ముస్లిం సోదరులారా! ”విద్యార్జన ప్రతి ముస్లింపై తప్పనిసరి” అన్నారు ప్రవక్త (స). విద్యార్జన అంటే ధార్మిక విద్యార్జన. ధార్మిక విద్యార్జనలో ప్రథమ స్థానం ఫరాయిజ్కి – ధర్మ విధులకు ఉంటుంది. ధర్మ విధుల్లో రెండు రమజానుతో ముడి పడి ఉన్నాయి. ఒకటి రమజాను ఉపవాసాలు, జకాత్. ఈ రెండు విధుల గురించే కాకుండా రమజాను సంబంధిత మరికొన్ని విషయాల గురించి ప్రశ్నోత్తరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అల్లాహ్ ఈ చిరు కృషిలో చిత్తశుద్ధిని అనుగ్రహించి, ఆమోద ముద్రను వేయలాని దీనాతి దీనంగా వేడుకుంటున్నాను. పవిత్ర మాసం ప్రశ్నోత్తరాలు
ప్రశ్న: ముస్లింలపై ఉపవాసాలు ఎప్పుడు ఫర్జ్ అయ్యాయి?
జవాబు: హిజ్రీ శకం 2వ సంవత్సరం. ఆ రకంగా ప్రవక్త (స) మొత్తం 9 రమజానులు ఉపవాసం ఉన్నారు.
ప్రశ్న: ఉపవాస ఉద్దేశ్యం ఏమి?
జవాబు: ఉపవాసం ద్వారా ‘దైవభీతి- తఖ్వా’ అనే అత్యున్నత గుణం, అత్యద్భుత ఆభరణం, అత్యుత్తమ సామగ్రి మనిషికి చేకూరాలన్నదే మొఖ్యొద్దేశ్యం. అళ్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు-”లఅల్లకుమ్ తత్తఖూన్” తద్వారా మీలో దైవభీతి జనింస్తుందని ఆశించ బడతోంది. (అల్బఖరహ్: 183)
ప్రశ్న: తఖ్వా అనగానేమి?
జవాబు: తక్వా నిర్వచనాలు పలువురు పలు విధాలుగా చెప్పారు. హజ్రత్ అలీ (ర) గారు ఇలా అన్నారు: ”మహోన్నతునికి భయ పడటం, అవతరించిన దానిపై (ఖుర్ఆన్పై) ఆమలు చేయడం, తక్కువ ఒనరులతో సంతృప్తి చెందటం, రాబోవు దినం కోసం సన్నాహాలు చేసుకోవడం”.
ప్రశ్న: ప్రవక్త (స) వారు సయితం ఉపవాసమ ఉద్దేశ్యం తఖ్వా అని సూచించారా?
జవాబు: అవును. ఆయన ఇలా అన్నారు: ”ఎవరయితే ఉపవాసం ఉండి అబద్ధమాడటం, అబద్ధఖ ప్రకారం వ్యవహారం చేయడం మానుకోడు అతను ఆహార పానీయాలను విడనాడటం పట్ల అల్లాహ్కు ఎలాంటి ఆసక్తి లేదు”. (బుఖారీ)
ప్రశ్న: ఫర్జ్ ఉపవాస సంకల్పానికి, నఫిల్ ఉపవాస సంకల్పానికి మధ్య తేడా ఏమి?
జవాబు: ఉపవాసం ఏదయినా సంకల్పం తప్పనిసరి. తేడా ఏమిటంటే, ఫర్జ్ ఉపవాసానికి ఫజ్రె సాదిఖ్కి ముందే సంకల్పం చేసుకోవాలి. నపీల్ ఉపవాసానికి కాస్త ఆలస్యంగానయినా సరే సంకల్పంచ చేసుకునే అనుమతి ఉంటుంది.
ప్రశ్న:ఉపవాస విశిష్ఠతను తెలుపగలరా?
జవాబు: ఉపవాసం ఔన్నత్యం ఎంతో ఘనమయినది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా స్వర్గానికి గల (ఎనిమిది) తలుపుల్లో ఓ తలుపు పేరు ‘రయ్యాన్’. రేపు ప్రళయ దినాన ఈ మార్గం గుండా కేవలం ఉపవాస దీకకులు మాత్రమే ప్రవేశిస్తారు. వారికి తప్ప ఇంకెవ్వరికి ఆ మార్గం గుండా ప్రవేశం ఉండదు….” (బుఖారీ, ముస్లిం)
ప్రశ్న: సాధారణ ఉపవాసానికి రమజాను ఉపవాసానికి గల తేడా ఏమి?
జవాబు: రమజాను ఉపవాసాలు విధి. ఇవి తప్ప మిగతా ఉపవాసాలు నఫిల్గా ఉంటాయి. పుణ్యం ప్రతి విధమయినటువిం ఉపవాసానికి లభిస్తుంది. అయితే ”రమజాను సాంతం ఉపవాసాలున్న వ్యక్తి గత పాపాలన్నీ మన్నించ బడతాయి” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (ముత్తఫఖున్ ఆలైహి)
ప్రశ్న: సియామ్ అంటే భావార్థం?
జవాబు: భాషా పరంగా, సౌమ్, సియామ్ అంటే ఆగి ఉండటం. శాస్త్ర పరంగా-అల్లాహ్ ప్రసన్నత కోరుతూ సుబహ్ సాదిఖ్ నుండి మొదలు సూర్యాస్తమయం వరకూ ఉపవాసాన్ని భంగ పర్చే సకల విషయాలకు దూరంగా ఉండటం. ముఖ్యంగా ఆహారపానీయాలు, లైంగిక సంబంధం.
