”అల్లాహ్ తన ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు ‘నేను మీకు గ్రంథాన్ని ఒసగిన తర్వాత మీ వద్ద ఉన్నదాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి. అతనికి సహాయ పడాలి” అని చెప్పాడు. తర్వాత ఆయన ‘ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా?’ అని ప్రశ్నించగా, ‘మేము ఒప్పుకుంటున్నాము’ అని అందరూ అన్నారు. ‘మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతో పాటు నేనూ సాక్షిగా ఉం టాను’ అని అల్లాహ్ అన్నాడు. (దివ్యఖుర్‌ఆన్-3:81)
ఇస్లాం, సమస్త మానవాళికి అల్లాహ్ ప్రసాదించిన ధర్మం. అది తప్ప అల్లాహ్ వద్ద ఆమోదిత జీవన విధానం మరొకటి కాజాలదు. ఇస్లాం ధర్మం అయిదు మూల స్థంభాల మీద ఆధార పడి ఉందని స్వయంగా ప్రవక్త ముహమ్మద్(స)వారు చెప్పిన వాటిలో మొది షహాదతైన్- రెండు సాక్ష్యాలు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్. ఈ ప్రకారం పై ఆయతులో వెలుగులోకి వచ్చే అయిదు విషయాలు ఇవి-
1) ఆదమ్ (అ) మొదలు ప్రవక్త ఈసా (అ) వరకూ అందరితోనూ అల్లాహ్ ప్రమాణం తీసుకున్నాడు.
2) ఒక ప్రవక్త మరో ప్రవక్తను విశ్వసించాలి, విశ్వసించమని తన అనుయాయులకు చెప్పాలి.
3) ప్రవక్తలందరూ అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారిని విశ్వసించాలి. విశ్వసించమని తమ తమ అనుయాయులకు తాకీదు
చేయాలి.
4) ‘నష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ నష్హదు అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ -నిశ్చయంగా అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడని మేము సాక్ష్యమిస్తున్నాము. మరియు ముహమ్మద్ (స) అల్లాహ్ ప్రవక్త అని మేము సాక్ష్యమిస్తున్నాము-అని ప్రవక్తలందరూ ముక్త కంఠంతో అన్నారు.
5) ‘అష్హదు అన్న ముహమ్మదన్ రసూలీ’ – నిశ్చయంగా ముహమ్మద్ (స) నా ప్రవక్త అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యమిచ్చాడు.
హజ్రత్ అలీ మరియు ఆయన బాబాయి అబ్బాస్ కుమారుడయిన అబ్దుల్లాహ్ (ర) గారి కథనం-”అల్లాహ్ తన ప్రవక్త చేసి పంపిన ప్రతి ప్రవక్తతోనూ మాట తీసుకున్నాడు-”ఒకవేళ ఆయన బ్రతికుండగా ముహమ్మద్ (స) వారు వస్తే ఆయన్ను తప్పకుండా విశ్వసించాలి, ఆయనకు సహాయ పడాలి. మరియు తన అనుయాయులతో ఆయన విషయమయి ప్రతిజ్ఞ చేయించాలి – ”వారు బ్రతికుండగా ఒకవేళ ముమహమ్మద్ (స) వారు వస్తే వారంతా ఆయన్ను తప్పనసరిగా విశ్వసించాలని, ఆయనకు సహాయం అందించాలని”. అబ్దుల్లాహ్ బిన్ సాబిత్ (ర) కథనం – ఓ సారి హజ్రత్ ఉమర్ (ర) ప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి: ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఖురైజా తెగకు చెందిన నా యూద సోదరుని దగ్గర నుండి నేనొస్తున్నాను. అతను నాకు తౌరాత్‌లోని కొన్ని ఉపదేశాలను వ్రాసి ఇచ్చాడు. వాటిని మీకు వినిపించనా?’ అని విన్నవించుకున్నారు. (ఉల్లేఖకులు) అంటున్నారు – ”అల్లాహ్ ప్రవక్త ముఖ కవళికలు ఒక్కసారిగా మారి పోయాయి”. అది గమనించిన నేను ఉమర్ (ర) గారినుద్దేశించి-”అల్లాహ్ ప్రవక్త ముఖం లో చోటు చేసుకున్న మార్పును తమరు గమనించడం లేదా?’ అన్నాను. అప్పుడు ఉమర్ (ర) ఎంతో వినయంగా ఇలా అన్నారు: ”రజీనా బిల్లాహి రబ్బన్, వ బిల్ ఇస్లామి దీనన్, వ బి ముహమదిన్ రసూలన్” -అల్లాహ్‌ను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, ముహమ్మద్ (స)ను ప్రవక్తగా నమ్మి సంతుష్టుడనయ్యాను. అది విన్న అల్లాహ్ ప్రవక్త నెమ్మదించి ఇలా అన్నారు: ”ఎవని చేతిలోనయితే ముహమ్మద్ ప్రాణ ముందో ఆయ సాక్షిగా చెబుతున్నాను – నేనుండగా మూసా ప్రవక్త (అ) మీ మధ్యకు వచ్చి మీరు నన్ను వీడి ఆయన్ను అనుసరిస్తే మీరు మార్గ భ్రష్టులవుతారు. సముదాయాలన్నింలో మీరు నా వాకు చెందిన వారు, ప్రవక్తలందరిలో నేను మీ వాకు చెందిన వాడను”. (తబ్రానీ)
హజ్రత్ జాబిర్ (ర) కథనం – అల్లాహ్ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”గ్రంథ ప్రజలతో ఏ విషయం గురించి అయినా సరే అడగకండి. వారే స్వయంగా మార్గ భ్రష్టులయినప్పుడు మిమ్మల్ని సరైన మార్గదర్శకత్వం చెయ్యలేరు. వారిని మీరు సంప్రతించడం వల్ల అసత్యాన్ని సత్యం అని నమ్మనయినా నమ్ముతారు లేదా సత్యాన్ని అసత్యం అని నిరాకరించనయినా నిరాకరిస్తారు. అల్లాహ్ సాక్షి! ఒకవేళ మీ మధ్యన మూసా ప్రవక్త (అ) ఉంటే, ఆయనకు సయితం నన్ను అనుసరించడం వినా మార్గాంతరం ఉండేది కాదు” అన్నారు ప్రవక్త (స).వేెరొక ఉల్లేఖనంలో – ”ఒకవేళ మూసా మరియు ఈసా (అ) బతికి ఉన్నా వారికి సయితం నన్ను అనుసరించడం తప్ప మార్గాంతరం ఉండేది కాదు”. (ముస్లిం)
పూర్వ ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారని ఎలా తెలుస్తుంది?
ప్రవక్త ఈసా (అ) సాక్ష్యం ఇచ్చారని ఎలా తెలుస్తుంది? ఖుర్‌ఆన్ చదవక ముందు బైబిల్ చదవితే కాదు, బైబిల్ చదివాక ఖుర్‌ఆన్‌లో వెతికితే కాదు. ఒక ముస్లిం ముందు తాను నమ్మే గ్రంథాన్ని ప్రథమం గా అర్థం చేెసుకోవాలి. అ తర్వాతే అవసరం ఉంటే అన్య గ్రంథాలను అధ్యాయనం చెయ్యాలి. అస్సఫ్ అధ్యాయంలో 6వ ఆయతులో ఇలా సెలవీయ బడింది: ”మర్యమ్ కుమారుడయిన ఈసా-”ఓ ఇస్రాయీలు సంతతి వారలారా! నేను మీ వైపునకు అల్లాహ్‌ా తరఫున పంపబడిన అల్లాహ్ సందేశహరుడను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవ పరుస్తున్నాను. నా తర్వాత రాబోవు ఒక సందేశహరుని గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు ‘అహ్మద్’ అని చెప్పినప్పి సంగ తిని గుర్తు చేెసుకో! తీరా అతను స్పష్టమయిన నిదర్శనాలతో తన వద్దకు వచ్చినప్పుడు ‘ఇది పచ్చి ఇంద్రజాలం, మాయ, చేతబడి’ అని వారు అన్నారు”.
”సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ప్రవక్తను అనుసరించేవారు (కరుణించ బడతారు). అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతులో, ఇంజీలు గ్రంథాలలో లిఖిత పూర్వకంగా లభిస్తుంది”. (ఆరాఫ్: 157)
ఆ ప్రవక్తను ఎలా గుర్తు పట్టాలి?
”ఆ ప్రవక్త మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు. చెడుల నుండి వారిని వారిస్తాడు. పరిశుద్ధమయిన వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు. అశుద్ధమయిన వాిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారి పై ఉన్న బరువులను దించుతాడు. వారికి వేయబడి ఉన్న సంకెళ్ళను త్రెంచుతాడు”. (ఆరాఫ్: 157)
ఆ ప్రవక్తను విశ్వసించడం వల్ల ప్రయోజనం?
”కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలు స్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితోపాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందుతారు”. (ఆరాఫ్: 157)
ఈ యదార్థం యూద, క్రైస్తవులకు తెలీదా?
”ఎవరికయితే మేము గ్రంథాన్ని ఒసగి ఉన్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తు ప్టినట్లే ప్రవక్తను గుర్తు పడతారు. అయితే తమను తాము నష్టంలో పడవేసుకున్న వారు మాత్రం విశ్వసించరు”. (అన్‌ఆమ్: 20)
వారికి తెలుసని సాక్ష్యం ఏమి?
”అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది? అని వారిని అడుగు. ”నాకూ- మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ా ఉన్నాడు” అని చెప్పెయ్యి. (అన్‌ఆమ్: 19)
సాక్ష్యం ఇచ్చిన యూద, క్రైస్తవులు ఉన్నారా?
చాలా మంది ఉన్నారు. ప్రవక్త (స) వారి కాలానికి చెందిన ఇద్దరిని గురించి తెలుసుకుందాం! వారిలో ఒకరు సల్మాన్ ఫారసీ (ర). ఆయన జీవితంలోని అధికాంశం సత్యాన్వేషణలో గడిచింది. ఆయన తల్లి దండ్రుల నుండి సంక్రమించిన మతం అగ్గి పూజారుల మతం. బాల్యం మరియు యవ్వనం అదే మతం సేవలో గడిపేశారు. మందిరంలో నిప్పు ఆరకుండా మండుతూ ఉండేలా చూసుకునే ముఖ్యమయిన బాధ్యత ఆయనకు ఇవ్వబడింది. కొంత కాలానికి అప్పి వాస్తవ క్రైస్తవం గురించి తెలుసుకున్న ఆయన ఎన్నో ప్రయాసలకు ఓర్చుకొని ఇంటి నుండి పారి పోయి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కొన్ని వేల మైళ్ళ ప్రాయాణం చేసి ఎందరో క్రిస్టియన్ ఫాదర్ల దగ్గర సేవలందిం చారు.
కొన్ని చోట్ల నయవంచకులయిన ఫాదర్ల గుట్టును సయితం ఆయన బైట పెట్టి ప్రజలకు న్యాయం జరిగేలా చూశారు. చివరి తాను బాగా ప్రభావితుడయిన తన ఫాదర్ మరణ ఘడియలో చెప్పిన మాటను అనుసరించి ‘నిస్సిబీన్’ ప్రాంతంలో ఉండే వ్యక్తి దగ్గరకు చేరుకున్నారు. అతను మరణ ఘడియలో చెప్పిన మాట ప్రకారం ‘అమ్మూరియ్యహ్’లో ఉండే మరో గురువు పంచన చేరారు. ఆయన మరణ ఘడియలో అరబ్బు ప్రాంతంలో ప్రవక్త ఇబ్రాహీమ్(అ) గారి ధర్మం విం ధార్మన్నే తీసుకు వస్తాడు అని తెలుసుకొని ప్రయాణ సౌకర్యం కలిగాక అక్కడి నుండి బయలుదేరగా, తోడు తీసుకెళతామని అన్నవారు ఆయన్ను బానిసగా చేసి మదీనాకు చెందిన బనూ ఖురైజా తెగకు సంబంధించిన వ్యక్తికి అమ్మేశారు. కొంత కాలానికి ప్రవక్త (స) మదీనాకు వలస రాగ, ఆయన్ను వెళ్ళి కలిసి ఒకి రెండు సార్లు విచారించి, పరీక్షించి చివరికి ఇస్లాం స్వీకరించారు.
