సంఘ సంస్కరణ రణ పండితాగ్రేసరులు ముహమ్మద్‌ (స)

Muhammad Pece Be Upon Him
 అబుల్ ఇర్ఫాన్
ప్రపంచంలో ఎందరో మహాపురుషులు, దైవప్రవక్తలు ఉద్భవించి లోక కల్యాణం కోసం తమ వంతు కృషి చేశారు. అయితే ప్రవక్తలకు, ప్రవక్తేతరులకు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రవక్తేతరులయిన మహా పురుషులు సహజసిద్ధంగా తమకున్న జ్ఞానం, శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రమే పని చేశారు, చేస్తున్నారు. కాని దైవప్రవక్తలు తమకున్న జ్ఞానం, శక్తి సామర్థ్యాలను సృష్టికర్త నుండి లభించే దివ్యజ్ఞానం ప్రకారం వినియోగిస్తూ లోక కల్యాణం కోసం పనిచేస్తారు. దైవప్రవక్త లకు ఈ జ్ఞానం సందర్భానుసారం దివ్యావిష్కృతి (వహీ) ద్వారా కొద్ది కొద్దిగా లభిస్తుంది.
  అనాది నుండి నేటి యుగం వరకు లక్షలాది మంది దైవప్రవక్తలు ప్రభవించారు. వారందరూ ఒకే విధమైన మౌలిక బోధనలు
 తెచ్చారు. అందరూ సృష్టిపూజను, మిధ్యాదైవాల ఆరాధనను ఖండిస్తూ సృష్టికర్త, విశ్వ పాలకుడు, పరిపోషకుడయిన
ఏకేశ్వరుడ్ని మాత్రమే ఆరాధిం చాలన్నారు.
ఆయన ఆజ్ఞల ప్రకారమే జీవితం గడపాలని; తద్వారా మాత్రమే ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షం లభిస్తాయని తెలియజే శారు. మహనీయ ముహమ్మద్‌ (స) కూడా ఈ విషయాన్నే బోధించారు. ఈ మౌలిక బోధ నలకు సంబంధించిన ధర్మాన్నే ఇస్లాం అం టారు. దాని అనుచరులనే ముస్లింలు అం టారు.
 దాదాపు ప్రతి జాతిలోనూ దైవప్రవక్తలు ఉద్భవించారు. అయితే గత ప్రవక్తలు తెచ్చిన బోధనలు ప్రక్షిప్తాలకు గురయి పోయినందున దేవుడు నేటి కలియుగంలో మహనీయ ముహమ్మద్‌ (స) వారిని అంతిమ దైవప్రవక్త గా ప్రభవింపజేశాడు.
   మహాప్రవక్త ముహమ్మద్‌ (స) క్రీ.శ. 570 రబీవుల్‌ అవ్వల్‌ మాసం సోమవారం నాడు అరేబియాలోని మక్కా పట్టణంలో జన్మిం చారు. ముహమ్మద్‌ (స) జన్మించడానికి కొన్నాళ్ళ పూర్వమే ఆయన తండ్రి చని పోయాడు. ఏడేళ్ళ వయసులో తల్లి కూడా ఇహలోకం వీడిపోవడంతో ఆయన అనాథ అయ్యారు. –   ఆ కాలంలో యావత్తు ప్రపంచం విగ్రహారా ధన, మూఢనమ్మకాలలో పూర్తిగా మునిగి ఉం డింది. అరేబియాలో విగ్రహారాధనతో పాటు జనం నైతికంగా అనేక చెడుగులలో బాగా కూరుకుపోయి ఉన్నారు. సభ్యతా సంస్కారాలు పూర్తిగా కొరవడ్డాయి. సభ్యతా సంస్కారాలు లేని ఆనాటి సమాజంలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మద్య సేవనం, మగువ లోల త్వం మస్తుగా ఉండేవి. వీటికి తోడు అర బ్బులు తెగ విద్వేషం, జాతీయ దురభిమానాల తో చీటికిమాటికి పరస్పరం కత్తులు దూసు కుంటూ సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసుకునేవారు.కాని బాల ముహమ్మద్‌ (స)పై ఈ చెడు సమాజం ప్రభావం పడకుండా విధి ఆయన్ని మేకల కాపరిగా చేసి ఏకాంత ప్రదేశాల్లో నోరులేని జీవాల మధ్య ప్రకృతి దృశ్యాల చాటున సుశిక్షణ ఇచ్చింది.
