సూరతుల్‌ అన్‌ఆమ్‌

 

నామకరణం: సూరతుల్‌ అన్‌ఆమ్‌

”అన్‌ఆమ్‌’ అని ఈ సూరహ్‌కు నామకరణం చెయ్యడానికి కారణం ఇందులో ‘అన్‌ఆమ్‌’- పశువుల ప్రస్తావన రావడమే. మరియు ఆయన (అల్లాహ్) పుట్టించిన పంటల నుండి మరియు పశువుల నుండి, వారు అల్లాహ్ కొరకు కొంత భాగాన్ని నియమించి: “ఇది అల్లాహ్ కొరకు మరియు ఇది మా దేవతల (అల్లాహ్కు వారు సాటి కల్పించిన వారి) కొరకు.” అని తమ ఊహలో చెబుతారు. వారి దేవతలకు చెందిన భాగం అల్లాహ్కు చేరదు. మరియు అల్లాహ్కు చెందిన భాగం వారి దేవతలకు చేరుతుంది. ఎలాంటి చెడు నిర్ణయాలు చేస్తున్నారు వీరు! (136) ఈ సూరహ్‌లో బహుదైవారాధకుల్లో అలనాడు బాగా ప్రబలి ఉన్న దురాచారాలు, మూఢ నమ్మకాలను ఖండించడం జరిగింది.

ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్ మాత్రమే సర్వ స్తోత్రాలకు అర్హుడు.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మక్కీ సూరహ్‌. కొన్ని ఆయతులు మినహాయించి – అవి మదీనాలో అవతరించాయి.

20,23,91,114,1 41,151, 152, 153.

2) ఇది తివాల్‌ సూరాలలోనిది.

3) ఆయతుల సంక్య 165.

4) క్రమానుసారం ఇది ఆరవ సూరహ్‌.

5) ఇది  అల్‌ హిజ్ర్‌ సూరహ్‌ా తర్వాత అవతరించింది.

6) ఈ సూరహ్‌ ఖుర్‌ఆన్‌ శైలీల్లో ఒకటయిన  (الحمد لله)

ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్ మాత్రమే సర్వ స్తోత్రాలకు అర్హుడు. అయినా సత్యతిర స్కారులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు.తో ప్రారంభమవు తుంది.

 

ఈ సూరహ్‌లో పేర్కొనబడిన ముఖ్యాంశాలు:

ఈ సూరహ్‌ మక్కీ తివాల్‌ సూరాల్లోని ఒకి. ఇది తివాల్‌ సూరహ్‌ అయినప్పికీ మదనీ సూరాలకు భిన్నంగా ఇందులో మూడు విషయాల గురించిన ప్రస్తావన ఉంది. 1) తౌహీద్‌. 2) రిసాలత్‌. 3) ఆఖిరత్‌.

సూరహ్‌ అవతరణ నేపథ్యం:

1) ముష్రికులు ప్రవక్త (స)తో ఇలా అన్నారు: ఓ ముహమ్మద్‌! (స) గొర్రె చనిపోయింది, దాన్ని చంపింది ఎవరు? ప్రవక్త (స) అన్నారు: అల్లాహ్‌ా. అప్పుడు వారు ఇలా అన్నారు: అంటే నువ్వు నీ సహచరులు చంపితే హలాల్‌, కుక్క, గద్ద చంపితే హలాల్‌. అల్లాహ్‌ చంపింది హలాల్‌ కాదా? దానికి జవాబుగా అల్లాహ్‌ా ఈ సూరహ్‌ను అవతరింప జేశాడు.

2) అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా అన్నారు: ఒకానొక సందర్భంలో అబూ జహల్‌ ప్రవక్త (స) వారిని పేడ విసిరి కొట్టాడు. అది తెలుసుకున్న ఆయన బాబాయి హమ్జా (ర) అగ్రహోదగ్రులయ్యారు. విల్లు చేత బూని అబూ జహల్‌ను సమీపించారు. అది గమనించిన అబూ జహల్‌ – ఓ అబూ యాలా! ముహమ్మద్‌ మమ్మల్ని మూర్ఖుల రకింద జమ కడుతున్నాడు. మా ఆరాధ్య దైవాలను తూలనాడుతున్నాడు. మా తాత ముత్తాతల పరంపరను ధిక్కరిస్తున్నాడు – ఈ విషయం నీ కంట పడలేదా? నీ చెవికి వినబడలేదా? నీతో ఎవ్వరూ అనలేదా? అది విన్న హమ్జా (ర) ఇలా అన్నారు: ”అవును మీకు మించిన మూర్ఖుడు ఎవడుంటాడు. నిజ ఆరాధుగ్యడయిన అల్లాహ్‌ను వదలి రాళ్ళు రప్పలను మీరు కొలుస్తున్నారు, పాము పుట్టను మీరు ప్రార్థిస్తున్నారు. వాగు వంకను మీరు వేడుకుంటున్నారు.  ఈ క్షణం నేను కూడా ముహమ్మద్‌ (స) వారు తీసుకొచ్చిన ధర్మాన్ని స్వీకరిస్తున్నాను. అష్హదు అల్లా ఇలా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ అంటూ ఇస్లాం స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ సూరహ్‌ అవతరించింది.

3) పూర్వం ప్రజలు ఆకలి భయంతో, లేదా మూఢ భక్తితో సంతానాన్ని హత్య చేసేవారు. ముజర్‌ తెగ చెందిన ఒక వ్యక్తి తన భార్యతో తన ఆడ సంతానాన్ని చంప వలసిందిగా గ్టిగా తాకిదు చేసేవాడు. ఆమె గుంత త్రవ్వి భర్త వస్తుం డటం చూసి పాపను ఆ గుంతలో దింపి పై పై మట్టి  వేసి దాచి పెట్టేది.

సూరహ్‌ ఘనత:

1) అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా అన్నారు: ఈ సూరహ్‌ మక్కాలో ఒకే సారి అవతరించింది. దీని అవతరణ సందర్భంగా భుమి నుండి ఆకాశం వరకూ దైవ దూతల బృందం తస్బీహ్‌, తహ్లీల్‌ చేస్తూ ఉన్నారు.

2) అస్మా బిన్త్‌ జైద్‌ (ర.అ) ఇలా అన్నారు: అన్‌ఆమ్‌ సూరహ్‌ ప్రవక్త (స) వారి మీద ఒకే సారి అవతరించింది,  ఇది అవతరించిన సందర్భంగా నేను ఆయన సవారీ అయిన ఉన్న ఒంటె ముకుతాడును పట్టుకొని ఉన్నాను. ప్రవక్త (స) వారు అమాంతంగా బరువెక్కారు. ఎంతగానంటే ఒంటె ఎముకలు విరిగి పోతాయోమనన్నంతగా.

Related Post