విశ్వ కర్త అల్లాహ్ ఉనికిని తెలియజేసే నిదర్శనాలు – దేవుడు, ఆరాధ్యుడు అనేది ఒక అపురూప భావన. దేవుడంటే ఎందరికో నమ్మకం, కొందరికి సందేహం. మరికొందరికి అసత్యం. ఈ విషయమయి మానవ చరిత్రలో తర్జనభర్జనలు చాలానే చోటు చేసుకున్నాయి. ‘ఉన్నావా? అసలున్నావా?’ అన్నది సంసయాత్మకుల సందేహం. ‘ఇందుగలడందు లేడను సందేహం వలదు..ఎందెందు వెతికి చూసిన అందందే గలడు’ అన్నది దేవుడున్నాడని నమ్ముతూ, ఆయనెవరో, ఆయన గుణగణాలేమిటో, శక్తి సామర్థ్యాలేమిటో స్పష్టత లేనివారి మాట. దేవుడే లేడు అన్న మాట ఎంత అవాస్తవమో, ప్రతిదీ దైవమే అన్న మాట కూడా అంతే అసంబద్ధం, అహేతుకం. దేవుడున్నాడు, ఒక్కడే; అద్వితీయుడు ఇదే సత్యం. పై రెండు సంశయాలు, ఆస్పష్టతలకు సమాధానమే ఈ వ్యాసం.
అల్లాహ్ అస్తిత్వ ఆధారాలు: 1) సహజ నైజం, 2) మేధ, 3) షరీఅతు శాస్త్రం,
4) సూక్ష్మ జ్ఞానము.
సహజ నైజం, అల్లాహ్ అస్తిత్వానికి ఆధారం:
కలుషితం కాని మానవ నైజం ఎటువంటి ఆధార అవసరం లేకుండానే అల్లాహ్ అస్తిత్వాన్ని అంగీకరిస్తుంది. ఈ కారణంగానే ఖుర్ఆన్ అల్లాహ్ అస్తిత్వాన్ని రుజువు చేసే ఆధారాలను ముక్తసరిగా ముగిస్తుంది. ఖుర్ఆన్ చెప్పేదేమిటంటే, నిష్కల్మషమయిన నైజం, ఎటువంటి బహుదైవ భావాలకు, మానవ సిద్ధాంతాలకు ప్రభావితం కాని ఆత్మలు అల్లాహ్ ఉనికిని ఎటువంటి ఆధారం అవసరం లేకుండానే అంగీకరిస్తాయి. అంతే కాదు-అల్లాహ్ అస్తిత్వం మరియు ఏకత్వం, తౌహీద్ అనేది ప్రతి మనిషి ఆంతర్యంలో అంతర్లీనమయి ఉన్న మౌలిక భావం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ﴿٣٠﴾
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని దృష్టిని (అల్లాహ్) ధర్మంపై నిలుపు, అల్లాహ్ మానవుల్ని ఏ ధర్మంపై నయితే పుట్టించాడో అ ధర్మంపైన్నే (ఉండండి). అల్లాహ్ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరయిన ధర్మం. కాని చాలా మంది తెలుసుకోరు”. (అర్రూమ్: 30)
మనిషిలోని ఈ సహజ స్వభావమే అతన్ని తన సృష్టికర్త వైపునకు మరలేలా పురిగొల్పుతుంది. కాకపోతే మనిషి పుట్టిన తర్వాత పరిసర, పరివార ప్రభావనికి గురువుతాడు. అతను కళ్ళు తెరచిన సమాజ రాతారీతులు అతన్ని మార్గం తప్పిస్తాయి. అందువల్ల అతను నిజ ఆరాధ్యునికి దూరంగానే బతక డం అలవాటు చేసుకుంటాడు. అతనిలో చోటు చేసుకున్న ఈ పరిణామాని కి కారణం, అతన్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, అతను ఆశ్రయించిన సాహిత్యం, అతనికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, పరిశోధకులు, ప్రింటింగ్, ఎలాక్ట్రానిక్ ప్రచార పరికరాలు, మనిషి చేసిన సిద్ధాంతాలు. అవి అతని అసలు నైజాన్ని కలుషితం చేసి, అతన్ని మిథ్యా మాయలో ముంచు తాయి. ఫలితంగా ఆత్మ చక్షువులు మూసుకుపోయి సత్యాన్ని గ్రహించలేక పోతాడు.
సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం – హజ్రత్ అబూ హురైరహ్ (6) కథనంలో ప్రవక్త ముహమ్మద్ (స) వారి ఈ ప్రవచనం ఈ విషయాన్నే ధృవ పరుస్తుంది:
ما مِن مَوْلُودٍ إلَّا يُولَدُ علَى الفِطْرَةِ، فأبَوَاهُ يُهَوِّدَانِهِ أوْ يُنَصِّرَانِهِ، أوْ يُمَجِّسَانِهِ، كما تُنْتَجُ البَهِيمَةُ بَهِيمَةً جَمْعَاءَ، هلْ تُحِسُّونَ فِيهَا مِن جَدْعَاءَ، ثُمَّ يقولُ أبو هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عنْه: {فِطْرَتَ اللَّهِ الَّتي فَطَرَ النَّاسَ عَلَيْهَا} [الروم: 30] الآيَةَ.
“పుట్టే ప్రతి శిశువు సహణ ధర్మంపైనే పుడుతుంది. కాని అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, జోరాస్ట్రియన్‌గానో (అగ్గి పూజారిగావో) మార్చి వేస్తారు”. ఈ ప్రవచనంలో ప్రవక్త (స) ముస్లిం గానో మార్చివేస్తారు’ అని అనలేదు, ఎందుకంటే ఇస్లాం ధర్మమే ప్రకృతి ధర్మం, ప్రతి వ్యక్తి నైజానికనుగుణంగా నిలబడే ఏకైక ధర్మం.
కొందరంటారు: ఎవరు ఎలాంటి జోక్యం కలుగుజేసుకోకుండా శిశువును దాని స్వభావం మీదే వదిలేస్తే అది తన నిజ ప్రభువును గుర్తిస్తుందా? అని. వారికి మా సమాధానం ఏమిటంటే, ‘జిన్నుల్లోని, మానవుల్లోని షైతానులు (మిథ్యా వాదులు) అతని జోలికి వెళ్ళకుండా ఉంటే, అతని నైజాన్ని పాడు చేయకుండా ఉంటే ఖచ్చితంగా అతను సహజ ధర్మం మీద ఉండగలడు. అయితే మానవ జాతికి చెందిన షైతానులు అతన్ని వదిలేసినా, జిన్ను జాతికి చెందిన షైతానులు అతన్ని వదలరు. షైతాన్ తన స్వయంగా చేసుకున్న ప్రమాణం – ఆదం సంతతిని మార్గభ్రష్టుల్ని చేసి తీరతాను’ అన్నది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: షైతాన్ పలికాడు:
قالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ (82) إِلاَّ عِبادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ (83)
“మరయితే నీ గౌరవ మర్యాదల సాక్షిగా (చెబుతున్నాను) – అందరినీ నేను పెడదారి పట్టిస్తాను. ఎంపిక కాబడిన కొంత మంది నీ దాసులు తప్ప!” అని అన్నాడు, (స్వాద్:82,83)
మనిషి మనసును వస పర్చుకునే కాసింత వెసులుబాటు షైతాను అల్లాహ్ తన యుక్తికి లోబడి ఇచ్చి ఉన్నాడు. ఓ హదీసులో ఇలా ఉంది:
إنَّ الشَّيْطَانَ يَبْلُغُ مِنَ الإنْسَانِ مَبْلَغَ الدَّمِ، وإنِّي خَشِيتُ أَنْ يَقْذِفَ في قُلُوبِكُما شيئًا.
