ధర్మోపదేశం

dharmam

సయ్యిద్  అబ్దుస్సలాం ఉమ్రీ  

ధనం ఏ నీడ  ఉండని అంతిమ దినాన అది ఏ విధంగానూ అతనికి పనికి రాదు. పైగా దానిమీద మోజు పెంచుకుని, యుక్తాయుక్తాలను వీడి, న్యాయాన్యాయాలనుపెడ చెవిన పెట్టి బ్రతికిన వారిని అది మహా సర్పమయి యమ యాతనలకు గురి చేస్తుంది. ఆ విషయాని కొస్తే మనిషి ఎంత సంపాదించినా చచ్చాక తోడు తీసుకెళ్ళేది చిల్లిగవ్వ కూడా కాదుగా! అతను చేసుకున్న పాపపుణ్యాలే అతనికుంటాయి అంతే. ధనం ఇహ లోక జీవి తాన్ని సుఖంగా గడపడానికి సహాయ పడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే,  దాన్ని ధర్మ పద్ధతిలో సంపాదించి, ధర్మ పరిధిలో ఖర్చు పెడితేగాని అది పరలోక మోక్షానికి ఉపయోగ పడదు.ధర్మం ఏ ఒక్క వర్గానికి, ప్రాంతానికి చెందినసొత్తు కాదు.ధర్మం అందరిది. ధర్మాన్ని పాటించడం, ధర్మ విధుల్ని నిర్వర్తించడం ఏకొంద రి బాధ్యత కాదు; అందరిది. మహా తెలివివంతులుమొదలు, మామూలు స్థాయి తెలివి గల వారి వరకు, బాగాచదువుకున్న వారు మొదలు అక్షరం ముక్క రాని వారి వరకు,బలవంతులు మొదలు బలహీనుల వరకు, కుబేరులు మొదలు కార్మికులు, కూటికి లేని వారి వరకు- ధర్మాన్ని తెలుసుకునే, ప్రశ్నిం చే, పాటించే హక్కు అందరికీ ఉంటుంది. ఉండితీరాలికూడా. ఫలానా ప్రాంతంలో పుడితేనో, ఫలానా యూనివర్సిటిలో చదువుకుంటేనో, ఫలానా కులంలో జన్మిస్తేతేనో, ఫలా నా భాష మాట్లాడితేనో, ఫలానా వేషధారణ కలిగి ఉంటేనో, ఫలానా రంగు కలి గుంటేనో, పురు డైతేనో, పెద్దవారయితేనో మాత్రమే ధర్మాన్ని, ధర్మ గ్రంథాన్ని చదవాలి. పాటించాలన్న రూలేం లేదు. ఓటు బ్యాంకు కోసం, నోటు బ్యాంకు కోసం వీటి అవసరం ఏ మేరకు ఉన్నా, ధర్మాన్ని నిష్ఠగా పాటి చడానికి వీటన్నింటితో పని లేదు. మరి అవసర మైనవి ఏమిటంటే..ధర్మాన్ని తెలుసుకోవాలన్న తపన, ధర్మాన్ని ఎలా పాటించాలన్న స్పష్టత! ఆ స్పష్టతే ధర్మాధర్మాల మధ్య విభ జన రేఖ. ఆ మాత్రం అవగాహన ఉంటే మన అధ్యాత్మికలక్ష్యం సగం నెరవేరినట్లే. మిగతా యాభై శాతాన్ని సాధి ంచడానికి కార్యాచరణ అవసరం. ప్రణాళిక, వ్యూ హం… దానికి ఏ పేరయి నా పెట్టుకోవచ్చు.  కొంత మందిలో ధర్మాన్ని పాటించాలన్న, నిష్టగా జీవింతాలన్న తపన ఉంటుందిగానీ, ఎలా, ఏ పరిధిలో అన్న స్పష్టత ఉండదు. అలాంటివారే ఎంతో నిష్టతో జీవిస్తున్నట్లు మనకు కనబడినా దర్గాల దగ్గరకెళ్ళి మోకరిల్లుతారు. పీరు బాబాల కోసం ఎగబడతారు. మోసపోతారు.    మరికొందరుంటారు; గుంట నక్కలు – వీరు సమయం కలిసొస్తే తమల్ని తాము బాబాలుగా ప్రకటించుకొన్ని పట్టపగలే నిలువు దోపిడికి పాల్పడతారు.  ప్రజల్ని అన్ని విధాలా కొల్ల గొడ తారు. వారి రక్తమాంసాలతోనే వ్యాపారం చేస్తా రు. ఆ వ్యాపార కేంద్రాల్నే పవిత్ర క్షేత్రాలుగా ప్రచారం చేస్తారు.

