నఫిల్‌ నమాజులు

 ''అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌(ర)కథనం: దైవప్రవక్త(స) గారి పది రకాతులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. రెండు రకాతులు జుహ్ర్‌ నమాజుకు ముందు, రెండు రకాతులు తరువాత, మగ్రిబ్‌ తర్వాత రెండు రకాతులు, ఇంటి వద్ద చేసేవారు. అలాగే రెండు రకాతులు ఇషా ఫర్జ్‌ నమాజ్‌ అనంతరం ఇంటి వద్దనే చేసేవారు. రెండు రకతులు ఫజ్ర్‌ (నమాజుకు) ముందు చేసేవారు.''   (బుఖారి 1126)

”అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌(ర)కథనం: దైవప్రవక్త(స) గారి పది రకాతులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. రెండు రకాతులు జుహ్ర్‌ నమాజుకు ముందు, రెండు రకాతులు తరువాత, మగ్రిబ్‌ తర్వాత రెండు రకాతులు, ఇంటి వద్ద చేసేవారు. అలాగే రెండు రకాతులు ఇషా ఫర్జ్‌ నమాజ్‌ అనంతరం ఇంటి వద్దనే చేసేవారు. రెండు రకతులు ఫజ్ర్‌ (నమాజుకు) ముందు చేసేవారు.”
(బుఖారి 1126)

ఐ పి సి తెలుగు విభాగం

నఫిల్‌ నమాజులు రెండు రకాలు
1.జమాఅత్‌తో చేయబడేవి
2.జమాఅత్‌తో చేయనివి

జమాఅత్‌తో చేయబడే నఫిల్‌ నమాజులు
(అ) ఫర్జ్‌తో సంబంధమైనవి
(ఆ) ఫర్జ్‌తో సంబంధం కానివి
ఫర్జ్‌తో సంబందమైనవి రెండు రకాలు
(అ) సున్నతె ముఅక్కదహ్‌ా
(ఆ) సున్నతె గైర్‌ ముఅక్కదహ్‌ా
(అ) సున్నతె ముఅక్కదహ్‌ా:
జమాతుతో చేయడం సున్నత్‌ కాని నఫిల్‌ నమాజులు

ఫర్జ్‌తో ముడిపడినవి ఫర్జ్‌తో సంబంధం లేనివి

సున్నతె ముఅక్కదా నిర్ణీత సమయంలో చేయబడేవి

సున్నతే గైర్‌ ముఅక్కదా నిర్ధారిత సమయం పేరు లేనివి”అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌(ర)కథనం: దైవప్రవక్త(స) గారి పది రకాతులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. రెండు రకాతులు జుహ్ర్‌ నమాజుకు ముందు, రెండు రకాతులు తరువాత, మగ్రిబ్‌ తర్వాత రెండు రకాతులు, ఇంటి వద్ద చేసేవారు. అలాగే రెండు రకాతులు ఇషా ఫర్జ్‌ నమాజ్‌ అనంతరం ఇంటి వద్దనే చేసేవారు. రెండు రకతులు ఫజ్ర్‌ (నమాజుకు) ముందు చేసేవారు.” (బుఖారి 1126)

(ఆ) సున్నతె గైర్‌ ముఅక్కదహ్‌:
– నాలుగు రకతులు దొహర్‌కు ముందు,తర్వాత రెండు. జుమా నమాజు జుహ్ర్‌తో సమానం. ఎందుకంటే అది జుహ్ర్‌కి బదులు. దానికి ముందు నాలుగు రకతులు సున్నత్‌. రెండు ముఅక్కదహ్‌,రెండు గైర్‌ ముఅక్కదహ్‌. అదే విధంగా తర్వాత.
– అసర్‌ నమాజుకు ముందు నాలుగు రకతులు.
– మగ్రిబ్‌కి ముందు రెండు రకతులు.
– ఇషా ముందు రెండు రకతులు.
– అజాన్‌ మరియు ఇఖామత్‌ల మధ్య.

ఫర్జ్‌తో సంబంధం కానివి రెండు రకాలు:
1.నిర్ణీత సమయంలో చేయబడే నమాజులు
2.సమయం లేకుండా ఎప్పుడైనా చేసుకునే నమాజులు.
నిర్ణీత సమయాలలో చేయబడే నమాజులు:

తహియ్యతుల్‌ మస్జిద్‌: మస్జిద్‌లో వెళ్ళిన తరువాత కూర్చోవక ముందు రెండు రకాతులు చేయడం.
”దైవప్రవక్త(స) ఈ విధంగా ప్రబోధించారు : మీలో ఎవరయినా మస్జిద్‌లోకి ప్రవేశిస్తే రెండు రకాతులు నమాజ్‌ చేసేంత వరకు కూర్చోకూడదు.” ( బుఖారి 433, ముస్లిం714)

విత్ర్‌ నమాజు: ఇది సున్నతె ముఅక్కదహ్‌ా. విత్ర్‌ అంటే బేసి అని అర్థం. ఈ నమాజు బేసి రకాతుతో ముగిస్తుంది గనక దీన్ని విత్ర్‌ నమాజు అంటారు. దాని సమయం ఇషా నమాజ్‌ అయిపోయిన తర్వాత నుంచి ఉషోదయం వరకు ఉంటుంది. ఈ నమాజు రాత్రిపూట ఆఖరి సమయంలో చేయటం ఉత్తమం. గాఢనిద్రమూలంగా నమాజ్‌ తప్పిపోయే ప్రమాదముంటే ఇషా నమాజు తర్వాతే చేసుకోవలెను.

