సూరతుల్‌ మాయిదహ్‌

నామకరణం: సూరతుల్‌ మాయిదహ్‌:

ప్రవక్త ఈసా (అ) వారి చెతుల మీదుగా అల్లాహ్‌ జరపించిన ఒక మహత్యం ‘మాయిదహ్‌’ వడ్డించిన విస్తరి. ఈ మహిమ పేరునే ఈ సూరహ్‌ పేరుగా పెట్టడం జరిగింది.

అల్లాహ్‌ సాక్తిగా! ఆ ఆయతు ఏదో కూడా మాకు తెలుసు. అది ఏ రోజు అవ తరించిందో కూడా తెలుసు. ఏ ఘడియలో అవతరించిందో కూడా తెలుసు. అది అరఫా దినాన శుక్రవారం సంధ్యా సమయాన అవతరించింది. (బుఖారీ)

సూరహ్‌ పరిచయం:

1) ఇది మదనీ సూరహ్‌. 2) ఇది తివాల్‌ సూరాలలోనిది. 3) పూర్తి ఆయతుల సంక్య 120.

4) క్రమానుసారం ఇది అయిదవ సూతరహ్‌. 5) ఇది సూరతుల్‌ ఫతహ్‌ తర్వాత అవతరించింది.

6) ఇది ఖుర్‌ఆన్‌ శైలీలలో ఒకటయిన  (  يا ايها الذين آمنوا ) తో ప్రారంభ మవుతుంది.

7) ఇది 6 మరియు 7వ పారాలలో ఉంది.

సూరాలో పేర్కొన బడిన ముఖ్యాంశాలు:

అన్య మదనీ సూరాల మాదిరిగానే ఈ సూరహ్ లో సయితం శాస్త్ర సంబంధిత అనేక ఆదేశాలున్నాయి. ఆబూ మైసరా ఇలా అంటున్నారు: ఇది చివరిలో అవతరించిన సూరహ్‌ కనుక ఇందులో రద్దు చేయడబడిన ఆదేశం ఏది లేదు. ఇందులో 18 విధుల (ఫరాయిహ్‌ల) ప్రస్తావన ఉంది.

అవతరణ నేపథ్యం:

1) ‘వలా తుహిల్లూ షఆయితరల్లాహి’ – పూర్వం ప్రజలు అల్లాహ్‌ షఆయిర్‌ను మార్చే ప్రయత్నం చేసేవారు. ఉదాహరణకు – అల్లాహ్‌ ఒక మాసాన్ని నిషిద్ధ మాసంగా ఖరారు చేస్తే వారు, వారి అవసరార్థం మరో ఆ మాసాన్ని కాకుండా మరో మాసాన్ని నిషిద్ధ మాసంగా ప్రకించే వారు. ఇలా అల్లాహ్‌ చిహ్నాల విషయంలో మనిషి జోక్యం చేసుకోకూడదన్న కఠిన ఆదేశాలతో ఈ సూరహ్‌ లోని కొన్ని ఆయతులు అవతరించాయి.

2) ‘అల్‌ యౌమ అక్మల్తు లకుమ్‌ దీనకుమ్‌ వ ఆత్మమ్‌తు అలైకుమ్‌ నిఅమతీ’ అన్నాడు అల్లాహ్‌. ఈ ఆయతు అవతరించినప్పుడు ఒక యూద వ్యక్తి వచ్చి హజ్రత్‌ ఉమర్‌ (ర) గారితో ఇలా అన్నాడు: ”ఓ విశ్వాసుల నాయకా! మీరు మీ గ్రంథంలో ఒక ఆయతు చదువుతారు. ఒకవేళ అటువంటి ఆయతే గనక మా గ్రంథంలో అవతరించి ఉంటే మేము అది అవతరించిన దినాన్ని పండుగ దినంగా చేసుకునే వారము” అన్నారు. అది విన్న ఉమర్‌ (స) ఇలా అన్నారు.  అల్లాహ్‌ సాక్తిగా! ఆ ఆయతు ఏదో కూడా మాకు తెలుసు.  అది ఏ రోజు అవ తరించిందో కూడా తెలుసు.  ఏ ఘడియలో అవతరించిందో కూడా తెలుసు. అది అరఫా దినాన శుక్రవారం సంధ్యా సమయాన అవతరించింది. (బుఖారీ)

గమనిక:

కొందరు విపరీత బుద్ధి ప్రబుద్ధులు – ప్రవక్త ఈసా (అ) మాయిదహ్‌ ప్రార్థన – అల్లాహుమ్మ రబ్బనా అనిజిల్‌ అలైనా మాయిదతిమ్‌ మినస్సమాయి తకూను లనా ఈదల్     లి అవ్వలినా వ ఆఖిరినా వ ఆయతిమ్‌ మిన్‌క” – ఓ అల్లాహ్‌ మా ప్రభూ! ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్ళాన్ని దించు. అది మా కొరకు -(అనగా) మాలోని తొలివారు, తుది వారందరికీ సంతొషకరమయిన విషయం (పండుగ) కావాలి. (మాయిదహ్‌: 114)  దీన్ని ఆసరాగా చేసుకొని సంతోష సమయాన్ని ఈద్‌గా ఆయన పేర్కొన్నప్పుడు మేమెందుకు చేసుకో లేము. మాకు ప్రవక్త (స) వారి జన్మ దినానికి మించిన సంతోష ఘడియ మరొకటి లేదు అంటారు. వారికి మా సమాధానం – గత ధర్మ శాస్త్రాలన్నీ ప్రవక్త (స) వారి ఆగమనంతో రద్దయ్యాయి. ఇప్పుడు ఆయన తీర్మానించి వెళ్ళినదే శాస్త్రం. అలాగే ఒకవేళ అది అంత ప్రాముఖ్యత గల విషయమయి ఉంటే స్వయంగా ప్రవక్త (స) చెప్పేవారు. లేదా ఆయన సహాబా చేసి ఉండేవారు. కనుక ఈద్‌ మీలాద్‌ చేసుకోవడం బిద్‌ఆత్‌.

 

Related Post