గుసుల్‌:

 ఐ పి సి తెలుగు విభాగం

 

 గుసుల్‌: భాషాపరంగా గుసుల్‌ అంటే ఒక వస్తువుపై (ఆ వస్తువు ఏదయినా) నీళ్ళను కుమ్మరించడం.  గుసుల్‌: షరీయతు పరిభాషలో ఓ ప్రత్యేక సంకల్పంతో శరీరంపై నీళ్ళు పోసుకోవడం.  ఆదేశం: శుద్ధి పొందడాని, అశుద్ధతను దూరం చేయడానికి ప్రార్థన కోసం, ప్రార్థన కోసం కాకపోయినా గుసుల్‌ చేయడం షరీయతు మెచ్చిన విషయం.అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ''అల్లాహ్‌ పశ్చాత్తాప పడే వారిని, పారిశుద్ధాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు''  (బఖర222)సుల్‌: భాషాపరంగా గుసుల్‌ అంటే ఒక వస్తువుపై (ఆ వస్తువు ఏదయినా) నీళ్ళను కుమ్మరించడం.

గుసుల్‌: షరీయతు పరిభాషలో ఓ ప్రత్యేక సంకల్పంతో శరీరంపై నీళ్ళు పోసుకోవడం.
ఆదేశం: శుద్ధి పొందడాని, అశుద్ధతను దూరం చేయడానికి ప్రార్థన కోసం, ప్రార్థన కోసం కాకపోయినా గుసుల్‌ చేయడం షరీయతు మెచ్చిన విషయం.అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”అల్లాహ్‌ పశ్చాత్తాప పడే వారిని, పారిశుద్ధాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు”  (బఖర222)

సౌకర్యం ఉంటె ప్రతి రోజు స్నానం చేయడం అభిలషణీయం. అలా వీలు కాని పక్షంలో వారానికొక స్నానం చేయడం తప్పనిసరి అవుతుంది.  దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: ప్రతి ముస్లింపై తప్పనిసరి విషయం ఏమిటంటే తాను ప్రతి ఏడు(7) రోజులకోసారి స్నానం చేయాలి. అందులో అతను తన తలను, దేహాన్ని కడగాలి. ముస్లిం గ్రంథంలో ఉన్న హదీసు ప్రకారం ప్రతి ముస్లింపై గల అల్లాహ్‌ హక్కు అని ఉంది. (బుఖారి 85, ముస్లిం849)

గుసుల్‌ మఫ్‌రూజ్‌: గుసుల్‌ కారణమయ్యే కారకాలు ఉండి కూడా గుసుల్‌ చెయ్యకపోతే నమాజు నెరవేరదు. అట్టి గుసుల్‌ను గుసుల్‌ మఫ్‌రూజ్‌ అంటారు. గుసుల్‌ ఫర్జ్‌ అయ్యే కారకాలు వీర్యస్ఖలనం, బహిష్టు రావడం, ప్రసూతి స్రావం జరగటం, మరణించటం.

 1.వీర్య స్ఖలనం: (జనాబత్) దూకుడుగా వెలువడే వీర్యాన్ని జనాబత్‌ అంటారు. అలాగే పురుషుని మర్మావయవం స్త్రీ రహస్యాంగంలోకి ప్రవేశించి స్ఖలనం జరగకపోయినా జనాబత్‌గానే పరిగణించడం జరుగుతుంది.

జునుబీ: జనాబత్‌ గల వ్యక్తి అశుద్ధుడు. ఆ జనాబత్‌ సంభోగం వల్ల జరిగినా, వీర్యస్ఖలనం వల్ల జరిగినా. అలా ఎందుకు అనడం జరిగిందంటే: వ్యక్తి జనాబత్‌ స్థితిలో ఉన్నంతవరకు అతను నమాజు చేయకూడదు గనక. జునుబీ అన్న పదం స్త్రీ పురుషులిరువురికీ వర్తిస్తుంది. ఇద్దరినీ జునుబీ అనే అంటారు.

