నామకరణం: సూరతుల్ ఇస్రా
ఈ సూరహ్పేరు ‘ఇస్రా’ పెట్టడానికి కారణం మహాద్భుత సంఘటన ‘ఇస్రా’ ప్రస్తావన ఇందులో ఉండటమే. రాత్రికి రాత్రి కోట్ల కాంతి సంవత్సరాల దూరం వెళ్ళి రావడం, రాత్రిలోని ఒక బాగంలో సప్తాకాశాలు, స్వర్గ నరకాలు, అప్పటి వరకూ ఎవ్వరూ వెళ్ళని సిద్రతుల్ మున్తహాకు ఆవల వెళ్ళి అల్లాహ్తో సంభాషించి రావడం మానవ చరిత్రలో కని, విని ఎరుగని మహాద్భుత సంఘట, గొప్ప మహిమ.
సూరహ్ పరిచయం:
1) ఇది మక్కీ సూరహ్. 26,32,33,57, 73 నుండి 80 వరకు గల ఆయతులు తప్ప. ఇపి మదీనాలో అవతరించాయి.
2) ఇది మియీన్ సూరాలలోనిది.
3) ఆయతుల సంక్య 111
4) క్రమానుసారం ఇది 17వ సూరహ్.
5) ఇది ఖసస్ సూరహ్ తర్వాత అవతరించింది.
6) ఇది స్తోత్ర శైలీతో ప్రారంభమవుతుంది (سبحن الذي)
7) 109వ ఆయతు దగ్గర ఒక సజ్దా ఉంది.
ముఖ్యాంశాలు:
ఇది మక్కీ సూరాలలోనిది. అఖీదహ్, రిసాలత్, ఆఖిరత్ గురించి నొక్కి వక్కాణిస్తుంది. ముఖ్యం మహనీయ ముహమ్మద్ (స) వారి విశిష్ఠతను మరింత ఇనుమడింపజేసేస్తుంది. ఆయన సత్య ప్రవక్త అనడానికి గల గొప్ప మహిమల్ని ఇది పేర్కొంటుంది.
అవతరణ నేపథ్యం:
అబ్దుల్లాహ్ గారి కథనం – ఒక బాలుడు ప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి – ఓ దైవప్రవక్తా (స)! నా తల్లి మిమ్మల్ని ఫలానా ఫలానా వస్తువులు అడిగింది అన్నాడు. అందుకు ప్రవక్త (స) -‘ఈ రోజు మీకివ్వడానికి మా దగ్గర ఏమీ లేదు’ అని సమాధానమిచ్చారు. నా తల్లి చెప్పింది: మీ చొక్కా నాకు తొడిగించాలని’. ప్రవక్త (స) తన చొక్కాను తీసి ఆ బాలుడుకి ఇచ్చి వేశారు. బయిటికీ రాకుండా ఇంటి లోపలే కూర్చుండి పోయారు. బిలాల్ (ర) అజాన్ ఇచ్చారు, ఇఖామత్ కూడా అయి పోయింది కాని ప్రవక్త (స) బయికి రాలేదు. కంగారు చెందిన సహాబ అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళగా ప్రవక్త (స) చొక్కా లేకుండా కూర్చుని ఉన్నారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది: మరియు నీవు (పిసినారితనంతో) నీ చేతిని నీ మెడకు కట్టుకోకు మరియు దానినిపూర్తిగా స్వేచ్ఛగాకూడా వదలి పెట్టకు. అలాచేస్తే నిందలకు గురిఅవుతావు, దిక్కు లేని వాడవై కూర్చుంటావు (విచారిస్తావు).29
ఈ సూరహ్ ఘనత:
హజ్రత్ ఆయిషా (ర.అ) ఇలా అన్నారు: ”ప్రవక్త (స) ప్రతి రాత్రి బనీ ఇస్రాయీల్ (ఇస్రా) మరియు అజ్జుమర్ సూరాలు పారాయణం చేసేవారు.
2) సహాబా ఫజ్ర్ నమాజులో తరచూ సూరహ్ ఇస్రాను చదివేవారు.