పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు

పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు

మానవుడు చాలా అభివృద్ధిని సాధించాడు, సంతోషకరమైన విషయ మే కాని మరోవైపు చూస్తే మానవులలో పాపాలు కూడా విపరీతంగా పెరిగి పోయాయి. ఎందుకిలాగ జరుగుతుందోనని ఆలోచిస్తే అనేక కారణాలు మనముందుకు వస్తాయి. వాటిలో రెండు కారణాలను ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవలసిన అవసరముంది.

1. పాపము గురించి సరైన అవగాహన లేకపోవటం. ఏది పాపము మరియు ఏది పుణ్యము అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక పోయి నందువలన పాపాలలో అతి ఘోరమైన పాపం బహుదైవారాధనను కూడా ప్రజలు పుణ్యకార్యమని భావిస్తున్నారు.

ఏది పాపము ఏది పుణ్యము అని నిర్ణయించేది మానవులు కాదు. మానవులను సృష్టించిన ప్రభువు అల్లాహ్‌ా. కావున అల్లాహ్‌ా ఆదేశాల ప్రకారం పాపమేదో, పుణ్యమేదో తెలుసుకోవలసిన అవసరం అందరికీ ఉంది.

పాపాన్ని తేలిక (కామన్‌)గా తీసుకుంటున్నారు ప్రజలు. పెద్ద పెద్ద పాపాలు చేస్తూ కూడా ఈ రోజుల్లో ఇది కామన్‌, ఇలాంటివన్నీ మామూలే అని అంటున్నారు.

అనస్‌ (ర) కథనంలో ఇదే విషయం స్పష్టమవుతుంది. ఆయన(ర) ఇలా తెలియజేసారు: ”నేడు మీరు ఏ పాపాలనైతే వెంట్రుక కంటే తేలి కగా తీసుకుంటున్నారో వాటిని మేము ప్రవక్త (స) వారి కాలంలో ప్రా ణాంతకమైనవిగా  భావించే వాళ్ళము.” (బుఖారీ)

అంటే ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కాలంలోని ప్రాణాంతకమైన పాపాలను నేడు ప్రజలు చాలా తేలికగా తీసుకుంటున్న కారణాన ప్రజల్లో పాపాలు అధికమైపోయాయి. ఈ ధోరణి చాలా ప్రమాదకర మైనది. దైవప్రవక్త (స) ఈ విధంగా హెచ్చరించారు: ”పాపాలను తేలికగా తీసుకోకండి, అది (ఈ ఆలోచన) మిమ్మల్ని నిలువునా ముంచే స్తుంది.” (అహ్మద్ )

కారణాలు ఏవైననూ దైవ ఆదేశాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే దానిని పాపం అంటారు  పాపం చేసినవాడు ప్రభువు దృష్టిలో నేర స్తుడు .మరి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే పాపము  చేసిన వ్యక్తికి శిక్ష తప్పదా? లేక అతని పాపపరిహారానికి ఏదైనా మార్గం ఉందా? ఉందనే అంటున్నాడు ఆ కరుణామయుడు అల్లాహ్‌ా. ఏమిటి ఆ మార్గం? అదే పశ్చాత్తాపం. అరబీ మరియు ఉర్దూ భాషలో పశ్చాత్తాపాన్ని ‘తౌబా’ అని అంటారు.

అల్లాహ్‌ా ఈ విధంగా తెలియజేసాడు: ”పాపం చేసిన తరువాత పశ్చా త్తాపం చెంది తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపునకు అల్లాహ్‌ా కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ా క్షమాబిక్ష పెట్టే వాడు కరుణించేవాడూను.” (అల్‌ మాయిదా 5:39)

పై వాక్యం ద్వారా పాపానికి పరిహారం పశ్చాత్తాపమని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రండి, ఇక పశ్చాత్తాపము చెందే విధానాన్ని తెలుసు కుందాం.!

పశ్చాత్తాపం చెందే విధానము: ఖుర్‌ఆన్‌ మరియు హదీసు గ్రంథాలలో తెలుపబడిన పశ్చాత్తాప విధానమేమిటంటే మానవుడు-

1) పాపమును త్యజించాలి, ఇకపై చేయనని దృఢంగా నిర్ణయించుకోవాలి.

2) తాను చేసిన తప్పులపై దైవ సమకంలో సిగ్గుతో కుమిలిపోవాలి.

3) అల్లాహ్ ను క్షమించమని వేడుకోవాలి.

4) ఒకవేళ ఇతరులపై దౌర్జన్యం చేసి ఉన్నా లేక ఇతరుల హక్కును కాజేసి ఉన్నా దానిని తిరిగి ఇచ్చేసి క్షమాపణ కోరుకోవాలి.

ఈ విధంగా మానవుడు పశ్చాత్తాప పడితే అల్లాహ్‌ా అతని అపరాధాన్ని మన్నించుటకు సిద్ధంగా ఉన్నాడు. ”నిశ్చయంగా అల్లాహ్  అమితంగా క్షమించేవాడూ కరుణించేవాడూను.” (తౌబా 9:104)

పూర్వపు ప్రవక్తల మరియు ప్రజల పశ్చాత్తాపము:

పూర్వం గతించిన వారిలో అవిధేయతకు పాల్పడిన చాలా మందిని వారి పశ్చాత్తాపము వలన అల్లాహ్  క్షమించినాడని గ్రంథాలలో కొన్ని ఉదాహరణలు మనకు తెలియపరిచాడు వాటిలో నుండి రెండు ఉదాహరణలు మీ ముందు ఉంచుతున్నాను.

మొదటి ఉదాహరణ: ఆది మానవుడైన ఆదమ్‌ (అ) మరియు ఆయన సతీమణి హవ్వా (అ) వీరిద్దరు స్వర్గంలో ఉన్నప్పుడు అల్లాహ్‌ా నిషేధిం చిన ఓ చెట్టు ఫలాన్ని తిన్న కారణాన వారిద్దరితో పొరపాటు జరిగింది. తరువాత వారిద్దరూ భూమిపైకొచ్చాక అల్లాహ్‌ా సమక్షంలో చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడ్డారు. కరుణామయుడైన అల్లాహ్  వారిద్దరి తప్పిదాన్ని క్షమించాడని ఖుర్‌ఆన్‌లో తెలిపాడు. ”అప్పుడు ఆదం (అ) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకొని (పశ్చాత్తాపం చెందారు) అల్లాహ్‌ా ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తా పాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను.” (బఖర 2:37)

పై వాక్యము ద్వారా ఆదం (అ) గారి అపరాధము ఆయన చేసుకున్న పశ్చాత్తాపము వలన మన్నించబడిందని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఆది మానవుని అపరాధము మానవులందరికి సంక్రమించిన కారణాన ‘మానవుడు జన్మతః పాపి’ అనే సిద్ధాంతము సరికాదని కూడా స్పష్టమ వుతుంది.

Related Post