అల్లాహ్ మళ్ళీ ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ప్రవక్తలు ప్రతి జాతిలోనూ వచ్చారు. దాదాపు ప్రతి ప్రవక్తా మార్గం మరచిన ప్రజలకు రుజుమార్గం చూపిస్తూ పాప క్షమాపణకై విశ్వ ప్రభువుని వేడుకొని ఆయన వైపు మరలితే ఆయన మీకు ప్రపంచ జీవితంలో కూడా శుభాలు, సౌఖ్యాలు ప్రసాదిస్తాడని తెలియజేశాడు. ఇలా ఈ మహా లక్ష్య సాధన కోసం ప్రభవింప జేయబడిన అనేకమంది దైవ ప్రవక్తలను, వారి సముదాయాలను మనం ఎరుగం. ఎందుకంటే అల్ల్లాహ్ వారి గురించి మనకు తెలియజేయలేదు గనక. ఈ విషయాన్నే ఆ పరమ ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు: ”(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలలో కొందరి వృత్తాంతాలు నీకు తెలిపాము. అనేకమంది వృత్తాంతాలు తెలియజేయలేదు”. (దివ్య ఖుర్ఆన్ – 4: 164)
అయితే అల్లాహ్ మనకు ‘ఆద్’ జాతి గురించి, ఇతర కొన్ని జాతుల గురించి తెలియజేశాడు. ఆద్ జాతి ప్రజలు సయితం విగ్రహారాధనకి గురై ఉండేవారు. అలాగే వారిలో నీతి బాహ్యమైన విషయాలు సయితం ఎక్కువగానే ఉండేవి. వారి వద్దకు అల్లాహ్‌ా హూద్ ప్రవక్తను పంపాడు. ఈ విషయాన్ని అల్లాహ్‌ా ఇలా పేర్కొంటున్నాడు: ””ఆద్ జాతి ప్రజల దగ్గరకు మేము వారి సోదరుడు హూద్‌ని (ప్రవక్తగా నియమించి) పంపాము. అతను ఇలా అన్నాడు: ‘నా జాతి ప్రజలారా! అల్ల్లాహ్ాను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీవన్నీ అభూత కల్పనలు తప్ప మరేమీ కావు. (అలాిం మిథ్యా దైవాలను ఇకనైనా వదలి పెట్టండి)”. (దివ్యఖుర్ఆన్ – 11: 50)
అలా ఆయన వారిని సంస్కరించడానికి యత్నించారు. కొందరిని మినహాయించి అధిక శాతం మంది అవిధేయతకు పాల్పడ్డారు. తత్కారణంగా వారిపై భయంకరమైన ఉపద్రవం విరుచుకుపడింది. అల్లాహ్ తన అనుగ్రహంతో హూద్‌ని, ఆయనతోపాటు విశ్వసించిన వారిని రక్షించాడు. చాలా కాలం వరకు నిజ ధర్మాన్నే అనుసరించారు.
ఆ విధంగా అల్లాహ్ అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రవక్తల్ని నియమించి పంపాడు. వారిలోని ఒకరు ‘సమూద్’ జాతి ప్రజలు. వీరి వద్దకు సాలెహ్ ప్రవక్త వచ్చారు. ఆయన సయితం గత ప్రవక్తల బోధనల్ని సత్యమని ధృవపర్చారు. దానికి ఆ జాతి ప్రజలు ఇలా అన్నారు: ”సాలెహ్! గతంలో నీవు మా మధ్య ఎంతో మంచివాడివిగా ఉన్నావు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. (ఉన్నట్టుండి ఇప్పుడేమయింది నీకు?) మా తాతముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ దైవాలను పూజించుకో నీయకుండా మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు? నీవు బోధిస్తున్న విషయం పట్ల మాకు అనుమానంగా ఉంది. అది మమ్మల్ని తీవ్ర సందిగ్ధంలో పడవేసింది”. (ఖుర్ఆన్ – 11: 62)
హజ్రత్ సాలెహ్ (అ)గారి హితబోధతో ప్రభావితులైనవారు ఓ సుదీర్ఘ కాలం వరకు నిజమార్గంపై ఉన్నారు. ఆ తర్వాత హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) ప్రభవింపజేయబడ్డారు. అప్పుడు ఈ విశ్వమంతా ఒక్కడు కూడా ఏకదైవారాధకుడు లేడు. ఆయన ఇరాక్ దేశంలో జన్మించారు. సత్యం, ధర్మం వైపు తన జాతివారిని ఆహ్వానించి ఆయన్ను ఆ జాతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఆయన్ని తొలుత విశ్వసించినవారి భార్య ‘సారా’ మరియు పెదనాన్న కొడుకు హజ్రత్ ‘లూత్ (అ) మాత్రమే. ప్రవక్త ఇబ్రాహీమ్ (అ) గారి రాక అనంతరం ఈ పుడమిపై ఎక్కడో ఓ చోట ఏకదైవారాధకులు ఉంటూనే వచ్చారు. అది కూడా ఆయనగారి వంశానికి చెందినవారే అవడం మరో విశేషం. చూడండి!
