ఇల్లు ఆనందాల హరివిల్లవ్వాలంటే….

ఆనందాల ఇల్లు

 బాబుల్‌కి దుఆఁయేఁ లేతీ జా

తుఝ్కో సుఖి సంసార్‌ మిలే

మైకేకి కభీ నా యాద్‌ ఆయే

ససురాల్‌మే ఇత్నా ప్యార్‌ మిలే

హోఁటోఁపె హన్సీకి ధూప్‌ ఖిలే

మాథేపె ఖుషీగా తాజ్‌ రహే

కూతురి ఇల్లు ఆనందాల హరివిలవ్వాలని కోరుకోని  తల్లిదండ్రులుండరు. ఇది ప్రతి తల్లి దండ్రుల కల, ఆశ, ఆశయం కూడా. వారి ఈ కల ఫలించాలంటే వారి దీవెనలతోపాటు వధువుగా వెళుతున్న కూతురిలో సయితం కొన్ని ఉత్తమ లక్షణాలు ఉంటేనే అది సాధ్య మవుతుంది. ఆ మేరకు దోహదపడే కొన్ని విషయాలను తెలుసకుందాం!

భార్యాభర్తలు ఒండొకరి పట్ల గౌరవమర్యాదలు కలిగి ఉండాలని, ఒండొకరి బావోద్వేగాలను అర్థం చేసుకుని మసలుకోవాలని. మన్నింపుల వైఖరి అవలంబించాలని ఇస్లాం హితవు చేస్తోన్ది. పూర్వ కాలం నుండి అన్ని సమాజాల్లో నూ ఉన్న సంప్రదాయం ఏమిటంటే, కూతురి ని పెళ్ళి చేసి భర్త ఇంటికి సాగనంపేటప్పుడు తల్లులు తమ కుమార్తెలకు భర్త పట్ల కలిగి ఉండవలసిన గౌరవమర్యాదల గురించి మరియు అతని పట్ల చూపించవలసిన శ్రద్ధ గురించి నొక్కి వక్కాణించేవారు. ప్రాంతం, సంప్రదాయాన్ని బట్టి ఆ హితవు ఉత్తమంగా నూ, అత్యుత్తమంగాను ఉండేది. అటువంటి ఓ తల్లి హితోపదెశాన్ని ఇక్కడ పొందు పరుస్తు న్నాము. నిజంగా ఆ మాతృమూర్తి మాటలు ముత్యాలే!

ఆమె భర్త పేరు ఔఫ్‌ బిన్‌ ముహల్లమ్‌ ఆష్‌ షైబానీ. ఈయన ఆరబ్బుల్లో గొప్ప వంశానికి చెందిన కీర్తిప్రతిష్టలు గల నాయకుల్లో ఒకరు.  ఆయన సతీమణి మహా గొప్ప వివేకం గల మహిళ. ఆమె తన కూతురిని సాగనంపుతూ ఇలా హితవు పలికింది: ఓ నా గారాలపట్టీ! నీవు గొప్ప వంశానికి వార సురాలివి మరియు మంచి నడవడిక కలదాని వి కాబట్టి ఈ సలహా నీకు అవసరమా?అంటే, అవసరమే అంటాను. ఎందుకంటే ఈ సుగు ణాలు నీలో పుష్కలంగా ఉన్నాయని నాకు తెలుసు. కాని మరచిపోయిన పాఠాన్ని జ్ఞాప కం చేసినట్లుగాను, గుర్తుంటే, సలహాగాను ఉంటుందుందని నేనీ మాటలు చెబుతున్నాను. నా ఈ మాటలను మూట కట్టుకో. ఓ నా చిట్టి తల్లీ! తన తండ్రి ఐశ్వర్యవంతుడు అన్న ధీమాతో భర్త లేకుండా ఓ స్త్రీ అన్నీ చేసు కోగలిగితే మేమంతా భర్త లేకుండానే అన్ని చేసుకోగలిగేవాళ్లము. వాస్తవంగా స్త్రీలు, పురుల కోసం, పురుషులు స్త్రీల కోసం సృష్టించబడ్డారు. కనుక వివాహం అనేది ఓ అనివార్య అంశం.

ఓ నా చిట్టి తల్లీ! నీవు ఏ ఇంటిలో పెరిగావో, ఎక్కడ నడక, నడవడిక నేర్చుకున్నావో ఆ పరి చయ ప్రాంతాన్ని వదిలి తెలియని చోటుకి వెళుతున్నావు. నీకు అంతకు ముందు పరిచ యం లేని ఓ సహచరునితో నీ జీవితాన్ని పంచుకోబోతున్నావు. అతనితో కలిసి బ్రతికేం దుకు బయలుదేరుతున్నావు.నిన్ను మనువాడటం ద్వారా, అతడు నీకు యజమాని అయ్యాడు కాబట్టి అతని వద్ద నీవు సేవకురాలి వలే ఉండె, అతను నీకు సేవకుడి గా మారతాడు.

