అజాన్‌

 

అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అష్‌హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ా, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌.

అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అష్‌హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ా, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌.

ఐ పి సి తెలుగు విభాగం

అజాన్‌
అజాన్‌: ఫర్జ్‌ నమాజు సమయం అయిందని తెలియజేయటానికి మరియు ముస్లింలు నమాజ్‌ చేయటానికి ప్రోగు కావాలని తెలుపుటకు ఇస్లాం ధర్మం ప్రవేశపెట్టిన ఒక ఆరాధన (ప్రకటన)
నిర్ణీత సమయంలో చేయు ఫర్జ్‌ నమాజు కొరకు మరియు చేజారిపోయిన ఫర్జ్‌ నమాజుల కొరకు అజాన్‌ పలకడం సున్నత్‌. సామూహికంగా నమాజ్‌ చేసేవారి కొరకు అజాన్‌ పలకడం సున్నత్‌ ముఅక్కదహ్‌, కాకపోతే జన సమూహంలో ఏ ఒక్కరూ అజాన్‌ పలికినా అందరి తరపునా అదే సరిపోతుంది. ఒంటరిగా నమాజ్‌ చేసేవారి కొరకు అజాన్‌ పలకటం సున్నతె ఐనియ్యహ్‌. ఇస్లాం చిహ్నాలలో అజాన్‌ పలకడంలో చాలా గొప్ప విశిష్ఠత ఉంది.
అజాన్‌ ప్రారంభం: హిజ్రీ శకం మొదటి సంవత్సరంలో అజాన్‌ పలకడం ప్రారంభమైనది.
ఆధారం: అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ” ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్‌(పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్‌ ధ్యానం వైపు పరుగెత్తండి, క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. ” ( సూరా జుముఅహ్‌: 9)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ” నమాజు చదివే సమయం ఆసన్నమైనప్పుడు మీలో ఒకరు అజాన్‌ పలకాలి మరియు మీలో పెద్దవారు ఇమామత్‌ చేయాలి.(బుఖారి:602, ముస్లిం:674)

అజాన్‌ పలుకులు:
అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అష్‌హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ా, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌.
ఫజర్‌ నమాజులో అజాన్‌ పలికేటప్పుడు ”హయ్య అలల్‌ఫలాహ్‌” తర్వాత ”అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌, అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌” అని పలకాలి. ఈ విషయం ‘బుఖారి,ముస్లిం మొదలగు గ్రంథాలలో ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢీ అయినది.
అర్థం: అల్లాహ్‌ గొప్పవాడు అల్లాహ్‌ా గొప్పవాడు,అల్లాహ్‌ా గొప్పవాడు అల్లాహ్‌ా గొప్పవాడు, అల్లాహ్‌ా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లాహ్‌ా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ముహమ్మద్‌(స) అల్లాహ్‌ా ప్రవక్త అని నేను సాక్య్షమిస్తున్నాను, ముహమ్మద్‌(స) అల్లాహ్‌ా ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను, రండి నమాజ్‌ వైపునకు, రండి నమాజ్‌ వైపునకు, రండి సాఫల్యం వైపునకు, రండి సాఫల్యం వైపునకు, అల్లాహ్‌ా గొప్పవాడు, అల్లాహ్‌ా గొప్పవాడు, అల్లాహ్‌ా తప్ప వేరే ఆరాధ్య దైవం ఎవరూ లేరు.
”అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌” అంటే నమాజు నిద్రకంటే మేలైనది.

