వుజూలో అయిష్టకరమైన విషయాలు

అమర్‌ బిన్‌ షుఐబ్‌ తన తండ్రి మరియు తాతతో ఇలా ఉల్లేఖించారు, దైవప్రవక్త(స) దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఓ దైవ పవ్రక్తా!(స) వుజూ ఎలా చేస్తారు? దైవప్రవక్త (స) ఒక పాత్రలో నీళ్ళు తెప్పించి తమ అరచేతుల్ని మూడు సార్లు కడిగారు, తరువాత ముఖాన్ని మూడు సార్లు కడిగారు,తరువాత మోచేతులను మూడు సార్లు కడిగారు, తరువాత తలపై మసహ్‌ చేసి తమ చూపుడు వ్రేళ్ళను చెవుల లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో చెవుల పైభాగాన్ని మసహ్‌ా చేసారు. తరువాత తమ కాళ్ళను మూడ సార్లు చొప్పున కడిగారు. ఆ తరువాత వుజూ (విధానం) అంటే ఇదే అన్నారు. ఎవరైన ఇందులో ఎలాంటి హెచ్చు తగ్గులు చేసినా తప్పు చేసినట్లు మరియు దౌర్జన్యానికి పాల్పడినట్లు అవుతుంది. అన్నారు (అబూదావూద్-135)

2.6.2 వుజూలో అయిష్టకరమైన విషయాలు

1.నీరు వృధా చేయటం:
దైవప్రవక్త(స) ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు: త్వరలో నా ఈ అనుచర సమాజంలో కొందరు శుభ్రత పొందే మరియు దుఆ విషయంలో హద్దుమీరి పోతారు. ( అబూదావూద్-96)
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : ” మితి మీరకండి మితిమీరి పోయేవారిని ఆయ న(అల్లాహ్) ఇష్టపడడు”. (ఆరాఫ్-31)

2. కుడి చేయికి బదులు ఎడమ చేయిని ముందు కడగటం, మరియు కుడి కాలుకి బదులు ఎడమ కాలుని కడగడం.

3. ఎలాంటి కారణం లేకుండానే వుజూ నీటిని తుడవటం. కారణమంటే బాగా చలి ఉన్నప్పుడు, లేక మురికి, చెత్త అంటుకునే అవకాశమున్నప్పుడు, లేక అవయవాలపై నీరు ఉండుట వలన హాని కలిగించే భయమున్నప్పుడు తుడవటంలో తప్పు లేదు.
ఇబ్నె అబ్బాస్‌ (ర) మైమూన(ర)తో ఈ విషయాన్ని ఉల్లేఖించారు, దైవప్రవక్త(స)వద్దకు ఒక రుమాలు తీసుకొచ్చి ఇచ్చారు. కాని ఆయన(స) రుమాలుతో నీటిని తుడవలేదు కేవలం నీటిని విదిల్చారు. (బుఖారి256, ముస్లిం 317)

4. నీళ్ళతో మొహంపై కొట్టటం, ( ఇలా చేయటం మర్యాదకు విరుద్ధం )
5.అవయవాలను మూడు కంటే ఎక్కువ సార్లు కడగటం, మసహ్‌ చేయటం, లేదా మూడుకంటే తక్కువ సార్లు చేయటం.
అమర్‌ బిన్‌ షుఐబ్‌ తన తండ్రి మరియు తాతతో ఇలా ఉల్లేఖించారు, దైవప్రవక్త(స) దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఓ దైవ పవ్రక్తా!(స) వుజూ ఎలా చేస్తారు? దైవప్రవక్త (స) ఒక పాత్రలో నీళ్ళు తెప్పించి తమ అరచేతుల్ని మూడు సార్లు కడిగారు, తరువాత ముఖాన్ని మూడు సార్లు కడిగారు,తరువాత మోచేతులను మూడు సార్లు కడిగారు, తరువాత తలపై మసహ్‌ చేసి తమ చూపుడు వ్రేళ్ళను చెవుల లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో చెవుల పైభాగాన్ని మసహ్‌ా చేసారు. తరువాత తమ కాళ్ళను మూడ సార్లు చొప్పున కడిగారు. ఆ తరువాత వుజూ (విధానం) అంటే ఇదే అన్నారు. ఎవరైన ఇందులో ఎలాంటి హెచ్చు తగ్గులు చేసినా తప్పు చేసినట్లు మరియు దౌర్జన్యానికి పాల్పడినట్లు అవుతుంది. అన్నారు (అబూదావూద్-135)