జనాబత్‌ కారణాలు: 

1.కామోద్రేకంతో స్త్రీ పురుషులిరువురి మర్మాంగం నుండి వీర్యస్ఖలనం జరగటం. అది సంభోగం వల్ల జరిగినా, స్వప్నం వల్ల జరిగినా, వేరే ఆలోచన వల్ల జరిగినా సరే.
ఉమ్మె సలమా (ర) కథనం: దైవప్రవక్త (స)వారి సన్నిధి ఉమ్మె సులైమ్‌ అను స్త్రీ వచ్చి: ఓ దైవప్రవక్తా! నిశ్చయంగా అల్లాహ్‌ సత్యం వియంలో సిగ్గుపడడు. మరి స్త్రీకి ఇహ్తిలామ్‌ అయినప్పుడు ఆమె గుసుల్‌ చేయాల్నా? అని ప్రశ్నించింది. అందుకు దైవప్రవక్త (స): ”ఆమె దాని తాలూకు చెమ్మ చూసినప్పుడు స్నానం చేయాలి” అన్నారు. (బుఖారి 278, ముస్లిం 313)
2. సంభోగం (వీర్య స్ఖలనం జరగకపోయినా)
అబూ హురైరా(ర) గారి కథనం: ”భర్త తన భార్య తొడల మధ్య కూర్చుని సంభోగిస్తే అతనిపై గుసుల్‌ వాజిబ్‌ అవుతుంది” అన్నారు ప్రవక్త(స). (బుఖారి 278, ముస్లిం 348)
ముస్లిం ఉల్లేఖనంలో ”అతనికి వీర్యస్ఖలనం జరగకపోయినా సరే” అని ఉంది.

జనాబత్‌ వల్ల క్రింది విషయాలు నిషిద్ధమవుతాయి:

నమాజు, మస్జిద్‌లో ఆగటం (ఆగకుండా వెళ్ళిపోవడం అనుమతించబడింది) కాబా చుట్టు ప్రదక్షిణ, ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని ముట్టుకోవడం, లేదా ఖుర్‌ఆన్‌ వాక్యాలు గల కాగితాన్ని ముట్టుకోవడం ఖుర్‌ఆన్‌ను సంచిలోగాని,పెట్టెలోగాని ఎత్తుకెళ్ళడం.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”విశ్వసించిన ప్రజలారా! మీరు మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగేటప్పుడే (నమాజు చేయాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా. స్నానం చేయనంత వరకు నమాజు చేయరాదు.(మస్జిద్‌) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం.” (నిసా: 43) నమాజు దరిదాపుల కూడా అంటే నమాజు చేసే స్థలం మస్జిద్‌ అని అర్థం.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: నేను బహిష్టుగల స్త్రీ జునుబీ మస్జిద్‌లో ప్రవేశించడాన్ని ఆమోదించను.”                                                                                                                             (అబూదావూద్‌ 232)
దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు:” కాబా చుట్టూ ప్రదక్షిణ నమాజు అనబడుతుంది. అయితే అల్లాహ్‌ా మీకోసం అందులో మాట్లాడుకునే అనుమతి ఇచ్చాడు. కాబట్టి మంచి విషయాలు తప్ప మాట్లాడరాదు సుమా! (హాకిమ్‌ 1/459)
దైవప్రకవ్త (స) ఇలా అన్నారు: బహిష్టు గల స్త్రీగానీ, జునుబీ గానీ ఖుర్‌ఆన్‌ను చదవకూడదు.” ( తిర్మిజి 131)
గమనిక: జునుబీ అయిన స్త్రీపురుషులు నోటితో పదాలను ఉచ్చరించకుండా లోలోన మననం చేసుకోవచ్చు. అలాగే తెరచి ఉన్న ఖుర్‌ఆన్‌ను చూడటం అందులోని ప్రార్థనలను పారాయణం ఉద్దేశంతో కాకుండా చదవడం సమ్మతించబడింది. ఉదాహరణకు:”రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్‌ వ ఫిల్‌ ఆఖిరతి హసనత్‌ వఖినా అజాబన్నార్‌.” (బఖర 201)
అలాగే ప్రయాణ సమయంలో చేసే ప్రార్థన: ”సుబ్హానల్లజీ సఖ్ఖర లనా హాజా వమా కున్నా లహు ముఖ్‌రినీన్‌” (జుఖ్రుఫ్: 13)

 గమనిక: జునుబీ అయిన వ్యక్తి బట్టలు ఇతరత్రా వస్తులతోపాటు ఖుర్‌ఆన్‌ను ఎత్తుకునే అనుమతి ఉంది. అయితే ఉద్దేశం బట్టలు ఎత్తుకుంటున్నాను అని ఉండాలేగాని ఖుర్‌ఆన్‌ ఎత్తుకుంటున్నాని కాదు. అలాగే ఖుర్‌ఆన్‌ వాక్యాలకంటే ఎక్కువగా వ్యాఖ్యాన వాక్యాలుండే గ్రంథాన్ని ఎత్తుకోవచ్చు. అదే విధంగా ఎలక్ట్రానిక్‌ ఖుర్‌ఆన్‌ ఎత్తుకునే అనుమతి ఉంది.