అజాన్‌ ఇవ్వుటకు షరతులు:
1. ముఅజ్జిన్‌ (అజాన్‌ పలికే వ్యక్తి) ముస్లిం, పరుషుడు, తెలివి, మరియు బాలిగ్‌ (యుక్త వయస్కుడు) అయి ఉండాలి.(మంచి, చెడులో తేడా గ్రహించ గల పిల్లవాడు కూడా పెద్దవారి ఆధర్యంలో అజాన్‌ పలికినా సమ్మతమే.)
2.అజాన్‌ పలుకులు క్రమంగా పలకాలి.
3. అజాన్‌ పలుకుల మధ్య పెద్ద విరామం ఉండకూడదు.
4. సామూహికంగా చేసే నమాజు కోసం అజాన్‌ పలుకుతున్నప్పుడు బిగ్గరగా శబ్దాన్ని పెంచి పలకాలి. సామూహికంగా నమాజు చేయబడిన మస్జిద్‌లో కాక ఇతర ప్రదేశంలో ఒంటరిగా నమాజ్‌ చేయుటకు కూడా బిగ్గరగా అజాన్‌ పలకడం సున్నత్‌ విధానం. అయితే సామూహికంగా నమాజు చేయబడే మస్జిద్‌లో ఒంటరిగా నమాజ్‌ చేయదలచిన వ్యక్తి నెమ్మదిగా అజాన్‌ పలుకులు పలకాలి, ఎందుకంటే బిగ్గరగా అజాన్‌ పలికితే ప్రజలు తరువాతి నమాజ్‌కు సమయం అసన్నమయిందని అపార్థం చేసుకునే ప్రమాదముంటుంది.
అబూసయీద్‌ అల్‌ ఖుద్రీ (ర)తో దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: ” నీవు గొర్రెలను, పల్లెలను ఇష్టపడుతున్నావనే విషయం నేను గమనిస్తున్నాను, నీవు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు లేదా పల్లెలో ఉన్నప్పుడు నమాజ్‌ చేయుటకు అజాన్‌ పలికితే బిగ్గరగా శబ్దాన్ని పెంచి అజాన్‌ పలుకు. ఎందుకనగా అజాన్‌ పలికే వ్యక్తి శబ్దం ఎంత దూరం పోతుందో ఆలోపు ఉన్న మానవులు, జిన్నాతులు, మరియు ప్రతి ఒక్కటీ అతని గురించి పరలోకంలో సాక్ష్యం పలుకుతాయి. (బుఖారి-584)
5.నమాజు వేళలోనే అజాన్‌ చెప్పాలి. ఎందుకనగా నమాజు సమయానికి ముందు చేయబడదు, నమాజు సమయం అయిందని తెలిపే ఈ అజాన్‌ పలుకులు సమయానికి ముందే పలకడం ధర్మసమ్మతం కాదని ధార్మిక పండితులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. కాకపోతే ఫజర్‌ నమాజుకై అర్థరాత్రి నుంచే అజాన్‌ పలకవచ్చు,దీని గురించి మరిన్ని వివరాలు అజాన్‌లోని సున్నతులు అనే అధ్యాయంలో వస్తాయి.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”నమాజు సమయం అసన్నమయినప్పుడు మీలోని ఒకరు అజాన్‌ పలకాలి.” (బుఖారి 603, ముస్లిం 674)
గమనిక: స్త్రీలు సామూహికంగా నమాజు చేయుటకు అజాన్‌ పలకడం సరికాదు. ఎందుకంటే వారు తమ గొంతు బహిర్గతం చేసినచో ఫిత్‌నా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే వారు ఇఖామత్‌ పలకటం శ్రేయస్కరం. ఇఖామత్‌ పలుకులు అక్కడే ఉన్నవారు నమాజ్‌ చేయుటకు సన్నద్ధం కావాలని నెమ్మదిగా పలుకుతారు, అజాన్‌ మాదిరిగా బిగ్గరగా పలకరు కావున స్త్రీలు ఇఖామత్‌ పలుకవచ్చు.

