హజ్‌-ఉమ్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పారభాషిక పదాలు

Haj_03
ఇహ్రాం: ఉమ్రా లేక హజ్‌ లేదా రెండింటి కోసం ఒకేసారి దీక్ష బూనటం.
ఇహ్రాం దుస్తులు: దీక్ష సందర్భంగా ధరించే రెండు తెల్లటి దుప్పట్లు.
ముహ్రిం: మీఖాత్‌ చేరుకున్న పిదప హజ్‌ – లేదా ఉమ్రాకరొకు దీక్ష బూనిన వ్యక్తిని  ముహ్రింగా వ్యవహరిస్తారు.
హరమీ: స్వదేశి అయినా, పరదేశి అయినా హరంలో నివసించే వ్యక్తి.
హజ్‌ మాసాలు: 1) షవ్వాల్‌ 2) జుల్‌ ఖఅదా 3) జుల్‌హిజ్జ మాసపు మొదటి పది  రోజులు.
ఇస్తిలామ్‌: హజ్రె అస్వద్‌ (నల్లరాయి)ని ముద్దాడటం లేదా చెయ్యితో తాకటం, దూరం నుండి సైగ చెయ్యటం.
ఇజ్‌తిబా: ఇహ్రాం దుప్పటిని కుడి భుజం క్రింద నుండి తీసి ఎడమ భుజంపై వేసుకో వటం, అంటే కుడి భుజం తెరచివుంటే, ఎడమ భుజం కప్పబడి ఉండాలి.
తష్రీఖ్‌ దినాలు: జుల్‌హిజ్జ 11, 12, 13 తేదీలు.
తల్‌బియా: లబ్బైక్‌ అల్లాహుమ్మ లబ్బైక్‌………
తమత్తు: హజ్‌ నెలల్లో ఉమ్రా కొరకు ఇహ్రాం ధరించి, ఉమ్రా చేసి అదే సంవత్సరం  అదే ప్రయాణంలో హజ్‌ ఇహ్రాం కూడా బూని హజ్‌ చెయ్యటం.
ముతమత్తి: హజ్జె తమత్తుకై దీక్ష బూనిన వ్యక్తి.
ఖిరాన్‌: మీఖాత్‌ చేరిన పిదప ఉమ్రా-హజ్‌ల దీక్ష ఒకేసారి బూనటం. అంటే ఉమ్రా  చేసిన తరువాత అవే దుస్తుల మీద హజ్‌ నియమాలను నెరవేర్చటం.
ఖారిన్‌- ముఖ్రిన్‌: హజ్జె ఖిరాన్‌ దీక్ష బూనిన వ్యక్తి.
ఇఫ్రాద్‌: కేవలం హజ్‌ దీక్ష బూనటం. ఈ హజ్‌ చేసే వ్యక్తిని ముఫ్రిద్‌ అంటారు.
మీఖాత్‌: హజ్‌-ఉమ్రాల కోసం మక్కా వెళ్ళే వారు ఏ స్థలానికి చేరాక దీక్ష బూనటం  తప్పని సరో దాన్ని మిఖాత్‌ అంటారు.
సున్నత్‌: హజ్‌-ఉమ్రాలో ప్రవక్త (స) చేసిన పనులు. వీటిని పాటించడం పుణ్యప్రదం. వీటిని వదలడం అవాంఛనీయం.
తహ్లీఖ్‌- హల్ఖ్‌: ఉమ్రాలో తవాఫ్‌ మరియు సయీ తరువాత, హజ్‌లో ఖుర్బాని తరు వాత తలవెంట్రుకలను పూర్తిగా తీసివేయటం.
తఖ్సీర్‌: శిరోముండనానికి బదులు తలవెంట్రుకలను కత్తిరించటం.
దమ్‌: చెయ్యరాని పని చేసినందుకు ఖుర్బాని తప్పనిసరి అవటం.
రమీ: మూడు జమరాత్‌ల దగ్గర కంకర రాళ్ళు రువ్వటం.
రమల్‌: తవాఫ్‌ చేసేటప్పుడు మొదటి మూడు ప్రదక్షిణల్లో కాళ్ళు దగ్గరగా పెడుతూ భుజాలను ఎగురవేస్తూ జోరుగా నడవటం.
షౌత్‌: కాబా గృహ ఒక ప్రదక్షిణని హతీమ్‌తో కలిపి షౌత్‌ అంటారు.
తవాఫె ఖుదూమ్‌: మక్కా చేరుకున్న తరువాత చేసే మొదటి తవాఫ్‌. దీనినే తవాఫె    ఉరూద్‌ మరియు తవాఫె తహియ్యా అని కూడా అంటారు.
తవాఫె ఇఫాజా: జుల్‌హిజ్జ 10వ తేదీన చేసే ప్రదక్షిణ. దీన్ని తవాఫె జియారహ్‌  మరియు తవాఫె రుకున్‌ అని కూడా అంటారు. సమయం 10వ తేదీ రమీ, ఖుర్బాని, హల్ఖ్‌ల తరువాత.
తవాఫె విదా: హరమ్‌ బయట నుండి వచ్చే హాజీలు మక్కా నుండి బయలుదేరక ముందు చేసే ప్రదక్షిణ. దీన్ని తవాఫె సద్ర్‌ అని కూడా అంటారు.
ఫిద్యా – (పరిహారం): చెయ్యరాని పని ఏదైనా చేస్తే ఫిదియా తప్పనిసరి. 3 రోజుల ఉపవాసాలుండాలి లేదా ఆరుగురు నిరుపేదలకు అన్నం   పెట్టాలి. లేదా మేకను జిబహ్‌ా చేసి పేదవారిలో పంచిపెట్టాలి.
సయీ: సఫా – మర్వా కొండల మధ్య ఏడుసార్లు తిరగటం (పచ్చని లైట్లు గల స్థలంలో చిన్నగా పరుగెత్తటం)

 

Related Post