2. హైజ్‌ – బహిష్టు

హైజ్‌ అంటే భాషాపరంగా ‘పారడం’. హైజ్‌- షరీయత్‌ పరిభాషలో స్త్రీ నైజానికి సంబంధించిన  ప్రకృతి సిద్ధ రక్తం. ఆరోగ్యవంతమైన స్త్రీ యుక్త వయసుకు చేరుకున్నాక ఆమె గర్భ సంచి క్రింది భాగం నుండి ప్రత్యేక సమయంలో వెలువడే రక్తం. హైజ్‌ వల్ల గుసుల్‌ వాజిబ్‌ అవుతుందనడానికి ఖుర్‌ఆన్‌ మరియు హదీసుల ఆధారం:

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ” వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: అదొక అశుద్ధ స్థితి. కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యేవరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట అల్లాహ్‌ అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరుపవచ్చు. అల్లాహ్‌ా పశ్చాత్తాప పడేవారిని పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్ట పడతాడు.” ( బఖర 222)

దైవప్రవక్త(స) ఫాతిమా బిన్తె అబీ హబష్‌(ర)ను ఉద్దేశించి ఇలా అన్నారు: ”నీకు బహిష్టు మొదలయితే నమాజును వదిలెయ్యి. బహిష్టు ఆగిపోతే స్నానం చేసి నమాజు చదువుకో”. (బుఖారి 226, ముస్లిం 333)
యుక్త వయస్సు: ఏ వయసుకు చేరిన మీదట స్త్రీపరుషులపై ధర్మ విధులయిన నమాజు,రోజా హజ్‌ వంటివి ఫర్జ్‌ అవుతాయో దాన్ని బులూగ్‌ అంటారు. ఒకరు యుక్త వయసుకు చేరుకున్నారన్న విషయం కొన్ని సూచనల ఆధారంగా తెలుస్తుంది.
(అ) స్రీ పురుషుల మర్మావయవాల నుండి వీర్యస్ఖలనం (ఇహ్తిలామ్) జరగటం.
(ఆ) స్త్రీలు బహిష్టు రక్తాన్ని చూడటం. బహిష్టు రావడం అనేది దేశ, వాతారణం, ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చంద్రమానపు తొమ్మిది సంవత్సరాలు నిండిన తర్వాత బహిష్టు వస్తుంది.
(ఇ) ఒకవేళ స్త్రీకి బహిష్టు రాకపోయినా, పురుషునికి ఇహ్తిలామ్‌ అవ్వకపోయినా చంద్రమానం ప్రకారం 15 సంవత్సరాలు నిండితే అతను/ఆమె యవ్వన థకు చేరుకుంటారు.

హైజ్‌ గడువు:

– కనిష్ఠ గడువు: ఒక పగలు ఒక రాత్రి.
– గరిష్ఠ గడువు: 15 రోజులు.
– సాధారణ గడువు: 6 లేదా 7 రోజులు.

రెండు హైజ్‌ల మధ్య శుద్ధత గడువు:

రెండు హైజ్‌ల మధ్య కనిష్ఠ శుద్ధత గడువు 15 రోజులు. గరిష్ఠ గడువుకి పరిమితి లేదు. ఏ స్త్రీకి సంవత్సరం రెండు సంవత్సరాల పాటు బహిష్టు రాదు.
హైజ్‌ మధ్యకాలంలో నిషిద్ధమయినవి:
(అ) నమాజు
(ఆ) ఖుర్‌ఆన్‌ చదవడం, తాకడం, ఎత్తడం.
(ఇ) మస్జిద్‌లో ఆగి ఉండటం.
ఆయిషా (ర)గారి కథనం: దైవప్రవక్త(స) నాతో ”మస్జిద్‌ నుండి గుడ్డపేలికను అందివ్వు అన్నారు. అందుకు నేను బహిష్టుతో ఉన్నాను అన్నాను. దానికాయన (స) నీ బహిష్టు నీచేతిలో లేదు కదా! అన్నారు.” ( ముస్లిం 298)

(ఈ) తవాఫ్‌:

ఆయిషా(ర) కథనం: మేము హజ్‌ చేసే నిమిత్తం బయలుదేరాము. సరఫ్‌ అనే ప్రదేశంలో ఉండగా నాకు బహిష్టు వచ్చింది. నేను ఏడుస్తున్న సమయంలో దైవప్రవక్త(స) నావద్దకు వచ్చారు. ఏమయ్యింది నీకు? బహిష్టు వచ్చిందా? అని అడిగారు. నేను అవును అన్నాను. అందుకాయన: ”ఇది అల్లాహ్‌ా ఆదం పుత్రికలపై నిర్ణయించిన విషయం కాబట్టి ఒక హాజీ చేసే క్రియలన్నింటిని నీవు పూర్తి చెయ్యి కాబా చుట్టూ తవాఫ్‌ తప్ప” అన్నారు. (బుఖారి 290, ముస్లిం1211)
(ఉ) మస్జిద్‌ అశుద్ధం అవ్వచ్చు అన్న భయం ఉన్నప్పుడు మస్జిద్‌ గుండా నడిచి వెళ్ళడం.
(ఊ) ఉపవాసం: ఉపవాసం అది ఫర్జ్‌ అయినా, నఫిల్‌ అయినా బహిష్టుగల స్త్రీ ఉండకూడదు. తప్పిపోయిన తన ఉపవాసాలను శుద్ధిపొందాక పూర్తి చేయాలి. అయితే నమాజును పూర్తి చేయాల్సిన అవసరం లేదు. హైజ్‌ గడువు ముగిసి ఆమె స్నానం చేయకపోయినా ఉపవాసం విధి అవుతుంది.
ముఆజా (ర) కథనం: నేను హజ్రత్‌ ఆయిషా(ర)గారితో (శుద్ధి పొందిన తర్వాత) ఉపవాసం పూర్తి చేసి, నమాజు పూర్తి చేయని బహిష్టు స్త్రీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నించాను. అందుకు ఆమె ఏమిటి? నీవు హెతువాదివా? అని అడిగింది. లేదు, నేను హెతువాదిని కాను, అన్నాను అప్పుడు ఆమె ఇలా అన్నారు:”ఈ పరిస్థితి మాకు ఎదురయ్యేది. అయితే రోజా పూర్తి చేయాలని, నమాజు పూర్తి చేయకూడదని మాకాదేశించబడింది.” (బుఖారి 315,ముస్లిం 335)
శుద్ధి పొందిన బహిష్టు స్త్రీ ఉపవాసం పూర్తి చేయాలి. నమాజు పూర్తి చేయాల్సిన అవసరం లేదు. అన్న ఆదేశంలోని ఆంతర్యం బహుశా నమాజుల సంఖ్య ఎక్కువయి పూర్తి చేయడం కష్టమవడం అవ్వచ్చు.

(ఎ) సంభోగం:

”వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: అదొక అశుద్ధ స్థితి. కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యేవరకు వారి వద్దకు పోకండి.వారు పరిశుద్ధత నొందిన మీదట, అల్లాహ్‌ా అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరుపవచ్చు. అల్లాహ్‌ా పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు. (బఖర 222)

గర్భసమయంలో రక్తాన్ని చూడటం:

గర్భిణి స్త్రీ నుండి వెలువడే రక్తం బహిష్టు రక్తం కాదు. అది ఇస్తిహాజా రక్తం. ఆమె తన దైనందిన ప్రార్థనలను పూర్తి చేయాలి.

శుద్ధి సూచనలు:
1.ఎండిపోవడం
2.తెలుపు ఛాయలు
స్త్రీ ఈ రెంటిలో దేన్ని చూసినా అది ఆమెకు పరిశుద్ధత లభించిందనడానికి ఆనవాలు. అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చు.

ఆయిషా(ర)కథనంలో ఇలా ఉంది. స్త్రీ తన బహిష్టు కాలంలో జిగటు మరియు పసుపుపచ్చని పదార్థాన్ని చూస్తే అది హైజ్‌గానే భావించబడుతోంది. ఒకవేళ రుతుస్రావకాలం ముగిసి శుద్ధి లభించిందన్న సూచనలు అందిన పిమ్మట కనబడితే అది హైజ్‌గా పరిగణించబడదు.

ఉమ్మె అతియా(ర) వివరించారు: శుద్ధి పొందాక వెలువడే జిగటు మరియు పసుపుపచ్చని రంగు గల పదార్థానికి ప్రాధాన్యతనిచ్చేవారము కాము.” (అబూదావూద్‌ 307)

ఇస్తిహాజా:
రోగ కారణంగా స్త్రీ గర్భ సంచి క్రిందిభాగం నుండి వెలువడే రక్తం. ఈ రక్త ప్రసరణ వల్ల వుజూ భంగం అవుతుంది. గుసుల్‌ చేయాల్సిన అవసరం లేదు. నమాజు మరియు రోజాను మానుకోవాల్సిన అవసరము లేదు. ఇస్తిహాజా గల స్త్రీ రక్తాన్ని కడుక్కోవాలి. తత్సంబంధిత స్థలం మీద ఏదైనా గుడ్డతో కట్టుకోవాలి. ప్రతి నమాజు కోసం వుజూ చేసుకొని నమాజు చదువుకోవాలి.