అజాన్‌లోని సున్నతులు

1. ముఅజ్జిన్‌ (అజాన్‌ పలికే వ్యక్తి) ఖిబ్లా వైపు ముఖం చేసి నిలబడాలి.
2. ముఅజ్జిన్‌ చిన్న అశుద్ధత మరియు పెద్ద అశుద్ధత రెండింటి నుండి శుభ్రత పొంది ఉండాలి.వుజూ లేకుండా అజాన్‌ పలకడం అయిష్టకరమైన విషయం. మరియు జునుబీ (గుసుల్‌ తప్పనిసరి అయిన వ్యక్తి) అజాన్‌ పలకడంర మరీ హేయమైనది.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”పరిశుభ్రత లేకుండా అల్లాహ్‌ నామ స్మరణ చేయటానికి నేను ఇష్టపడను”.
(అబూదావూద్‌: 17)
3.”హయ్య అలస్సలాహ్‌” అన్నప్పుడు మెడను కుడివైపు తిప్పి పలకాలి. మరియు ”హయ్య అలల్‌ ఫలాహ్‌” అన్నప్పుడు మెడను ఎడమ వైపు తిప్పి పలకాలి. మెడను మాత్రమే తిప్పాలి శరీరాన్ని కాదు.
4.అజాన్‌ పలుకుల్ని మంచి కంఠంతో మంచి స్వరంతో పలకాలి, అజాన్‌ పలుకులు, హాజరు కానివారికి (నమాజ్‌ సమయం అసన్నమయిందని) తెలుపుటకు పలుకుతారు. కాబట్టి (తర్‌తీల్‌తో) అంటే పెద్ద కంఠంతో మంచి స్వరంతో అజాన్‌ పలికితేనే సందేశం వారి వద్దకు చేరుతుంది.
5.”తర్జీ” అజాన్‌ పలకడం. ”తర్జీ” అంటే షహాదతైన్‌ పలుకులను ముందు నెమ్మదిగా పలికి తరువాత బిగ్గరగా పలకడం.
6.ఫజర్‌ అజాన్‌ లో తస్వీబ్‌. ”తస్వీబ్‌” అంటే ఫజర్‌ అజాన్‌లో ‘హయ్య అలల్‌ ఫలాహ్‌’ తరువాత ”అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌” అని రెండుసార్లు పలకడం.
7.అజాన్‌ పలికే వ్యక్తి మంచి కంఠం, మంచి స్వరం గలవాడై ఉండాలి. అతని కంఠాన్ని విన్నవారి హృదయం మెత్తబడాలి, వారు నమాజు చదవటానికి సిద్ధపడాలి.
8. అసహ్యకరమైన రాగాలతో పాటల లాగా అజాన్‌ పలకరాదు.
9. అజాన్‌ పలికే వ్యక్తి మంచి నడవడిక మరియు న్యాయనిర్ణేతగా ప్రజలలో పేరుగాంచిన వాడై ఉండాలి.
10. ఫజర్‌ నమాజులో ఇద్దరు ముఅజ్జిన్లు ఉండటం సున్నత్‌ విధానం. ఒకరు ఫజర్‌కి ముందు మరొకరు ఫజర్‌ తరువాత అజాన్‌ పలుకుతారు.

దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”బిలాల్‌(ర) రాత్రి ఉండగానే అజాన్‌ పిలుపు ఇస్తారు. మీరు ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌(ర) అజాన్‌ ఇచ్చే వరకూ తినవచ్చు త్రాగవచ్చు”. (బుఖారి 592, ముస్లిం 1092)
11. అజాన్‌ వినేవారు నిశ్శబ్దతను పాటించాలి, మరియు అజాన్‌ పలికేవానిలాగే అజాన్‌ వినేవారు సమాధానంగా పలకాలి.
ముఅజ్జిన్‌ ఇలా పలికితే సమాధానంగా ఇలా పలకాలి
అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌
హయ్య అలస్సలాహ్‌ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌
హయ్య అలల్‌ ఫలాహ్‌ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌
అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌
లా ఇలాహ ఇల్లల్లాహ్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌
12. అజాన్‌ తరువాత దుఆ మరియు దైవప్రవక్త(స)పై దరూద్‌ పఠించాలి.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు:” ఎవరయితే అజాన్‌ పిలుపు విని ఈ దుఆ ” అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్దవతిత్తామ్మతి, వస్సలాతిల్‌ ఖాయిమతి, ఆతి ముహమ్మదనిల్‌ వసీలత వల్‌ ఫజీలత, వబ్‌అస్‌హు మఖామన్‌ మహ్‌మూద నిల్లజీ వఅత్తహ్‌” చేస్తాడో అతని కోసం ప్రళయదినాన నేను సిఫారసు చేయటం సమ్మతమై పోతుంది.(బుఖారి 579)
అర్థం: ఓ అల్లాహ్‌! ఈ సంపూర్ణ పిలుపుకు, స్థాపించబడే నమాజ్‌కు అధిపతి అయినవాడా! ముహమ్మద్‌ (స )కు ప్రతిష్ఠాత్మక మయిన స్థానాన్ని(మఖామె మహ్మూద్‌) ఆధిక్యతను ప్రసాదించు. ఏ ప్రశంసాత్మకమయిన(ఉన్నత) స్థానం (స్వర్గంలో) ప్రసాదిస్తానని నీవు వాగ్దానం చేశావో ఆ స్థానంలో (ఆయన్ని) ప్రతిష్టంపజెయ్యి).అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు: ”…త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహ్‌ామూద్‌కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు.” ( అల్‌ ఇస్రా-79)
ముఅజ్జిన్‌ అజాన్‌ తరువాత దుఆ మరియు దైవప్రవక్త(స)పై దరూద్‌ నెమ్మదిగా చదవాలి. ఎందుకనగా వినేవారు ఇవి కూడా అజాన్‌ పలుకులేనేమో అని అపార్థం చేసుకునే ప్రమాదముంది.