మరో వ్యక్తి- అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (ర). ఆయన ప్రవక్త యూసుఫ్ (అ) వారి వంశావళికి చెందిన వారు. యూద మతస్థులుగా ఉన్న ప్పుడు ఆయన పేరు హసీన్. ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రవక్త (స) అబ్దుల్లాహ్ అని నామకరణం చేశారు.
ఆయన యూదులకు నాయకునిగా ఉండేవారు. ఆయనలో సత్యార్తి పరవళ్లు తొక్కుతూ ఉండేది. ప్రవక్త (స) మదీనాకు వచ్చారని తెలుసు కున్న ఆయన కేవలం ప్రవక్త మాత్రమే సమాధానం చెప్పగలిగే మూడు ప్రశ్నలు అడిగి సమాధానం విన్న మీద సంతుష్టులయి ఇస్లాం స్వీకరిం చారు. కానీ ఓ షరతు పెట్టారు. యూదులు మాట తప్పే జాతి. కాబట్టి నేను ఇస్లాం స్వీరించానన్న విషయాన్ని మీరు దాచిపెట్టి వారిని ప్రశ్నిం చండి అని విన్నవించుకున్నారు. వారు వచ్చాక- ”హసీన్ (అబ్దుల్లాహ్) బిన్ సలామ్ మీ దృష్టిలో ఎలాంటి వారు?” అని ప్రశ్నించారు ప్రవక్త (స). దానికి వారు:’ఆయన మాలో ఉత్తముడు, మాలో శ్రేష్టుడు, గొప్ప వంశానికి చెందినవాడు’. అన్నారు. అది విన్న ప్రవక్త (స)-‘ఒకవేళ అబ్దుల్లాహ్ బిల్ సలామ్ ఇస్లాం స్వీకరిస్తే మీరేం చేస్తారు?’ అని మళ్ళి ప్రశ్నించారు. అందుకు వారు – ‘దేవుడు ఆయన్ను అటువంటి చర్య నుండి కాపాడు గాక!’ అన్నారు. అంతలోనే అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (ర) వారి యెదుట వచ్చి-‘అష్హదు అల్లా ఇలా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్’ అని సాక్ష్యమిచ్చారు. అంతే, అగ్గి మీద గుగ్గిలమయిన యూదులు మాట మారుస్తూ- ‘వీడు మాలో చెడ్డ వాడు, పరమ చెడ్డ వంశానికి చెందిన వాడు’ అంటూ ఆయన్ను నోటి కొచ్చినట్లు తూలనాడటం ప్రారంభించారు. అది చూసిన అబ్దుల్లాహ్ బిన్ సలామ్-‘దైవ ప్రవక్తా! దీని భయమే నాకుండేది’ అన్నారు. (బుఖారీ)
ప్రవక్త ముహమ్మద్ (స) వారి గురించి పాత నిబంధనల్లో ఏముంది?