ఆయిషా(ర) గారి కథనం: ఫాతిమా బిన్తె హబష్‌ దైవప్రవక్త(స)వారి సన్నిధికి వచ్చి ఓ దైవప్రవక్తా! నేను ఇస్తిహాజా గల స్త్రీని. ఇస్తిహాజా రక్తం నిరంతరాయంగా రావడం వల్ల నేను శుద్ధి పొందలేకపోతున్నాను. మరి నేను నమాజును మానుకోవాల్నా? అని ప్రశ్నించింది. అందుకు దైవప్రవక్త (స) ‘లేదు’ అది హైజ్‌ కాదు. నీకు ఒకవేళ హైజ్‌ గనక వస్తే నమాజును మానెయ్యి. దాని గడువు ముగిశాక స్నానం చేసి నమాజు చదువుకో.” అన్నారు. (బుఖారి 236, ముస్లిం333)

24 గంటకన్నా తక్కువగా, లేదా 15 రోజులకన్నా ఎక్కువ ఏ స్త్రీ అయినా రక్తం చూస్తే అది ఇస్తిహాజాగా పరిగణించబడుతుంది. అది హైజ్‌ కాజాలదు. క్రింది వివరణ ద్వారా స్త్రీ రక్తాల మధ్య తేడా గమనించవచ్చు:

బహిష్టు రక్తం                                                          ఇస్తిహాజా రక్తం
నలుపు ప్రభావం గలదై ఉంటుంది,చిక్కగా ఉంటుంది.         పలుచగా ఉండి ఎరుపు ప్రభావంగలదై ఉంటుంది
ఆరోగ్య స్థితిలో వస్తుంది.                                                  రోగ స్థితిలో వస్తుంది
దుర్వాసన గలదై ఉంటుంది                                             దుర్వాసన ఉండదు.
ప్రత్యేక దినాల్లో వస్తుంది.                                                  నిర్ధారిత వేళ లేదు.
గర్భసంచి క్రింది నుండి వెలువడుతుంది.                           యోని గుండా లేదా గర్భ సంచి క్రిందిభాగం నుండి వస్తుంది.

3. నిఫాస్‌:
ప్రసవానంతరం వెలువడే రక్తాన్ని నిఫాస్‌ అంటారు. ప్రసవానంతరం ఒకవేళ రక్తం కనబడకపోయినా స్నానం తప్పనిసరిగా చేయాలి. బిడ్డ పుట్టేటప్పుడుగానీ, దానికి ముందుగాని వెలువడే రక్తం నిఫాస్‌ అనబడదు. కారణం అది శిశువుకు ముందు రావడమే. అది చెడు రక్తంగా భావింబడుతోంది. కాబట్టి శిశువు జననానికి పూర్వం రక్తం చూసినా నమాజు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో నమాజు చేయలేకపోతే తర్వాత అయినా ఖజా చేసుకోవాలి.

నిఫాస్‌ కాలపరిమితి:
– కనిష్ఠం: ఒక నిమిషము.
– గరిష్ఠం: 40 రోజులు
– సాధారణంగా: 60 రోజులు . అరవై రోజులకు మించిపోతే అది ఇస్తిహాజా అనబడుతుంది.
 నిఫాస్‌ సమయంలో నిషేధాలు:
హైజ్‌ సమయం నిషిద్ధమయినవన్నీ నిఫాస్‌ సమయంలో సయితం నిషిద్ధం అన్న విషయం మీద పండితులందరూ
ఏకీభవించారు.
4. మరణం 
ముస్లిం మరణిస్తే అతన్ని స్నానం చేయించడం ముస్లిములందరిపై తప్పనిసరి అవుతుంది. అది వాజిబ్‌ కిఫాయగా భావించబడుతుంది. సదరు వ్యక్తికి సంబంధించిన బంధువులలోని కొందరు లేదా ఇతరులు ఎవరయినా అతని శవ సంస్కారాలు చేపడితే ఇతరులపై గల ఆ బాధ్యత వైదొలుగుతుంది. ఒకవేళ ఏ ఒక్కరూ ఆ కార్యం నెరవేర్చకపోతే ఆ పాపం అందరికి ముట్టుతుంది. అలాగే గుసుల్‌ ఇచ్చే వ్యక్తి గుసుల్‌ చేయిపిస్తున్నానని సంకల్పం చేసుకోవాలి. ఈ స్నానం నుండి అమరవీరునికి మినహాయింపు ఉంది. అమరవీరునికి (షహీద్‌ని) స్నానం చేయిపించకూడదు. దీని సంబంధించిన వివరాలు జనాయిజ్‌ ప్రకరణంలో వస్తాయి.
శవాన్ని స్నానం చేయించాలి అనడానికి ఆధారం:
అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) కథనం: హజ్‌లో ఒంటె తొక్కి చనిపోయిన వ్యక్తి గురించి ప్రవక్త(స) ఇలా ఆదేశించారు: ”అతన్ని నీరు మరియు రేగాకుతో స్నానం చేయించండి.” ( బుఖారి 1208, ముస్లిం 1206 )