ధర్మం మీద అపారమైన ప్రేమ ఉంటే సరిపోదు …ప్రాథమిక సూత్రాలు తెలుసుకోకుండా వీణ మీటితే అపస్వరాలు పలికినట్లు, ధర్మం విషయం లో సయితం ప్రాథమిక పరిజ్ఞానమే లోపిస్తే అప సవ్యతలు చోటు చేసుకొని అపమార్గం పాల్జే స్తాయి. అఖీదయే ధర్మానికి అసలైన పునాది. అర్కానుల్‌ ఈమాన్‌ ఏమిటో, అర్కానుల్‌ ఇస్లాం ఏమిటో, కలిమా అర్థం ఏమిటో తెలుసుకోకుండా ధర్మాన్ని పాటించిన ఏ వ్యక్తీ ఎంతో కాలం సత్య బాటన నడవలేడు. ఏ రంగానికయినా, ఏ వ్యాపా రానికయినా ఈ సూత్రమే వర్తిస్తుంది.  ఓ పది లక్షలు పెట్టి వైద్య శిబిరాలు నిర్వహిం చామనుకోండి, లేదా ఓ 10 కోట్లు పెట్టి అనాథల, అభాగ్యుల, వితంతువుల సంక్షేమ  క్షేత్రాలు నిర్మించామనుకోండి – దాన్ని అల్లాహ్‌ా తనకు ఇవ్వబడిన రుణంగా అంగీక రించి ఉత్తమ రీతిలో దాన్ని తిరిగిస్తాడని, అలా చేయడం స్వయంగా అల్లాహ్‌ాను సేవిం చుకున్నట్టే అవుతుందని, అటువంటి బృహ త్తర కార్యం వల్ల అల్లాహ్  ఎంతో ప్రసన్నుడవు తాడని, తన దాసుల అవసరాలు తీర్చడంలో నిమగ్నుడయి ఉండే దాసుని అవసరాలు   స్వయంగా తానే తీరుస్తాడని దైవప్రవక్త (స) వారు పలు ప్రవచనాల ద్వారా రూఢీ అవు తుంది.

 

అదే ఏ ఉమ్రాకో, హజ్జ్‌కో వెళ్ళామనుకోండి – అది మన పాప ప్రక్షాళన కోసం పనికొ స్తుంది. ‘ఒక ఉమ్రా మరో ఉమ్రాకి మధ్య, ఒక జుమా మరో జుమా మధ్య జరిగే పాపా లను ప్రక్షాళిస్తాయ’న్నారు ప్రవక్త (స).   దురదృష్టకరం ఏమిటంటే బాగా ధార్మిక విద్యార్జన, ప్రాపంచిక విద్యార్జన గరిపినవారు, మంచీ చెడుల విచక్షణ ఉన్నవారు కూడా ధర్మాన్ని రక్షగా కాక, అదో దైవం తమపై విధించిన శిక్షగా భావిస్తున్నారు. నిజంగా నిశితంగా మనం పరిశీలించినట్లయితే ధర్మానికంటూ మనం పెట్టే పెట్టుబడి మనకే చెందుతుంది, మనకే చేరుతుంది. మనం ధర్మ పద్ధతిలో మన కోసం, మన వారి కోసం మనం వెచ్చిస్తున్నది ఆవగింజంతటిదయినా అందులో చిత్తశుద్ధి ఉంటే మహా పర్వత రూపంలో తిరిగి మా వద్దకు వస్తుంది.

ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకొని సంపాదించడంలో బిజీగా ఉన్న ఒక కుమారుడు  ముదిమి థకు చేరుకున్న అమ్మానాన్నలకు వారికిష్టమయిన వస్తువులు కొనిపెట్టాడానుకోండి. అదీ పెట్టు బడే. స్వర్గసౌధాలకు పెట్టే పెట్టుబడి. ‘తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని, తండ్రి స్వర్గపు ద్వారం అని, వారిరువురి ప్రసన్నతలోనే దైవ ప్రసన్నత దాగుంద’ని దైవప్రవక్త (స) నొక్కి వక్కా ణించారు. భార్యాపిల్లలపై పెట్టే పెట్టుబడి ఇహంలో జీవన మకరందాన్ని, పరంలో శాశ్వత కీర్తిని తెచ్చి పెడుతుంది. ‘నీ భార్యకు, నీ సంతానానికి నీవు పెట్టే ముద్దలో సయితం నీకు పుణ్యం ఉంది’ అని స్వయంగా ప్రవక్త (స) వారు సెలవియ్యడమే కాక, ‘సజ్జన సంతానం మరణానంతరం కూడా పనికొస్తుంది. రేపు ప్రళయ దినాన కూడా వారి కారణంగా తల్లిదండ్రుల్ని కీర్తికిరీటాలు తొడిగించి సన్మానించడం జరుగుతుంద’ని తెలియజేశారు.

ఓ పది లక్షలు పెట్టి వైద్య శిబిరాలు నిర్వహిం చామనుకోండి, లేదా ఓ 10 కోట్లు పెట్టి అనాథల, అభాగ్యుల, వితంతువుల సంక్షేమ  క్షేత్రాలు నిర్మించామనుకోండి – దాన్ని అల్లాహ్‌ా తనకు ఇవ్వబడిన రుణంగా అంగీక రించి ఉత్తమ రీతిలో దాన్ని తిరిగిస్తాడని, అలా చేయడం స్వయంగా అల్లాహ్‌ాను సేవిం చుకున్నట్టే అవుతుందని, అటువంటి బృహ త్తర కార్యం వల్ల అల్లాహ్‌ా ఎంతో ప్రసన్నుడవు తాడని, తన దాసుల అవసరాలు తీర్చడంలో నిమగ్నుడయి ఉండే దాసుని అవసరాలు   స్వయంగా తానే తీరుస్తాడని దైవప్రవక్త (స) వారు పలు ప్రవచనాల ద్వారా రూఢీ అవు తుంది.

అదే ఏ ఉమ్రాకో, హజ్జ్‌కో వెళ్ళామనుకోండి – అది మన పాప ప్రక్షాళన కోసం పనికొ స్తుంది. ‘ఒక ఉమ్రా మరో ఉమ్రాకి మధ్య, ఒక జుమా మరో జుమా మధ్య జరిగే పాపా లను ప్రక్షాళిస్తాయ’న్నారు ప్రవక్త (స).   ఓ హదీసు గ్రంథాన్ని,ఒక ఖుర్‌ ఆన్‌ గ్రంథాన్ని మన కొసమే కాక మస్జిద్‌కొచ్చేవారు చదివేం దుకు కొన్నామనకోండి అవి మనో వికాసానికి, పూణ్యానికి కారణభూతం అవుతాయి. మనం చేసే ఈ సత్కార్యాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మానసికంగానో, ఆధ్యాత్మికం గానో సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ధర్మాన్ని పాటిం చడం ద్వారా లభించే ప్రయో జనాల్ని ధనంతో కొనలేము కదా!

