”నీ ప్రభువు వద్ద నుంచి ఏదయినా గొప్ప సూచన వచ్చేసిన రోజున, ముందు నుంచీ విశ్వసించకుండా ఆ రోజే విశ్వసించినవాని విశ్వాసం, లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యము చేయని వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగ పడదు”. (అన్‌ఆమ్: 158)
దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మూడు విషయాలు సంభవించాయంటే, అంతకు పూర్వం విశ్వసించని ఏ వ్యక్తి విశ్వాసం అతనికి ఏ విధంగానూ పనికి రాదు. 1) దజ్జాల్. 2) జంతువు. 3) పడమర నుండి సూర్యుడు ఉదయించడం”. (ముస్లిం)
ఆది నుండి అంతం వరకూ మహా భయంకర ఉపద్రవం దజ్జాల్:
ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ఆదం (అ) పుట్టింది మొదలు ప్రళయం సంభవించే వరకు దజ్జాల్ కంటే భయంకరమైన విషయం మరొకటి లేదు”. (ముస్లిం)
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ప్రతి దైవప్రవక్త తన అనుచర సమాజాన్ని ఒంటి కన్ను, కోతల రాయుడు – అబద్ధీకుడయిన దజ్జాల్ గురించి హెచ్చరించారు. జాగ్రత్త! దజ్జాల్ ఒంటి కన్ను వాడయి ఉంటాడు. మీ ప్రభువు ఒంటి కన్నువాడు కాదు”. (బుఖారీ, ముస్లిం)
ప్రళయ సంకేతాలు ఎలా సంభవిస్తాయి?
”ప్రళయ సంకేతాలు ఒక దారంలో కూర్చబడిన పూసల వంటివి. దారం తెగిందా అవి ఒకి తర్వాత ఒకటంటూ జారి పడతాయి” అన్నారు ప్రవక్త (స). (ముస్తద్రక్ హాకిమ్)
పెద్ద తరహా ప్రళయ సంకేతాల వర్గీకరణ:
పెద్ద తరహా ప్రళయ సంకేతాలు రెండు విధాలు.
1) ప్రళయం అత్యంత సమీపంగా ఉంది అని తెలియజేసేవి. ఉదాహరణకు – దజ్జాల్ రాక, ప్రవక్త ఈసా (అ) పునరాగమనం, యాజూజ్ మాజూజ్ రాక, రూపాలు మారి పోవడం వగైరా.
2) ప్రళయం సంభవించింది అని తెలియజేసేవి. పొగ, పడమర నుండి సూర్యుడు ఉదయించడం, నేెల నలు మూలల నుండి ప్రజల్ని ఓ చోటు ప్రోగు చేసే జంతువు.
దజ్జాల్‌కు మసీహ్ అన్న పేరు ఎందుకు?
ఇబ్ను అసీర్ (రహ్మ) ఇలా అభిప్రాయ పడ్డారు: ”దజ్జాల్‌ను మసీహ్ అని పిలవడానికి గల కారణం ఏమిటంటే, అతని కుడి కన్ను తుడిచి వేయబడి ఉంటుంది గనక అతన్ని మసీహ్ అంటారు”.
”వాడు మక్కా మదీనాలు తప్ప ప్రపంచం మొత్తం తిరుగుతాడు గనక వాణ్ణి మసీహ్ అంటారు” అన్నది మరికొందరు పండితుల మాట.
భాషా పరంగా తీసుకుంటే, ఈసా మసీహ్ మరియు మసీహ్ దజ్జాల్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. దజ్జాల్‌ను పిలిచే మసీహ్ అరబీలో పయీల్ ను పోలి ఉండి మఫ్‌వూల్ అర్థాన్ని కలిగి ఉంటుంది. అంటే, ఎవడి కన్ను తుడిచి వేయ బడిందో అతను అని. ఈసా (అ)ను పిలిచే మసీహ్ అరబీలో పయీల్‌ను పోలి ఉండి ఫాయిల్ అర్థాన్ని కలిగి ఉంటుంది. అంటే, ఎవరి స్పర్శతో స్వస్థత లభిస్తుందో అతను అని. ప్రవక్త ఈసా (అ) తన చేత్తో పుట్టు గుడ్డిని, కుష్టు రోగిని తాకితే అల్లాహ్ ఆనతితో వారికి సంపూర్ణ స్వస్థత లభించేది. ఆ రకంగా – ఈసా (అ) మసీహుల్ హుదా – మార్గం చూపించే మసీహ్ అయితే, దజ్జాల్ మసీహుజ్ జ్వలాలహ్ – మార్గం తప్పించే మసీహ్. దజ్జాల్ అనేది దజ్ల్ అనే మూల ధాతువు నుండి వచ్చి పదం. అర్థం: దగా, మోసం, భ్రమకు గురి చేయడం-అతను అసత్యాన్ని అందంగా ప్రదర్శిస్తాడు.