ఇఖామత్‌:
ఇఖామత్‌ అజాన్‌ లాగే ఉంటుంది, కాకపోతే క్రింద ఇవ్వబడిన కొన్ని తేడాలు అందులో ఉంటాయి.
1.అజాన్‌ పలుకులు రెండేసి సార్లు పలుకబడతాయి. ఇఖామత్‌ పలుకులు ఒక్కొక్కసారి మాత్రమే పలుకబడతాయి.
ఇఖామత్‌ పలుకులు: అల్లాహ్‌ అక్బర్‌ అల్లాహు అక్బర్‌, అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, అష్‌హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌, హయ్య అలస్సలాహ్‌, హయ్య అలల్‌ఫలాహ్‌, ఖద్‌ ఖామతిస్సలాహ్‌, ఖద్‌ఖామతిస్సలాహ్‌, అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌.
2. అజాన్‌ పలుకులు నిధానంగా ప్రశాంతంగా పలుకబడతాయి, ఇఖామత్‌ పలుకులు తొందరగా పలుకబడతాయి.

ఖిబ్లా వైపు ముఖం చేయు విధానం:
నమాజు చదివే వ్యక్తి కాబతుల్లాహ్‌ను దగ్గర నుండి చూస్తున్నాడంటే అతను తప్పనిసరిగా కాబా వైపు పూర్తి నమ్మకంతో ముఖం చేసి నిలబడాలి. ఒకవేళ నమాజు చేసే వ్యక్తి దూర ప్రదేశంలో ఉన్నాడంటే స్పష్టమైన ఆధారాల ప్రకారం ముఖం ఖిబ్లా వైపు చేసి నిలబడాలి. ఆధారాలు దొరకనప్పుడు అంచనావేసి దాని ఆధారంగానే నిలబడి నమాజు చదివినా సరిపోతుంది.

నమాజు విధానము:
అల్లాహ్‌ ముస్లిములపై ఫర్జ్‌ నమాజులు విధిగా చేయాలని ఆదేశించినపుడు దైవదూత జిబ్రయీల్‌(అ) దైవప్రవక్త ముహమ్మద్‌(స) వద్దకు వచ్చి నమాజుల వేళలు, నమాజుల రకాతుల గురించి వివరించారు. ఆ వివరాలు ఇక్కడ తెలుపుతున్నాము:
1. ఫజ్ర్‌ నమాజు: ఇందులో రెండు రకాతులు, రెండు ఖియామ్‌లు మరియు ఒక తషహ్హుద్‌ ఉంటుంది.
2. దొహర్‌ నమాజు: ఇందులో నాలుగు రకాతులు, రెండు తషహ్హుద్‌లు ఉంటాయి. మొదటి తషహ్హుద్‌ రెండు రకాతుల
తర్వాత రెండో తషహ్హుద్‌ చివర్లో ఉంటుంది.
3.అస్ర్‌ నమాజు: ఇందులో నాలుగు రకాతులు. దొహర్‌ నమాజు లాగే ఉంటుంది.
4. మగ్రిబ్‌ నమాజు: ఇందులో మూడు రకాతులు,రెండు తషహ్హుద్‌లు ఉంటాయి. మొదటి తషహ్హుద్‌ రెండు రకాతుల
తర్వాత రెండో తషహ్హుద్‌ చివర్లో ఉంటుంది.
5. ఇషా నమాజు: దొహర్‌ మరియు అస్ర్‌ నమాజుల లాగే ఈ నమాజు ఉంటుంది.
3.ఒక వ్యక్తి తప్పిపోయిన నమాజులను ఖజా చేయదలచినప్పుడు ఒక్క సారి అజాన్‌ పలికితే సరిపోతుంది కాని ప్రతి నమాజు కొరకు ఇఖామత్‌ ఇవ్వవలెను.