ఇకపోతే ధార్మిక విద్యనుచదివే విద్యార్థులు, చదివించే తల్లిదం డ్రులు మూడు రకాలుగా ఉం టారు. నాసి రకం, మధ్య రకం, నాణ్యత గలవారు. ఈ మూడు వర్గాల్లో నాసిరకం తల్లి దండ్రులు నాసిరకపు ఆలోచన ల్నే తమ పిల్లలకిచ్చి ధార్మిక పాఠశాలలకు పంపుతారు.వీరు ఏదోలా చదివి..ఏదోకటి చేసు కు బ్రతకాలి అన్న పరిధి    శారీరకంగానో,మానసికంగానో, ఆధ్యాత్మికంగానో సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మాన్ని పాటించడం ద్వారా లభించే ప్రయోజనాల్ని ధనంతో కొన లేము. దాటవు వీరి లక్ష్యాలు. చదువు పూర్తవడమే ఆలస్యం ఇక పులులు, సింహాలు, తోడెళ్లు లాగా జన వాసాల మీద పడి వారి ఇహాన్ని పరాన్ని భ్రష్టు పట్టిస్తూ ధర్మాన్ని ధనార్జన మార్గంగా చేసుకుని సిగ్గు లేకుండా బ్రతికేస్తారు. వీరు ఊబి నేలను పోలి ఉంటారు. ఇక మధ్య రకం విధ్యార్థులు ఒకరిని మోసం చేసి బ్రతకా లన్న  ఉద్దేశ్యం లేకపోయినా వారి ఆర్జించిన విద్య వల్ల వారి కి, వారి కుటుంబానికి ఏ మేర కు ప్రయోజనం కలుగుతుం దన్న విషయాన్ని ప్రక్కన పెడితే ప్రజలకు మాత్రం వీరి వల్ల ఎలాంటి ధార్మిక ప్రయొజనం చేకూరదు. ఆ దిశగా వారు ఆలోచించరు కూడా. అంటే వీరు ధార్మిక విద్యార్జన గరి పారుగానీ, ధర్మాన్ని తమ కోసం గానీ, ఇతరుల కోసం గానీ శుభప్రదమయినదిగా భావించలేదు.  ఒకవేళ వీరికి సంతానం కలిగి మంచి ఆర్థిక స్తోమత ఉన్నా వారు తమ పిల్లలను ధార్మిక పాఠశాలల్లో మాత్రం చేర్చే సాహసం చేయరు. వారి దృష్టిలో ధార్మిక పాఠశాలలో పడిన శ్రమ, నేర్చుకున్న విద్య ఒక వృధా ప్రయాస తప్ప మరేమీ కాదు. ఒకవేళ అదృష్టవశాత్తు ధార్మిక సేవలు అందించే సువర్ణవకాశం వచ్చినా మొత్తుకుంటూ పని చేస్తారేగానీ మన స్ఫూర్తిగా పని చెయ్యరు. అంతర్జాతీయ వేెదిక పై ధర్మం, ధర్మావలంబీకులు పడరాని పాట్లు పడుతున్నా పట్టనట్టుగా ఉండి పోతారు తప్ప తమవంతు కర్తవ్యంగా ఏదయినా నివారణ, నిరసన చర్యలు చేపడ దామన్న ఆలోచన కూడా వీరి మెదళ్లలో మెదలదు. అంటే వీరు ప్రత్యక్షంగా ఒకరికి కీడు తల పెట్టక పోయినా మేలు చేసే సద వకాశాన్ని సయితం వదులుకుం టారు.