దజ్జాల్ గురించి అహ్లుస్సున్నహ్ వల్ జమాఅహ్ అఖీదహ్:
దజ్జాజ్ మరియు అతని ఉపద్రవాల గురించి వివరించబడిన హథీసులు ఎంతో ప్రామాణికమయినవి. సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీలో పేర్కొనబడిన అత్యంత ఉన్నతమైన – సహీహ్ హథీసులు కాబట్టి, దజ్జాల్ విషయంలో పండితులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఈ ఉల్లేఖనాల విషయంలో శంకకి, సంశయానికి, సందేహానికి లోను కావడం ఏ విధంగానూ సరి కాదు. ప్రవక్త ఈసా (అ) మళ్ళీ వస్తారు అన్న మాట ఎంత వాస్తవమో దజ్జాల్ రాక కూడా అంతే యదార్థం!
దజ్జాల్ ఉపద్రవం ఎలా ఉంటుంది?
దజ్జాల్ – అతని ద్వారా అల్లాహ్ తన దాసుల్ని పరీక్షిస్తాడు. అతనికి కొన్ని వస్తువుల మీద పట్టును, అధికారాన్ని ఇస్తాడు. ఉదాహరణకు – మృతులను బతికించడం, ప్రాపంచిక భోగ భాగ్యాలు అతని వద్ద ప్రోగయి ఉండటం, అతని వెంట అతని స్వర్గ నరకాలుండటం, భూ సంపదలు అతని వెంట ఉండటం, వాన కురవడం, భూమి పంటలు పండించడం వగైరా. చివరికి ప్రవక్త ఈసా (అ) అతన్ని అంతమొందిస్తారు.
”దజ్జాల్ గురించి ఏ దైవ ప్రవక్త తన అనుచర సమాజానికి చెప్పని ఒక విషయం నేను మీకు చెప్పనా? నిశ్చయంగా వాడు ఒంటి కన్ను వాడు. తన వెంట స్వర్గం మరియు నరకం లాంటి రెండు వస్తువులు తీసుకొస్తాడు. వాడు దేన్నయితే స్వర్గం అంటాడో అది నరకమయి ఉంటుంది” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ, ముస్లిం)
హజ్రత్ ముగీరా బిన్ షుఅబా (రజి) కథనం – దజ్జ్జాల్ గురించి నేను దైవ ప్రవక్త (స)ను నేను అడిగినన్ని ప్రశ్నలు మరెవరూ అడిగి ఉండరు. ఆయన (నాకు ధైర్య చెబుతూ) ”వాడు నిన్నేమీ చేయ లేడులే” అన్నారు. అందుకు నేను – ”ప్రజలు చెబుతుంటే విన్నాను: ‘అతని వెంట రొట్టెల పర్వతం, నీటి సెలయేరు ఉంటుందటగా’అని అన్నాను. అందుకాయన – ”విశ్వాసుల్ని కాపాడటం అల్లాహ్‌కు అంతకంటే చాలా తేలిక” అని చెప్పారు. (బుకారీ, ముస్లిం)
దజ్జాల్ వర్ణణ: ”అతని కళ్ళ మధ్య క-ఫ-ర అని వ్రాయబడి ఉటుంది.” (బుఖారీ, ముస్లిం)
అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (ర), హుజైఫా బిన్ యమాన్ (ర) గారిను ద్దేశించి – ”మీరు దజ్జాల్ గురించి దైవప్రవక్త (స) వారి నోట ఏం వింటున్నారో చెప్పండి” అని అడిగారు. దానికాయన -”నిశ్చయంగా దజ్జాల్ బయికి వస్తాడు. అతని వెంట నీరు మరియు నిప్పు ఉంటాయి. ప్రజలు చల్లని నీరు అనుకునేది మండే నిప్పయి ఉంటుంది. ప్రజలు మండే నిప్పు అనుకునేది చల్లని నీరయి ఉంటుంది”. (బుఖారీ, ముస్లిం)
ఉబాదహ్ బిన్ సాబిత్ (ర) – మసీహ్‌ా దజ్జాల్ పొట్టి వాడయి ఉంటాడు. రెండు కాళ్ళు వంకరగా ఉంటాయి. అతని జుత్తు గింగిరాల జుత్తయి ఉంటుంది. అతను ఒంటి కన్ను గలవాడయి ఉంటాడు. అది మరీ లోపలికీ ఉండదు, మరీ పైకి ఉబికి ఉండదు” అన్నారు.
