అల్లాహ్ క్షమాగుణం ఎంతో విశాలమైనది!

?‍♂మనిషి అడుగుడగున తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. సోదరుల హక్కులను ఇవ్వడం లేదు, సోదరిమణుల హక్కులను కాలరాస్తున్నారు. వ్యాపారం లో మోసం, తూనికల్లో అవకతవకలు, దొంగతనం, దోపడి ,బలహీనుల పై దాడులు, హత్యలు, అత్యాచారాలు, వ్యభిచారం తల్లిదండ్రుల అవిధేయత, తల్లిదండ్రులకు బ్రతికున్నంత కాలం అన్నపు ముద్ద కూడా పెట్టనే లేదు. ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తూవుంటే నన్ను అల్లాహ్ క్షమిస్తాడా? అల్లాహ్ నా పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడా? నా తప్పులకు సరిదిద్దే మార్గం లేదా? అనే ఆలోచనలు మానవునికి రావడం సహజమే.

తాను ఇన్ని పాపాలు చేసినాక అల్లాహ్ తనను ఎలా క్షమిస్తాడు? అని అనుకోరాదు. చిత్తశుద్దితో విశ్వసిస్తే, నిజమైన పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ అతని అల్లాహ్ క్షమాగుణం పాలన్నింటిని ప్రక్షాళనం చేసేస్తాడు.కాని మనందరి ప్రభువు అయిన అల్లాహ్ ఇలా అంటున్నాడు;

 

۞ قُلْ يَٰعِبَادِىَ ٱلَّذِينَ أَسْرَفُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يَغْفِرُ ٱلذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించే వాడు, అపారంగా కరుణించేవాడు. ?(Quran – 39 : 53)?

?ఈ ఆయాతులో అల్లాహ్ క్షమాగుణం ఎంత విశాలమైనదో తెలుబడింది. ఆత్మల పై అన్యాయానికి ఒడిగట్టడం అంటే అత్యధికంగా పాపాలు చేయటం అని అర్ధం. ‘అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి’ అంటే విశ్వసించక మునుపు, పశ్చాత్తాప భావం జనించకముందు ఎన్ని పాపిష్టి పనులు చేసివున్నా సరే దైవ కారుణ్యం పట్ల నిస్పృహకు గురి కారాదని భావం. తాను ఇన్ని పాపాలు చేసినాక అల్లాహ్ తనను ఎలా క్షమిస్తాడు? అని అనుకోరాదు. చిత్తశుద్దితో విశ్వసిస్తే, నిజమైన పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ అతని పాపాలన్నింటిని ప్రక్షాళనం చేసేస్తాడు.

?ఈ ఆయతు అవతరణా నేపధ్యం ద్వారా కూడా ఇదే విషయం తెలుస్తోంది. ఈ ఆయతు అవతరించక ముందు కొంతమంది అవిశ్వాసులు, ముష్రిక్కులకు ఈ సందేహమే కలిగింది. వారు ఎన్నో హత్యలకు పాల్పడ్డారు. వ్యభిచారం కూడా చేశారు. వారు దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చి, “మీరు చెప్పేదంతా బాగానే ఉంది గాని మేము ఇప్పటికే పాపిష్టిపనులు చాలా చేశాం కదా! మరి మేము గనక విశ్వసిస్తే మా పాపాలన్నీ క్షమించబడతాయా?!” అని ప్రశ్నించగా, దాని పై ఈ ఆయతు అవతరించింది. (?సహీహ్ బుఖారీ – అజ్జుమర్ సూరా వ్యాఖ్యానం).

?అంతమాత్రాన అల్లాహ్ క్షమాబిక్ష పట్ల, దయాదాక్షిణ్యాల పట్ల మితిమీరిన ఆశతో విచ్చల విడిగా పాపాలు చేస్తూ ఉండమని, దైవాదేశాలను ఖాతరు చేయనవసరం లేదని, అల్లాహ్ హద్దులను, నియమనిబంధనలను నిర్ధాక్షిణ్యంగా నలిపివేయమని దీని అర్ధం ఎంతమాత్రం కాదు. ఈ విధంగా దైవాగ్రహాన్ని కొనితెచ్చుకుని, ఆయన కారుణ్యం పట్ల ఆశలు పెంచుకోవటం అవివేకం మాత్రమే. చేదు విత్తనం నాటి తీపి ఫలాలను ఆశించటం వంటిదే ఇది కూడా. అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడైనట్లే ఆయన శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకునేవాడన్న సంగతిని కూడా జనులు మరచిపోకూడదు.

?దివ్యఖుర్ఆన్ లో ఎన్నో చోట్ల అల్లాహ్ ఈ రెండు పార్శ్వాలు ఒకే సమయంలో ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకు: “ప్రవక్తా! నేను క్షమించేవాణ్ణి, కరుణించేవాణ్ణి. దాంతోపాటు నా శిక్ష కూడా బాధాకరమైన శిక్షే అని నా దాసులకు తెలియజెయ్యి” అని అనటం జరిగింది (?అల్ హిజ్రి: 49,50) అంటూ మొదలయింది. దీనిబట్టి అవగతమయ్యే దేమిటంటే

– విశ్వసించి, లేదా నిజంగా పశ్చాత్తాపం చెంది, దేవుని నికార్సయిన దాసుడుగా మెలిగే వ్యక్తి పాపాలు సముద్రపు బుడగలకు సమానంగా ఉన్నాసరే – వాటిని దేవుడి క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన తన దాసులపాలిట క్షమాశీలి, దయా స్వభావి. వందమందిని హతమార్చిన వ్యక్తి పశ్చాత్తాపం చెందిన సంఘటన కూడా హదీసులో వచ్చింది.

-(?సహీహ్ బుఖారీ – కితాబుల్ అంబియా; ముస్లిం – కితాబుత్తౌబా)

Related Post