సూరహ్‌ నూర్‌

నామకరణం: సూరహ్‌ నూర్‌

ఈ సూరహ్‌కి ‘అన్నూర్‌’ అని నామకరణం చెయ్యడానికి గల కారణం – ఇదే సూరహ్‌లో 35వ ఆయతులో వచ్చిన ‘అల్లాహు నూరుస్సమావాతి వల్‌ అర్జ్‌’ అల్లాహ్‌ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి! అన్న ప్రస్తావనే. నిజంగా ఈ సూరహ్‌లో పేర్కొనబడిన నీతిని తూచా తప్పకుండా పాటిస్తే ఇల్లు, సమాజం, దేశం గొప్ప స్థితికి చేరుకుంటుంది.

”ఏ మనిషండి బాబూ! ఇతని మెదడు నుండి వస్తున్న మాటలు ఏం మాటలండి బాబు! ఒకవేళ ఈ మాటలే గనక తుర్క్‌ తెగ వాళ్లు వింటే తకణమే ఇస్లాం స్వీరిస్తారు.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మదనీ సూరహ్‌.

2) ఇది మసానీ సూరాలలోనిది.

3) క్రమానుసారం ఇది 24వ సూరహ్‌.

5) ఇది హష్ర్‌ సూరహ్‌ అనంతరం అవతరించింది.

6) ఇది ‘సూరతున్‌ అన్జల్‌నా’ అని ప్రారంభం అవుతుంది.

7) ఇది విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర.అ) గారిపై మోపబడిన నిందను ఖండిస్తుంది.

ముఖ్యాంశాలు:

ఇది ఇతర మదనీ సూరాల మాదిరిగానే ఇస్లామీయ షరీఅతు గురించి చర్చిస్తుంది. ముఖ్యం కుటుంబ, సామాజిక విలువల గురించి ఇది ప్రస్తావిస్తుంది.

అవతరణ నేపథ్యం:

1) సహాబాలో కొందరు లేదా ఒకరిద్దరు మక్కా నుండి మదీనాకు హిజ్రత్‌ చేసి వెళ్లి తర్వాత కొందరు పెళ్ళి కాని ఉమ్మె మహ్‌దూన్‌, ఉమ్మె గలీజ్‌, వహియియా ఖిబ్‌తియా, ఉమ్మె సువైద్‌, జలాలా వంటి వ్యభిచార స్త్రీలతో వివాహం చేసుకోవాలనుకున్నారు. అప్పుడు ఈ ఆయతు అవతరించడం జరిగింది: ఒక వ్యభిచారి, ఒక వ్యభిచారిణిని లేక బహుదైవారాధకురాలయిన (ముష్రిక్‌) స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు; మరియు ఒక వ్యభిచారిణిని, ఒక వ్యభిచారుడో లేక ఒక బహు దైవారాధకుడో మాత్రమే వివాహ మాడుతాడు. మరియు ఇలాంటి విషయం విశ్వాసుల కొరకు నిషేధించబడింది. (3)

2) హిలాల్‌ బిన్‌ ఉమయ్యహ్‌ (ర) సాయంత్రం పొలం నుండి ఇంటికొచ్చే సరికి ఆయన అభార్య పర పురుషునితో ఉండటం చూసి కోపంతో ఊగి పోయారు. అయితే నలుగురు సాకులు తప్పసరి అన్న ఈమరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనిందమోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొనిరాలేరో, వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు (ఫాసిఖూన్‌). (4) ఆదేశం కారణంగా అయన చాలా మధన పడ్డారు. ఆ విషయాన్ని ఎంతో బాధ పడుతూ ప్రవక్త (స) వారికి విన్నవించుకోగా – అల్లాహ్‌ ఈ ఆయతును అవతరింప జేశాడు. మరియు ఎవరైతే, తమ భార్యల మీద అపనిందమోపి, దానికి తాము స్వయమే తప్ప ఇతరులను సాక్షులుగా తేలేరో, వారు తమంతట తామే నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి సాక్ష్యమిస్తూ: నిశ్చయంగా, తాను సత్యం పలుకుతున్నాననీ;

మరియు ఐదవసారి అతడు ఒకవేళ అసత్యం పలుకుతున్నట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్‌ ఆగ్రహం తనమీద విరుచుకుపడు గాక! అనీ అనాలి.

ఇక ఆమె (భార్య) శిక్షను తప్పించుకోవ టానికి, నాలుగు సార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేస్తూ: నిశ్చయంగా, అతడు అబద్ధం చెబుతున్నాడనీ;

మరియు అయిదవ సారి ఒకవేళ అతడు సత్యవంతుడైతే! నిశ్చయంగా, తన మీద అల్లాహ్‌ ఆగ్రహం విరుచుకుపడుగాక! అనీ అనాలి. (7-9)

సూరహ్‌ ఘనత:

హజ్రత్‌ ఉమర్‌ (ర) ఇలా అంటూ ఉండేవారు: మీరు  నిసా, అహ్జాబ్‌, నూర్‌ సూరాలను నేర్చుకోండి.

”మీరు మీ పురుషులకు సూరహ్‌ మాయిదహ్‌ నేర్పండి, మీ స్త్రీలకు సూరహ్‌ నూర్‌ నేర్పించండి. (హాకిమ్‌)

అబూ వాయిల్‌ కథనం – నేను అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌తో హజ్జ్‌ చేశాను. ఆయన హజ్జ్‌ సందర్భంగా సూరహ్‌ నూర్‌ చదివి దానికి వ్యాఖ్యానం చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యాన విధానానికి ముగ్దుడయిన నా స్నేహితుడు ఇలా అన్నాడు: ”ఏ మనిషండి బాబూ! ఇతని మెదడు నుండి వస్తున్న మాటలు ఏం మాటలండి బాబు! ఒకవేళ ఈ మాటలే గనక తుర్క్‌ తెగ వాళ్లు వింటే తకణమే ఇస్లాం స్వీరిస్తారు.

Related Post