  యౌవన వయస్సు వచ్చిన తరువాత ఆయన వర్తకం చేసి నీతిమంతుడయిన వర్తకునిగా ఖ్యాతి చెందారు. హజ్‌ సీజన్‌ వస్తే, వర్తకులం దరిలో ముహమ్మద్‌ (స) మాత్రమే ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకట్టుకునే వారు. కారణం ఆయన ఎలాంటి మోసం చేయకుండా నిజాయితీగా వ్యవహరిస్తారు; ఇతరులకంటే తక్కువ ధరలకు సరుకు అమ్ము తారు.వ్యాపారంలో వచ్చే లాభాలను పేదలకు, అనాధలకు దానం చేసేవారు.ఇలా ప్రతి వ్యవ హారంలోను ముహమ్మద్‌ (స) కనబరచే సౌశీ ల్యం, సద్వర్తనాలు చూసి ప్రజలు ఆయన్ని సాదిఖ్‌ (సత్యమంతుడు) అని, అమీన్‌ (నిజా యితీపరుడు) అని పిలిచేవారు.
 ఆనాడు బానిసవ్యవస్థ పకడ్బందీగా ఉండేది. ముహమ్మద్‌ (స) దైవప్రవక్త అయిన తరువాత పెద్దఎత్తున బానిస విమోచనోద్యమం సాగించి వేలాదిమందికి బానిసత్వం నుంచి శాశ్వతంగా విముక్తి కల్గించారు. ఆయనసలు దైవప్రవక్త కాకముందు నుంచే బానిస వ్యవస్థను అస హ్యించుకునేవారు. అర్ధాంగి ఖదీజా (రజి) ఓ బానిస బాలుడ్ని ఇస్తే ముహమ్మద్‌ (స) తక్షణ మే ఆ బాలుడికి బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు.
 కొన్నాళ్ళకు పిల్లవాడి తండ్రి, పినతండ్రి వచ్చి ”మా పిల్లవాడ్ని మాకు అప్పగించండి; మీ రెంత ధర అడిగినా ఇచ్చుకుంటాం” అన్నారు. దానికి ఆయన ”పిల్లవాడి  ఇష్టాయిష్టాల మీద వదిలేద్దాం. పిల్లవాడు మీ దగ్గరకు వస్తానంటే తీసికెళ్ళండి; నాకు డబ్బు ఇవ్వనవసరం లేదు. నాదగ్గరే ఉంటానంటే మాత్రం నేను మీకు అప్పగించలేను” అన్నారు. పిల్లవాడు ముహమ్మద్‌ (స) సద్వర్తనంతో ఇదివరకే ప్రభావితుడయి ఉన్నందున తండ్రి, పినతం డ్రుల వెంట సొంతూరుకు పోవడానికి నిరాక రించాడు.
  వయస్సు పెరుగుతున్న కొద్దీ ముహమ్మద్‌  (స)లో ఆధ్యాత్మిక చింతన కూడా అధికం కాసాగింది.ఆయన తరచుగా ఓ కొండ గుహ కెళ్ళి దైవధ్యానంలో లీనమైపోయేవారు. ఆయన (స) 40వ ఏట దైవదౌత్యం ప్రసాదిం చబడింది.  ఈ విధంగా సృష్టికర్త నుంచి దైవ సందేశం అవతరించే దివ్యావిష్కృతి ప్రారం భం అయింది. దివ్యావిష్కృతి ద్వారా లభించిన దైవాజ్ఞల ప్రకారం ముహమ్మద్‌ (స) ఏకేశ్వరో పాసనా ప్రచారం ప్రారంభించారు.