పరిస్థితులు:
దజ్జాల్ రాకకు పూర్వం మూడు సంవత్సరాలు చాలా భీకర కరువుతో కూడినవయి ఉంటాయి. ప్రజలు ఆ మూడు సంవత్సరాలు తీవ్ర ఆకలి దాహాలకు గురవుతారు. మొది సంవత్సరం అల్లాహ్ ఆకాశాన్ని ‘తన మూడింట ఒక వంతు వర్షాన్ని ఆపుకోవాల్సిందిగా ఆదేశిస్తాడు’. భూమిని – ”తన మూడింట ఒక వంతు పంటను నిలిపివేయాల్సిందిగా అజ్ఞాపిస్తాడు. రెండవ సంవత్సరం-అల్లాహ్‌ా ఆకాశాన్ని ‘తన మూడింట రెండు వంతుల వర్షాన్ని ఆపుకోవాల్సింది’గా ఆదేశిస్తాడు. భూమిని – ‘తన మూడింట రెండు వంతుల పంటను నిలిపివేయాల్సింది’గా అజ్ఞా పిస్తాడు. మూడవ సంవత్సరం – అల్లాహ్ ఆకాశాన్ని ‘తన పూర్తి వర్షాన్ని ఆపుకోవాల్సింది’గా ఆదేశిస్తాడు. భూమిని – ‘తన పూర్తి పంట ను నిలిపివేయాల్సింది’గా అజాపిస్తాడు. ‘అలాంటి గడ్డు పరిస్థితిలో ప్రజలు ఏమి తిని బతుకుతారు’ అని ప్రశ్నించినప్పుడు – ‘తహ్లీల్-లా ఇలాలహ ఇల్లల్లాహ్, తక్బీర్-అల్లాహుఅక్బర్, తహ్మీద్ – అల్‌హమ్దు లిల్లాహ్ – ఇవే వారికి ఆహారానికి బదులు సరి పోతాయి. ఇవే వారికి ఆహారంగా ఉంటా యి’ అని సమాధానమవ్వడం జరిగింది. (సహీహుల్ జామె)
అంటే, దైవ దూతలకు ఆహారంగా అల్కాహ్ స్మరణ ఉన్నట్లే అప్పి గడ్డు స్థితిలో విశ్వాసులకు సయితం అల్లాహ్ స్మరణ ఆహారంగా ఉంటుంది.
దజ్జాల్ ఏ ప్రాంతం నుండి వస్తాడు?
”తూర్పు వైపున గల ఖురాసాన్ అనే ప్రాంతం నుండి దజ్జాల్ బయట పడి వస్తాడు” అన్నారు ప్రవక్త (స). (సహీహుల్ జామె)
హజ్రత్ తమీమ్ దారీ (ర) గారి కథనం – ”దజ్జాల్ అస్ఫహాన్ ప్రాంతానికి చెందిన యూదుల నుండి బయట పడి వస్తాడు. అతనతోపాటు 70 వేల మంది యూదు లుంటారు” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్ అహ్మద్) వేరొక ఉల్లేఖనంలో – ”అస్ఫహాన్‌కు చెందిన 70 వేల మంది యూదులు అతని వెంట ఉంటారు. వారి ఒంటి మీద పచ్చని దుప్పట్లు ఉంటాయి”. (ముస్లిం)
ఎన్ని రోజులుాండు?
”నా సముదాయం (యూదుల)లో నుంచి దజ్జాల్ వస్తాడు.అతను నలభై రోజలో లేక నలభై నెలలో లేదా నలభై సంవత్సరాలో ఉంటాడు”. (ముస్లిం) ఇతర ఉల్లెఖనాల్లో 40 రోజులు అన్న నిర్ధారణ ఉంది”. (ముస్లిం) ”అతను భూమిలో నలభై రోజులుంటాడు. ఒక్క రోజు ఒక సంవత్సరమంత, ఒక రోజు ఒక మాసమంత, ఒక రోజుకు ఒక వార మంత సుదీర్ఘమయి ఉంటుంది. మిగతా దినాలు సాధారణంగా మీ రోజులు మాదిరిగానే ఉంటాయి” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
ఏం చేస్తాడు?