మస్నూన్‌ గుసుల్‌
1. జుమా నమాజు కోసం చేసే గుసుల్‌:
జుమా నమాజుకి హాజరవ్వాలనుకున్న వ్యక్తి ఆ రోజు గుసుల్‌ చేయడం సున్నత్‌, అతనిపై జుమా నమాజు విధికాకపోయినా ఉదాహరణకు ప్రయాణికుడు. స్త్రీ,బాలుడు. జుమా నమాజు కోసం హాజరయినా కాకపోయినా ప్రతి ఒక్కరు జుమారోజు స్నానం చేయడం సున్నత్‌’ అని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు.

దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు:” ఎవరయినా జుమా రోజు వుజూ చేసుకుంటే సరే, (సరిపోతుంది) మరి ఎవరయితే గుసుల్‌ చేస్తారో గుసుల్‌ చేయడం ఉత్తమం”. (తిర్మిజి 497 )
2. పండుగల నమాజు కోసం గుసుల్‌: దీని సమయం పండుగ అర్థ రాత్రి దాటిన తర్వాత మొదలవుతుంది.
అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌(ర)గారి కథనం దైవప్రవక్త(స) ”ఈదుల్‌ ఫిత్ర్‌, ఈదుల్‌ అజ్హా రోజు స్నానం చేసేవారు”.
(ఇబ్నుమాజ1315)
3. గ్రహణ సమయంలో గుసుల్‌  (సూర్య చంద్ర గ్రహణం)
గ్రహణ స్నాన సమయం గ్రహణం మొదలవగానే ప్రారంభమవుతుంది. అది తొలిగితే పూర్తవుతుంది.
4.ఇస్తిస్ఖా నమాజు కోసం గుసుల్‌: ఇస్తిస్ఖా నమాజుకి వెళ్ళక ముందు స్నానం చేసుకోవడం సున్నత్‌.
5.శవాన్ని స్నానం చేయించిన తర్వాత గుసుల్‌:

దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: ”శవాన్ని స్నానం చేయించిన వ్యక్తి తానూ స్నానం చేయాలి.” (తిర్మిజి 993)
6. హజ్‌కి సంబంధించిన గుసుల్‌:
(అ) హజ్‌ మరియు ఉమ్రాల కోసం ఇహ్రాం(దీక్ష ) బూనేటప్పుడు చేసే స్నానం.
(ఆ) మక్కాలో ప్రవేశించేందుకు చేసే స్నానం.

నాఫె కథనం అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌(ర)గారు స్నానం చేయందే మక్కాలో ప్రవేశించేవారు కారు. ఆయన జీతువా ప్రాంతంలో రాత్రి గడిపి ఉదయం అయ్యాక స్నానం చేసి మరి మక్కాలో ప్రవేశించేవారు.”దైవప్రవక్త(స) వారు కూడా అలా చేసేవారని చెబుతుండేవారు”. (బుఖారి 1478,ముస్లిం1259)
(ఇ) జవాల్‌ తర్వాత అరఫాలో విడది చేసేందుకు స్నానం చేయడం.
(ఈ) తష్రీఖ్‌ దినాల్లో జమరాత్‌ల మీద  జవాల్‌ అనంతరం కంకరాళ్ళు రువ్వేందుకు స్నానం చేయడం.
(ఉ) మదీనాలో ప్రవేశించేందుకు స్నానం చేయడం.

పరీక్ష  7
 సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:

(ఎ) ఎండిపోవడం (బి) ఇస్తిహాజా (సి) కుసూఫ్‌ (డి)తవాఫ్‌ (ఇ) సంభోగం (ఎఫ్‌) జుమా (జి) హైజ్‌ (ఎచ్‌) మరణం
(ఐ) తెలుపు(జె) నిఫాస్‌ (కె) గ్రంథాన్ని ముట్టుకోవడం (ఎల్‌) నమాజు
1. వీర్యస్ఖలనం,హైజ్‌,నిఫాస్‌ మరియు………………….వల్ల గుసుల్‌ వాజిబ్‌ అవుతుంది.
2. మస్నూన్‌ గుసుల్‌లో…………………స్నానం మరియు …………..గుసుల్‌ వస్తుంది.
3. …………………………మరియు ………………….బహిష్టు నుంచి శుద్ధి లభించిందనడానికి గుర్తులు.
4. ………………………..మరియు ………………………జునుబీ వ్యక్తికి నిషిద్ధాలు.
5. ప్రసవానంతరం ఓ స్త్రీకి 65రోజులు రక్తస్రావం జరిగింది. అందులో 60 రోజులు……………అవగా మిగతా
5రోజులు……………………గా పరగణించబడతాయి.
 సరైన సమాధానాన్ని ఎన్నుకోండి: 

