని అధ్యాయనాలు చాటి చెబుతున్నాయి.


పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లోయి
లోకంలో కన్నీరిక చెల్లోయి
.


కేరీర్‌లో నిలదొక్కుకోవాలని సంతానాన్ని కాంక్షించని వారికి జీవితాంతం విషాదం వెంటాడుతూ ఉంటుంది. అందుకే విశ్వ ప్రభువు అంటున్నాడు: ”పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి మేము వారికీ ఉపా ధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయడం మహా పాపం”. (17:31)

ఇలా ఎందుకు జరుగుతున్నది? అంటే మనం కొన్నింటిని పట్టించుకుంటున్నాం, కొన్నింటిని అస్సలు పట్టించుకోవడం లేదు. అవేమంటే,


దేన్నీ మనం మరువలేదు అంటే ..
ఆహారాన్ని మరువ లేదు. ఆహార్యాన్ని మరువ లేదు. సంపద సౌఖ్యాన్ని మరువ లేదు, సంసార సుఖాన్ని మరువ లేదు. ఇంద్రియ భోగమును మరువ లేదు. మోహమును మరువలేదు, కామమును మరువ లేదు, క్రోధమును మరువ లేదు, మదమును మరువ లేదు, మాత్సర్యామిను మరువ లేదు. స్వీయ స్వార్థాన్ని మరువ లేదు, పర వంచనను మరువ లేదు, వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీని మరువ లేదు, దాని ధాటికి విరిగిన పేదల నడ్డీ మరువ లేదు, లంచమును మరువ లేదు, లంచావతారులను మరువ లేదు. కలకంఠి యెడల కీచ క్రీడను మరువ లేదు, కన్నా వారి యెడల కఠిన వైఖరిని మరువ లేదు. రాగ దేశాలనుఁ మరువలేదు, పగ ప్రతీకారాలను మరువ లేదు.

మరి ఏం మరిచాము అంటే,
అల్లాహ్ స్మరణను మరిచాము, ప్రవక్త సంప్రదాయాన్నీ మరిచాము, ఆత్మ ఆహారాన్నీ మరిచాము, మరణాన్ని మరిచాము, సమాధి అవస్థను స్వర్గ అనుగ్రహాలనుఁ మరిచాము, నరక శిక్షలను మరిచాము, సుజ్ఞానంబును మరిచాము, కరుణను మరిచాము, దయను మరిచాము, దాన ధర్మాన్ని మరిచాము, అన్నదానాన్ని మరిచాము, ఆప్తుల ఆప్యాయతను మరిచాము, నమాజును మరిచాము, జకాతును మరిచాము, త్యాగాన్ని మరిచాము, సమరస భావాన్ని మరిచాము, సహిష్ణుతను మరిచాము, స్నేహ భావాన్ని మరిచాము,, క్షమను మరిచాము, తల్లిదండ్రుల సేవను మరిచాము, అన్నాదమ్ముల అనుబంధాన్ని మరిచాము, ఆలుమగల అన్యోన్నతను మరిచాము, మంచిని మరిచాము, మంచిని బోధించడాన్ని మరిచాము, ప్రేమను మరిచాము, ప్రేమను పంచడాన్ని, ప్రేమను పెంచడాన్ని మరిచాము.

దేన్నీ విడువము అంటే,
దుర్గుణాన్ని విడువము, దుర్నడతను విడువము, దురహంకారాన్ని విడువము, దమన నీతిని విడువము, దహాం కాండను విడువము, పాపాలను విడువము, చెడు స్నేహాన్ని విడువము, కుట్రలు, కుతంత్రాలను విడువము, అకామార్జనను విడువము, వారసత్వపు హక్కుల స్వాహాను విడువము, పుల్లెలెట్టడాన్ని విడువము, కాపురాల్ని కూల్చడాన్ని విడువము, పరోక్ష నిందను విడువము, పరాయి సొమ్మును విడువము, రంధ్రాన్వేషణను విడువము, అసూయ, అత్యాశలను విడువము. ఐహిక లాలసను విడువము, ధన పిపాసను విడువము, మగువ లోలత్వాన్ని విడువము, మాదక ద్రవ్యాలను విడువము.

దేన్నీ విడిచెదము అంటే,
ధర్మాన్ని విడిచెదము, న్యాయాన్ని విడిచెదము, బంధుత్వ సంబంధాలను విడిచెదము, మానవ అనుబంధాలను విడిచెదము, సిగ్గు సిరిని విడిచెదము, మానం మర్యాదను విడిచెదము…. ఇలా ఉంది మన స్థితి, మానసిక పరిస్థితి… మానసిక ఒత్తిడికి గురికాకపోతే ఏమవుతాం?
సకల చింతలకు చికిత్స పరలోక చింతన
అందమైన ఈ జీవితం ఏదోక రోజు అంతమయిపోతుంది. మన శ్రమను, కృషిని అశాశ్వతమయిన ఐహిక జీవితానికే ధారపోసి పరలొకాన్ని విస్మరించడం అంటే, నకిలీ నగల మోజులో అసలు సిసలయిన పసిడి విలువను గుర్తించక నష్టపోవడమే / పెదవుల్లో నవ్వులు పొలమారుతున్నాయి.