“నిశ్చయంగా షైతాన్ మీ నరనరాల్లో రక్తం ప్రవహించినట్లే పరిగెడుతుంటాడు. అతను మీ మనసుల్లో ఎక్కడ చెడుని నింపేస్తాడేమోనని నేను భయపడుతున్నాను” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (bukhari)
ఖుర్ఆన్ సయితం పైతాన్ బారి నుండి శరణు కోరాల్సిందిగా పురమాయిస్తుంది. ఎందుకంటే “వాడు జనుల హృద యాలలో చెడు ఆలోచనలను రేత్తిస్తాడు”.(అన్నాస్: 5)
అలాగే ప్రతి మనిషి తోనూ ఒక జన్ను సహచరుడు ఉండటాడని, అతన్ని చెడుకై పురిగొల్పుతూ ఉంటాడని ఖుర్ఆన్ ఈ వాక్యం ద్వారా రూఢీ అవుతుంది: ‘మా ప్రభూ! నేనితన్ని పెడదారి పట్టించ లేదు. ఇతనే స్వయంగా బహుదూరపు అప మార్గంలో పడి ఉన్నాడుని అతని సహవాసి (అయిన షైతాన్) అంటాడు”. (ఖాఫ్: 27) మనిషి షైతాన్ ఎత్తుగడల నుండి, అతను విసిరే విష వలయం నుండి, అతని వసీకరణల నుండి కాపాడ బడాలంటే అల్లాహ్ శరణు కోరడం వినా మార్గం లేదు. ఆయనే తన దాసుల్ని ఉద్దేశించి ఇలా ఉపదేశిస్తున్నాడు: (ఈ విధంగా) ‘చెప్పు: నేను మానవుల ప్రభువు శరణు కోరుతన్నాను. మానవుల చక్రవర్తి (శరణు కోరుతున్నాను). మానవుల ఆరాధ్యున్ని (ఆశ్రయిస్తున్నాను). దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుండి. వాడు జనుల హృదయాలలో చెడు ఆలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందిన వాడయినా సరే, మానవుల వర్గానికి చెందినవాడయినా సరే”. (అన్నాస్: 1-6)
మానవ ఆకారంలో ఉండే పైశాచిక శక్తులు ఓ ఎత్తయితే, జిన్నుల వర్గానికి చెందిన షైతానులు మరో ఎత్తు. అవి మనిషి సహజ స్వభావాన్ని నీరు గార్చి, వారిని అధోగతికి గురి చేసే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవు. సహీహ్ ముస్లిం హదీసు గ్రంథంలోని ఓ హదీసు ద్వారా రూఢీ అయిన విషయం – హజ్రత్ ఇయాజ్ బిన్ హిమార్ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఓ రోజు ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో పేర్కొన్న అంశాల్లోని ఓ అంశం –
ألا إنَّ رَبِّي أمرني أنْ أُعَلِّمَكُمْ ما جَهِلْتُمْ، ممَّا علَّمَني يوْمِي هذا، كُلُّ مالٍ نَحَلْتُهُ عَبْدًا حلالٌ، وإنِّي خَلَقْتُ عبادي حُنَفاءَ كُلَّهم، وإنَّهُم أتتْهُمُ الشياطينُ فاجْتَالَتْهُمْ عن دينِهِمْ، وحَرَّمَتْ عليهم ما أحْلَلْتُ لهمْ، وأمرتهُمْ أنْ يُشْركُوا بِي ما لَمْ أُنزِلْ بهِ سُلْطَانًا
الراوي : عياض بن حمار | المحدث : الألباني | المصدر : صحيح الجامع
“మీరు మరచిన యదార్ధాన్ని మీకు ఎరుక పర్చవలసిందిగా నా ప్రభువు నన్ను ఆదేశించాడు, నేను వా దాసులకు ప్రసాదించిన ప్రతిదీ హలాల్-ధర్మ సమ్మతమయినదే. నిశ్చయంగా నేను నా దాసులను స్వచ్చమయిన స్వభావం (ఏకేశ్వరోపాసనా ధర్మం) పైనే పుట్టించాను. తర్వాత సైతానులు వారి వద్ద వచ్చి వారిని వారి నిజ ధర్మం నుండి వేరు పర్చాయి. వారి కోసం నేను ధర్మ సమతం (హలాల్) చేసిన వాటిని అవి అధర్మం (హరామ్)గా చేశాయి. ఎటువంటి ప్రమాణం అవతరించని షిర్కు పాల్పడవల సిందిగా పురిగొల్పాయి, నాతోపాటు అన్యులను భాగస్తులుగా చేసి పూజించమని ప్రేరేపించాయి.