6. హైజ్‌ నుండి శుద్ధి పొందిన స్త్రీ ప్రార్థన చేయాలంటే ఆమెపై………………….వాజిబ్‌ అవుతుంది.
(అ) తయమ్ముమ్‌
(ఆ) వుజూ
(ఇ) గుసుల్‌
7.అమ్మాయి యుక్తవయసుకు చేరుకుంది అనడానికి గుర్తులు (హైజ్‌) కనబడకపోయినా ఆమె యుక్త వయసుకు చేరుకున్నాక ఆమెపై నమాజులు వాజిబ్‌ అవుతాయి.
(అ) చంద్రమానపు పది సంవత్సరాలు
(ఆ) చంద్రమానపు 20 సంవత్సరాలు
(ఇ) చంద్రమాసపు 15 సంవత్సరాలు.
8. కాలకృత్యాలు తీర్చుకోవడం వల్ల స్నానం తప్పనిసరి అవుతుంది.
(అ) అవును
(ఆ) కాదు.
9. హైజ్‌ యొక్క గరిష్ఠ గడువు 15 రోజులు.
(అ) అవును
(ఆ) కాదు
10. హైజ్‌ సమయంలో తప్పిపోయిన నమాజులను పూర్తి చేయాలి, ఉపవాసాల్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు.
(అ) అవును
(ఆ) కాదు
11. ఓ వ్యక్తికి స్వప్నస్ఖలనం అయింది. అతను నమాజు చదవాలంటే………………………. చేయాలి.
(అ) వుజూ
(ఆ) గుసుల్‌
12. ప్రసవానంతరం స్త్రీ ఎటువంటి రక్తాన్ని చూడలేదు ఆమెపై స్నానం చేయడం…………………
(అ) తప్పనిసరి
(ఆ) తప్పనిసరి కాదు.

 

గుసుల్‌ విధానం

వాజిబ్‌ విధానం:
1.శరీరాన్ని కడిగేటప్పుడు సంకల్పం చేసుకోవడం
2. వెంట్రుక మందం చోటుకూడా పొడిలేకుండా మొత్తం శరీరం మీద నీరు పోసుకోవడం.

జాబిర్‌(ర) కథనం: దైవప్రవక్త(స) ఎలా స్నానం చేసేవారని అడగటం జరిగింది. అందుకు ఆయన ‘దైవప్రవక్త మూడు దోసిళ్ళు నీళ్ళు తీసుకుని తలపై పోసుకునేవారు. తర్వాత పూర్తి శరీరంపై పోసుకునేవారు” అన్నారు. (బుఖారి 253)

ఉమ్మె సలమా(ర) కథనం: నేను ‘దైవప్రవక్తా! నేను మందమయిన ఎంట్రుకలు గలదాన్ని. జనాబత్‌ గుసుల్‌ కోసం వాటిని పూర్తిగా విప్పాల్నా? అని ప్రశ్నించాను. అందుకాయన(స) అవసరం లేదు, నీవు నీతలపై మూడు చెంబుల నీళ్ళు పోసుకుంటే చాలు, నీవు పరిశుద్ధత పొందుతావు.” అని సమాధానమిచ్చారు. (ముస్లిం 330)
సున్నత్‌ విధానం:
1.కుడిచేత్తో నీళ్ళు తీసుకొని మొదట రెండు చేతులు మణికట్ల దాకా కడుక్కోవాలి. తర్వాత ఎడమ చేత్తో మర్మాంగాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత శరీరంపైగల అశుద్ధతను దూరం చేసుకోవాలి. తర్వాత శుభ్రపరిచే పరికరంతో బాగా తోమాలి.