ఇక నాణ్యమైన ఆలోచనలు కలిగిన తల్లిదం డ్రులు వారి సంతానం-వారు ధనికులయినా, నిరుపేదలయినా నిస్వార్థంగా తమ పరిధులలో ధార్మిక సేవల్ని అందించే ప్రయత్నం  చేస్తారు. తాము ఆర్జించిన విద్యను, విజ్ఞానాన్ని లోకాని కి, లోకవాసులకు అందజేస్తారు. అంటే కొంద రు ఆధార పడతారు. కొందరు సొంత కాళ్ళ మీద నిలబడతారు. కొందరు సొంత కాళ్ళ మీద నిలబడటమేకాక ఇతరులకు ఆధారం ఇచ్చే స్థాయికి ఎదుగు తారు. తల్లిదండ్రులుగా మనం ఏ జాబితాలో చేెరాలో, మన పిల్లల్ని ఏ కేటగిరిలో చేర్చాలో మనమే నిర్ణయించుకో వాలి. ఉత్త తల్లిదండ్రులుగా మిగిపోతామో, ఉత్తమ తల్లిదండ్రులుగా మన పేరు నమోదు చేసుకుంటామో మన చేతుల్లోనే ఉంది.ఒకవేళ అల్లాహ్  మనల్ని సజ్జన సంతానానికి తల్లిదం డ్రులుగా ‘కీర్తి కిరీటాలు’ తొడిగించి సన్మానిం చాలనుకుంటే అంత మాత్రం శ్రమ తీసుకోక తప్పదు.

అమ్మనాన్నలుగా మనం చదువు-ఉద్యోగానికి మించి ఎందుకు ఆలోచించం? ఎల్ల కాలం మన పిల్లలు ఒకరి క్రింద పని చేయాలని మనం ఎందుకు ఆశిస్తాము. ప్రాపంచిక విద్య ను నేర్పే తల్లిదండ్రుల ధోరణి ఎలా ఉన్నా ధార్మిక విద్యను చదివించే మన బుద్ధులకు ఏమయింది? ‘ఎవరి దగ్గరయినా ఉద్యోగం చేయాల్సి వచ్చినా పని నేర్చుకోవడానికే చే యాలి. ఆ పనిలో పరిపూర్ణతను సాధించాక రెక్కలు వచ్చిన పక్షివి నువ్వు! ఎంత దూరం వెళ్లగలవన్నది నీ ఇష్టమ. ఎంత పైకి ఎగరగల వన్నది నీ ధైర్యం’ అని మనం మన పిల్లలకు ఎందుకు బోధించము? పిల్లల పెంపకంలో ఆధ్యాత్మిక వికాసమూ ఓ ముఖ్య భాగమే.ధర్మం గురించి, ధర్మనిర్వహణ గురించీ బాల్యంనుండే నూరిపోయాలి. ఈ ఆధ్యాత్మిక అక్షరాభ్యాసం ఎంత తొందరగా జరిగితే అంతే మంచిది. ఇక కన్నవారు నేర్పించినా, నేర్పించకపోయినా పిల్లలుగా వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విష యాలు కొన్నుంటాయి. ఎందుకంటే అందరు తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా అధ్యాపక స్థాయి కి చెందిన వారు కాలేరు గనక.

భయం యువత ప్రధమ శత్రువు. పిరికివాడు గొప్ప ఆలోచనల జోలికి వెళ్ళడు. ఆలోచనలు గొప్పవిగా లేనప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం ఏమంత గొప్పగా ఉండదు.  సలహాలు, సంప్ర తింపులు ప్రతి విషయంలోనూ అవసరమే. కానీ, వారి ప్రతిభాపాటవాలు, శక్తిసామర్థ్యాల గురించి తెలిసిన వారి సలహాలు మాత్రమే తీసుకోవాలి. ”ఒకవేళ మీకు తెలియకపోతే జ్ఞానం గలవారిని అడిగి తెలుసుకోండి”.  అల్లాహ్  ఇలా ఎందుకు చెప్పాడంటే, దారిన పోయే దానయ్యలందరూ ఆధ్యాత్మిక గురువు లు కాలేరు గనక. బద్ధకం మహా ప్రమాద కారి. సమర్థునికి, అసమర్థునికి మధ్య గల వ్యత్యాస రేఖ ఒక్కటే – ‘కష్టమే కాని సాధ్యం’ అంటాడు సమర్థుడు. ‘సాధ్యమే కాని కష్టం’ అంటాడు అసమర్థుడు. కాబట్టి ‘నావల్ల కాదు,  నేను చేయలేనేమో, అంత స్థోమత, స్థాయి, శక్తి నాకు లేదు’ అన్న నిరాశభరిత నిస్పృహల కు స్వస్తి పలికి, ఆ స్థాయి, స్థోమత, శక్తి ఎలా వస్తుందో ఆలోచించాలి.  దురలవాట్లు, దుర్వ్య సనాలు, దురాలోచనలు, ధరాలోభం, ధన దాహం, లోభం, మోహం, మదం, మత్సర్యా లు ధార్మిక విద్యార్థిని దుర్మార్గునిగా పిరికివాని గా తయారు చేస్తాయి. కుబేరుల గుమ్మం దగ్గర చేతులు జోడించి నిలబడే (?) స్థాయికి దిగజార్చుతాయి. పోతే కోపం పతనానికి తొలి మెట్టు. ఈ కారణంగానే ‘మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని మట్టి కరిపించివాడు కాదు బలవం తుడు, కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని నిగ్ర హించుకున్న ధీరశాంతుడే సిసలైన బలశాలి’ అని ప్రవక్త మహనీయులు (స)వారు చెప్పారు.