ఈ నిర్మల నైజం ఎప్పుడు ప్రస్ఫుటమవుతుంది?
విపత్తులు విరుచుకు పడినప్పుడు, ఆపదలు కుండపోతగా కురిసినప్పుడు, భౌతిక ఏ ఆధారం పనికి రాదని రూఢీ అయినప్పుడు, ప్రమాదం నుండి బయట పడగలిగే ఏ మార్గం కానరానప్పుడు మనిషిలోని ఈ నిర్మల నైజం బైట పడుతుంది. ఈ యదార్థాన్ని అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు:
وَإِذَا مَسَّ الْإِنسَانَ الضُّرُّ دَعَانَا لِجَنبِهِ أَوْ قَاعِدًا أَوْ قَائِمًا فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهُ مَرَّ كَأَن لَّمْ يَدْعُنَا إِلَىٰ ضُرٍّ مَّسَّهُ ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْمُسْرِفِينَ مَا كَانُوا يَعْمَلُونَ (12(
– మనిషికి ఏదయినా కష్టం కలిగినప్పుడు పడుకొని, కూర్చొని, నిలబడి మమ్మల్ని మొర పెట్టుకుంటాడు. మరి మేము అతని కష్టాన్ని అతన్నుండి తొలగించినప్పుడు, తనకు కలిగిన ఏ కష్టానికీ, ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు”. (యూనుస్: 12) వేరొక చోట ఇలా ఉంది:
هُوَ الَّذِي يُسَيِّرُكُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ ۖ حَتَّىٰ إِذَا كُنتُمْ فِي الْفُلْكِ وَجَرَيْنَ بِهِم بِرِيحٍ طَيِّبَةٍ وَفَرِحُوا بِهَا جَاءَتْهَا رِيحٌ عَاصِفٌ وَجَاءَهُمُ الْمَوْجُ مِن كُلِّ مَكَانٍ وَظَنُّوا أَنَّهُمْ أُحِيطَ بِهِمْ ۙ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ لَئِنْ أَنجَيْتَنَا مِنْ هَٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ (22)
“ఆయనే మిమ్మల్ని భూమిలోనూ, సముద్రంలోనూ నడుపుతున్నాడు. ఆ విధంగా మీరు ఓడలలో పయనమవుతున్నప్పుడు, అవి ప్రజలను సానుకూలమయిన గాలులు ద్వారా తీసుకు పోతుంటాయి. ఆ అనుకూల పవనాలకు ప్రజలు ఆనంద డోలికల్లో తేలియాడుతుండగా (అక స్మాత్తుగా) వారిపై ఉధృతమైన గాలి వీస్తుంది. అన్ని వైపుల నుంచీ వారిపై అలలు వచ్చి పడతాయి. తాము (ఆపదలో దారుణంగా) చిక్కుకు పోయామన్న సంగతిని వారు గ్రహిస్తారు. (ఆ క్షణంలో) తమ విశ్వాసాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించుకుని, (అల్లాహ్!) నువ్వు గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞులమయి ఉంటామ’ని మొర పెట్టుకుంటారు”. (యూనుస్: 22)
అల్లాహ్ అస్తిత్వానికి మేధ ఆధారం
మనిషి మేధకు సంబంధించిన ఆధారాన్ని మనం తీసుకున్నట్లయితే – సృష్టి లోని ప్రాణులన్నింటికి ఓ కర్త, సృష్టికర్త ఉండి తీరాలి. ఏ సృష్టికర్త లేకుండా సృష్టి మొత్తం తనకు తానే ఉనికిలోకి వచ్చేసింది, లేదా ఇట్లే యాధృచ్చికంగా ఓ విస్పోటన ఫలితంగా ఉనికిలోకి వచ్చేసిందన్నది సత్య దూరం. ఎందు కంటే ఏమీ కానిది దేన్ననయి సరే ఎలా సృష్టించగలదు?!