 

నేను నా స్వహస్తాలతో పొదిగిన ముత్యాల హారాన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను. అది నీకో జ్ఞాపిక మరియు మార్గదర్శి కూడా. మొదటి ముత్యం: నీవు నీ భర్త సహచర్యం లో తృప్తి ఉండు. సర్దుకుపోయే గుణం నీలో ఉండాలి. నీ భర్త మాట, ఆదేెశం పట్ల విధే యత కలిగి ఉండు.

 

రెండవ ముత్యం: సంతృప్తి మనశ్శాంతిని స్తుంది. అసంతృప్తి అనర్థాలను సృష్టిస్తుంది. అలాగే భార్య భర్త పట్ల విధేయత కలిగి ఉండ టం అల్లాహ్‌ాను రాజీ పరుస్తుంది.

మూడవ ముత్యం: నీ భర్త నీ నుండి సువా సన పరిమళాన్ని ఆఘ్రాణించాలేగానీ, దుర్వా సన ఆనవాళ్ళు నీలో కనబడకూడదు.

నాల్గవ ముత్యం: నీవు సదా అతని ముందర అందంగా, సుకుమారంగా ఉండేందుకు ప్రయ త్నించు. నీ దుస్తుల్లోగానీ, మాట, నడవడికలో గానీ అతను ఎలాంటి వికారాన్ని చూడకూ డదు. కాటుక అలంకరణని పెంచుతుందని గుర్తుంచుకో.

అయిదవ ముత్యం: భోజన సమయానికి రుచికరమయిన వంటకాలను అతని కోసం సిద్ధ పరచి ఉంచు. (అతను భోంచేసేంత వరకు ఇంటి విషయాలు, బైటి వ్యవహారాల గురించి చర్చించకు.)

ఆరవ ముత్యం: అతను విశ్రాంతి తీసుకునే సమయంలో ఎలాంటి అలికిడి కాకూండా చూసుకో. ఆకలి తీవ్రత మండుతున్న జ్వాల వంటదయితే, నిద్రాభంగం కోపాన్ని తెప్పించే విషయం అని మరువకు.

ఏడవ ముత్యం: అతని నౌకర్లు మరియు సంతానం పట్ల శ్రద్ధ వహించు. అతని సంద ను, సంసారాన్ని చక్కబెట్టు.

ఎనిమిదవ ముత్యం: నీవు అతని సంపద విషయంలో తీసుకునే జాగ్రత్త నిన్ను అతను


మెచ్చుకునేలా చేస్తుంది. నీవు అతని సంతానం నౌకర్ల విషయంలో చూపే శ్రద్ధ నీలోని ప్రతిభను అతను గుర్తించేలా చేస్తుంది.

తొమ్మిదవ ముత్యం: నీవు నీ భర్త రహస్యా లను ఎన్నటికీ బయట పెట్టకు. అతని ఆజ్ఞ ఉల్లంఘనకు పాల్పడకు.

పదవ ముత్యం: నీవు అతని రహస్యాలను బహిర్గతం చేస్తే అతనికి చేెసిన ద్రోహ భావం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీవు ఆతని ఆజ్ఞ ఉల్లంఘనకి పాల్పడితే అతని హృదయం లో నీ పట్ల ద్వేషభావం చోటుచేసుకుంటుంది.

ఓ నా చిట్టి తల్లీ జాగ్రత్త! అతడు విచారంగా ఉన్నప్పుడు అతని ముందు సంతోషాన్ని ప్రదర్శి ంచకు. అతను సంతోషంగా ఉన్నప్పుడు అతని  ముందు విచారాన్ని కనబర్చకు. ఎందుకంటే మొదటిది యుక్తాయుక్తాల జ్ఞానలేమిని సూచిస్తే, రెండవది – బాధ కలిగిస్తుంది.

నీకు సాధ్యమయిన స్థాయిలో, రీతిలో అతని పట్ల గౌరవభావం కలిగి ఉండు. నీకు వీలయి నంతగా అతనికి అనుకూలంగా మసలుకో.  అప్పుడు నీ సహచర్యం, నీతో సంభాషణ అతనికి ఆనందాన్నిస్తుంది. తద్వార మీరిరు వురు జీవిత మకరందాన్ని తనివితీరా ఆస్వా దించవచ్చు.

తెలుసుకో ఓ నా చిట్టి తల్లీ! నీ సంతోషంకన్నా ముందు అతని సంతోషానికి ప్రాధాన్యతనివ్వు. నీ కోరికలకు ముందు అతని కోర్కెలకు ప్రాముఖ్యతనివ్వు.

ఈ తల్లి చేసిన ఈ మహోపదేశాల్ని తూచా తప్పకుండా పాటించిన ఆ కూతురి కడుపున జన్మించినవారు తర్వాత రాజులై పరిపానా పగ్గాలు చేపట్టారు. అందుకే పెద్దలన్నారు:’ప్రతి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది” అని.

Related Post