మరణం తథ్యం:
జీవితం ఆట కాదు, నాటకమూ కాదు,తోలు బొమ్మలాట అంతకన్నా కాదు, జీవితం ఓ యదార్థం, కళ్ళకు క్టినట్టు కానవస్తున్న కఠోర సత్యం. మనిషి అనుక్షణం అనుభవిస్తున్న వాస్తవం, నిత్య ప్రయాణం. ఇక్కడ అందరూ ప్రయాణికులే. అందరూ ప్రయాణ సామగ్రి అవసరం ఉన్నవారే. ఇహలోకం శాశ్వత నివాసం కాదు, అంతమయ్యే తాకం. తాత్కాలిక వాహనమేగానీ, సుఖసంతోషాల నికేతనం కాదు. అదో వారిధి, దాన్ని దాలంటే సత్కర్మల నౌక అవసరం. ఇహలోక ప్రయాణానికి ప్రారంభం జననమయితే, పరలోక ప్రయాణానికి ఆరంభం మరణం. ”ప్రతి ప్రాణికి మరణం రుచి చూడవలసి ఉంటుంది”. (ఆల్‌ ఇమ్రాన్‌: 185)

మరణ స్మరణ మంచిది:
మరణం అంటే ఎందుకో మనిషికి కొంచం అయిష్టం, కొంచం భయం. కారణం – సత్కర్మల సామగ్రి అంతగా లేదన్న బెంగ. అల్లాహ్‌ా విషయంలో తన వల్ల జరిగిన జాప్యం. అయినా ఒక విశ్వాసి అల్లాహ్‌ాను కలుసుకోవ డాన్నే ఇష్ట పడతాడు. తన నిర్వాకాలకు ప్రభువు ఎక్కడ శిక్షిస్తాడోనన్న భయం అతనిలో ఉన్నట్లే, మన్నిస్తాడు అన్న గంపెడాశ అతనికి. అందుకే ఎంత ఇష్టం లేకున్నా మరణాన్ని స్మరించుకోవడం మానకోడు. నికాహ్‌ా ప్రసంగంలో సయితం మరణ స్మరణ జరుగుతుంది. కారణం ”రుచుల్ని నియంత్రించే మరణాన్ని అత్యధికంగా స్మరించుకుంటూ ఉండండి” (తిర్మిజీ) అన్న ప్రవక్త (స) వారి మాట. ఓ సందర్భంగా ప్రవక్త (స) వారిని ‘బుద్ధి మంతులు ఎవరు?’ అని ప్రశ్నించడం జరిగింది. అందుకాయన (స) ”మరణాన్ని అందరికన్నా ఎక్కువగా స్మరించుకునేవారు, దాని కోసం అందరికన్నా ఎక్కువగా సామగ్రి విషయంలో సిద్ధంగా ఉండేవారు, వారే బుద్ధిమంతులు. ఇహపరాల మేళ్ళన్నింనీ మూట కట్టుకు పోయారు” అన్నారు ప్రవక్త ౖ(స). (తబ్రానీ)

కఠోర గరళం మరణం:
మరణం సంభవించగానే కర్మల పత్రాలు చుట్టి వేయబడతాయి. ఎలాిం కర్మ చేసుకునే వెసులుబాటు ఉండదు. జరిగిన పొరపాట్లకు గానూ తౌబా చేసుకునే వ్యవధి కూడా దొరకదు. చేజారి సువర్ణావకాశాలపై కాసింత కన్నీళ్ళు పెట్టుకునే తీరిక సయితం లభించదు. మనిషి అసలు ప్రస్థానం మెదలవుతుంది – అది స్వర్గానికా? నరకానికా? అన్నది అతను చేసుకున్న కర్మను బట్టి నిర్థారించడం జరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఈ గరళాన్ని మింగాల్సిందే. ”వారికి చెప్పు: ‘ఏ చావు నుండయితే మీరు పారి పోతు న్నారో అది మిమ్మల్ని కబళించి తీరుతుంది. ఆ తర్వాత మీ రహస్యం బహిర్గత విషయాలను ఎరిగిన వాని సమక్షంలో మీరంతా తరలించ బడ తారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నింనీ మీకు తెలియ జెపుతాడు”. (జుముఅహ్‌ా: 8)

