నమాజ్‌ కొరకు షరతులు

ఇబ్నె అబ్బాస్‌(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) మక్కా లేక మదీనాలోని తోటలోగుండా వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వారి సమాధులలో శిక్షించబడుతున్న శబ్దాన్ని విన్నారు. వెంటనే ప్రవక్త(స) ఇక్కడ ఇద్దరు శిక్షింబడుతున్నారు, దైవప్రవక్త(స) ఇలా అన్నారు ''వీరిద్దరు శిక్షింబడుతున్నారు కాని పెద్ద కారణంగా శిక్షించబడటం లేదు'' తరువాత ఇలా అన్నారు ''జాగ్రత్తగా వినండీ, వీరిద్దరిలో ఒకరు మూత్ర విసర్జన చేసేటప్పుడు జాగ్రత్త వహించేవాడు కాదు. మరియు రెండవ వ్యక్తి చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు. తరువాత దైవప్రవక్త(స) ఒక చెట్టు కొమ్మను తెప్పించి దానిని రెండు భాగాలుగా త్రుంచి వారిద్దరి సమాధులపై పూడ్చారు. మీరిలా ఎందుకు చేసారని ప్రశ్నించగా ఆయన(స) బహుశ ఆ కొమ్మలు ఎండిపోయేంత వరకు వారికి శిక్ష తగ్గవచ్చు అని సమాధానమిచ్చారు. (బుఖారి 213)

ఇబ్నె అబ్బాస్‌(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) మక్కా లేక మదీనాలోని తోటలోగుండా వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వారి సమాధులలో శిక్షించబడుతున్న శబ్దాన్ని విన్నారు. వెంటనే ప్రవక్త(స) ఇక్కడ ఇద్దరు శిక్షింబడుతున్నారు, దైవప్రవక్త(స) ఇలా అన్నారు ”వీరిద్దరు శిక్షింబడుతున్నారు కాని పెద్ద కారణంగా శిక్షించబడటం లేదు” తరువాత ఇలా అన్నారు ”జాగ్రత్తగా వినండీ, వీరిద్దరిలో ఒకరు మూత్ర విసర్జన చేసేటప్పుడు జాగ్రత్త వహించేవాడు కాదు. మరియు రెండవ వ్యక్తి చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు. తరువాత దైవప్రవక్త(స) ఒక చెట్టు కొమ్మను తెప్పించి దానిని రెండు భాగాలుగా త్రుంచి వారిద్దరి సమాధులపై పూడ్చారు. మీరిలా ఎందుకు చేసారని ప్రశ్నించగా ఆయన(స) బహుశ ఆ కొమ్మలు ఎండిపోయేంత వరకు వారికి శిక్ష తగ్గవచ్చు అని సమాధానమిచ్చారు. (బుఖారి 213)

ఐ పి సి తెలుగు విభాగం
నమాజు కొరకు షరతులు అంటే నమాజ్‌ చేయడానికి ముందు తప్పనిసరిగా చేసుకోవాల్సిన కార్యాలు. ఇవి నమాజ్‌లోని భాగాలు కాకపోయినప్పటికీ ఈ కార్యాలు చేయనిదే నమాజు నెరవేరదు.
ఇమామ్‌ షాఫయి దగ్గర నాలుగు విషయాలను నమాజ్‌ షరతులు అంటారు.
(1) తహారత్‌ (పరిశుభ్రత)
(2) సమయం అయిందని తెలుసుకోవటం.
(3) సతర్‌ను పాటించటం.
(4) ఖిబ్లా వైపు ఉండటం
తహారత్‌ (శుచీ శుభ్రత)
శుచీ శుభ్రతల గురించి మనం తహారత్‌ అధ్యాయంలో తెలుసుకున్నాం. శుభ్రత చాలా రకాలుగా విభజించబడినది, సరైన పద్ధతిలో నమాజ్‌ చేయుటకు మనం వీటన్నింటినీ వివరంగా తెలుసుకోవటం అవసరం, అవి:
1. హదసె అస్గర్‌ మరియు హదసె అక్బర్‌ నుండి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం. (ఏ అశుద్ధత గుసుల్‌ (స్నానం)చేయడం ద్వారా మాత్రమే దూరమవుతుందో దాన్ని హదసె అక్బర్‌ అంటారు. మరియు ఏ అశుద్ధత వుజూ చేయడం వల్ల దూరమవు తుందో దాన్ని హదసె అస్గర్‌ అని అంటారు.)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”శుభ్రత లేనిదే నమాజు స్వీకరించబడదు.” (ముస్లిం 224)
2. నజాసత్‌ (మలినాల) నుండి దేహాన్ని శుభ్రపరచడం: నజాసత్‌ మరియు దాని రకాలు గురించి తహారత్‌(శుచీశుభ్రత) అధ్యాయంలో తెలుసుకున్నాము.