”నిశ్చయంగా మేము ఫిర్‌ఔన్ వద్దకు ఒక ప్రవక్తను పంపిన విధంగా ఒక ప్రవక్తను మీపై సాక్ష్యంగా నియమించి మీ వద్దకు పంపాము”. (ముజమ్మిల్: 15)
”వారి సహోదరులలో నుండి నీ విం ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను”. (ద్వితియోపదేశ కాండము-18:18)
ప్రవక్త మూసా (అ) వంటి ప్రవక్త కేవలం ముహమ్మద్ (స) వారు మాత్రమే మానవ చరిత్రలో కన బడతారు. ఉదాహరణకు:1) పుట్టుకలో ఇద్దరూ సమానం. 2) వివాహం, బార్యా పిల్లలు ఇద్దరికీ ఉన్నారు. 3) వలస-హిజ్రత్ ఇద్దరూ చేెశారు. 4) దైవప్రవక్తగా ఇద్దరికి గుర్తింపు. 5) ధర్మశాస్త్రం ఇద్దరికీ ఇవ్వబడింది. 6) ధర్మ పరిపాలన ఇద్దరూ చేెశారు. 7) ఇద్దరిదీ సహజ మరణమే.
కొత్త నిబంధనల్లో ఆయన (స) గురించి ఏముంది?
”అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త (ఉత్తరవాది) మీ యెద్దకు రాడు”. (యోహాను-14: 7)
”నేను తండ్రిని వేడుకుందును. మీ యెద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను (ఉత్తరవాదిని) అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకనుగ్రహించును”. (యోహాను-14:16)
”నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా, కానని ఉత్తరమిచ్చెను”. (యోహాను-1:20-22)
ఆదరణకర్త అంటే ఆత్మ కదా?
”ఆయన తనంతటత తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి, సంభవింపబొవు సంగతులను మీకు తెలియ జేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనక నన్ను మహిమ పరచును”. (యోహాను-16: 11-14)
గమనిక: క్రైస్తవుల నమ్మకం ప్రకారం – తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటయినప్పుడు – ‘వేటిని వినునో’ ఎలా అవుతుంది? పరిశుద్ధాత్మ, యేసు ముందు నుంచే ఉన్నారు కదా?
”ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును”. (యోహాను-15:28)
ఆరామిక్‌లో ‘పారాక్లీట్’ అంటే, కీర్తించ బడినవాడు. అదే అరబీలో ముహమ్మద్ (స). పై పదాన్ని ‘కింగ్ జేమ్స్ వెర్షన్’లో సర్వ జీవులపై కృప అని అనువదించడం జరిగింది. ఉత్తరవాది అంటే అందరి కోసం వేడుకునే వారు. పై అర్థాలన్నీ ప్రవక్త ముహమ్మద్ (స) వారి గురించి చెప్పబడిన ఈ ఖుర్‌ఆన్ వాక్యంలో ఇమిడి ఉన్నాయి. ”మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక సందేశహరుడు వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంత గానో కోరుకుంటాడు”. (తౌబహ్: 128)
ముహమ్మద్ అని పేరు ప్రస్తావన ఎందుకు లేదు?
పాత నిబంధనల్లో ప్రవక్త ఈసా (అ) వారిని ‘ఇమ్మానియేలు’ అని పిలిచినట్టే, ప్రవక్త ముహమ్మద్ (స) వారిని పారాక్లీట్ – ఉత్తరవాది అని చెప్పడం జరిగింది.
అబద్ధ ప్రవక్తలు వస్తారని ఉంది కదా?
అబద్ధ ప్రవక్తలే కాదు, అబద్ధ క్రీస్తులు కూడా వస్తారు అని ఉంది. నిజానిజాలను నిగ్గు తేల్చుకుని నిజం గ్రహించే బాధ్యత మాత్రం మనదే.
అల్లాహ్‌ను నమ్మడంతోపాటు కేవలం యేసు వారిని నమ్ముకుంటే సరి పోతుంది కదా? కొందరాంరు. సరిపోదు. ఒక ప్రవక్త మరో ప్రవక్త ను గూర్చి సాక్ష్యమిచ్చినట్లే, ప్రవక్తలందరూ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారిని గురించి సాక్ష్యమిచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన్ను విశ్వసించాల్సిందిగా తన అనుయాయులకు ఉపదేశించారు కూడా. ”సంపూర్ణ సత్యంలోకి మిమ్మల్ని నడిపించును” అని యేసు వారు చెప్పిన ఆ ప్రవక్తే ముహమ్మద్ (స). ఆయన్ను విశ్వసించి, అనుస రించడమంటే యేసు వారి మాటను గౌరవించడమే.
