సూరహ్‌ అర్రాద్‌

  నామకరణం: సూరహ్‌ అర్రాద్‌

ఈ సూరహ్‌కి ‘అర్రాద్‌’ అని నామకరణం చెయ్యడానికి గల కారణం 13వ ఆయతులో వచ్చిన దీని ప్రస్తావనే. ‘మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనయాడుతోంది. ఆయన స్తోత్రం చేస్తుంది’ (అర్రాద్‌:13) ఉరుము మెరుపులు మేఘాలలోని భాగం. మేఘం – అది అల్లాహ్‌ అనుగ్రహం, ఆగ్రహానికి ఆనవాలు కూడా. అది వనయి కురిస్తే జీవితం, అది పిడుగయి పడతే మరణం. ఇది అల్లాహ్‌ సృష్టి నిదర్శనాల్లోని ఓ నిదర్శనం.

దానికి అతను – ”అల్లాహ్‌ ఎవరు? బంగారంతో చేయబడిన వాడా? వెండితో చేయబడినవాడా? రాగితో చెయ్యబడిన వాడా? అని అడిగాడు.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మదనీ సూరహ్‌. అయితే ఇది మక్కీ సూరహ్‌ అన్న అభిప్రాయం కూడా బలంగా విన్పిస్తుంది.
2) ఇది మసానీ సూరాలలోనిది.
3) ఆయతుల సంక్య 43.
4) క్రమానుసారం ఇది 13వ సూరహ్‌,
5) ఇది ‘ముహమ్మద్‌’ సూరహ్‌ా తర్వాత అవతరించింది.
6) ఇది హురూప్‌ ముఖత్తఆత్‌తో ప్రారంభమవుతుంది. (المر)
7) ఈ సూరహ్‌లో ఒక సజ్దా 15వ ఆయతు దగ్గర ఉంది.

ముఖ్యాంశాలు:

ఈ సూరహ్‌ా తౌహీద్‌, రిసాలత్‌, ఆఖిరత్‌ గురించి చెప్పడమే కాక, ఈ విషయంలో ముష్రికుల నుండి ఎదురయ్యే సవాళ్ళకు సరయిన సమాధానం కూడా చెబుతుంది.

అవతరణ నేపథ్యం:

అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర) ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్‌ (స) అరబ్బులోని ఓ నియంత వైపనకు ఒక సహాబీని పంపి అతన్ని పిలుచుకు రావాల్సిందిగా పురమాయించారు. ఆయన వెళ్లి రసూలుల్లాహ్‌ా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పగా – దానికి అతను – ”అల్లాహ్‌ ఎవరు? బంగారంతో చేయబడిన వాడా? వెండితో చేయబడినవాడా? రాగితో చెయ్యబడిన వాడా? అని అడిగాడు. సహాబీ వచ్చి ఆ విషయాన్ని ప్రవక్త (స) వారికి చేరవేశాడు, అలా రెండు మూడు సార్లు జరిగింది. చివరి సారి వెళ్ళి మ్లాడుతుండగా – అతను అదే రీతిన హేళనకు దుగుతున్న సమయంలో ఓ పిగుడు వచ్చి అతని తలపై పడి అతని తలను చీల్చుకుంటూ భుమిలోకి పాతుకుపోయింది. ఈ నేపథ్యంలోనే అల్లాహ్‌ ఈ ఆయతు అవతరింపజేశాడు:

وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ ”మరియు ఆయన పెళపెళమనే ఉరుములను పంపి వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు” (అర్రాద్‌: 13)