‘ధార్మికంగా జీవించడం చాలా కష్టం’ అన్న నిరాశజనితమైనది. ధార్మికంగా జీవించడం అంటే కోర్కెల్ని చంపుకొని బ్రతకడం కాదు. ధార్మికంగా నడుచుకుంటూ జీవితంలోని మక రందాన్ని గ్రోలుతూ, నూటికి నూరు శాతం ఆనందిస్తూనే, కోర్కెలకు ఎక్కడ కళ్ళెం వేయా లో అక్కడ మాత్రమే వేయాలి. కోర్కెల్ని అదుపు లో, పొదుపులో పెట్టుకోవాలన్నది త్యాగం కాదు. అలా అని మడి కట్టుకు కూర్చోమని ధర్మం ఉపదేశించదు. దైవానికి బాగా ఇష్టమ యిన పనుల కోసం, మన దేహాలకు సుఖాన్ని కాకుండా, మన ఆత్మలకు శాంతాన్ని, ఆనం దానిచ్చే కార్యాల కోసం మన స్థోమత కొద్దీ  ఖర్చు పెట్టవచ్చు.  అదే సమయంలో ధర్మం అంగీకరించని, అభిలషణీయం కాని వాటి విష యంలో ధర్మం ఎన్ని ఆంక్షలు విధించినా విసుగు చెందాల్సిన అవసరం లేదు. లోకులు ఏమనుకుంటారో,  బంధువులు ఏమనుకుం టారో అన్న సంశయమే ఉండ కూడదు. భూ మ్యాకాశాలంతటి సువిశాలమయిన స్వర్గవనా లలో విహరించాలన్నది మన ఆకాంక్ష అయితే దైవాదేశాలను, దైవప్రవక్త (స) వారి సంప్రదా యాలను మాత్రమే ఆచరణలో పెట్టాలి.’గొప్ప ఆలోచనలు, గొప్ప కార్యాలన్నీ అవహేళతోనే మొదలవుతాయి’ అన్న విషయాన్ని విస్మరించ కండి. సున్నత్‌ స్వర్ణ సౌధాలు నిర్మించాలి. బిద్‌అత్‌లకు గోరీ కట్టాలి. అధిక శాతం విగ్ర హారాధన, సమాధుల ప్రదక్షిణ, ఫాతెహాల, పది మంది స్త్రీల కహానీల, పుక్కిటి పురాణాల సమాజంలో ధర్మాన్ని ఇంత నిష్టగా పాటిస్తే   నలుగురు నవ్విపోతారేమో అన్న అర్థం లేని సంకోచాలు వద్దు. మన ఆర్థిక పరిస్థితులు అనుకూలించినా, ప్రతికూలించినా మనం మాత్రం ధర్మానికి, న్యాయానికి కట్టుబడి జీవిం చాలి.  స్వర్గశిఖర భాగాన్ని అధిరోహించి, సత్యప్రవక్త సహచర్యాన్ని సొంతం చేసుకొని, సత్యప్రభువు దివ్య దర్శనంతో పునీతులం అవ్వాలనుకునే మనకు ఎవరో గేలి చేస్తారన్న చింత ఎందుకు?

