మహనీయ ఇబ్రాహీం (అలైహిస్సలాం)
మహనీయ ఇబ్రాహీం (అలైహిస్సలాం)
మహనీయ ఇబ్రాహీం (అ)ను ముస్లిములే కాక…యూదులు, క్రైస్తవులు కూడా దైవప్రవక్తగా, ప్రవక్తల పితామహులుగా, తమ ధర్మ గురువుగా, ఆదర్శమూర్తిగా నమ్ముతారు. గౌరవిస్తారు. ఆదరిస్తారు. అయితే ఈ మహానుభావుని గురించి అంతిమ దైవగ్రంథం దివ్య ఖుర్‌ఆన్ ఇచ్చే సాక్ష్యమేమిటో వినండి. ”మహనీయ ఇబ్రాహీం (అ) యూదుడూ కాదు; క్రైస్తవుడూ కాదు; ఆయన ఏకోన్ముఖుడయిన ముస్లిం, స్వచ్ఛమయిన ఏకదైవారాధకుడు, బహుదైవారాధకుడు ఎంత మాత్రం కాదు.” (3:67)
మౌనంగానే భూమ్యాకాశాల నిర్మాణంలో, రేయింబవళ్ళ నిరంతర భ్రమణంలో కానవచ్చే సూచనలను గమనించేవారు. తద్వారా ఆయన సృష్టికర్తను తెలుసుకో గలిగారు. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దేవుడు లేడని గ్రహించారు.
సత్య ప్రకటన:
మహనీయ ఇబ్రాహీం (అ) విగ్రహారాధకుల కుటుంబంలో పురోహిత ఇంట్లో పుట్టారు. బహు దైవారాధన వాతావరణంలో పెరిగారు. మహనీయ ఇబ్రాహీం (అ) జాతి ప్రజలు… స్వయంగా ఆయన తండ్రి కూడా రాళ్ళతో కొయ్యతో చేసిన విగ్రహాలను పూజించేవారు. వారు వాటి ముందు మోకరిల్లేవారు. వాటికి నైవేద్యాలు సమర్పించుకునే వారు. వాటికి మొర పెట్టుకునేవారు. వాటిని స్తుతిస్తూ కీర్తనలు పాడే వారు. అయితే మహనీయ ఇబ్రాహీం (అ) విగ్రహారాధకు బహు దూరంగా ఉండేవారు. బహుదైవారాధన వాస్తవానికి కడు విరుద్ధమని తలచేవారు. మౌనంగానే భూమ్యాకాశాల నిర్మాణంలో, రేయింబవళ్ళ నిరంతర భ్రమణంలో కానవచ్చే సూచనలను గమనించేవారు. తద్వారా ఆయన సృష్టికర్తను తెలుసుకో గలిగారు. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దేవుడు లేడని గ్రహించారు. ”నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా మూఖాన్ని త్రిప్పుకుంటున్నాను, నేను బహుదైవారాధకులలోని వాణ్ణి ఎంత మాత్రం కాను” అని ప్రక ించారు. ”జాతి వారు నిజదైవానికి కల్పించే భాగస్వాములతో నాకు ఎలాిం సంబంధం లేదు” అని స్పష్టంగా తెలియజేసేశారు. (6:79)
సృష్టికర్త వైపుకు ఆహ్వానం:మహనీయ ఇబ్రాహీం (అ) ఎలాంటి సంకోచానికి లోనవకుండా పరిస్థితులకు భయ పడకుండా తండ్రిని, జాతి వారిని సృష్టికర్త అయిన అల్లాహ్ వైపుకు ఆహ్వానించడం ప్రారంభించారు. బహు దైవారాధనను, విగ్రహారాధనను హేతుబద్ధంగా ఖండించారు. ఆయన(అ) తన తండ్రితో… జాతి ప్రజలతో ఇలా అనేవారు: మీరు ఎవరికి మొరపెట్టుకుంటున్నారు? మీరు మొరపెట్టుకుంటే మీ మొరలు వినలేని,.. మీకు ఏ మాత్రమూ లాభం చేకూర్చలేని,..మీకు ఎలాంటి నష్టమూ కలిగించ లేని విగ్రహాలను మీరు ఎందుకు పూజిస్తున్నారు? మీ బాధలను విన లేని, మీ స్థితిగతుల్ని చూడలేని, మీకు ఏ మాత్రమూ ఉపయోగ పడని రాళ్ళతో కొయ్యతో స్వయంగా మీరు చేసుకున్న విగ్రహాలను మీరు ఎలా పూజిస్తున్నారు.? మీకు ఈ పాటి ఇంగిత జ్ఞానం కూడా లేదా! మనిషి ఎవరిని ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఒక్క అల్లాహ్ మాత్రమే ఆరాధనకు నిజ అర్హుడు ఎందుకు? సహేతుకమయిన, సమంజసమయిన కారణాలను వివరిస్తూ ఆ మహనీయులు ఇలా అన్నారు: ”ఆయనే నన్ను ప్టుించాడు. ఆపైన ఆయనే నాకు దారి చూపుతాడు. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు. త్రాపిస్తున్నాడు. నేను జబ్బు పడిన ప్పుడు ఆయనే నయం చేకూర్చుతాడు. ఆయనే నాకు మృత్యువు నిస్తాడు. తిరిగి నాకు జీవితాన్ని ప్రసాదిస్తాడు. ప్రతి ఫలదినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడని నేను ఆయనపైనే ఆశలు పెట్టుకున్నాను”. (దివ్య ఖుర్‌ఆన్ – 28:78-82) ఈ విధంగా మహనీయ ఇబ్రాహీం(అ), ఒక్క అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు అనడానికి అత్యంత సమంజసమయిన కారణాలు వివ రించారు. అవును మానవుల్ని పుట్టించినవాడు అల్లాహ్‌యే… మానవుడు భువిలో కాలిడిన క్షణంలోనే తల్లి పాలిండ్లలో పాలును పుట్టించినవాడు, అతనికి పాలు చీకే మ్రింగే విధానాన్ని నేర్పినవాడు అల్లాహ్‌యే… మానవుల ఉనికి, పెరుగుదల, పెంపుదల, మనుగడ, ప్రగతీ వికాసాలకు కావలసినటువిం సామాగ్రినంతినీ సమకూర్చిన వాడు అల్లాహ్‌యే. ఇదే సత్యం. అలాంటప్పుడు మహోన్నతుడయిన అల్లాహ్‌ను కాదని రాళ్ళతో, కొయ్యతో, బంగారు వెండిని కరిగించి చేసిన విగ్రహాలను పూజించడం, మానవుల మధ్య పుట్టి, పెరిగి, అపదలకు, రోగాల కు గురై స్వయంగా తమ మృత్యువును దాటలేక పోయిన వారిని ఆప దల్లో, అవసరాల్లో ఆశ్రయించడం కన్నా అవివేకం, అజ్ఞానం మరేది కాగలదు? సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి. సృష్టితాలను కాదు.అల్లాహ్‌ను ఆరాధించడమే సహేతుకమయినది. సమంజసమయినదీను.
వ్యతిరేకత మొదలయింది:
ఈ మాటలు విన్న తండ్రికీ, జాతి ప్రజలకూ కోపం వచ్చింది. తండ్రి బెదిరించాడు. ఇంటి నుండి బయికి వెళ్ళగొట్టాడు. మొత్తం జాతి శత్రువై పోయింది. ఆనాటి చక్రవర్తి కూడా ఆ మహనీయున్ని అగ్ని గుండంలో పడవేసి మీ దేవీదేవతలను కాపాడుకోండి అని ఫర్మానా జారి చేశాడు. ఆయన (అ) అగ్నిగుండంలో పడవేయ బడ్డారు కూడా. సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ ఆయన్ను అగ్ని గుండం నుండి సురక్షితంగా కాపాడాడు. మహనీయ ఇబ్రాహీం (అ) జీవితాంతాం మిథ్యాశక్తులకు భయపడ కుండా విగ్రహారాధనను ఖండించేవారు. సృష్టికర్తయిన అల్లాహ్ ఘనతా ఔన్నత్యాలను చాటి చెప్పేవారు. సత్యప్రకటన కార్యంలో జనులకు ఏకదైవారాధన వైపుకు పిలిచే ఈ బృహత్తర సేవలో ప్రాపంచిక ప్రయోజనాలను త్యజించారు. ఇల్లు వాకిలిని వదిలి వేశారు. దేశాన్ని విడిచి పెట్టారు. ఆయన (అ) అల్లాహ్ ప్రసన్నత కోసం ఆయన (అ) సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. ఏక దైవారాధన మార్గంలో ఆయన చేసిన త్యాగాలను ఘనకార్యాలను అల్లాహ్ మెచ్చుకొని ప్రళయం వరకు ఆయన్ను ప్రజలకు నాయకునిగా చేశాడు. ఆయనకు ఉన్నత కీర్తిని ప్రసాదించాడు. నేడు ముస్లిం సముదాయం ప్రతి నమాజులో అంతిమ దైవ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స)పై దరూద్ సలాం పంపిస్తూ ప్రవక్తల పితామహులైన హజ్రత్ ఇబ్రాహీం(అ)పై కూడా అల్లాహ్ కరుణాగ్రహాలు వర్షించాలని అల్లాహ్‌ను వేడుకుంటారు.