” దైవప్రవక్త(స) ఇలా ప్రబోధించారు: ఖుర్‌ఆన్‌ గ్రంథ ప్రజలారా! బేసి సంఖ్యలో నమాజ్‌ చేయండి. నిస్సందేహంగా అల్లాహ్‌ా ఒక్కడే. బేసినే ప్రేమిస్తాడు.” (అబూదావూద్‌ 1416)
అబూహురైరా(ర) కథనం: నా మిత్రులు (ముహమ్మద్‌(స)) నాకు మూడు విషయాల గురించి హితోపదేశం చేశారు- ప్రతినెలా మూడు రోజుల ఉపవాసం పాటించమనీ, చాష్త్‌ వేళ రెండు రకాతులు నమాజ్‌ చేయమనీ, నిద్రపోక ముందే విత్ర్‌ నమాజ్‌ చేసుకోమనీ.” (బుఖారి 1880, ముస్లిం 721)
విత్ర్‌ నమాజ్‌ కనీస సంఖ్య ఒక రకాతు. ఒకటి లేకమూడు లేక ఐదు ఈ విధంగా పదకొండు వరకు చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ రకాతుల విత్ర్‌ నమాజ్‌ చేస్తే ప్రతి రెండు రకాతులకి సలాం చేసి చివర్లో ఒక రకాతు చేయవలెను.

ఖియాముల్లైల్‌: నిద్రపోయి లేచి చేసే నమాజునే తహజ్జుద్‌ నమాజ్‌ కూడా అంటారు.
ఖియాముల్లైల్‌ సున్నత్‌. ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు. నిద్ర నుంచి లేసిన తర్వాత నుండి ఫజర్‌ అజాన్‌ వరకు చేసుకోవచ్చు.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”రాత్రిపూట కొంతభాగం తహజ్జుద్‌(నమాజు)లో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను ”మఖామె మహ్‌మూద్‌”కు (ప్రశంసాత్మకమైన, స్థానానికి)చేరుస్తాడు.” (ఇస్రా:79)

అబూహురైరా(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రబోధించారు: ఫర్జ్‌ నమాజుల తర్వాత అన్నిటికంటె ఉత్తమమైన నమాజు ఖియాముల్లైల్‌. (రాత్రిపూట చేసే నమాజు). (ముస్లిం 1163)

సలాతుజ్జుహా: (చాష్త్‌ నమాజు) చాష్త్‌ నమాజ్‌ కనిష్ఠ సంఖ్య రెండు రకాతులు. గరిష్ఠ ఎనిమిది రకాతులు. దీని సమయం సుర్యోదయం తర్వాత నుంచి మొదలయి (జవాల్‌) సూర్యుడు నెత్తి నుండి వాలక ముందు వరకు ఉంటుంది. సూర్యుడు పావు భాగం ఉదయించిన తర్వాత చేయటం ఉత్తమం.

సలాతుల్‌ ఇస్తిఖారహ్‌: మక్రూహ్‌ కాని సమయాలలో రెండు రకాతుల నమాజ్‌. (రెండు గానీ లేదా అంతకంటే ఎక్కువ ధర్మ సమ్మతమైన పనుల్లో తనకు లాభదాయకమైన పనిని ఎన్నుకునే సద్బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని కోరటం) నమాజ్‌ చేసిన తర్వాత రూఢీ అయిన దుఆ ద్వారా దుఆ చేయటం సున్నత్‌ విధానం. అల్లాహ్‌ా ఆ పనిని చేసే సద్బుద్ధిని ప్రసాదిస్తే చేయాలి లేక పోతే వదిలేయాలి.
జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) వివరించారు: అన్ని పనులనూ ఇస్తిఖారహ్‌ చేసే విషయంలో దైవప్రవక్త(స) ఖుర్‌ఆన్‌లోని ఏదయినా సూరాను బోధించినట్లే బోధించేవారు. ఆయన(స) సెలవిచ్చారు: ”మీలో ఎవరయినా ఏదయినా పని చేయాలను కున్నప్పుడు ఫర్జ్‌తోపాటు రెండు రకాత్‌లు నమాజ్‌ చేసి ఈ దుఆ చేయండి.

”అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక, వ అస్తఖ్‌దిరుక బిఖుద్‌రతిక, వ అస్‌అలుక మిన్‌ ఫజ్‌లికల్‌ అజీం, ఫఇన్నక తఖ్‌దిరు వలా అఖ్‌దిరు, వ త-లము వలా అ-లము, వ అన్‌త అల్లాముల్‌ గుయూబ్‌, అల్లాహుమ్మ ఇన్‌కున్‌త త-లము అన్న హాజల్‌ అమ్‌ర ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్‌రీ, ఫఖ్‌దుర్‌హులీ, వ యస్సిర్‌హులీ, సుమ్మ బారిక్‌లీ ఫీహ్‌ా, అల్లాహుమ్మ ఇన్‌ కున్‌త త-లము అన్న హాజల్‌ అమ్‌ర షర్రుల్లీ ఫీదీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్‌రీ ఫస్‌రిఫ్‌హు అన్నీ వస్‌రిఫ్‌నీ అన్‌హు, వఖ్‌దుర్‌ లియల్‌ ఖైర హైసు కాన, సుమ్మ అర్‌జినీ బిహీ”. (బుఖారి 1109)

అర్థం: ఓ అల్లాహ్‌! నిస్సందేహంగా నీ నుండి జ్ఞానంతో పాటు మేలును కోరుతున్నాను. నీ మహిమతోపాటు నీనుండి శక్తిని కోరుతున్నాను. నీ గొప్ప దయను కోరుతున్నాను. నిశ్చయంగా నీవు అధికారం గలవాడవు. నాకు అధికారం లేదు, నీవు ఎరుగుదువు. నేను ఎరుగను. నీవు అగోచరాలను బాగా ఎరుగుదువు. ఓ అల్లాహ్‌ా! నీ జ్ఞానాన్ని అనుసరించి ఈ పని నా కోసం, నాధర్మం, నా ఉపాధి నా పర్యవసానానికి ఉత్తమమయినదయితే దాన్ని నా అదృష్టంలో చేర్చు. దాన్ని నా కోసం సులభం చెయ్యి. నా కోసం దానిలో సమృద్ధి నివ్వు. నీ జ్ఞానాన్ని అనుసరించి ఈ పని గనుక నాకోసం నా ధర్మం, నా ఉపాది
మరియు నా పర్యవసానం రీత్యా చెడ్డది అయితే దాన్ని నా నుండి దూరం చెయ్యి. నన్ను దాని నుండి దూరం చెయ్యి. మేలు ఎక్కడున్నా దాన్ని నా అదృష్టంలో చేర్చు. దానిపై నన్ను సంతోషపరచు.”

2. నిర్ణీత సమయం లేని నఫిల్‌ నమాజులు:
ఏ సమయాలలో నమాజ్‌ చేయడం అయిష్టకరమో(మక్రూహ్‌) ఆ సమయాలలో తప్ప ఏ సమయంలోనైనా, ఎన్ని రకాతులైనా నమాజ్‌ చేయడం. రాత్రిపూటనైనా, పగటిపూటనైనా నఫిల్‌ నమాజులు రెండేసి చదవటం ముస్తహబ్‌.
అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమర్‌(ర) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త(స)తో రాత్రి నమాజు గురించి ప్రశ్నించాడు: దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”రాత్రి నమాజులు రెండేసి రకాతులుగా ఉన్నాయి.” ( బుఖారి 946)

పరీక్ష 20

సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:

(ఎ) 3 (బి) మగ్రిబ్‌కి ముందు రెండు రకాతులు (సి) ఫజర్‌కి ముందు రెండు రకాతులు (డి) 1(ఇ) 11
(ఎఫ్‌) మగ్రిబ్‌ తర్వాత రెండు రకతులు (జి) అజాన్‌ మరియు ఇఖామత్‌ల మధ్య చేసే నమాజులు (ఎచ్‌) 13

1. విత్ర్‌ నమాజ్‌ కనీసం………………………రకాతు. ఇంకా ………………………రకాతులు. మరియు విత్ర్‌ నమాజ్‌
గరిష్ఠ సంఖ్య……………………..
2……………..మరియు……………..సున్నతె ముఅక్కదహ్‌ా,కాని…………..మరియు………..సున్నతె గైర్‌ముఅక్కదహ్‌.

సరైన సమాధాన్ని ఎన్నుకోండి:

3.చాష్త్‌ నమాజు సమయం సూర్యుడు కొంచెం ఉదయించిన తర్వాత నుంచి ఆకాశం మధ్యలో వచ్చేవరకు ఉంటుంది.
(అ) అవును
(ఆ) కాదు
4.ఖియాముల్లైల్‌ రాత్రి 10 నుండి ఉదయం 11:30 వరకు.
(అ) అవును
(ఆ) కాదు
5. ఇస్తిఖారహ్‌ నమాజు రెండుపనుల్లో తనకు లాభాదాయకమైన పనిని ఎన్నుకునే సద్బుద్ధిని ప్రాదించమని కోరడం.
(అ) అవును
(ఆ) కాదు

Related Post