6. ఎలాంటి కారణం లేకుండా వుజూ అవయవాలను కడుగుటకై ఇతరుల సహాయం తీసుకోవటం అయిష్టకరమైన విషయం ఎందుకంటే ఇలా చేయటం దైవదాస్యానికి విరుద్ధంగా అహంకారాన్ని సూచిస్తుంది.

7. ఉపవాస స్థితిలో పుక్కలించేటప్పుడు మరియు ముక్కును నీళ్ళతో శుభ్రపరిచేటప్పుడు మితిమీరటం అయిష్టకరమైనది. ఎందుకంటే అలా చేయటం వల్ల అతని గొంతులోకి నీరు దిగి అతని ఉపవాసం భంగమయ్యే ప్రమాదముంది.
దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ముక్కులోనికి సరిగా నీరు ఎక్కించండి అయితే ఉపవాస స్థితిలో మాత్రం ఇలా చేయకండి. (అబూదావూద్-142)

2.6.3 వుజూను భంగపరిచే విషయాలు:

1.మలమూత్ర మార్గాల గుండా ఏదయినా వస్తువు విసర్జింపబడటం.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ” మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసి వస్తే…” ( అన్నిసా:43)

అబూహురైరా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”మీలో అవపాన వాయువు వదలిన వ్యక్తి నమాజును అల్లాహ్‌ా అతను వుజూ చేయనంత వరకూ స్వీకరించడు” (ఈ హదీస్‌లో హదస్‌ అనే పదం వాడబడింది) హజ్‌రమౌత్‌ తెగకు చెందిన ఒక వ్యక్తి ఓ అబూహురైరా!(ర) హదస్‌ అంటే ఏమిటి? అని ప్రశ్నించాడు, హదస్‌ అంటే ‘ఫుసాఉన్‌’ మరియు ‘దిరాతున్‌’ అని సమాధానమిచ్చారు.(బుఖారి 135, ముస్లిం 225)
(”ఫుసాఉన్‌” అంటే కడుపు నుండి శబ్దంతో వచ్చేగాలి, ”దిరాతున్‌” అంటే కడుపు నుండి శబ్దం లేకుండా వచ్చేగాలి.)
ఈ హదీసు ఆధారంగానే మలమూత్ర మార్గాల గుండా వెలువడే పదార్థాలు అవి శుద్ధమైనా సరే దాని వల్ల వుజూ భంగ మవుతుందని భావించబడినది.

2. పరుండి నిద్రపోవటం వలన.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ఎవరికయితే నిద్ర వస్తుందో వారు సరి కొత్తగా వుజూ చేసుకోవాలి”.(అబూదావూద్-203)
స్థిరముగా కూర్చుండి నిద్రపోవటం వలన వుజూ భంగమవదు. ఎందుకనగా క్రింది భాగము ఆనుకొని ఉండును, అపాన వాయువు వెలువడే సందేహముండదు. దానికి ఆధారం ఏమిటంటే:
అనస్‌ (ర) ఇలా తెలిపారు: ఇషా నమాజ్‌లో దైవప్రవక్త (స) రాక కోసం సహచరులు తీవ్రంగా నిరీక్షించేవారు.నిద్ర మత్తులో ఒక్కోసారి వారి తలలు వాలిపోయేవి (కునుకు వచ్చేది) కాని వారు సరికొత్తగా వుజూ చేయకుండానే నమాజ్‌ చేసేవారు. (అబూదావూద్-200)
స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే దైవప్రవక్త(స) అనుచరులు మస్జిద్‌లో నమాజ్‌ కోసం ఎదురు చూస్తూ కోర్చుని నిద్రపోయే వారు, దైవప్రవక్త(స) వచ్చిన వెంటనే నమాజ్‌ చేసేవారు.

