సూరతుల్‌ పాతిహా

నామకరణం: సూరతుల్‌ పాతిహా

‘అల్‌ ఫాతిహా’ అని నామకరణం చయ్యడానికి గల కారణం- ఈ సూరాతో ఖుర్‌ఆన్‌ మహా గ్రంథం ప్రారంభం అవ్వ డమే. ఈ సూరాకు మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. 1) ఉమ్ముల్‌ కితాబ్‌ – ఖుర్‌ఆన్‌ మౌలికాంశాలన్నింకి ఇది  క్షేత్ర స్థాయి అధ్యాయం.  సబ్‌వుల్‌ మసానీ, అష్షాఫియహ్‌, అల్‌ వాఫియహ్‌, అల్‌ కాఫియహ్‌, అల్‌ అసాస్‌, అల్‌ హమ్ద్‌ అన్న నామాలు ఈ సూరాకు ఉన్నాయి.

”ఏ శక్తి స్వరూపుని చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నా – తౌరాతులోగానీ, ఇన్జీల్‌లోగానీ, జబూర్‌లోగానీ, స్వతహాగా ఫుర్‌ఖాన్‌ (ఖుర్‌ఆన్‌)లోగానీ ఇటువంటి సూరహ్‌ అవతరించ లేదు.ఇదే సబ్‌వుల్‌ మసానీ మరియు నాకివ్వబడిన ఖుర్‌ఆనల్‌ అజీమ్‌”. (ముస్నద్‌ అహ్మద్‌)

సూరహ్‌ పరిచయం:

1) ఈ సూరహ్‌ అవతరణ మక్కాలో జరిగింది. ఒకరిద్దరు పండితులు మాత్రం ఇది మదీనాలో అవతరించింది అనాంరు.

2) ఇది మసానీ సూరాలలోనిది.

3) దీనిలోని ఆయతుల సంఖ్య ‘బస్మల్లహ్‌’తో కలిపి ఏడు.

4) ఖుర్‌ఆన్‌ వరుస క్రమంలో ఇది మొది సూరహ్‌.

5) ఈ సూరహ్‌ ‘ముద్దస్సిర్‌’ సూరా తర్వాత అవతరించింది.

6) స్తోత్ర శైలికి సంబంధించిన ఒక శైలి ‘అల్‌ హమ్దు లిల్లాహ్‌’ తో ఈ సూరహ్‌ ప్రారంభమవుతుంది.

7) ఈ సూరాలో ‘అల్లాహ్‌’ మహోన్నత నామం బస్మలహ్‌తో కలిపి రెండు సార్లు వచ్చింది.

8) భాగం 1 , హిజ్బ్‌ 1, రుబూ 1.

సూరహ్‌ పేర్కొన బడిన అంశాలు:

ఈ సూరహ్‌ ఇస్లాం ధర్మ మౌలిక విషయాలు మరియు పాక్షిక విషయాల చుట్టూ ఉంటుంది. ఉదాహరణకు- అఖిదహ్‌, ఇవబాదహ్‌, షరీఅహ్‌, పరలోక విశ్వాసం, అల్లాహ్‌ రుబూబియ్యత్‌, అల్లాహ్‌ ఉలూహియ్యత్‌, అల్లాహ్‌ అస్మా వస్సిఫాత్‌ – గుణ నామాల పట్ల విశ్వాసం, మొక్కుబడి, అర్థింపులలో అల్లాహ్‌ ఒక్కడిని మాత్రమే ఆశ్రయించడం, సన్మార్గ భాగ్యాన్ని అర్థించే నిమిత్తం ఆయన వైపునకు మరలడం, ఆయనతోనే సన్మార్గ సద్బుద్ధిని వేడుకోవడం, విశ్వాసం మిద నిలకడ కలిగి జీవించడంతోపాటు సజ్జనుల మార్గాన్ని అనుసరించి ఆయన్ను దీనాతి దినంగా ప్రాధేయ పడటం, మార్గ భ్రష్టులు, అల్లాహ్‌ ఆగ్రహానికి గురయిన వారి బాటకు దూరంగా మసలుకోవడం, గత సముదాయాల సత్పరిణామం, దుష్పరిణామ ప్రస్తావన, సౌభాగ్య జీవి తానికి మెట్లు, దురదృష్టకర జీవితానికి కారణాలు, అల్లాహ్‌ చెయ్యమన్న వాటిని చేస్తూ, వదులుకోమన్న వాటిని వదలడం ద్వారా అల్లాహ్‌ ప్రసన్నతను చూరగొనే ప్రయత్నం చెయ్యండం తదితర విషయాల ప్రస్తావన ఈ సూరహ్‌లో ఉంటుంది.

అవతరణ నేపథ్యం:

అబీ మైసరహ్‌ కథనం – ప్రవక్త (స) తొలి వహీ అవతరణలో చోటు చేసుకున్న స్థితి కారణంగా కాసింత బెరుకు కలిగి ఉండే వారు. ‘ఓ ముహమ్మద్‌’ అన్న అపరిచిత పిలుపు ఎక్కడ ఎప్పుడు విన్నా ఆయన పారి పోయేవారు. అప్పుడు వర్ఖా బిన్‌ నౌఫల్‌ ఇలా అన్నారు: ”మీరు ఇలాంటి  పిలుపు వింటే స్థిమితంగా నిబడి ఏం చెప్పబడుతుందో వినండి. ఓ సారీ ఓ మహమ్మద్‌! అని పిలుపు వినబడింది. అందుకాయన- ‘లబ్బయిక్‌! అన్నారు. అప్పుడు ఇలా అనబడింది: అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ అని చెప్పండి. ఆనక ఇలా సెలవియ్య బడింది: అల్‌హమ్దు లిల్లాహి రబ్బిల్‌ ఆలమీన్‌….చివరి సూరహ్‌ వరకూ.. ఇది అలీ బిన్‌ అబీ తాలిబ్‌ (ర) గారి మాట.

సూరహ్‌ ఘనత:

ఉబై బిన్‌ కఅబ్‌ (ర) ప్రవక్త (స) వారికి ఉమ్ముల్‌ ఖుర్‌ఆన్‌ పారాయణం చేసి విన్పించారు. అది విన్న ప్రవక్త (స) ఇఆల అన్నారు: ”ఏ శక్తి స్వరూపుని చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నా – తౌరాతులోగానీ, ఇన్జీల్‌లోగానీ, జబూర్‌లోగానీ, స్వతహాగా ఫుర్‌ఖాన్‌ (ఖుర్‌ఆన్‌)లోగానీ ఇటువంటి  సూరహ్‌ అవతరించ లేదు.ఇదే సబ్‌వుల్‌ మసానీ మరియు నాకివ్వబడిన ఖుర్‌ఆనల్‌ అజీమ్‌”. (ముస్నద్‌ అహ్మద్‌)

 

Related Post