విధివ్రాత నియమాలు – 3

విధివ్రాత నియమాలు - 3

 

3) సృష్టి నిర్మాణం అల్లాహ్  యుక్తికి లోబడి జరిగింది

ప్రపంచం కేవలం ఒక క్రీడారంగం, వడ్డించిన విస్తరి, విలాస స్థలం ఎంతమాత్రం కాదు. సృష్టిశ్రేష్ఠుని సృజన సయితం ఏదో అల్లాటప్ప గా, అర్థరహితంగా జరుగలేదు. అవిశ్వాసులు దైవ తిరస్కారులు భావించినట్లు అల్లాహ్  ఈ సృష్టిని లక్ష్యరహితంగా చేయలేదు. ఇదే విష యాన్ని ఆయన ఇలా తెలియజేస్తున్నాడు: ”మేము ఈ గగన భవనాలను వీటిలో ఉన్న సమస్తాన్నీ ఏదో ఆటగా సృజించలేదు.” (అన్బియా:16)

మరో చోట ఇలా సెలవియ్యబడింది: ”మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలి రావటం అనేది జరగని పని అని అనుకు న్నారా?”. (మోమినూన్‌:115))

”మేము ఆకాశాలనూ భూమినీ, వాటి మధ్య నున్న సమస్త వస్తువులనూ సత్యబద్ధంగానే సృష్టించాము”. (హిజ్ర్‌:85))

”భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ అల్లాహ్  దే – ఆయన దుర్జనులకు వారి దుష్కర్మలకు దుష్ఫలం, సజ్జనులకు వారి సత్కర్మలకు సత్ఫ లితం ఇచ్చేటందుకు ఈ వ్యవస్థ ఏర్పరచ బడినది.” (నజ్మ్‌:31))

నిజం ఏమిటంటే, మనం మన కోసం బాధా కరం, నష్టదాయకం అనుకున్నదే మన పాలిట శుభకరం కావచ్చు. ”దేన్ని మీరు ఇష్ట పడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీ కోసం ఎంతగానో ఇష్టపడి కోరుకునే విషయాలే మీ పాలిట కీడు గా రూపొందవచ్చు. నిజ జ్ఞానం అల్లాహ్‌ాకు మాత్రమే ఉంది. ఆ విషయం మీకు తెలి యదు.” (బఖర:216)

అల్లాహ్‌ా మనల్ని ఏదో ఒక విధంగా పరీక్షిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో భయంతోనూ, మరికొన్ని సందర్భాల్లో ఆకలిదప్పులతోనూ, ఇంకొన్ని సందర్భాల్లో ధనప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతోనూ, కరువుకాటకాలతోనూ పరీక్షిస్తాడు. దైవం పట్ల, ఆయన విధిరాత పట్ల విశ్వాసం సన్నగిల్లినవారు, లేదా బొత్తిగా నమ్మకం లేనివారు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతారు. వాటినే అసలు అసాఫల్యానికి ఆనవాలుగా తలపోస్తారు. దీనికి భిన్నంగా విశ్వాసులు ఇటువంటి దుస్థితి ఎదురైనప్పుడు వారి విశ్వాసం మరింత వికసిస్తుంది. ద్విగుణీ కృతమైన విశ్వాసంతో వారు అల్లాహ్‌ాను ఇలా వేడుకుంటారు: ”మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నర కాగ్ని నుండి కాపాడు.” (ఆలి ఇమ్రాన్‌ :191)

ఇంకా ఇలా వేడుకుంటారు: ”ఓ మా పోష కుడా! నువ్వెరినైతే నరకాగ్నిలో పడవేస్తావో, వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. మా ప్రభూ! పిలిచేవాడొకడుఈమాన్‌ (విశ్వాసం) వైపునకు-ప్రజలారా! మీ ప్రభువు ను విశ్వసించండి’ అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే! మేము విశ్వసిం చాము. కనుక ఓ ఫ్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు.” (ఆలి ఇమ్రాన్‌: 192-193)

ప్రతిగా అల్లాహ్‌ా ఏమని సమాధానిస్తున్నాడో కూడా కాస్త గమనించండి: ”వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు. మీలో పని చేసేవారి పనిని వారు పురుషులైనా స్త్రీలైనా సరే నేను వృధా చేయను.” (అని వాగ్దానం చేశాడు)  (ఆలి ఇమ్రాన్‌:195))

కాబట్టి ”నగరాలలో దైవ తిరస్కారుల సేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు. ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే”  (ఆలి ఇమ్రాన్‌ : 196,197)

4) మేలు లేని కీడును అల్లాహ్  సృష్టించ లేదు.

మంచీచెడులు సృష్టించిన వాడు అల్లాహ్ యే. ఇందులో ఏ విధమైనటువంటి సందేహంలేదు. సులువుగా మనం అర్థం చేసుకోవాలంటే, కార్బన్‌ ఆక్సిడ్‌ మన పాలిట కీడుగా పరిణ మించినా, మనం ఆక్సిజన్‌ని ఎలా పీల్చి బ్రతు కుతున్నామో మనకు ఆ ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న వృక్షాలు కార్బన్‌ ఆక్సిడ్‌ శ్వాసించి జీవిస్తున్నాయి.

కనుక అల్లాహ్‌ా ఏది చేసినా మానవ శ్రేయం, మేలు కోసమే. ఇక కీడును మనం దైవానికి ఆపాదించకూడదు. ఎందుకంటే, మేలు అన్నది కేవలం దైవకృప మాత్రమే. ఇక కీడు అంటారా! అది మనిషి చేసిన దుష్కర్మలకు గాను లభించే ప్రతిఫలం. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, మావునికి కలిగే కీడు కూడా విధివ్రాతలో రాయబడి ఉన్నదే! అయితే అంతిమంగా విధివ్రాత మొత్తం మేలు తో కూడుకున్నదిగానే భావించాలి. ఈ విధం గా అల్లాహ్‌ా కార్యాలన్నీ కూడా మేళ్ళే అవు తాయి. ఈ కారణంగా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు ‘వష్షర్రు లైస ఇలైక’ కీడు అన్నది నీ తరపున కాదు. అన్నారు.నిజం ఏమిటంటే, మనకు ప్రాప్తమయి ఉన్న జ్ఞానం అర్థం చేసు కునే శక్తి బహు స్వల్పం. ఎలా అంటారా?

హజ్రత్‌ మూసా (అ) స్వయంగా దైవ ప్రవక్త అయినప్పటికీ హజ్రత్‌ ఖిజర్‌ (అ) వారి సహ చర్యంలో ఉన్నప్పుడు జరిగిన మూడు సంఘ టనల వెనుక ఉన్న యుక్తి ఆయనకు బోధ పడలేదు. మూడింటిని ఆయన కీడుగానే భావి ంచారు. అయితే నిజం తెలిశాక ఆయన విశ్వాసం ద్విగుణీకృతం అయ్యింది. ఎందులో ఏముందో మనకు తెలియదు గనక ప్రవక్త (స) తరచూ ఈ దుఆ చదువుతూ ఉండమ న్నారు. ”అవూజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్‌ షర్రి మా ఖలఖ్‌ – నేను సృష్టిరాసుల కీడు నుండి అల్లాహ్‌ా యొక్క సంపూర్ణ వచ నాల రక్షణలోకి వస్తున్నాను.” (ముస్లిం)

Related Post