సూరహ్‌ యూసుఫ్‌

నామకరణం: సూరహ్‌ యూసుఫ్‌

అత్యంత గౌరవప్రదమయిన రాత్రి, అత్యంత గౌరవప్రదమయిన స్థలంలో, అత్యంత గౌరవప్రదమయిన దూత ద్వారా, అత్యంత గౌరవప్రదమయిన ప్రవక్త మీద అత్యంత గౌరవవంతడుయిన అల్లాహ్‌ా తరఫు నుండి అత్యంత గౌరవప్రదమయిన భాషలో అవతరించిన అత్యంత గౌరవప్రదమయిన ఖుర్‌ఆన్‌. ఇందులో పేర్కొనబడిన అత్యుత్తమ గాథ ప్రవక్త యూసుఫ్‌ (అ) గారిది. ఈ గాథను అల్లాహ్‌ ‘అహ్సనల్‌ కసస్‌’ అని పేర్కొన్నాడు. ఈ సూరహ్‌లో ప్రవక్త యూసుప్‌ (అ) వారి గాథ ఉండటం మూలంగా దీనికి ‘యూసుఫ్‌’ అని నామకరణం చెయ్యడం జరిగింది.

ప్రవక్త యూసుఫ్‌ (అ) వారి గాథ. ఆయన బాల్యం నుండి దైవదౌత్యం ప్రసాదించ బడి, ప్రభుత్వ పగ్గాలు చేపట్టేంత వరకూ ఎంతో హృద్యంగా వివరించ బడింది.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మక్కీ సూరహ్‌. 1,2,3,7 ఇవి మాత్రం మదీనాలో అవతరించాయి.

2) ఇది మియీన్‌ సూరాలలోనిది.

3) ఆయతుల సంఖ్య 111

4) ఇది హూద్‌ సూరహ్‌ అనంతరం అవతరించింది.

5) ఇది హురూఫ్‌ ముఖత్తఆత్‌తో (الر ) ప్రారంభమవుతుంది.

6) ఇందులో ప్రవక్త యూసుప్‌ పేరు 25 సార్లకన్నా ఎక్కువ వచ్చింది.

7) క్రమానుసారం ఇది 12వ సూరహ్‌.

ముఖ్యాంశాలు:  

ఇది మక్కీ సూరహ్‌ా. ఇందులో ప్రవక్తల గాథల ప్రస్తావన ఉంది. మఖ్యంగా ప్రవక్త యూసుఫ్‌ (అ) వారి గాథ. ఆయన బాల్యం నుండి దైవదౌత్యం ప్రసాదించ బడి, ప్రభుత్వ పగ్గాలు చేపట్టేంత వరకూ ఎంతో హృద్యంగా వివరించ బడింది. ఇదే గాథ బైబిల్‌ పాత నిబంధనల్లో కాసింత మార్పుతో దొరుకుతుంది. అయితే ఖుర్‌ఆన్‌ శైలికి అది ఆమట దూరం. ఎందుకంటే ఖుర్‌ఆన్‌ గాథను కేవలం ఒక గాథలా విన్పంచదు, దాని ద్వారా గ్రహించాల్సిన హిత బోధను సయితం అది సూచిస్తుంది.

అవతరణ నేపథ్యం:

మస్‌ఆబ్‌ బిన్‌ సఅద్‌ తన తండ్రి సఅద్‌ బిన్‌ అబీ వఖాస్‌తో ఉల్లేఖించారు: نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ

(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమ మైన గాథను నీకు వినిపించ బోతున్నాము.

ఈ ఆయతు గురించి ఆయన ఇలా అన్నారు: అల్లాహ్‌ ప్రవక్త (స) పై ఖుర్‌ఆన్‌ అవతరింపజేశాడు. ఆయన దాన్ని మాకు చదివి ఓ సుదీర్ఘ సమయం వరకూ విన్పించారు. తర్వాత ప్రజలన్నారు- యా రసూలల్లాహ్‌! మీరు ఏదయిన యాదార్థ గాథ వినిపిస్తే బాగుండు అని. అల్లాహ్‌ా ‘ ‘ ఈ సూరహ్‌ను అవతరింపజేశాడు. దాన్ని ప్రవక్త ఓ సూదీర్ఘ కాలం వరకూ విన్పిస్తూ ఉన్నారు. మళ్ళీ జనులన్నారు – మీరు మాతో సంభాషణ లాంటిది జరిపితే బాగుండు. అప్పుడు అల్లాహ్‌

اللَّهُ نَزَّلَ أَحْسَنَ الْحَدِيثِ كِتَابًا مُتَشَابِهًا مَثَانِيَ تَقْشَعِرُّ مِنْهُ جُلُودُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلِينُ جُلُودُهُمْ وَقُلُوبُهُمْ إِلَى ذِكْرِ اللَّهِ – الزمر/ 23 .

అల్లాహ్‌ సర్వశ్రేష్ఠమైన బోధనను ఒక గ్రంథరూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకే రకమైన వాటిని (వచనాలను) మాటి మాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం వలన మెత్తబడతాయి. అనే ఆయతును అవతరింపజేశాడు. వారు ఖుర్‌ఆన్‌ను బలంగా విశ్వసించాలన్నదే దీని ఉద్దేశ్యం. ప్రజలు పారాయణాన్ని ఇష్ట పడ్డాడు అత్యుత్తమ పారాయణ సూక్తులు వారికివ్వ బడ్డాయి. ప్రజలు గాథల్ని ఇష్ట పడ్డారు.  అత్యుత్తమ  గాథలు వారికివ్వ బడ్డాయి. వారు సంభాషణను ఇష్ట పడ్డారు, అత్యుత్తమ సంభాషణలు వారికివ్వ బడ్డాయి అన్నారు ఔన్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర).

సూరహ్‌ ఘనత:

  • మస్‌అబ్‌ బిన్‌ ఉమైర్‌ మదీనాకు ధర్మాన్ని నేర్పించడానికి వచ్చినప్పుడు – అమ్ర్‌ బిన్‌ జమూహ్‌ అనే వ్యక్తి కొందరికి ఆయన వద్దకు పంపి – మీరు తీసుకు వచ్చిన ఆ గ్రంథమేది? అని అడగమన్నాడు. దానికి సహాబ అన్నారు మీకు ఇష్టముంటే మేము మీ వద్దకు వచ్చి చదివి విన్పిస్తాము అన్నారు. అనుమతి ఇవ్వడంతోపాటు ఒక రోజు కేయించాడు. ఆ దినం వెళ్ళి

الر تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِا

إِنَّا أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ

అలిఫ్-లామ్-రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు.

వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్ఆన్ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము.

ఈ సూరహ్‌ను చదివి విన్పించారు.

2) అబ్దుల్లాహ్‌ బిన్‌ ఆమిర్‌ బిన్‌ రబీఆ (ర) ఇలా అన్నారు: నేను ఫజ్ర్‌ నమాజులో ఈ సూరహ్‌ను హజ్రత్‌ ఉమర్‌ (ర) గారు పారాయణం చేస్తూ విన్నాను.

3) స్వర్గ వాసులు స్వర్గంలో సూరహ్‌ యూసుఫ్‌ మరియు మర్యమ్‌ సూరాలను రసాస్వాదన చేస్తారు అన్నారు ఖాలిద్‌ బిన్‌ మిఅదాన్‌.

4) అతా (రహ్మ) ఇలా అన్నారు: ఖేదకు, దుఃఖానికి, బాధకు గురయిన ఏ వ్యక్తయినా సరే ఈ సూరహ్‌ను చదివిన్లయితే అతనికి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది.

Related Post