నామకరణం: సూరహ్ అన్నహ్ల్
ఈ సూరహ్‌కు ‘అన్నహ్ల్’ అని నామకరణం చెయ్యడానికి గల కారణం – ఇందులోని 68వ ఆయతులో తేనెటీగ ప్రస్తావన ఉండటమే. ఇది అల్ప జీవి అయినప్పికీ ఒక తెలివయిన కీటకం. అల్లాహ్ మార్గదర్శకం మేరకు అది పని చేస్తుంది, అది ఉత్పత్తి చేసే స్వచ్ఛమయిన తేనెను అల్లాహ్ మానవాళికి అనుగ్రహించిన మేళ్ళలో ఒకటి. తెనెలో మానవాళికి స్వస్థత ఉందని స్వయంగా అల్లాహ్ పేర్కొనడం గమనార్హం.

పైనున్న ఆకాశమందున్న సూర్య చంద్ర నక్షత్రాలు, క్రిందనున్న భూమియందు గల సమద్రాలు, పర్వతాలు, వృక్షాలు, పశుపక్యాదులు, నదీ నదాలు, లోయలు,పంట పొలాలు, ఓడలు – సృష్టిలోని వైవిధ్యం ఇవన్నీ అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు అనడానికి ప్రబల నిదర్శనాలు అంటుంది.
సూరహ్ పరిచయం:
1) ఇది మక్కీ సూరహ్. 126, 128 ఆయతులు తప్ప, ఇవి మదీనాలో అవతరించాయి.
2) ఇది మియీన్ సూరాలలోనిది.
3) ఆయతుల సంక్య 128.
4) క్రమానుసారం ఇది 16వ సూరహ్.
5) ఇది సూరహ్‌ా యూసుఫ్ తర్వాత అవతరించింది.
6) ఈ సూరహ్ ఫిఆలె మాజీతో (أتى) ప్రారంభమవుతుంది.
7) ఈ సూరహ్‌లో 50వ ఆయతు దగ్గర ఒక సజ్దా ఉంది.
ముఖ్యాంశాలు:
ఇది మక్కీ సూరాలలోనిది. ఈ సూరహ్ అకీదహ్ మౌలికాంశాలయిన తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి ప్రస్తావి స్తుంది. విశ్వాంతరాళంలో గల అల్లాహ్ ఏకత్వ ఆధారాలను ఈ సూరహ్ పేర్కొంటుంది. పైనున్న ఆకాశమందున్న సూర్య చంద్ర నక్షత్రాలు, క్రిందనున్న భూమియందు గల సమద్రాలు, పర్వతాలు, వృక్షాలు, పశుపక్యాదులు, నదీ నదాలు, లోయలు,పంట పొలాలు, ఓడలు – సృష్టిలోని వైవిధ్యం ఇవన్నీ అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు అనడానికి ప్రబల నిదర్శనాలు అంటుంది.
అవతరణ నేపథ్యం:
అబ్దుల్లాహ్‌ా బిన్ అబ్బాస్ (ర) గారు ఇలా అన్నారు: ‘ఆ ఘడియ దగ్గరకు వచ్చింది’ (అల్ ఖమర్) అన్న ఆయతు అవతరించినప్పుడు మక్కా అవిశ్వాసులు ఒండొకరితో ఇలా అనుకోసాగారు. మీరు చేస్తున్న పనుల్ని ప్రక్కన పెట్టి ప్రళయ రాక కోసం ఎదురు చూడండి. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు: మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు’ (అంబియా) అన్న ఆయతును అవతరింప జేశాడు. సమయం కాస్త సుదీర్ఘమయ్యే సరికి ‘ఓ ముహమ్మద్! మమ్మల్ని భయపెట్ట గలిగేది ఏదీ రాలేదేమి? అని అడిగారు. అప్పుడు ‘ అతా అమ్రుల్లాహ్- అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది!’ అన్న ఆయతు అవతరించింది. వారందరూ ఆకాశానికేసి చూడటం ప్రారంభించారు. తర్వాత ఇలా అనబడింది: కావున మీరు దానికొరకు తొందరపెట్టకండి. అప్పుడు వారు కాస్త శ్వాస పీల్చుకున్నారు. ఈ ఆయతు అవతరించిన తార్వత ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నేను మరియు ప్రళయం (రెండు వేళ్ళను చూపించి) ఇలా దగ్గర దగ్గరగా పంప బడ్డాము”.
2) ఉబై బిన్ ఖలఫ్ అల్ జుమ్హీ ఓ రోజు కుళ్ళిపోయిన ఓ ఎముకను తీసుకొచ్చి – ఓ ముహమ్మద్! (స) ఈ ఎముకను నీ ప్రభువు బ్రతికిస్తాడాంవా? అని ప్రశ్నించాడు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది: ఆయన మానవుణ్ణి ఇంద్రియ (వీర్య) బిందువుతో సృష్టించాడు, తరువాత ఆ వ్యక్తి యే ఒక బహిరంగ వివాదిగా మారి పోతాడు. (4)