చిత్తశుద్ధి ప్రాధాన్యతా క్రమంలో మనల్ని మనం వర్గీకరించుకోవాలి. మనం చేసే ప్రతి కార్యం, ఖర్చు పెట్టే ప్రతి పైసా..మనకు ఆత్మా నందాన్నివ్వాలి. అలా ఇవ్వలేనప్పుడు ఎందుకు అలా లేదో ఆత్మపరిశీలన చేెసుకోవాలి. కటిక దారిద్య్రంలో ఉన్నా ధర్మాన్ని చీదరించుకోకూ డదు. ధార్మిక విద్య వల్ల ఒనగూడేదేమి లేదం టూ చులకన చేసి మాట్లాడకూడదు. ‘దినార్‌ దిర్హమ్‌ లేెనోడు కాదు దరిద్రుడు, ధర్మం లేనో డు, ధర్మప్రకారం బ్రతకనోడు సిసలయిన దరిద్రుడు’ అన్న ప్రవక్త (స) వారి మాటను సదా గుర్తుంచుకోవాలి. ‘ధార్మిక విద్యార్థి పాదా ల క్రింద దైవదూతలు తమ రెక్కల్నిపరుస్తారు. సృష్టిలోని ప్రతి ప్రాణి అతని కోసం దుఆ చేస్తుంది’ అన్న విషయాన్ని విస్మరించకూడదు. మనం ధర్మ పరిధిలో దేన్ని కోరుకున్నా, అది జన్నతుల్‌ ఫిర్‌దౌసిల్‌ ఆలా అయినా సరే, బలంగా కోరుకోవాలి. దాన్ని నిజం చేయడా నికి యావత్తు సృష్టీ ఏకమవుతుంది.

అంతిమంగా ఒక విన్నపం – మన జీవితంలో చివరి నిమిషం మనల్ని నిజంగా ప్రేమించే వారు ఎంత మంది ఉంటారు? అని సమీక్ష జరుపుకోవాలి. ఎంత ఎక్కువ మంది ఉంటే మనమదేస్థాయి విజేతలం. మన పిల్లల్నిమనం బద్ధకస్థులుగా, నిరాశావాదులుగా తయారు చేయకూడదు. వారి జీవితాన్ని వారు నిర్మించు కోగలరన్న స్థాయికి వారిని చేెర్చాలి. సమస్య కంటే తామే శక్తిమమంతులమని వారు నమ్మాలి. సవాళ్లలోను అవకాశాల్ని వెతుక్కో వాలి. అవసరమయితే పద్దతిని మార్చుకోవాలే గానీ మార్గం తప్పకూడదు. ఎందుకంటే వైఫ ల్యం కూడా ఒంటరిగా రాదు; అద్భుతమయిన అవకాశాలను వెంటేసుకుని మరీ వస్తుంది. అయితే ఆ సమయంలో నిరాశ నిస్పృహలలో నిండా మునిగి ఉంటాము గనక వాటిని గమ నించము. ధర్మ మార్గంలో జీవిస్తూ కట్టుబట్ట లతో నడి బజారులో నిలబడాల్సి వచ్చినా సరే వైఫల్యాన్ని అంగీకరించకూడదు. ఎందుకంటే మన అనుమతి లేకుండా మనల్ని ఏదీఎప్పుడూ ఓడించలేదు. మేమోడిపోయామని మనం అనుకుంటే తప్ప. చివరిగా -ఆధ్యాత్మిక నటన మహా ప్రమాదకారి. పామరుల నుంచి పండి తుల దాకా.ఇది అందరికీ వర్తించే బహిరంగ హెచ్చరిక!

Related Post