సూరతుల్‌ బఖరహ్‌

నామకరణం: సూరతుల్‌ బఖరహ్‌

ఈ మహిమాన్విత సూరహ్‌కు ‘అల్‌ బఖరహ్‌’ అని నామ కరణం చేయడానికి గల కారణం – ఇదే సూరలో పేర్కొనబడిన ఓ మహిమ. ఈ మహిమ మూసా (అ) వారి కాలంలో సంభవించింది. జరిగిందేమిటంటే, బనీ ఇస్రాయీల్‌కి చెందిన ఒక వ్యక్తి హత్య గావించ బడ్డాడు. అయితే ఎవరు హత్య చేశారన్నది రుజువు కాలేదు. ఈ సమస్యను ప్రవక్త మూసా (అ) వారి ముందర తీసుకు వచ్చినప్పుడు – అల్లాహ్‌ ఆనతి మేరకు ఆయన వారకి ఒక ఆవును జిబహ్‌ చేయ వలసిందిగా, లేదా ఆవును జిబహ్‌ చేసి దాని ఒక భాగాన్ని తీసి మరణించిన ఆ వ్యక్తిని తడమాల్సిందిగా ఆదేశించారు. అల్లాహ్‌ ఆజ్ఞతో ఆ వ్యక్తి బతుకుతాడు, తనను హతమార్చివారిని గురించి తెలియజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇది అల్లాహ్‌ శక్తి సూచనకు సంబంధించిన ఒక గొప్ప సంఘటన – మరణించిన తర్వాత తిరిగి బతికిస్తాడు అనడానికి ప్రబల తార్కాణం.

ఇది అల్లాహ్‌ శక్తి సూచనకు సంబంధించిన ఒక గొప్ప సంఘటన – మరణించిన తర్వాత తిరిగి బతికిస్తాడు అనడానికి ప్రబల తార్కాణం.

సూరహ్‌ పరిచయం:


1) ఇది మదనీ సూరహ్‌.
2) ఇది తివాల్‌ సూరాలలోని అతి పెద్ద సూరా.
3) ఇందులోని ఆయతుల సంఖ్య 286
4) ఖుర్‌ఆన్‌ వరుస క్రమంలో ఇది రెండవది.
5) ఇది మదీనాలో అవతరించిన తొలి సూరహ్‌
6) ఈ సూరా ‘ముఖత్తఆత్‌’ అక్షరాలతో మొదలవుతుంది. (الم)
7) ఇందులో వందకు పై సార్లు అల్లాహ్‌ నామ ప్రస్తావన వచ్చింది.
8) ఈ సూరహ్‌లో ‘ఆయతుద్దయిన్‌’ ఖుర్‌ఆన్‌లోనే అతి పెద్ద ఆయతు.
అది 282 ఆయతు.
9) ఈ సూరహ్‌లో ఖుర్‌ఆన్‌లోనే అత్యంత మహిమన్వితమయిన ఆయతు – ఆయతుల్‌ కుర్సీ ఉంది.
10) ఈ సూరహ్‌లోనే మేరాజ్‌ సందర్భంగా కానుకగా ఇవ్వబడి రెండు ఆయతులున్నాయి. 285, 286.
11) ఖుర్‌ఆన్‌లో చివరిగా అవతరించిన ఆయతు 281 ఈ సూరహ్‌లో నే ఉంది. ”వత్తఖూ యౌమన్‌ తుర్‌జవూన్‌….’
11) భాగం – 1,2,3. హిజ్బ్‌ – 1-5, అర్రుబువు 1-19.


సూరహ్‌ పేర్కొన బడిన అంశాలు:


ఖుర్‌ఆన్‌లోనే అత్యంత పెద్ద సూరహ్‌. ఇది మదనీ సూరహ్‌. మదనీ సూరాల మాదిరిగానే ఇందులో షరీఅతు పరమయిన ఆదేశాలు, వ్యవస్థాగతమయిన విషయాలు, ముస్లిం సామాజిక జీవితానికి అవసరమయిన చట్టాలు ఉన్నాయి.
అవతరణ నేపథ్యం:
ముజాహిద్‌ (రహ్మ) కథనం – ఈ సూరహ్‌లోని మొది నాలుగు ఆయతులు విశ్వాసుల విషయమయి అవతరించాయి. తర్వాతి రెండు ఆయతులు అవిశ్వాసుల విషయమయి అవతరించాయి. ఆ తర్వాతి 13 ఆయతుల్లో మునాఫిక్‌ల – కపటుల ప్రస్తావన ఉంది.
‘ఇన్నల్లజీన కఫరూ’ జిహాక్‌ (రహ్మ) – ”ఇది అబూ జహల్‌ మరియు అతని కుటుంబీకులయిన అయిదుగురిని ఉద్దేశించి అవతరించింది అన్నారు. కల్బీ (రహ్మ) – అంటే యూదులు అన్నారు.


ఈ సూరహ్‌ ఘనత:


1) ఈ సూరహ్‌ చదవబడే ఇంటి నుండి షైతాన్‌ పారి పోతాడు.
2) సూరతుల్‌ బఖరహ్‌, ఆల్‌ ఇమ్రాన్‌ చదవాల్సిందిగా ప్రవక్త (స) ప్రోత్సహించారు.
3) సూరతుల్‌ బఖరహ్‌ను తీసుకోవడం శుభం, వదులుకోవడం పశ్చాత్తాపం.
4) సూరతుల్‌ బఖరహ్‌ను చేతబడి చేసేవారు జయించ లేరు,
5) సూరతుల్‌ బఖరహ్‌ కారణంగా తక్కువ వయసు గల వ్యక్తిని జాతికి నాయకునిగా నియమించారు ప్రవక్త (స).
6) ఆయతుల్‌ కుర్సీ ప్రతి ఫర్జ్‌ నమాజు తర్వాత చదివితే ఇక ఆ వ్యక్తిని స్వర్గం నుండి ఏ వస్తువు ఆపజాలదు ఒక్క మరణం తప్ప.
7) చివరి రెండు ఆయతులు చదివితే అవి అన్ని విధాల అతనికి సరి పోతాయి.
8) ఆయతుల్‌ కుర్సీ పడుకునేటప్పుడు చదివితే ఉదయం అయ్యేంత వరకూ షైతాన్‌ అతని దగ్గరకు కూడా రాడు.

Related Post