నామకరణం: సూరతుల్ మోమినూన్
ఈ సూరహ్‌కు ‘అల్ మోమినూన్’ అని నామకరణం చెయ్యడానికి గల కారణం – ఈ సూరహ్ ప్రారమభంలోనే విశ్వాసుల గుణగణాల ప్రస్తావన రావడమే. ఈ సూరహ్ అవిశ్వాసుల అవలక్షణాలను సయితం పేర్కొంటుంది.
సూరహ్ పరిచయం:
1) ఇది మక్కీ సూరహ్.
2) ఇది మియీన్ సూరాలలోనిది.
3) ఆయతుల సంక్య 118
4) క్రమానుసారం ఇది 23వ సూరహ్.
5)ఇది అన్బియా సూరహ్ తర్వాత అవతరించింది.
6) ఒక విషయాన్ని బల పరుస్తూ ఈ సూరహ్ ప్రారభమవుతుంది. ‘ఖద్ అఫ్‌లహల్ మోమినూన్’ వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు
ముఖ్యాంశాలు:
ఈ సూరహ్ కూడా ఇతర మక్కీ సూరాల మాదిరిగానే తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి చెపుతుంది.
అవతరణ నేపథ్యం:
హజ్రత్ ఉమర్ (ర) గారి కథనం – ప్రవక్త (స)పై వహీ అవతరించే సమయంలో తేనెటీగ శబ్దం వచ్చేది. అది విని మేము అక్కడే వేచి ఉన్నాము. ప్రవక్త (స) ఖిబ్లా దిశకు తిరిగి ఈ దుఆ اللهم زدنا ولا تنقصنا وأكرمنا ولا تُهِنَّا وأعطنا ولا تحرمنا وآثرنا ولا تؤثر علينا وارض عنا
చేెసిన తర్వాత ఇలా అన్నారు: ”అల్లాహ్ ఇప్పుడే నా మీద 10 ఆయతులు అవతరింపజేశాడు. వాటిని తప్పసరిగా పాటించే వ్యక్తి స్వర్గ శుభవార్తను అందజేశాడు అని మొదటి పది ఆయతులను పఠించి విన్పించారు. వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;
వారే! ఎవరైతే తమ నమా’జ్‌లో వినమ్రతను పాటిస్తారో!
మరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో;
మరియు ఎవరైతే విధిదానం (’జకాత్) సక్రమంగా చెల్లిస్తారో!
మరియు ఎవరేతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో.
తమ భార్యలతో (అజ్వాజ్‌లతో) లేక తమ అధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిసస్త్రీలతో తప్ప! అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు.
కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు.
మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.
మరియు వారు ఎవరైతే తమ నమా’జ్‌లను కాపాడుకుంటారో!
అలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు.
వారే ఫిర్‌దౌస్ స్వర్గానికి వారసులై, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. (1-11)