అలాగే సృష్టి మొత్తం ఒక విస్పోటనం ఆధారంగా ఉనికిలోకి రావడం అనేది కూడా అసంభవమే. విస్పోటనం పదార్థాల విచ్చిన్నానికి కారణమవుతుందనేది సాధారణ విషయమే. కాని ఆలోచనకు దారి తీసే విషయమేమమనగా పదార్థ విచ్చిన్నా నికి కారణమయ్యే విస్పోటనం ద్వారా-వివిధ ద్రవ్య రాసులు గల, వివిధ గుణాలు కలిగిన పదార్థాలుగా, పాలపుంతలు, సూర్యచంద్ర నక్షత్రాలు, గ్రహాలు,భూమిగా విడిపోయి ఒక క్రమయిన నిర్మాణంగా, నిర్దుష్టమైన దూరా లలో కక్ష్యలేర్పరుచుకుని పరిభ్రమించడం ఎంతో అందంగా, శాస్త్రీయంగా ఈ ఏర్పాటు జరగడం వెనుక ఎవ్వరూ లేరని అనగలమా? వస్తువేది తనం తట తానుగా ఉనికిలోకి రాలేనప్పుడు, ఒక విస్పోటనమే అన్నింటికి కారణం కాలేనప్పుడు, ఖచ్చితంగా ఈ విశ్వాసాన్ని ఉనికిలోకి తీసుకు వచ్చిన కర్త ఉన్నాడు అన్న యదార్థాన్ని నమ్మి తీరాలి. ఆయనే సర్వలోకాలకు ప్రభువు, శాసనకర్త, పాలకుడు, సంరక్షుడు అయిన అల్లాహ్. హేతు సంబంధిత ఇచ్చి తమయిన ఈ ఆధారాన్ని అల్లాహ్ ఇలా పేర్కొన్నాడు:
أَمْ خُلِقُوا مِنْ غَیْرِ شَیْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ ﴿٣٥﴾ أَمْ خَلَقُوا السَّمَاوَاتِ وَالأرْضَ بَل لا یُوقِنُونَ ﴿٣٦﴾
“ఏమిటి, వీరు (పుట్టించేవారు) ఎవరూ లేకుండానే వారంతటా వారే పుట్టుకు వచ్చారా? లేత వారే స్వయంగా సృష్టికర్తలా? ఏమిటి భుమ్యాకాశాలను వాళ్ళే సృష్టిం చారా?”. (అత్తూర్: 35-36)
మరింత స్పష్టంగా అర్థమయ్యేందుకు ఓ ఉదాహరణ- ఎడారిలో నడుస్తుండ గా ఒక చేతి గడియారం అక్కడ ఉండటాన్ని మీరు గమనించారు. చేతి గడియారంలో గాజు కవరు, ప్లాస్టిక్ మరియు ఇనుము ఉంటాయనేది అందరికి తెలిసిందే. సన్నటి ఇసుక నుండి గాజు తయారవుతుంది. ఆయిల్ నుండి ప్లాస్టిక్ తయారవుతుంది. భూమి నుండి ఇనుపు సేకరించబడుతుంది. ఈ భాగాలన్నీ ఎడారిలో లభిస్తాయి. అలా అని గడియారం తనకు తానుగా తయారయిపోయిందా? వందల సంవత్సరాల వరకూ సూర్యుడు ఉదయాస్తూ కాంతి కిరణాలు పరచినా, గాలులు వీచినా, పిడుగులు పడుతున్నా, ఆయిల్ భూమి ఉపరితలంపైకి పొంగి వచ్చి సన్నటి ఇసుక మరియు ఇనుముతో కలిసి కోట్ల సంవత్సరాలు ఉన్నా యాదృచ్ఛికంగా ఓ గడియారం తయారయి పోవడం అనేది సంభవమంటారా? మరలాంట ప్పుడు సువిశాలమయిన ఈ సుందర ధరితి, ఏ స్థభం లేకుండా నిలబడి ఉన్న ఈ నిలాకాశం, గలగలపారే సెలయేర్లు పర్వత శ్రేణులు, సూర్య చంద్ర నక్షత్రాలు, విశ్వ వ్యవస్థ మొత్తం ఏ కర్త లేకుండా ఉనికిలోకి వచ్చేసిందని నమ్మగలమా ?