 దేవుడు ఒక్కడే ప్రభువు, ఆయనే సకల పూజలకు అర్హుడు, అన్ని అక్కరలనూ తీర్చే వాడూ ఆయనే, అందువల్ల చట్టాన్ని అంద జేసేవాడు, నియమాలను నిర్ధారించేవాడూ ఆయనే అనే మహనీయ ముహమ్మద్‌ (స) వాదనకు విస్తు పోయారు ప్రజలు. వారి ఆవేదన ఏమిటంటే అన్నీ చేసేవాడు దేవుడే అయితే మా మహనీయులు, మా ఊరి దేవ తలు, ఇలవేల్పుల మాటేమిటీ అన్నది! దాంతో జనం మొదట్లో ఆయన్ని వింతగా చూసి హేళన చేశారు. తరువాత క్రమంగా ఆయన కు శత్రువులయిపోయారు.
 ఆయనపై కష్టాలు వచ్చిపడ్తాయి. సత్య తిర స్కారులు ఆయన్ని రకరకాలుగా వేధించే వారు. పెదనాన్న అబూలహబ్‌, అతని భార్య అయితే బంధుత్వాన్ని సైతం ఖాతరు చేయకుండా ముహమ్మద్‌ (స)ని వేధించే వారు. ఆయన నడిచే బాటపై ముండ్లు పరిచే వారు. ఇంటి ఆవరణలో ప్రార్థన చేస్తుంటే పిట్టగోడ మీదనుంచి పైన మలినాలు పడవేసే వారు. అయినప్పటికీ ఆయన చూస్తూ సహిం చడం తప్ప పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు. కాకపోతే మితిమీరిన దౌర్జన్యాలతో విసుగెత్తి ”ముత్తలిబ్‌ వంశీయులారా! మీ పొరుగువారి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా!” అని మాత్రం అనేవారు.
  మరోవైపు జనం క్రమంగా ఇస్లాంని విశ్వ సించి ఆయనకు అనుచరులై పోసాగారు. బహుదవారాధకులైన ఖురైష్‌ తెగ నాయకులు ఈ నూతన ధర్మాన్ని విశ్వసించినవారిని  కూడా హింసించడం మొదలెట్టారు. ముస్లింల సంఖ్య పెరిగిన కొద్దీ వారిపై దుష్ప్రచారం, దౌర్జన్యాలు కూడా అధికమయ్యాయి. మూడేళ్ల పాటు సంఘబహిష్కరణ కూడా జరిగింది. అయినా తౌహీద్‌ విప్లవం ఆగలేదు. రెట్టి,పు వేగంతో వ్యాపించనారంభించింది. కారణం మహాప్రవక్త (స) ప్రతిపాదించిన ప్రాథమిక సూత్రాలే.
 ధర్మమయితే అందరికీ ధర్మమే. అధర్మమ యితే అందరికీ అధర్మమే. ఒకరికి పాపమయి నది అందరికీ పాపమే. ఒకరికి పుణ్యప్రదమై నది అందరికీ పుణ్య ప్రదమయినదే. నేరం అన్నది ఎవరు చేసినా నేరమే. ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం వర్తిం చదు.
 ఈ నిష్పక్షపాత నియమంలో నా స్వంత జను లకు, నా ఆత్మీయులకు, ఆప్తులకు, స్వయంగా నాకూ ఎలాంటి మినహాయింపు లేదు.నేను ప్రపంచంలో న్యాయ సంస్థాపనకు వచ్చాను. అందుకే నియుక్తుణ్ణి. ప్రజల మధ్య ఎటువంటి బేధభావం చూపించకుండా న్యాయంగా వ్యవ హరించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి నాపై బాధ్యత మోపబడింది. ప్రజల జీవితాల లో నెలకొన్న అసంఖ్యాకమయిన అసంతుల నాలను రూపు మాపడానికి, అన్యాయాలను అంతమొందించడానికి, సమాజంలో పొడ సూపుతున్న అసమానతలను తుడిచి ప్టెడానికి నియోగించబడ్డాను నేను. అంతే కాదు నేను మీ మధ్య న్యాయమూర్తిగా కూడా వ్యవహరి స్తాను. మీలో తలెత్తే తగాదాలకు సరయిన, న్యాయవంతమయిన తీర్పులను చేయడానికి దైవం నియమించిన న్యాయనిర్ణేతను నేను అని కూడా ఆయన చాటారు. తదనుగుణంగా మదీనా-లో స్థాపించిన తొలి ఇస్లామీయ నగర రాజ్యానికి న్యాయమూర్తి, జడ్జిగా కూడా ఆయన భూమిక అద్భుతమయినది.

Related Post