”ఇబ్రాహీమ్ వృత్తాంతాన్ని జ్ఞాపకం తెచ్చుకో, అతను తన తండ్రితో, తన జాతి ప్రజలతో ‘మీరు పూజిస్తున్న వాటితో నాకెలాంటి సంబంధం లేదు. నా సంబంధం అంతా నన్ను సృష్టించిన సర్వేశ్వరునితో మాత్రమే ఉంది. ఆయనే నాకు దారి చూపుతాడు’ అన్నాడు. ఈ విషయాన్నే అతను తన సంతానంలో వదలి వెళ్ళాడు – వారు దాని వైపు మరలేందుకు”. (దివ్యఖుర్ఆన్ – 43: 26-28) హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) గారి స్వదేశం ‘ఇరాక్’ అని మనం ముందే తెలుసుకున్నాం. అక్కడి ప్రజలు పెట్టే కష్టాలకి బ్రతుకు భారమై సిరియా దేశానికి తరలి వెళ్ళారు ప్రవక్త ఇబ్రాహీమ్ (అ). అక్కడే ఆయన పరమపదించారు.
ఆయన కాలం నాటి మధుర స్మృతుల్ని గనక మనం కాసేపు నెమరువేసుకుంటే…, ఆయనగారి రెండవ భార్య హజ్రత్ హాజిరా (అ) గర్భం దాల్చి పండంటి ఓ మగ బిడ్డ (ఇస్మాయీల్) కు జన్మనిచ్చింది. హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) అల్లాహ్ ఆనతిపై తల్లీబిడ్డలిద్దరినీ తీసుకెళ్ళి ‘మక్కా’ (ఫారాన్) ఎడారి ప్రాంతంలో వదలి వచ్చారు. ఆ తర్వాత హజ్రత్ ‘సారా (అ)’ ద్వారా హజ్రత్ ఇస్హాఖ్ (అ) జన్మించారు. హజ్రత్ ఇస్హాఖ్ (అ) గారికి హజ్రత్ యాకూబ్ (అ) గారు ప్టుారు. ఆయన్నే ‘ఇస్రాయీల్’ అంటారు. ఆయన సంతానాన్నే ‘బనీ ఇస్రాయీల్’ అంటారు. హజ్రత్ యూసుఫ్ (అ) నుంచి హజ్రత్ ఈసా (అ) వరకు ప్రవక్తలందరూ ‘ఇస్హాఖ్’ గారి వంశంలోనే వచ్చారు. చూడండి దైవం ఎలా ఆశీర్వదిస్తున్నాడో! ”ఇబ్రాహీమ్ కుటుంబ సభ్యులారా! (వినండి) మీపై అల్లాహ్‌ా కారుణ్యం, ఆయన శుభాలు ఉన్నాయి”.(దివ్యఖుర్ఆన్- 11: 73)
అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) కూడా ఇబ్రాహీమ్ (అ) గారి జేష్ఠ పుత్రుడుడైన హజ్రత్ ఇస్మాయీల్ (అ) గారి వంశంలోంచి వచ్చినవారే. ఇటు మక్కాలోనే స్థిరపడిపోయిన హజ్రత్ ఇస్మాయీల్ (అ) గారు మక్కా పట్టణానికి నాయకుడయ్యారు. ఆయన తర్వాత నాయకత్వం ఆయన సంతానంలోనే కొనసాగింది. ఆయనగారి సంతానం రోజు రోజుకి అభివృద్ధి చెందసాగింది. వారు మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విస్తరించారు. వారందరూ కొన్ని వందల సంవత్సరాల వరకు దైవ విధేయతా మార్గమైన ఇస్లాం పైనే నిలకడగా ఉన్నారు. వారందరూ తమ పితామహుడైన ఇబ్రాహీమ్ (అ)గారి బాటపైనే నడిచారు. ఈ విధంగా రేయనక పగలనక కాలం బిరబిరా సాగిపోయింది. చివరికి వారిలో ‘అమ్ర్ బిన్ లుహుయ్యి’ పుట్టుకొచ్చాడు. అతనే బహు దైవారాధనను మళ్ళీ ప్రవేశప్టోడు. ప్రవక్త ఇబ్రాహీమ్ (అ) గారి సంప్రదా యాలను తుంగలో తొక్కివేశాడు. అతని కథ ఇలా మొదలవు తుంది…..