New Muslims APP

ప్రజా సంబంధాల ప్రాముఖ్యత

ధనము, యౌవనము, కీర్తిప్రతిష్ట, రాజ్యము, అధికారము అన్నియును అనిత్యములే.

కాబట్టి సంగ్రహమును, పరిగ్రహమును పరిత్యజించి మనకు ప్రాప్తమయినున్న వాటిని పలువురికి పనికి వచ్చేలా కార్యాచరణ రంగాన్ని తయారు చేసుకోవాలి. మనకు లభ్యమయి ఉన్న సకల సంప దలను, శ్రమను, శక్తిని, బుద్ధిని, వివేకాన్ని, విజ్ఞానాన్ని దైవాదేశాల కను గుణంగా-ధర్మ, దేశ, ప్రజల అభ్యున్నతి కోసం వినియోగించి శాంతిని, ఆత్మ సంతృప్తిని, మనోల్లాసాన్ని పొందాలి. ఆత్మ స్తుతికి, ప్రశంసకి బానిసయి ఇతరుల్ని కించపర్చడం, ద్వేషించడం అనేది కడకు ద్విగుణీ కృతమై మనల్ని కడతేరుస్తుంది. మన దుఃఖానికి కారణభూతమవుతుం దన్న సత్యాన్ని సదా గుర్తు పెట్టుకోవాలి. మనల్ని మనం ప్రేమించినట్ల యితే అన్యుల్ని సయితం ప్రేమించడం నేెర్చుకోవాలి. మన కోసం మంచిని ఇష్టపడినట్లే ఇతరుల మేలును సయితం కోరుతూ ఉండాలి. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు:
”ప్రజలతో సంబంధాలు పెట్టుకో కుండా, వారి నుండి ఎదురయ్యే ఇబ్బందుల్ని ఓర్చుకొలేని విశ్వాసికన్నా, ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి వల్ల కలిగే ఇక్కట్లను భరించేవాడే శ్రేష్టుడు”. (తిర్మిజీ)

ప్రజా సంబంధాల ప్రాముఖ్యత

వ్యాధిగ్రస్తుల్ని వెళ్ళి పరామర్శించి వచ్చేవారు. చేతనయినంత ఆర్థిక సహాయాన్ని అంద జేసేవారు. రోగగ్రస్తులతో ప్రేమగా పలుక రిస్తూ వారి స్వస్థత కోసం దుఆ చేసేవారు. కుష్టు రోగులతో సయితం కలిసి కూర్చుని భోంచేసేవారు.
ప్రజలకు ఏ ప్రమాదం వాటిల్లినా, ఏ విపత్కర పరిస్థితి ఏర్పడినా తాను ముందుండి వారి బాగోగులను గమనించేవారు.

ఇస్లాం ధర్మం వైరాగ్యాన్ని (రుహ్బానియ్యత్‌) బోధించదు.

మనిషి సొంత స్వార్థం కోసం సంఘం నుండి పారిపోయి కొండల్ని, కోనల్ని, అడవుల్ని, ఎడారుల్ని ఆశ్రయించి (సర్వ సంఘ పరిత్యాగి) సన్యాసిలా జీవించమని ఆదేశించదు. పైగా మనిషి సంఘంలోనే ఉంటూ, దేవుని హక్కులతోపాటు, దాసుల హక్కుల్ని సయితం నిర్వర్తించడమే గొప్పతన మని అంటుంది. ధర్మాధర్మాల సంఘర్షణలో ధర్మోన్నతి కోసం పరిశ్రమిస్తూ, అధర్మాన్ని సంఘం నుండి పారద్రోలడం అనేది శ్రేష్ఠ సము దాయ ప్రధమ కర్తవ్యంగా పేర్కొంటుంది. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించ మని, అభాగ్యుల్ని ఆదుకోమని, అనాథల్ని ఆదరించమని, వితంతు వుల, వికలాంగుల యోగక్షేమాల్ని గమనించమని, ప్రజలతో సత్సంబం ధాలు కలిగి ఉండమని, మంచిని ఆదేశించమని, పెంచమని, చెడును వారించమని, తుంచమని, అజ్ఞానం వల్ల అపమార్గం పాలైన అమాయ కులకు విజ్ఞాన దివ్వెలు అందించి ధర్మ మార్గాన నడిపించమని, ఏ ఒక్క రికి హాని తలపెట్ట వద్దని, ఇతరుల నుండి ఎదురయ్యే కష్టాలను ఓర్పుతో సహించి, పెద్ద మనస్సుతో క్షమించమని నొక్కి వక్కాణిస్తుంది ఇస్లాం. మహా ప్రవక్త (స) వారి జీవితంలో అడుగడుగునా ఈ ఆదర్శ ప్రవర్తనే దర్శనమిస్తుంది.