మొదటిది : అల్లాహ్ అస్తిత్వానికి షరీఅతు (శాస్త్ర ఆధారం అల్లాహ్ అస్తిత్వానికి సంబంధించి శాస్త్ర ఆధారాల్ని తీసుకున్నట్లయితే – ఆకాశ గ్రంథాలన్నీ అల్లాహ్ ఉనికిని గురించి సాక్ష్యమిస్తున్నాయి. వాటి మాధ్యమంగా అవతరించిన అందరికి శ్రేయస్కరమయిన శాసనాలన్నీ యుక్తి పరుడు, మహా శక్తిపరుడయిన అల్లాహ్ తరపు నుండే అని నొక్కి పఠ్కాణిస్తు న్నాయి. వేల సంవత్సరాలు మానవ చరిత్ర ఇస్తున్న సాక్ష్యం కూడా అదే. ఈ సృష్టికి కర్త ఉన్నాడు. ఆయనే సర్వ శక్తిమంతుడు, సర్వాధికారి, జీవన్మరణా లకు స్వామీ, మహోన్నత సామాజ్య పీఠానికి (మహోన్నత అకి) అధిపతి. అల్లాహ్ అస్తిత్వానికి పంచేంద్రియ జ్ఞానంతో ముడి పడి ఉన్న ఆధారం అల్లాహ్ అస్తిత్వాన్ని, ఆయన ఉనికిని రుజువు చేసే ఇంగిత జ్ఞానంతో కూడిన ఆధారం రెండు విధాలు. ఒకటి: మొర పెట్టుకునే వారి మొరలు ఆలకించ బడటం, ఆపదలో ఉన్న వారిని కాపాడటం వంటివి మనం నిత్యం మన ఈ చర్మ చక్షువులతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము. అంటే అంత మంది మొరలు ఆలకించబడుతున్నాయి, వారు కాపాడ బడుతున్నారు అంటే వాటిన వినేవాడు, వారిని కాపాడేవాడు ఒకడు ఖచ్చితంగా అన్నాడు. ఆయనే అల్లాహ్. ఆయన ఇలా సెలవిస్తున్నాడు:
وَنُوحًا إِذْ نَادَىٰ مِنْ قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ ﴿٧٦﴾
“అంతకు ముందు సూహ్ మొతర పెట్టుకున్న సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము అతని మొరని ఆలకించి ఆమోదించాము. అతన్నీ, అతని ఇంటి వారిని తీవ్రమయిన వ్యధ నుండి కాపాడాము”. (అన్ఫియా: 76)
మరో చోట ఇలా సెలవియ్యబడింది:
إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُمْ بِأَلْفٍ مِنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ ﴿٩﴾
“సహాయం కోసం మీరు మీ ప్రభువును మొర పెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా ఇపికి తెచ్చుకోండి – మరి అల్లాహ్ మీ మొర ఆలకించాడు, (మీ అక్కరలను తీర్చాడు”.
(అన్సాల్: 9)
రెండవది: అల్లాహ్ ప్రవక్తందరికి వారి కాలపు స్థితగతులను బట్టి కొన్ని సూచనల్ని ప్రసాదించేవాడు. వాటిని మోజిజాత్ అని కూడా అంటారు. ప్రజలు వాటిని ప్రత్యక్షంగా చూసేవారు, వినేవారు. ప్రవక్తలను ప్రజలు సత్య వంతులుగా, అల్లాహ్ తరఫు నుంచి వచ్చిన వారుగా సమ్మాలన్నదే ఈ మహి మల ఉద్దేశం. ఎందుకంటే వారి చేతుల మీదుగా జరిగే ఈ మహిమలు మానవ సాధ్యం కానివి, తన ప్రవక్తల సహాయార్లమే అల్లాహ్ వీటి వారి చేతుల మీదుగా జరిపిస్తాడు. అందులో వారి గొప్పతనమేమీ లేదు. మనత, గొప్పతనం మహిమాన్వితుడయిన అల్లాహ్ దే.