3. ఏ కారణమైనా సరే మతి చలించడం.
మతి చలించడం మత్తు వలన లేదా స్పృహ కోల్పోవటం వలన లేదా అనారోగ్యం వలన లేదా పిచ్చితనం వలన.
వీటిలో ఏ కారణంగానైనా మతి కోల్పోయినప్పుడు మనిషి శరీరం నుండి ఏదైన పదార్థం వెలువడిందా లేదా అనే అను మానం మిగిలి పోతుంది గనక వుజూ భంగమవుతుంది.

4. అడ్డు లేకుండా అరచేతితో లేదా వ్రేళ్ళతో తన మర్మాంగాన్ని లేక ఇతరుల మర్మాంగాన్ని ముందు భాగమైనా, వెనుక భాగమైనా తాకటం వలన వుజూ భంగమవుతుంది.

2.6.4 వుజూ అవసరమైన విషయాలు.

(వుజూ లేని ఎడల పూర్తి కాని విషయాలు-అవి)
1. నమాజు కోసం.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ” ఓ విశ్వసించిన వారలారా! మీరు నమాజు కొరకు లేచి నప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్‌ చేయండి, చీలమండల వరకు కాళ్ళను కడుక్కోండి.” (అల్‌ మాయిదహ్: 6)
2. కాబా చుట్టూ తవాఫ్‌ (ప్రదక్షిణ) కోసం.
తవాఫ్‌ కూడా నమాజ్‌ లాగే ఒక ఆరాధన కనుక తవాఫ్‌ కోసం వుజూ చేయటం వాజిబ్‌ అవుతుంది.
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ” తవాఫ్‌ కూడా నమాజు లాంటిదే – కాకపోతే తవాఫ్‌లో మాట్లాడుకోవచ్చు. మాట్లాడ దలచినవారు మంచి మాటలే మాట్లాడ వలెను.” ( తిర్మిజీ 960, హాకిం 1/ 459)

3. ఖుర్‌ఆన్‌ను తాకినప్పుడు లేదా ఎత్తుకున్నప్పుడు.
అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు: ” పరిశుద్ధులు మాత్రమే దాన్ని ముట్టుకోగలరు” ( అల్‌వాఖిఅహ్:79)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ” ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోవలెను” ( దారు ఖుత్‌నీ 1/459)

పరీక్ష – 5
సరైన పదాలతో ఖాలీ స్థలాలను పూరించండి:

(అ)ఖుర్‌ఆన్‌ ను ముట్టుకోవటం (ఆ) బిస్మిల్లాహ్‌ పఠించటం. (ఇ) సంకల్పం. (ఈ) సున్నత్‌.
1.అర్కానుల్‌ వుజూ అవి ………………., మొహం కడగటం, మోచేతులను కడగటం, తలపై మసహ్‌ చేయటం, రెండు కాళ్ళు కడగటం, మరియు ఇవన్నీ వరుసక్రమంగా పాటించటం.
2.వుజూ అవసరం ఉన్న విషయాలు అవి నమాజు మరియు……………… ……..మరియు తవాఫ్‌.
3. వుజూలో దట్టమైన గడ్డాన్ని ఖిలాల్‌ చేయటం ………………………………

సరైన సమాధాన్ని ఎంచుకోండి:

4. వుజూలో పుక్కలించటం:
(అ) ఫర్జ్‌. (      ఆ) సున్నత్‌. (       ఇ) హరాం.
5. వుజూ కోసం మిస్వాక్‌ చేయటం:
(అ) ఫర్జ్‌. (     ఆ) సున్నత్‌. (    ఇ) ముబాహ్‌.
6. ఒక స్త్రీ వుజూ చేసేటప్పుడు ముఖం కడగక ముందు రెండు కాళ్ళను కడిగింది
(అ) ధర్మ సమ్మతం.       (ఆ) ధర్మ సమ్మతం కాదు.
7. ఒక మహిళ గోళ్ళపై రంగు (నీల్‌ పాలిష్) పూసుకుని వుజూ చేసినది:
(అ) ఒప్పు.    (ఆ) తప్పు.
8. వుజూ చేసేటప్పుడు నీరు వృధా చేయటం మక్రూహ్‌ (అయిష్టకరమైనది):
(అ) అవును. (ఆ) కాదు.

Related Post