తౌహీద్‌ మరియు షిర్క్‌

2797809-499508-spring-summer-autumn-and-winter-background

سيد احمد محمدي

సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్  గొప్ప వివేకి, మహా ప్రజ్ఞాశాలి, సర్వజ్ఞుడు, సర్వ స్తోత్రాలకు ఆయనే అర్హుడు. ఆయన ఈ సృష్టి లో ప్రతి దానిని ఒక కారణం చేత ఆవిర్భవిం చాడు. అందులో ఎన్నో సూచనలున్నాయి. అల్లాహ్  మానవులను మరియు జిన్నాతులను పుట్టించిన విశేష ధ్యేయాన్ని  తెలియజేశాడు: ”మేము జిన్నాతులను మరియు మానవులను కేవలం మా ఆరాధనకై సృష్టించాము.” (జారియాత్‌ :56)

అల్లాహ్  ఆరాధన విధానాన్ని తెలియపరచుట కై ప్రతి జాతిలోనూ, ప్రతి సముదాయంలోనూ ప్రవక్తలను అవతరింపజేసాడు. ”మేము ప్రతి జాతిలోను, సముదాయంలోను ప్రవక్తలను పంపాము, తద్వారా అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి”. (అన్‌నహ్ :36)

అల్లాహ్‌ా ఏకత్వం కొరకే ప్రవక్తలు పంపబడ్డా రు ‘నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపి నా, ”నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందే శాన్ని(వహీని) అతనికి పంపాము.’ (అల్‌ అంబియా:25) అల్లాహ్  పంపిన ప్రవక్తలందరి ఏకైక సూత్రం అల్లాహ్  యొక్క ఏకత్వాన్ని చాటి చెప్పడమే.

తౌహీద్‌ (ఏకదైవారాధన):

తౌహీద్‌ అంటే- సృష్టికర్త ఒక్కడే, ఆయనకు ఎవ్వరూ సాటి లేరు, కనుక ఆయన తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, మరియు అల్లాహ్  పేర్లు, గుణగణాలు ఆయనకు మాత్ర మే సొంతం. తౌహీద్‌ గొప్ప ఆరాధన దాని పైనే జీవితం గడిపేవారి పాపాలన్నీ మన్నించ బడతాయి.

హజ్రత్‌ అమర్‌ బిన్‌ ఆస్‌ (ర) కథనం: ఆయన ఓ సారి దైవప్రవక్త (స) వారి వద్దకు వెళ్ళి ఇస్లాం ప్రకారం జీవితాన్ని గడపటానికి తమరి చేతిపై బైఅత్‌ చేస్తానన్నారు, అందుకు ప్రవక్త (స) గారు చేయి చాపగా అమర్‌ బిన్‌ ఆస్‌ (ర) వారు ఆగి పోయారు. కారణమడగ్గా తనకు ఒక షరతు ఉందని చెప్పారు. ప్రవక్త (స) ఆ షరతు ఏమిటని ప్రశ్నించగా అమర్‌ బిన్‌ ఆస్‌ (ర) తాను పూర్వం చేసిన పాపాలు మన్నించబడతాయా? అనే సందేహాన్ని వెళ్ళ బుచ్చారు. అప్పుడు దైవప్రవక్త (స) ఇలా బదులిచ్చారు: ”ఓ అమర్‌ ! ఇస్లాం స్వీకరించిన పిదప పూర్వపు అన్ని పాపాలు మన్నించ బడ తాయని నీకు తెలియదా?”.

షిర్క్‌ (బహుదైవారాధన): షిర్క్‌ ఏకత్వానికి వ్యతిరేకం. షిర్క్‌ పుణ్యకార్యాలన్నింటిని నశింప జేస్తుంది. అల్లాహ్  ఇలా సెలవిచ్చాడు:  ”వాస్త వానికి నీకు మరియు నీకంటే ముందు వచ్చిన ప్రవక్తకూ వహీ ద్వారా ఇలా తెలుపబడింది ఒకవేళ నీవు బహుదైవారాధన చేసినట్లయితే నీ కర్మలన్నీ నశించిపోతాయి, మరియు నిశ్చ యంగా నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరి పోతావు” (జుమర్‌: 65,66)

దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఎవరైతే షిర్క్‌ చేయకుండా మరణిస్తాడో అతను స్వర్గం లో ప్రవేశిస్తాడు, మరెవరయితే షిర్క్‌ చేస్తూ మరణిస్తాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”.(ముస్లిం) ఇప్పుడు షిర్క్‌ గురించి కొన్ని విషయాలు ఆధా రాల రీత్యా తెలుసుకుందాం!

1) ఒకరి ఎదుట ఆరాధనా భావంతో నిలబడుట: ”అల్లాహ్  సమక్షంలో వినమ్రులై నిలబడండి”. (బఖర:238)

అల్లాహ్‌ా తప్ప మరెవరి ఎదుట వినమ్రులై ఆరాధనా నిమిత్తం నిలబడరాదు. వారు సజీ వులైనా  మరణించినవారైనా ఆరాధనా నిమి త్తం నిలబడటం షిర్క్‌ అవుతుంది. ”ఎవరైతే తమ ఎదుట ప్రజలను గౌరవమర్యాదల కోసం నిలబడటం ఇష్టపడతాడో అట్టి వాడు తన నివాసం నరకంలో చేసినట్టే” అన్నారు ముహమ్మద్‌ (స). (అహ్మద్‌, అబూదావూద్)

కాకపోతే రోగగ్రస్తుల సహాయం కొరకు నిలబడటంలో తప్పు లేదు. ఒకసారి ముఆజ్‌ (ర) దైవప్రవక్త (స) పిలిచారని వచ్చారు. అపుడు ముఆజ్‌ (ర) గాయాలు తగిలినాయి, ఆయన (ర) సవారీ నుంచి దిగడానికి సహా యం కోసం దైవప్రవక్త(స) సహాబాలను నిల బడమని ఆదేశ మిచ్చారు.

2) అల్లాహ్‌ాకు తప్ప ఇతరులను సజ్దా చేయటం (సాష్టాంగపడటం):

”ఆయన సూచన (ఆయత్‌)లలో రేయింబ వళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా)చేయకండి, కాని కేవలం వాటిని సృష్టిన్చిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి.” (ఫుస్సిలత్‌: 37)

షరీఅతె ముహమ్మదియాలో అల్లాహ్‌ాకు తప్ప మరెవరికీ సజ్దా  చేయటం అనుమతించబడ లేదు, దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఒకవేళ నేను ఒకరి కొరకు సజ్దా చేయుటకు ఆదేశించినట్లయితే భార్యను తన భర్త కోసం సజ్దా చేయమని ఆదేశించేవాడ్ని”. (తిర్మిజీ)

గమనిక: సమాధులకు, పీర్లకు, సత్పురుషుల కు సజ్దా చేయటం షిర్క్‌ అవుతుంది, ఇలా చేయటం వలన మనిషి తౌహీద్‌ నుంచి తొలగి పోతాడు.

Related Post