ఇబ్నె అబ్బాస్‌(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) మక్కా లేక మదీనాలోని తోటలోగుండా వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వారి సమాధులలో శిక్షించబడుతున్న శబ్దాన్ని విన్నారు. వెంటనే ప్రవక్త(స) ఇక్కడ ఇద్దరు శిక్షింబడుతున్నారు, దైవప్రవక్త(స) ఇలా అన్నారు ”వీరిద్దరు శిక్షింబడుతున్నారు కాని పెద్ద కారణంగా శిక్షించబడటం లేదు” తరువాత ఇలా అన్నారు ”జాగ్రత్తగా వినండీ, వీరిద్దరిలో ఒకరు మూత్ర విసర్జన చేసేటప్పుడు జాగ్రత్త వహించేవాడు కాదు. మరియు రెండవ వ్యక్తి చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు. తరువాత దైవప్రవక్త(స) ఒక చెట్టు కొమ్మను తెప్పించి దానిని రెండు భాగాలుగా త్రుంచి వారిద్దరి సమాధులపై పూడ్చారు. మీరిలా ఎందుకు చేసారని ప్రశ్నించగా ఆయన(స) బహుశ ఆ కొమ్మలు ఎండిపోయేంత వరకు వారికి శిక్ష తగ్గవచ్చు అని సమాధానమిచ్చారు. (బుఖారి 213)
3.దుస్తుల పరిశుభ్రత:
శరీరం మాత్రమే అశుద్ధత లేకుండా శుభ్రంగా ఉంటే సరిపోదు, నమాజు చదువుటకు ధరించే దుస్తులు కూడా అన్ని రకాల అశుద్ధత నుండి శుభ్రంగా ఉండాలి.

ఖౌలహ్‌ బిన్తె యసార్‌ (ర) దైవప్రవక్త (స) వద్దకు వచ్చి ఓ దైవప్రవక్తా! నా దగ్గర ఒకటి కంటే ఎక్కువ బట్టలు లేవు. ఆ బట్టలోనే నా బహిష్టు రోజులు గడుస్తాయి, నేనేమి చేయాలని ప్రశ్నించారు. దైవప్రవక్త (స) ”నీ బహిష్టు కాలం ముగిసి నీవు శుభ్రత పొందాక ఆ బట్టను నీటితో కడిగి దానినే ధరించి నమాజు చదువు” అని సమాధానమిచ్చారు. ఒకవేళ రక్తపు మరకలు వెళ్ళకపోతే? అని ఆవిడ మళ్ళీ ప్రశ్నించారు, అప్పుడు దైవప్రవక్త (స) నీవు రక్తాన్ని నీటితో కడిగేస్తే చాలు, ఒకవేళ దాని మరక పూర్తిగా వదలక పోయినా నీకేమి నష్టం కలగదని తెలియజేశారు. (అబూదావూద్‌ 365)
4. నమాజ్‌ చేయుటకు ఎంచుకున్న స్థలం శుభ్రంగా ఉండవలెను.
నమాజు చేయటుకు ఎంచుకున్న స్థలం అంటే నమాజు చేసేటప్పుడు నిలబడేటప్పుడు, రుకూ సజ్దా చేసేటప్పుడు, చేతులు, నుదుటి, ముక్కు భూమిపై ఉంచేటప్పుడు అతను ధరించిన బట్టలు ఎంత దూరమైతే భూమిని తాకుతాయో ఆ ప్రదేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. ఈ షరతు విధించటానికి గల ఆధారం దైవప్రవక్త(స) జీవితంలో ఒకసారి ఒక పల్లెటూరు వాసి మస్జిద్‌లో ప్రవేశించి మూత్రవిసర్జన చేయసాగాడు, దైవప్రవక్త(స)నీరు తెప్పించి ఆ స్థలంపై కుమ్మరించమని ఆదేశించారు.

సమయం అసన్నమయిందని తెలుసుకోవటం.
ఫర్జ్‌ నమాజు కొరకు సమయం నిర్ణయించబడిందని మనం ముందే తెలుసుకున్నాం. కావున ప్రతి వ్యక్తి తప్పనిసరిగా నమాజు నిర్ణీత సమయంలోనే చదువుకోవాలి. మరియు నమాజ్‌ చదివే వ్యక్తి నమాజు చదవబడే నిర్ణీత సమయాలను తప్పని సరిగా తెలుసుకోవాలి. ఎందుకనగా నమాజ్‌ సమయం అసన్నమయిందన్న విషయం తెలుసుకోకుండానే నమాజ్‌ చదివితే అతని నమాజు స్వీకరించబడదు. తర్వాత అతను నమాజు సరైన సమయానికే చదివాడని తేలినప్పటికీ చదివేటప్పుడు నమాజు సమయం మొదలైందని తెలుసుకోలేదు కావున అతని నమాజు చెల్లదు.

