అల్లాహ్‌ దాసులుగా మారండి!

 వారిలా ప్రార్థిస్తూ ఉంటారు: ''ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవభీతిపరుల (ముత్తఖీన్‌ల) నాయకులుగా చేయ్యి స్వామీ!''

వారిలా ప్రార్థిస్తూ ఉంటారు: ”ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవభీతిపరుల (ముత్తఖీన్‌ల) నాయకులుగా చేయ్యి స్వామీ!”

కరుణామయిని (రహ్మాన్‌) దాసులు ఎవరంటే,
1) వారు భూమిపై వినమ్రులయి నడుస్తారు.
2) ప్రజలు వారితో మూర్ఖ వాదనకు దిగితే శ్రేయస్కరమయిన మాటే మ్లాడుతారు. పిడివాదానికి దిగకుండా హుందాగా వ్యవహరిస్తూ అక్కడి నుంచి తప్పుకుాంరు.
3) వారు తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగ పడుతూ, నిలబడుతూ రాత్రులు గడుపుతారు.
4) వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు: ”మా ప్రభూ! మాపై నుంచి నరక శిక్షను తొలగించు. ఎందు కంటే ఆ శిక్ష ఎన్నికీ వీడనిది. నిశ్చయంగా అది చాలా చెడ్డ చోటు, చాలా చెడ్డ నివాసం.
5) వారు ఖర్చు పెట్టే సమయంలో అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరీ పిసినారితనం చూపకుండా – రెండింకీ మధ్య సమతూకాన్ని పాిస్తారు.
6) వారు అల్లాహ్‌తోపాటు వేరొక దైవాన్ని మొర పెట్టుకోరు (దర్గాలు, ఉరుసుల రూపంలో జరిగే షిర్క్‌కి పాల్పడరు).
7) అల్లాహ్‌ ఏ ప్రాణిని హత్య చేయడాన్ని నిషేధిం చాడో దానిని హత మార్చరు.
8) వారు వ్యభిచారానికి పాల్పడరు. ఈ చేష్టకు పాల్పడినవాడు పాప ఫలాన్ని పొంది తీరతాడు. ప్రళయ దినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించ బడుతుంది.
9) ఒకవేళ వారి వల్ల ఏదయినా నిర్వాకం జరిగితే పశ్చాత్తాపం చెంది అల్లాహ్‌ వైపు మరలి వస్తారు.
10) వారు అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడయినా వ్యర్థమయిన వాటి గుండా పోవలసి వస్తే హుందాగా ముందుకు దాి పోతారు.
11) వారికి వారి ప్రభువు వాక్యాల ఆధారంగా బోధ పరచినప్పుడు వారు గుడ్డివారుగా, చెవి వారుగా మీద పడి పోరు. (రోధిస్తూ సజ్దా చేస్తారు).
12) వారిలా ప్రార్థిస్తూ ఉంటారు: ”ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవభీతిపరుల (ముత్తఖీన్‌ల) నాయకులుగా చేయ్యి స్వామీ!”
ఇలాంటి వారికే వారి సహన స్థయిర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగ బడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి”. (దివ్య ఖుర్‌ఆన్‌ – 25: 63-75)

Related Post