దైవ ప్రవక్త (స) ప్రజలతో కలిసిమెలిసి వారిలో ఒకరుగా ఉండేవారు.

వారితోనే కలిసి కూర్చునేవారు, కలిసి భోంచేసేవారు. ప్రయాణావస్థలో భోజన తయారికై కట్టెలు ఏరుకొచ్చేవారు. మస్జిద్‌ నిర్మాణ సమయంలో స్వయంగా రాళ్ళు మోసుకొచ్చేవారు. కందకం త్రవ్వాల్సి వచ్చినప్పుడు అందరిలానే తానూ గడ్డపార తీసుకొని కష్టపడేవారు. యుద్ధం సంభ వించినప్పుడు చివరి క్షణం వరకు వారితోనే ఉండేవారు. కొన్ని విప త్కర, విషయమ పరిస్థితులలో సహాబాలు వెన్ను చూపినా, ‘నేను సత్య ప్రవక్తను – ఇందులో సందేహానికి తావే లేదు’ అంటూ ధీరశాంతాన్ని ప్రదర్శించేవారు. తోటి ప్రజల సుఖసంతోషాలలో, దుఃఖ కష్టాలలో పాలు పంచుకునేవారు. దుఃఖితులను ఓదార్చేవారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు సంతోషం కలిగితే ఆయన ఆనంద పడేవారు. ప్రజలకు కష్టాలు ఎదు రైతే ఆయన చలించిపోయేవారు. తన ఉత్తమ నడవడికతో, స్వచ్ఛమైన చిరునవ్వుతో ప్రజా హృదయాల్ని గెలుచుకున్న సుభక్తాగ్రేసరులు, మహా ఉదారులు, గొప్ప దానశీలురు, కరుణ స్వరూపులు ఆయన (స).

దైవ ప్రవక్త (స) ఎన్నడూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండాలని, ప్రజల నుండి వేరయి తను గుర్తించబడాలని ఆశించలేదు.

మార్గం మధ్య ఎదురయ్యే వ్యక్తులకు తానే ముందుగా సలామ్‌ చేసేవారు. దారిలో పిల్లలు ఎదురైతే వారికి సయితం తానే ముందు సలాం చేసే వారు. వారితో కలిసి కూర్చునేవారు. ప్రేమగా తల నిమిరేవారు. పిలల్ల పట్ల అవ్యాజానురాగాన్ని కనబర్చేవారు. కొత్త పంట (ఖర్జూరాలు, ఇతర ఫలాలు) చేతికందితే ముందు పిల్లలకే ఇచ్చేవారు. ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కూడా తానే సలాం చెప్పే వారు. పరిచయస్తులతోనూ, అపరిచయస్తులతోనూ ప్రేమగా వ్యవహ రించేవారు. కొత్తపాత అన్న తేడా లేకుండా అందరితోనూ సమానంగా కరచాలనం చేసేవారు. చాలా రోజుల తర్వాత ఎవరైనా కలిస్తే, అతన్ని అమాంతంగా కౌగలించుకునేవారు. ఎవరైనా కరచాలనం చేెస్తే స్వయం గా ఆ వ్యక్తి చెయ్యి వదలనంత వరకూ వదిలే వారు కాదు. ఎవరికైనా ఏదైనా సందేశం పంపదలచుకుంటే సలాం చెప్పి పంపేవారు. అలాగే ఎవరైనా దూరం నుండి సలాం చెప్పి పంపితే ఆనందించేవారు. బంధువులకు, సహచరులకు, ఇరుగుపొరుగు వారికి అప్పుడప్పుడు కానుకలు అందజేసేవారు. తరచూ ”పరస్పరం ఒండొకరు కానుకలు ఇచ్చిపుచ్చు కుంటూ ఉండండి. తద్వారా మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగు తాయి” అని పురమాయిస్తూ ఉండేవారు.

ఏదైనా సమావేశానికి వెళ్ళవలసి వస్తే ఎక్కడ చోటు లభిస్తే అక్కడే కూర్చునేవారు.