ఆయన్ను విశ్వసించకపోతే ఏమవుతుంది?
”దీని తర్వాత కూడా ఎవరు వెను తిరిగి పోతారో వారే పరమ నీచులు అవుతారు”. (ఆల్ ఇమ్రాన్: 82)
”ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారంతా తమకు ఇష్టమున్నా లేక పోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉండగా, మీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్నేషిస్తున్నారా? ఎట్టకేలకు మీరంతా ఆయన వైపునకే మరలించ బడతారు”. (ఆల్ ఇమ్రాన్: 83)
మనం ఏం చెయ్యాలి?
‘ఓ ప్రవక్తా! వారితో అను: ”మేము అల్లాహ్‌ను, మాపై అవతరింప జెయ్య బడిన దానినీ విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాఖూబుపై, ఆయన సంతానంపై అవతరింపజెయ్యబడిన దానినీ, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరపున వొసగబడిన వాిని మేము విశ్వసించాము. మేము వారి మధ్యన ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము”. (ఆల్ ఇమ్రాన్: 84)
విశ్వసించని వారి పరిస్థితి ఏంటి?
(తొలుత) ”విశ్వసించి, నిశ్చయంగా ఈ ప్రవక్త సత్యం అని సాక్ష్యం కూడా ఇచ్చి, తీరా తమ వద్దకు స్పష్టమయిన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులయి పోయిన వారికి అల్లాహ్ సన్మార్గం ఎలా చూపు తాడు? అల్లాహ్ దౌర్జన్యాని ఒడిగట్టే జాతికి దారి చూపడు”. (ఆల్ ఇమ్రాన్: 86)
”ఇక ఎవరయితే ఇస్లాంను కాకుండా మరో విధానాన్ని అన్వేషిస్తే అతని ఆ అనుసరణ స్వీకరించ బడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరి పోతాడు”. (ఆల్ ఇమ్రాన్: 85)
చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు
”ఆ రోజు దౌర్జన్యపరుడిన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంాడు: ‘అయ్యో! నేను దైవప్రవక్త (స) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుండేది! అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది. నా వద్దకు సత్యోపదేశం వచ్చిన తర్వాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడు”. (ఫుర్ఖాన్: 29)
చివరి మాట:
మన సిరి సంపదలు, మన సంతానం మనల్ని సత్య శోధన, సత్య స్వీకరణ నుండి మరల్చ రాదు. మనకు మనమయి మనల్ని, మన పరి వారాన్ని నరకాగ్నికి గురి చేసుకోకూడదు. రేపు మరణ ఘడియలు సమీపించి – అయ్యో! ఇంకాసింత గడువు లభించి ఉంటే మేము సత్యాన్ని స్వీకరిం సజ్జనుల్లో చేరే వారమే అని బాధ పడే దుర్దశ రాకూడదు. ఏ ప్రాణికయినా దాని నిర్ధారిత సమయం ఆసన్నమయ్యాక ఆలస్యం చెయ్యడం జరగదు గనక మనం సత్యానికి మేల్కోవాల్సి ఉంది. కాంతికి కళ్లు తెరవాల్సి ఉంది, తెరిపించాల్సి ఉంది.
దేవా! మాకు సన్మార్గాన్ని ప్రసాదించి, సత్య బాటన నడిపించి, రుజుమార్గం మీద నిలకడను అనుగ్రహించి మా అందరి గమ్యస్థానమయిన స్వర్గానికి చేర్చు స్వామీ! అని దీనాతి దీనంగా వేడుకోవాల్సి ఉంది.