2) ప్రవక్త (స) వారిని చంపాలన్న ఉద్దేశ్యంతో వచ్చి ఆయన్ను మాటల్లో దింపేందుకు ఒకడు ప్రయత్నించగా మరొకడు వెనక నుండి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నాడు. అప్పుడు జరిగిన సంభాషణ. ఆమిర్‌ బిన్‌ తుఫైల్‌ – ఓ ముహమ్మద్‌ (స) ఒకవేళ నేను ఇస్లాం స్వీకరిస్తే దానికి నాకు దక్కే బహుమానం ఏమి? అని అడిగాడు. ఇతర ముస్లింలకు దక్కిన బహుమానమే నీకూ దక్కుతుంది అన్నరు ప్రవక్త (స). అలా కాదు నీ తర్వాత నన్ను నీ ప్రతినిథిగా ప్రకిస్తావా?’ అని మళ్ళి అడిగాడు. అది అల్లాహ్‌ అభీష్టం. అందులో నేను జోక్యం చేసుకోవడానికి లేదు. మరయితే నాకు మీరు అప్పగించే బాధ్యత ఏమి? అని తరిగి ప్రశ్నించాడు. అందుకు ప్రవక్త (స) ‘నేను అన్నీ వస్తువులు గల ఓ గుర్రాన్ని ఇస్తాను, వెళ్ళి అల్లాహ్‌ మార్గంలో పోరాడు అన్నారు. ఇలా మా మంతి జరుగుతుండా అర్బద్‌ అనే వ్యక్తి వెనుక నుండి దాడి చెయ్యడానికి సిద్ధ మయి పోయాడు. అయితే అతని చెయ్యి లేవడం లేదు. అల్లాహ్‌ తరఫున ఓ పిడుగు పడి చచ్చాడు. మరో వ్యక్తి ప్రవక్త (స) ఓ పెద్ద సైన్యమే తీసుకు వస్తానని పారి పోయాడు. మరుసి రోజు కరవాలం చేతబూని ప్రవక్త (స) వారిని, మరణ దూత పని పడతానని బయలు దేరాడు. అయితే కాసింత దూరం వచ్చాక దైవదూత అతనికో గుద్దు గుద్డాడు. అంతే మట్టిలో కూరుకు పోయాడు. అతని మోకాలి మీద ఓ పుండు లాంటి ఏర్పడింది. దాంతో అతను తన గుర్రం వీపు మీదే చచ్చాడు.
سَوَاءٌ مِّنكُم مَّنْ أَسَرَّ الْقَوْلَ وَمَن جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ (10)
మీలో ఒకడు తన మాటను రహస్యంగాచెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నాలేక పగటివెలుగులోతిరుగుతూ ఉన్నా, (అల్లాహ్దృష్టిలో) అంతాసమానమే(ఒకటే)!
3) అబ్దుల్లాహ్‌ బిన్‌ అతా తన అవ్వతో ఉల్లేఖించిన మాట – ఆమె అన్నారు నేను జిబైర్‌ బిన్‌ అవ్వామ్‌ (ర) గారి ఇలా చెబుతూ విన్నాను. ఖురైష్‌ ప్రజలు ప్రవక్త (స) వారి వద్దకు వచ్చి – ”నువ్వు నిన్ను ప్రవక్తగా భావిస్తున్నావు కదా! నీపై వహీ అవతరిస్తుంది అంటున్నా కదా! మరి సులైమాన్‌ (అ) గారికి గాలుల్లి కైవసం చెయ్యడం జరిగింది. మూసా (అ) గారి సమద్రాన్ని అధీన పర్చడం జరిగింది. ఈసా (అ) వారికి మృతుల్ని బతికించే మహిమ ఇవ్వబడింది. ఒకవేళ నువ్వే గనక ప్రవక్త అయితే, ఈ కొండల్ని పిండి చేయి మా కోసం పంట భూముల్ని తయారు చెయ్యమని చెప్పు. వాి మధ్యన సెలయేర్ల ను ప్రవహింప జెయ్యమని చెప్పు. లేదా మరణించిన మా పూర్వీకుల్ని బతికించమని చెప్పు మేము వారితో మాట్లాడి ఏదోక విషయం తేల్చుకుంటాము. లేదా నువ్వు కూర్చున్న ఈ బండరాయిని బంగారంగా మార్చేయమని చెప్పు. ఆ విధంగా వేసవిలో మా వర్తక ప్రయాణం తప్పుతుంది. మేమందరం ఆయన చుట్టూ ఉండగానే అల్లాహ్‌ తరఫు నుంచి ఉత్తరం అందుకున్న ఆయన ఇలా అన్నారు: ఎవని చేతిలోనయితే నా ప్రాణముందో ఆయన సాకిగా చెబుతున్నా – మీరడిగిందల్లా అల్లాహ్‌ నాకు ఇస్తానన్నాడు కానీ తర్వాత మీరు కారుణ్య ద్వారానికి దూరమయి పోతారు. కనుక నేను వీటికి బదులు కారుణ్య తలుపునే ఎన్నుకున్నాను. అప్పుడు ఈ ఆయతు అవతరించింది:
وَلَوْ أَنَّ قُرْآنًا سُيِّرَتْ بِهِ الْجِبَالُ أَوْ قُطِّعَتْ بِهِ الْأَرْضُ أَوْ كُلِّمَ بِهِ الْمَوْتَىٰ ۗ بَل لِّلَّهِ الْأَمْرُ جَمِيعًا ۗ

మరియు నిశ్చయంగా, (ఖుర్ఆన్ను) పఠించటం వలన కొండలు కదలింప బడినా, లేదా దానివల్ల భూమి చీల్చబడినా, లేదా దాని వల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా! (అవిశ్వాసులు దానిని విశ్వసించరు). వాస్తవానికి సర్వనిర్ణయాల అధికారం కేవలం అల్లాహ్కే చెందుతుంది.

Related Post