”అతను వచ్చి రాగానే ముందు తన్ను తాను దైవప్రవక్తగా ప్రకటించుచుకుంటాడు. తర్వాత తానే దైవమని ప్రకటిస్తాడు”. (ముస్నద్ అహ్మద్)
దజ్జాల్ ఉపద్రవాల్లో ఒకటేమిటంటే – అతను (అంతంత మాత్రమే ధర్మ జ్ఞానంగల) ఒక పల్లెటూరి ముస్లిం వ్యక్తినుద్దేశించి ఇలా అంటాడు: ”నీ కోసం నీ తండ్రిని, నీ తల్లిని నేను బతికిస్తే నేను నీ ప్రభువుని అని నమ్ముతావా?” అని అడుగతాడు. దానికతను – ‘తప్పకుండా’ అని సమాధానమిస్తాడు. అప్పుడు ఇద్దరు షైతానులు అతని తండ్రి మరియు తల్లి రూపంలో ప్రత్యక్షమయి ఇలా అంారు: ”ఓ మా ప్రియ కుమారా! అతన్ని అనుసరించు, అతనే నీ ప్రభువు” అని. (ముస్నద్ అహ్మద్)
ఎక్కడెక్కడికి వెళతాడు?
”దజ్జాల్ మక్కా మదీనాలు మినహా ఇతర నగరాలన్నింటినీ త్రొక్కుతాడు. మక్కా మదీనాలకు వెళ్ళే కొండ దారులన్నింటి మీద అలాహ్ తన దూతల్ని నియమిస్తాడు. వారు ఒకరి రెక్క మరొకరు పట్టుకొని వాటికి రక్షణ కల్పిస్తూ ఉంటారు. దజ్జాల్ (మదీనాకు దగ్గల్లో ఉన్న) ఉప్పు నేల మీద దిగగానే మదీనా నగరం మూడు సార్లు కంపిస్తుంది. అల్లాహ్ మదీనాలో ఉండే కాఫిర్ – అవిశ్వాసులు, మునాఫిఖ్ – కపటులందరినీ బయికి తీస్తాడు”. (ముస్లిం)
దజ్జాల్ లక్షణాలు
”దజ్జాల్ ఆజాను బాహుడయి ఉంటాడు. రంగు ఎరుపు, ముంగరులు తిరిగిన శిరులు, ఒంటి కన్ను గలవాడయి ఉంటాడు. అతను కన్ను బయికొచ్చిన ద్రాక్షలా ఉంటుంది. ప్రజల్లో అతన్ని పోలిన వారంటే, ఖుజాఆ తెగకు చెందిన ఇబ్బు ఖుత్న్ అని చెప్పొచ్చు” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)
దజ్జాల్ అనబడేవారు ఎంత మంది?
ప్రవక్త (స) ఇలా ప్రవిచించారు: ”దాదాపు ముప్ఫయి మంది దజ్జాల్ (మహా మోసకారులు) రానంత వరకూ ప్రళయం సంభవించదు. వారిలో ప్రతి ఒక్కడు – ‘తాను దైవ ప్రవక్త’ అని భావిస్తాడు”. (బుఖారీ, ముస్లిం)
దజ్జాల్ ఎప్పుడు వస్తాడు?
”ప్రజలు దజ్జాల్‌ను గురించిన ప్రస్తానను మరచి పోనంత వరకూ, ఇమాములు వేదికల మీద సయితం అతని పేరుని ప్రస్తావించడం వదలి వేయనంత వరకూ దజ్జాల్ రావడం జరుగదు” అన్నారు ప్రవక్త (స). (మజ్‌మఅవుజ్జవాయిద్)
యూదులకు ఆశ్రయం ఇచ్చే నాధుడే ఉండడు:
హజ్రత్ అబూ హురైరా (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”యూదులతో ముస్లింల యుద్ధం జరగనంత వరకూ ప్రళయం సంభవించదు. (ఆ యుద్ధంలో) యూదులు రాళ్ళు లేక చెట్ల వెనుక దాక్కుంటాడు. అప్పుడు ఆ రాళ్ళు మరియు చెట్లు – ‘ఓ ముస్లిం! ఇదిగో నా వెనకాల యూదుడు దాక్కున్నాడు. రా.. వచ్చి ఇతన్ని సంహరించు” అని చెబుతాయి. కాని గర్‌ఖద్ చెట్టు మాత్రం చెప్పదు. ఎందుకంటే అది యూదుల చెట్టు”. (బుఖారీ, ముస్లిం)
ఏం చెయ్యాలి?