ప్రజల భుజాలు దాటుకుంటూ ప్రత్యేక స్థానం కోసం ప్రాకులాడేవారు కాదు. సహచరుల్లోని, సభికుల్లోని ఎవరైనా గౌరవార్థం లేచి నిలబడాన్ని అసహ్యించు కునేవారు. ఎవరైనా మ్లాడేటప్పుడు మధ్యలో కలుగజేసుకునేవారు కాదు. ఎదుి వ్యక్తి చెప్పిందల్లా శ్రద్ధగా వినేవారు. జవాబు ఇవ్వవలసి వస్తే ఎంతో సౌమ్యంగా, సమంజసమైన రీతిలో సమాధానం ఇచ్చేవారు. ఎవరైనా ఏదైనా పని కోసం పిలిస్తే సిద్ధంగా ఉండేవారు. వ్యాధిగ్రస్తుల్ని వెళ్ళి పరామర్శించి వచ్చేవారు. చేతనయినంత ఆర్థిక సహాయాన్ని అంద జేసేవారు. రోగగ్రస్తులతో ప్రేమగా పలుక రిస్తూ వారి స్వస్థత కోసం దుఆ చేసేవారు. కుష్టు రోగులతో సయితం కలిసి కూర్చుని భోంచేసేవారు.
ప్రజలకు ఏ ప్రమాదం వాటిల్లినా, ఏ విపత్కర పరిస్థితి ఏర్పడినా తాను ముందుండి వారి బాగోగులను గమనించేవారు. ఎవరి కైనా జీవితపు చివరి ఘడియ సమీపించింది అని తెలిస్తే తక్షణం బయలుదేరి వెళ్ళి – ”పశ్చాత్తాపం చెందమ”ని హితవు పలికే వారు. అతని ఇంివారికి ధైర్యం చెప్పే వారు. ఓర్పు సహనం కలిగి ఉండమని హితోపదేశం చేసేవారు. శవ సంస్కారాలు తొందరగా ముగియాలని అభిలషించేవారు. శవపిేకను తానే స్వయంగా మోసేవారు. జనాజా నమాజు చేయించేవారు. మరణిం చిన వ్యక్తి కోసం దుఆ చేయడమేకాక, అతని మీద అప్పు భారమేదైనా ఉంటే తీర్చేవారు.

అవసరార్థం తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరికి ఆయన ‘లేదు’ అని అనలేదు.

అప్పు రుణ భారం క్రింద నలిగే బీదసాదల ఆప్పును స్వయంగా తీర్చేవారు లేదా స్తోమత గల ఇత రులను తీర్చమని ప్రోత్సహించేవారు. అవ సరం అన్పిస్తే ఇరుగుపొరుగు వారి కోసం బజారు నుండి కూరగాయలు తీసు కొచ్చి ఇచ్చేవారు. ఆకలిగొన్నవారి ఆకలి తీర్చేవారు. బానిసల బంధ విముక్తి కోసం అహరహం పరిశ్రమించేవారు. సమాజంలోని అణగారిన వర్గాలను, దళిత జనాలను, పీడిత ప్రజలను ఉద్ధరించే ప్రణాళికలు రూపొందించేవారు. వారి అభ్యుదయానికై అహర్నిశలు కృషి చేసేవారు. ప్రజలతో నగుమోముతో పలు కరించేవారు. అప్పుడప్పుడు సహచరులతో కలిసి హాస్యాన్ని పండించేవారు.

విల్లు విద్య పోటిల్లో, ఈత పోటిల్లో, పరుగు పందెంలో వారితో పాల్గొనేవారు.

ఒక్క మాటలో చెప్పాలంటే, దైవప్రవక్త (స) సమాజానికి, సంఘా నికి, ప్రజానికానికి ఎంత దగ్గరగా జీవించా రంటే, ఆ సమాజపు ప్రతి వ్యక్తి-”అందరి కన్నా ఎక్కువగా దైవ ప్రవక్త (స) నన్నే ప్రేమి స్తున్నారు” అన్న గొప్ప అనుభూతిని పొందే వాడు. మహా ప్రవక్త (స) వారి ఈ ఆదర్శ ప్రవర్తన కారణంగానే అప్పి ఆ సమాజం లో మునుపెన్నడూ కని,విని,ఎరుగని పరివర్త నం వచ్చింది. అదే నేడు మనందరి ‘కల’ (విజన్‌) అయి నిలిచింది. ఆకలను సాకారం చేసుకునే దిశకు మన ‘లక్ష్యం’ (మిషన్‌) సాగాల్సి ఉంది.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.