మైమూన (ర) కథనం: నేను ప్రవక్త(స)వారి కోసం స్నానానికని నీళ్ళు పెట్టాను, అప్పుడు ఆయన (స) తన చేతులను రెండుసార్లు లేదా మూడు సార్లు కడుక్కున్నారు. ఆ తర్వాత ఎడమ చేత్తో మర్మాంగాన్ని కడిగి తన చేతులకు మట్టిపై రుద్దారు.        (బుఖారి 254,ముస్లిం 317)
2. పూర్తి వుజూ చేయాలి. కాళ్ళను మాత్రం స్నానం చివర్లో కడుక్కున్నా పరవాలేదు.
3. నీటితో తలను బాగా తోమాలి. ఆ తర్వాత మూడు సార్లు తల కడుక్కోవాలి.
4.ముందు కుడి పార్శ్యాన్ని, తరువాత ఎడమ పార్శ్యాన్ని కుడుక్కోవాలి.
ఆయిషా(ర) కథనం: దైవప్రవక్త(స) జనాబత్‌ గుసుల్‌ చేసేటప్పుడు ముందు తన రెండు చేతులను కడుక్కునేవారు. తర్వాత నమాజుకోసం వుజూ చేసినట్టు చేసేవారు. ఆనక తన వ్రేళ్ళలను నీళ్ళలో ముంచి వెంట్రుకల అడుగుభాగాన పోనిచ్చిరుద్దే వారు. ఆ తర్వాత తలపై మూడు సార్లు నీళ్ళు పోసుకునేవారు. అటు పిమ్మట పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకునేవారు.  (బుఖారి 245)
ఆయిషా(ర)గారి కథనం: ”దైవప్రవక్త(స)వారు చెప్పులు తొడగటంలో, నడవటంలో,శుద్ధిపొందటంలో సమస్త కార్యాల్లో కుడి వైపు నుండి ప్రారంభించడాన్ని ఇష్టపడేవారు.” ( బుఖారి 166, ముస్లిం 268)
5.పూర్తి శరీరాన్ని తోమాలి. కడగడంలో ఒక అవయం తర్వాత మరో అవయం క్రమాన్ని పాటించాలి.
6. శరీరంలో తడవని నీరు చేరని భాగాలు చెవులు నాభి గోర్లక్రింది భాగాలను నీళ్ళు తీసుకుని తడపాలి.
7. గుసుల్‌  క్రియలను మూడేసి సార్లు చేయటం.

 గుసుల్లోని మక్రూహాత్‌లు:

1. నీరుని దుబారా చేయడం.
ఓ వ్యక్తి జాబిర్‌(ర)గారిని స్నానం గురించి ప్రశ్నించారు. అప్పుడు జాబిర్‌(ర)గారు ఒక ‘సా’ (నాలుగు సేర్ల నీళ్ళు) నీరు నీకు సరిపోతుంది’ అన్నారు. దానికావ్యక్తి నాకు ఒక ‘సా’ సరిపోదు అన్నాడు. అది విన్న ఆయన ”నీకంటే ప్రతి విషయంలో అగ్ర గణ్యుడు, నీకంటే ఎక్కువ శిరోజాలు కలిగిన మహానీయునికి ఒక ‘సా’ నీరే సరిపోయేది (నీకు సరిపోదా?) అని అన్నారు. (బుఖారి 249, ముస్లిం 327)

2. నిలిచి ఉన్న నీళ్ళలో స్నానం చేయటం:
అబూహురైరా (ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: మీలో జునుబీ అయినవారు నిలిచి ఉన్న నీళ్ళలో స్నానం చేయకూడదు. అది విన్న వారు ఓ అబూహురైరా! మరి మేమేంచేయాలి? అనిఅన్నారు. అందుకాయన అందులోనుండి నీరు తోడి స్నానం చేయాలి’ అన్నారు. (ముస్లిం 283 )

పరీక్ష 8

సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:

(ఎ) వుజూ (బి) నీటిని దుబారా చేయటం (సి) నిలిచి ఉన్న నీళ్ళలో స్నానం చేయటం (డి) మర్మాంగాన్ని కడగటం
1. ………………………………మరియు ……………………..గుసుల్‌లోని సున్నతులు.
2. ……………………………..మరియు……………………….గుసుల్‌లోని మక్రూహాత్‌లు

 సరైన సమాధానం ఎన్నుకోండి:
3. గుసుల్‌ అర్కానుల్లో సంకల్పం ఒకటి
(అ) అవును
(ఆ) కాదు
4.సున్నత్‌ విధానం ఏమిటంటే ముందు ఎడమ పార్శ్యం కడిగి తర్వాత కుడి పార్శ్యం కడగాలి
(అ) అవును
(ఆ) కాదు
5. గుసుల్‌ ఫర్జ్‌లలో చెవులు,నాభి,గోర్ల క్రింది భాగం కడగటం కూడా ఉంది.
(అ) అవును
(ఆ) కాదు.

Related Post