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”దజ్జాల్ గురించి విన్న వ్యక్తి అతనికి ఎడంగానే ఉండాలి. అల్లాహ్ సాక్షి! ఒక వ్యక్తికి తన మనసులో తాను విశ్వాసినే అని ఉంటుంది. కానీ అతను చేసే కనికట్టుకి ముగ్దుడయి అతన్ని అనుసరించడం ప్రారంభించేస్తాడు”. (అబూ దావూద్)
మదీనా విశ్వాసి చేతుల మీద దజ్జాల్ పరాభవం:
”దజ్జాల్ వెడలినప్పుడు విశ్వాసుల్లో ఒకతను అతని వద్దకు బయలు దేరతాడు. అక్కడ అతనికి ఆయుధాలు ధరించి ఉన్న దజ్జాల్ భటులు తారస పడతారు. ‘ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు?’ అని ప్రశ్నిస్తారు. ‘ఈ మధ్య (గొప్పలు చెప్పుకుంటూ, మాయ మాటలు చెబుతూ) బయలుదేరాడే వాడి వద్దకు’ అని బదులిస్తాడు. దానికి వారు-‘ఏమి, నువ్వు మా ప్రభువును నమ్మవా?’ అని ఆరా తీస్తారు. ”మాకు మా ప్రభువు గురించి తెలియంది ఏమి లేదు” అని సమాధానమిస్తాడు. అది విని అగ్రహోదగ్రులయిన భటులు – ”అతన్ని తెగ నరకండి!” అని చెబుతారు. తర్వాత తమలో తాము మాట్లాడుకుంటూ, ‘నేను తప్ప ఎవరూ ఎవర్ని చంపకూడదు’ అని మన ప్రభువు మనతో చెప్ప లేదా? అనుకొని అతన్ని దజ్జాల్ దగ్గరికి తీసుకు వెళతారు. విశ్వాసి దజ్జాల్‌ను చూడగానే (ప్రవక్త (స) తెలిజేసిన లక్షణాల్ని గమనించి) ఇలా అంటాడు: ”ప్రజలారా! దైవ ప్రవక్త (స) చెప్పింది ఈ దజ్జాల్ గురించే” అని.
దజ్జాల్ అతన్ని బోర్లా పడేయమని ఆదేశిస్తాడు. తర్వాత అతన్ని పట్టుకొని తలను మొహాన్ని బాదమని చెబుతాడు. అతని సైగ మేరకు ఆ విశ్వాసిని పొట్ట, వీపు సాగిపోయేలా చితక బాదడం జరుగుతుంది. తర్వాత దజ్జాల్ ‘నువ్వు నన్ను (నీ దైవంగా) విశ్వసిస్తున్నావా?’ అని అడుగుతాడు. అందుకతను (నిరాకరిస్తూ), ‘నువ్వు అసత్య మసీహ్‌వి’ అని అంటాడు. ఆ తర్వాత అతని తలను రంపంతో కోసి రెండు కాళ్ళూ వేరయ్యేలా రెండు ముక్కలుగా చీల్చేయమాండు. దజ్జాల్ ఆ రెండు ముక్కల మధ్య తిరుగుతాడు. తర్వాత వాటినుద్దేశించి – ‘లే’ అని ఆదే శించగా, అతను లేచి నిరుగా నిలబడతాడు. దజ్జాల్ మళ్ళీ అతన్ని ‘నువ్వు నన్ను (నీ దైవంగా) నమ్ముతున్నావా?’ అని అంటాడు. అందు కతను (నిరాకరిస్తూ) ‘నీ గురించి నా నమ్మకం ఇప్పుడు మరింత బల పడింది. ప్రజలారా! వీడు నా తర్వాత ఎవరి పట్లనూ ఈ విధంగా ప్రవర్తించ లేడు’ అని అంటాడు. అప్పుడు దజ్జాల్ అతన్ని పట్టుకొని కోసేయాలనుకుాండు. కాని అల్లాహ్ అతని మెడ – రక్తనాళం మధ్య భాగాన్ని ఇత్తడిగా మారుస్తాడు.