మరణ కాంక్ష మంచిది కాదు:
”మీలో ఎవ్వరూ మరణాన్ని కాంక్షించ కూడదు. అది రాక మునుపే దాన్ని ఆహ్వనించ కూడదు, దుఆ చెయ్యకూడదు. మీలో ఒకడు మరణించాడు అంటే, ఇక అతనికి కర్మలు చేసుకునే వెసులుబాటు ఉండదు. విశ్వాసి ఎంత కాలం జీవిస్తే అతనికి అంతే ఎక్కువ మంచి జరుగుతుంది” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
”తనపై విరుచుకు పడిన విపత్తు కారణంగా మీలో ఎవ్వరూ మరణాన్ని కోరుకోకూడదు. ఒకవేళ తప్పసరి అనుకుంటే ఈ విధంగా ప్రార్థించాలి: ”అల్లాహుమ్మ అహ్‌ాయినీ మా కానతిల్‌ హయాతు ఖైరన్‌ లీ, వ తవప్ఫనీ ఇజా కానతిల్‌ వఫాతు ఖైరన్‌ లీ” – ఓ అల్లాహ్‌ా! జీవతం నా కోసం శుభవంత అయినమత వరకు నన్ను బ్రతికించు. మరణమే నా పాలిట మేలన్నప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు. (ముత్తఫఖున్‌ అలైహి)

మరణానికి మించిన ప్రమాదం మరణ విస్మరణం:
మరణం ఎవ్వరూ నిరాకరించ లేనీ, తప్పించ లేని యదార్థం అయినా మనిషి మాత్రం దాన్ని మరచి పోవడానికి ప్రయత్ని స్తుాండు. అది నిత్యం ఎదురయ్యే అనుభవం అయినా దాని కోసం ముందస్తు జాగ్రత్తలు అస్సలు తీసుకోడు. ఇది ముమ్మాికి మూర్ఖత్వమే! ”వివేకి ఎవరంటే, తన మనోమయ స్థితిని అంచనా వేయగలిగే స్థితిలో ఉంటూనే, మరణా నంతరం పనికొచ్చే కర్మలు చేయడంలో జీవితాన్ని సద్వినియోగ పర్చు కుాండో అతడే. ఇక అసమర్థుడెవడండే, మనోవాఛల్ని అనుకరిస్తూ అల్లహ్‌ మీద లేనిపోని ఆశలు పెట్టుకునేవాడు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ) – జీవితం తర్వాత మరణం ఉంది, మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంది, ఆ జీవితానికి అంతం లేదు. అక్కడ మరణానికే మరణం ఇవ్వడం జరుగుతుంది.
”ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, వినోద వస్తువు తప్ప మరేమీ కాదు. అయితే పరలోక నిలయపు జీవితమే అసలు సిసలయిన జీవితం. ఈ విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంత బావుండు!”. (అన్‌కబూత్‌: 64) అవును;


శాశ్వత జీవని ముందుంది! శ్వాస ఆగితే అది పుడుతుంది!!

మరణ స్మరణ లాభాలు:
1) ప్రాపంచిక రుచుల, ఐహిక వ్యామోహ నియంత్రణ.
2) మరణానికి పూర్వమే దాని కోసం తగిన సన్నాహాలు చేసుకునే ఆలోచన కలుగుతుంది.
3) అది మనిషిని నిత్య జాగృతావస్థలో ఉంచుతుంది. ఏమరుపాటు నుండి, అలక్ష్యం నుండి కాపాడుతుంది.
4) అది మనిషికి కష్టాల, నష్టాల వల్ల కలిగే బాధను తగ్గిస్తుంది. నిరాశకు లోను కాకుండా చూస్తుంది.
5) అది మనిషిలో ఐహిక అనాసక్తతను,పరలోక ఆసక్తతను కలిగిస్తుంది.
6) అది జరిగి పొరపాట్లను దిద్దుకునే, తౌబా చేసుకునే వ్యవధిని ఇస్తుంది.
7) అది మనస్సును మెత్తబరుస్తుంది. కింలో కన్నీరు ఇంకిపోకుండా, కరుణ అంతరించి కాఠిన్యం, కరకుదనం ఆవహించకుండా కాపాడుతుంది.
చివరి మాట
గొంతులో మాటలు వణికిపోతున్నాయి / కళ్ళల్లో చూపులు సోలిపోతున్నాయి. మోహములో వెలుగులు మాయమౌతున్నాయి / గుక్కెడంత నీరు గుప్పెడంత కూడు.. గుడిసె లాంటి గూడు నీడలాంటి తోడూ / ఇంకేమి కావాలి?


మనిషి జన్మించి … జీవించి … మరణించే వరకు ఇంకెంత కావాలి?

Related Post