దైవప్రవక్త(స) ఒక సారి ముజ్‌దలిఫహ్‌ ప్రాంతంలో మగ్‌రిబ్‌ మరియు ఇషా నమాజును కలిపి ఒకేసారి ఒక అజాన్‌ మరియు రెండు ఇఖామత్‌ (ఒక ఇఖామత్‌ మగ్రిబ్‌ కోసం మరో ఇఖామత్‌ ఇషా కోసం) పలికి చదివారు.(ముస్లిం1218)

ఇఖామత్‌ కోసం షరతులు:
అజాన్‌ పలుకుటకు ఉన్న షరతులే ఇఖామత్‌ పలుకుటకు వర్తిస్తాయి.

ఇఖామత్‌ లోని సున్నతులు:
అజాన్‌లో ఉన్న సున్నతులు ఇఖామత్‌లోనూ ఉన్నాయి. అజాన్‌ పలికిన వ్యక్తే ఇఖామత్‌ పలకటం ముస్తహబ్‌. ఇఖామత్‌ వినే వ్యక్తి ”అఖామహల్లాహు వ అదామహా” అనటం సున్నత్‌ .

ఫరజ్‌ కాని నమాజుల కొరకు పిలుపు:
ఫర్జ్‌ నమాజుల కొరకు అజాన్‌ మరియ ఇఖామత్‌ సున్నతె ముఅక్కదహ్‌. మరి సామూహికంగా చేయబడే ఫర్జ్‌ కాని నమాజులు ఉదాహరణకు పండగల నమాజు,సూర్యచంద్ర గ్రహణాల నమాజులు, జనాజా నమాజు వగైరాలో అజాన్‌ మరియు ఇఖామత్‌ పలకటం సున్నత్‌ పద్ధతి కాదు, ఇలాంటి నమాజుల కోసం ”అస్సలాతు జామిఅహ్‌” అని పిలుపునివ్వాలి.
అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్‌(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స)వారి కాలంలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ”ఇన్నస్సలాత జామిఅహ్‌” అని పిలవబడింది.” (బుఖారి 1003)

పరీక్ష 11
సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(అ) ఆఖిల్‌ (ఆ) బాలిగ్‌ (ఇ) అజాన్‌ (ఈ) ఇమామ్‌ (ఉ) పరుషుడు (ఊ) ఫజర్‌ (ఎ) ఇషా
1. ……………. అంటే ఫరజ్‌ నమాజు కొరకు సమయమయిందని తెలియజేయటానికి మరియు ముస్లింలు నమాజ్‌ కొరకు హాజరు కావాలని తెలుపుటకు ఇస్లాం ధర్మం ప్రవేశపెట్టిన ఓ ప్రత్యేక ఆరాధన.(ప్రకటన)
2. అజాన్‌ పలికే వ్యక్తి తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలి, మరియు……………….అయి ఉండాలి,మరియు……………… మరియు …………………………..అయి ఉండాలి.
3. అజాన్‌లో ……………….. కొరకు ”అస్సలాతు ఖైరున్‌ మినన్నౌమ్‌” అనే పలుకు అదనంగా పలుకబడుతుంది.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
4. అజాన్‌ పలికిన వాడే ఇఖామత్‌ పలకటం మంచిది కాదు.
(అ) ఒప్పు (ఆ) తప్పు
5.సమయానికి నమాజు చదువుటకు లేక ఖజా నమాజు చదువుటకు అజాన్‌ పలకటం………………….
(అ) వాజిబ్‌ (ఆ) సున్నత్‌

Related Post