సమయం అసన్నమైందని తెలుసుకునే మార్గాలు:

క్రింద ఇవ్వబడిన మూడు విధానాలతో సమయాన్ని తెలుసుకోగలము.
1. స్పష్టమైన జ్ఞానం: అనగా కొన్ని స్పష్టమైన ఆధారాలతో సమయాన్ని అర్థం చేసుకోవటం. ఉదాహరణకు సూర్యున్ని చూచి అది ఆస్తమిస్తున్నప్పుడు(మగ్రిబ్‌) నమాజ్‌కి సమయం అసన్నమయిందని గ్రహించడం.
2. ఇజ్తెహాద్‌. అంటే మనిషి కొన్ని అస్పష్టమైన ఆధారాలను చూచి తెలుసుకునే ప్రయత్నం చేయటం. ఉదాహరణకు: నీడను చూచి అది ఇంత పొడుగు సాగిందంటే ఫలాన నమాజు సమయం మొదలైందని అంచనా వేయటం.
3.తఖ్లీద్‌. (ఇతరులను అనుసరించటం) ఒక వ్యక్తి అజ్ఞాని అతను ఆధారాల ద్వారా లేక ప్రయత్నాల వల్ల సమయాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడంటే అతను బాగా ఆధారాలు తెలుసున్న పండితున్ని అనుసరించాలి. లేక ఎవరన్న కొన్ని ఆధారాల ద్వారా అంచనా వేయగలుగుతున్న వ్యక్తినైనా అనుసరించాలి.

సమయానికి ముందే చేయబడిన నమాజుపై తీర్పు:
ఎవరికయినా సమయానికి ముందే నమాజు చదివాడని తెలిస్తే అతను ఉద్దేశపూర్వకంగా చదివినా, లేక ప్రయత్నం విఫలమవ్వటంవల్లనో, లేక మరొకరిని అనుసరిస్తూ చదివినా అతని నమాజు చెల్లదు. అతను తప్పనిసరిగా మళ్ళీ సమయానికి నమాజ్‌ చేయవలెను.

సతర్‌ను పాటించటం:

షరీయతు ప్రకారం శరీరపు ఏఏ భాగాలను తప్పనిసరిగా కప్పుకోవాలో, మరియు శరీరపు ఏఏ భాగాల వైపు చూడరాదో ఆ భాగాలను దాచటాన్ని ”సత్రుల్‌ ఔరహ్‌ా” అని అంటారు.
నమాజులో కప్పవలసిన శరీర భాగాల హద్దులు.
పురుషులకు: మోకాళ్ళ నుండి నాభి వరకు
స్త్రీలకు: మొహం మరియు అరచేతులు తప్ప మొత్తం శరీరము.

ఆయిషా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా తెలియజేశారు: ” ఎవరికయితే బహిష్టు అవుతుందో (అంటే ఏ స్త్రీ యుక్త వయస్సుకు చేరిందో) ఆమె వోణీ కుప్పుకునే దాకా అల్లాహ్‌ ఆమె నమాజును స్వీకరించడు.” ( తిర్మిజి 277)

 ఖిబ్లా వైపు ముఖం చేయడం:

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ” ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపునకు త్రిప్పు, మీరు ఎక్కడ ఉన్నాసరే మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి…..” (అల్‌ బఖర 150)

దైవప్రవక్త(స) నమాజు నేర్పిస్తూ ఇలా బోధించారు ”నీవు నమాజు చేయదలచినప్పుడు సవ్యంగా, చక్కగా వుజూ చెయ్యి తరువాత ఖిబ్లా వైపు ముఖం తిప్పి ‘అల్లాహు అక్బర్‌’ అని తక్బీర్‌ పలుకు” (బుఖారి 5897, ముస్లిం 397)
దైవప్రవక్త(స) మదీనాకు హిజ్రత్‌ చేసిన ప్రారంభంలో ఖిబ్లా వైపు (కాబా వైపు) ముఖం చేయాలని ఆదేశించబడినది.

పరీక్ష 12

సరైన సమాధానమేదో కనుక్కోండి

1.నమాజు షరతులలో ఒక షరతు తహారత్‌
(అ) హదస్‌ నుండి శుద్ధత పొందుట.
(ఆ) శరీరం, బట్టలు, స్థలం శుభ్రంగా ఉండాలి.
(ఇ) పైన తెలుపబడినవన్నీ శుభ్రంగా ఉండాలి.
2. పరుషుడు నమాజులో కప్పవలసిన భాగాలు:
(అ) పిడికిలి నుండి మొకాళ్ళ వరకు.
(ఆ) నాభి నుండి మొకాళ్ళ వరకు.
(ఇ) ముఖం మరియు మోచేతులు తప్ప మొత్తం శరీరం కప్పబడి ఉండాలి.
3.స్త్రీలు సతర్‌ను పాటించే షరతు అన్ని నమాజులలో వర్తిస్తుంది.
(అ) అవును.
(ఆ) కాదు.
4.ఒక వ్యక్తి దొహర్‌ నమాజు సమయం ప్రారంభమైందని స్పష్టంగా తెలుసుకోకుండానే నమాజు చేసాడు. తరువాత అతను సరైన సమయానికే నమాజు చదివాడని రుజువైంది. అతని నమాజు:
(అ) చెల్లుతుంది.
(ఆ) చెల్లదు.

Related Post