ప్రశ్న: రమాజను ఉపవాసాలు తప్పనిసరి ఫర్జ్ అన్న ఆదేశం ఎక్కడుంది?
జవాబు:”ఇక మీదట ఈ నెలను గన్న వ్యక్తి ఈ మాసపు ఉపవాసాల్ని విధిగా పాటించాలి”. (అల్ బఖరహ్: 184) ప్రవక్త (స) ఇస్లాం మూలాధారాలుగా పేర్కొన్న వాిలో ఒకి రమజాను ఉపవా సం కూడా ఉంది.
ప్రశ్న: ఉపవాసాల రకాలు ఎన్ని?
జవాబు: రెండు. ఫర్జ్ ఉపవాసాలు. ఇందులో రమజాను, మొక్కుబడి, కఫ్ఫారా, ఖజా ఉపవాసాలుంటాయి. నఫిల్ – ఇందులో ప్రతి నెలలో మూడు (చంద్రమానపు 13,14,15 తేది), వారంలో రెండు (సోమ, గురు), తాసూఆ, ఆషూరా, అరఫా దినం ఉపవాసాలుంటాయి.
ప్రశ్న: రమజాన్ ఉపవాసాలు ఎవరి మీద ఫర్జ్?
జవాబు: ముస్లిం, బుద్ధిమంతుడు, యవ్వనస్థుడయినన ప్రతి ముస్లింపై రమాజను ఉపవాసాలు ఫర్జ్. అనివార్య పరిస్థితి, రోగం వంటి కారణాలు ఉంటే తప్ప.
ప్రశ్న: అనివార్య పరిస్థితి అంటే?
జవాబు: స్త్రీలకు బహిష్టు రావడం, పురి రక్తస్రావం.
ప్రశ్న: ఒక బాలుడుగానీ, ఒక బాలిక గానీ యవ్వన థకు చేరకున్నారని ఎలా తెలుస్తుంది?
జవాబు: అబ్బాయి అయితే నాభి క్రింద వెంట్రుకలు రావడం, వీర్య స్ఖలనం అవ్వడం ద్వారా తెలుస్తుంది. అమ్మాయి అయితే బహిష్టు రావడం ద్వారా తెలుస్తుంది. దీనికి వయసు పరిమితం లేదు. ఒకవేళ పై ఏ కారణం కానరాక పోతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా 15 సంవత్సరాలు నిమడిన వారు యవ్వనస్థులుగా పరిగణించ బడ తారు.
ప్రశ్న:గత ఎన్నో సంవత్సరాలుగా ఉపవాసం పాటించని వ్యక్తి ఏం చేయాలి?
జవాబు: అతన్ను అల్లాహ్కు భయ పడాలి. స్వచ్ఛమయిన తౌబా చేసకోవాలి. రమజాను ఉపవాసాలు ఉండటం మొదలు పెట్టాలి. ఎక్కువగా నఫిల్ ఉపాసాలు ఉండే ప్రయత్నం చేయాలి.
ప్రశ్న: ఒక వ్యక్తి రమజాను ఉపవాసాలు విధి కాదని వాదిస్తున్నాడు అతని ఆదేశం ఏమి?
జవాబు: రమాజను ఉపవాసాలు ఫర్జ్ అని తెలిసి కూడా ఉండని వ్యక్తి పాపి అవుతాడు. రమజాను ఉపవాసాలు లేవు అని నిరాకరించే వ్యక్తి ఇస్లాం ధర్మం నుండి వైదొలుగుతాడు. అతన్ని తౌబా చేసుకోమని చెప్పాలి. వినకపోతే అతను కాఫిర్గా పరిగణించ బడతాడు. ఒకవేళ అతను మరణిస్తే ఇస్లామీయ పద్ధతిలో అతనికి శవ సంస్కారాలుచ ఎయ్యడం గానీ, ముస్లింల ఖనన వాికలో సమాధి చెయ్యడం గానీ నిషిద్ధం.
ప్రశ్న: కొందరు రమజాను మాసం ముందు బాగా పాపాలు చేసేసి, రమజాను మాసంలో కమాభిక పొంద వచ్చు అన్న ధీమాతో ఉంారు. వారికి మీ సమాధానం ఏమి?
ప్రశ్న: ముఖ్యంగా యువత సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లకి అతుక్కు పోయి ఉంటారు. ఇది ఎంత వరకు సమంజసం?
జవాబు: సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లనేవి ఒక వరం, సరిగ్గా విని యోగించుకుంటే. లేదంటే అదే మనిషి పాలిట శాపంగా పరిణమి స్తుంది. రమజాను మామసంలో మనిషి ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టిగ్రామ్ విం వాటిని తగ్గించుకొని ఖుర్ఆన్ పారాయణం, రుకూ, సజ్దాలలో సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే, ఉపవాసం ఉండి పగలంతా నిద్రించడంగానీ,టివీకి అతక్కుపోవడం గానీ, స్మార్ట్ ఫోన్ మత్తులో జోగడంగానీ ఒక విశ్వాసికి ఏ విధంగానూ శోభించని విషయం. ”అల్లాహ్ దైవభీతి పరుల నుమడి మాత్రమే స్వీకరిస్తాడు” అన్న స్పృహతో జీవించాలి.