తర్వాత దజ్జాల్ అతన్ని చంపానికి మార్గమేదీ కనిపించదు. దాంతో దజ్జాల్ అతని కాళ్ళూ చేతులు పట్టుకొని విసిరేస్తాడు. చూసిన జనం అతన్ని అగ్నిలో విసిరేశాడని అనుకుంటారు. కాని వస్తవానికి (పరిణామ పరంగా) అతన్ని స్వర్గంలో పడేయడం జరిగి ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్త (స) ఇలా అన్నరు: ”ఆ వ్యక్తి అల్లాహ్ దృష్టిలో అందరి కంటే గొప్ప వీరమరణం పొందిన వాడుగా పరిగణించ బడతాడు”. (బుఖారీ, ముస్లిం) \
ప్రవక్త ఈసా (అ) వారి పునరాగమనం:
దజ్జాల్ మదీనా నుండి బయలుదేరి డమాస్కస్ చేరుకోక ముందే ఇమామ్ మహ్దీ సైన్యంతో బయలు దేరి ఉంటారు. ఫజ్ర్ నమాజు వేళ దమాడ్కస్ జామె మస్జిద్‌లో ప్రవక్త ఈసా (అ) ఇద్దరు దైవ దూతల సహాయంతో దిగి రావడం జరుగుతుంది. ఆయన్ను నమాజు సారథ్యం వహించాల్సిందిగా కోరడం జరుగుతుంది. నిరాకరించి మహ్దీ (అ) గారిని నమాజుకు సారథ్యం వహించాల్సిందిగా కోరుతారు”. (ముస్లిం)
దజ్జాల్ సంహరణ:
ఇమామ్ మహ్దీ మరియు దజ్జాల్ సైన్యాల మధ్య భీకర పోరు జరుగు తుంది. చివరికి ప్రవక్త ఈసా (అ), దజ్జాల్‌ను తరుముకుంటూ వెళ్ళి ‘లుద్ ముఖ ద్వారం’ (బైతుల్ మఖ్దిస్ సమీపంలోని ఓ పల్లెటూరు) వద్ద ఈటె విసిరి చంపడం జరుగుతుంది”. (తిర్మిజీ)
”ఒక వేళ ప్రవక్త ఈసా (అ) అతన్ని చంపడంలో తొందర పడక పోతే, అతను ఆయన శ్వాస తాకిడికే – ఉప్పు నీటిలో కరిగి పోయినట్లే కరిగి పోయేవాడు” అన్నారు ప్రవక్త (స).
దజ్జాల్ ఉపద్రవం నుండి శరణు పొందే విధానం:
ప్రవక్త (స) స్వతహాగా నమాజు తషహ్హుద్‌లో దజ్జాల్ ఉపద్రవం నుండి అల్లాహ్ శరణు వేడుకునే వారు. అలాగే ఆ మహా ఉపద్రవం నుండి శరణు వేడుకోవాల్సిందిగా తన అనుచర సమాజాన్ని ఆదేశించారు కూడా. ”మీలో ఎవరయినా చివరి తషహ్హుద్ పూర్తి చేసుకున్న తర్వాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ శరణు వేడుకోండి. నరకాగ్ని బారి నుండి, సమాధి యాతన నుండి, జీవర్మరణాల పరీక్ష నుండి మరియు దజ్జాల్ ఉపద్రవం నుండి”. (ముస్లిం)
ప్రవక్త (స) తన సహాబాకు ఖుర్‌ఆన్ ఆయతులు నేర్పించినట్టు ఈ దుఆను నేర్పించేవారు. ”అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్ అజాబిల్ ఖబ్రీ, వ అవూజు బిక మిన్ ఫిత్‌నతిల్ మసీహిద్ దజ్జాల్…” (బుఖారీ)
రక్షణ ఎలా?
”ఎవరయితే సూరతుల్ కహఫ్‌లోని ప్రారంభ లేదా చివరి పది ఆయ తులు కంఠస్ఠం చేసుకుాంరో వారు దజ్జాల్ ఉపద్రవం నుండి కాపాడ బడతారు”. (ముస్లిం)
”మీలో దజ్జాల్‌ను చూసిన వారు అతని మీద కహఫ్‌లోని ప్రారంభ ఆయతులు చదవండి. అవి మీ పాలిట రక్షగా ఉంాయి” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)