సూరహ్‌ హూద్‌ (అ)

నామకరణం: సూరహ్‌ హూద్‌ (అ)

ఈ సూరహ్‌కు హూద్‌ అని నామకరణం చెయ్యడానికి గల కారణం ఈ సూరహ్‌ాలో ప్రవక్త హూద్‌ (అ) వారి ప్రస్తావన కాసింత వివరంగా రావడమే. హూద్‌ జాతి చాలా బలీయమయిన జాతిగా ఖ్యాతి.

మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమా’జ్ సలపండి. నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మక్కీ సూరహ్‌. 12,17,114 ఆయతులు తప్ప; ఇవి మదనీ.
2) ఇది మీయీన్‌ సూరాలలోనిది. ఆయతుల సంక్య 123.
3) క్రమానుసారం ఇది 11వ సూరహ్‌.
4) ఇది హురూఫ్‌ ముఖత్తఆత్‌తో (الر) ప్రారంబమవుతుంది.
5) ఇది ప్రవక్త గాథల్లో గల పరమార్థ వివరణతో ముగుస్తుంది.


ముఖ్యాంశాలు:

ఇది ఇతర మక్కీ సూరాల మాదిరిగానే తౌహీద్‌, రిసాలత్‌, ఆఖిరత్‌ గురించి నొక్కు పెడుతుంది. ముఖ్యంగా ఈ సూరహ్‌ా ప్రవక్త (స) వారిపై అవతరించిన కాలం నాటికి ఆయన తీవ్ర మనో వేదనకు గురయి ఉన్నారు. ఆయన బాబాయి అబూ తాలిబ్‌, భార్య ఖదీజా (ర.అ) మరణించిన కారణంగా ఆయన శోక సముద్రంలో మునుగి ఉన్నారు. అలాంటి తరుణంలో అవతరించిన ఈ సూరహ్‌ గత ప్రవక్తల గాథల్ని తెలియజేసి ఆయన్ను ఓదార్చింది. ఓర్పు సహనాలు కలిగి ఉండాల్సిందిగా ప్రోత్సహించింది.
అవతరణ నేపథ్యం: మక్కాలో అఖ్నస్‌ బిన్‌ షరీఖ్‌ అను ఒక వ్యక్తి ఉండవాడు. అతను ప్రవక్త (స) వారి వద్దకు వచ్చి ఎంతో తియ్యటి మాటలు చెప్పి ఓదారుస్తున్నట్లు నించేవాడు. కానీ మనసులో మాత్రం తీవ్రమయిన ధ్వేషం ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే ఓదార్చుతూనే లోలోన పైశాచికానందం చెందేవాడు. అతని అసలు రూపాన్ని బహిర్గత పరుస్తూ ఈ ఆయతు అవతరించింది: أَلَا إِنَّهُمْ يَثْنُونَ صُدُورَهُمْ لِيَسْتَخْفُوا مِنْهُ ۚ أَلَا حِينَ يَسْتَغْشُونَ ثِيَابَهُمْ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ (5)

వినండి! వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవటానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త! వారు తమ వస్త్రాలలో తమను తాము కప్పుకున్న ప్పటికీ, ఆయన (అల్లాహ్)కు వారు దాచే విషయాలూ మరియు వెలిబుచ్చే విషయాలూ అన్నీ బాగా తెలుసు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్నవి (రహస్యాలు) కూడా బాగా తెలుసు.
2) ఒక సహాబీ ఒక స్త్రీని భావోద్రేకానికి లోనయి ముద్దు పెట్టుకున్నారు. అపరాధ భావంతో వచ్చి ప్రవక్త (స) విషయం వివరించారు. అప్పుడు ఈ ఆయతు ఆవతరించింది: 

وَأَقِمِ الصَّلَاةَ طَرَفَيِ النَّهَارِ وَزُلَفًا مِّنَ اللَّيْلِ ۚ إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ ۚ ذَٰلِكَ ذِكْرَىٰ لِلذَّاكِرِينَ 

(114)

మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమా’జ్ సలపండి. నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక). 


ఈ సూరహ్‌ ఘనత:

ప్రవక్త (స) అన్నారు: ”హూద్‌ మరియు దాని చెల్లెల్లునన్ను వృద్ధుణ్ణి చేసేశాయి. (వాఖిఅహ్‌, ముర్స లాత్‌, నబా, తక్వీర్‌).
అబూ అలీ అస్సరీ కథనం- నేను ప్రవక్త (స)ను చూసి ఇలా అడిగాను: ”మిమ్మల్ని హూద్‌ సూరహ్‌ వృద్ధుణ్ణి చేసింది అని మీ గురించి జనులనుకుంటున్నారు. ఇది నిజమేనా? అందుకాయన-అవును నేనన్నాను- అందులో గల ప్రవక్త గాథలు, గత సముదాయాలను విధించబడిన శికలు మిమ్మల్ని వృద్ధుణ్ణి చేశాయా? ఆయనన్నాడు -లేదు  فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا ۚ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ (112)
కనుక (ఓ ప్రవక్తా!) నీవూ మరియు పశ్చాత్తాపపడి (ఆయనవైపుకు మరలిన) నీ సహచరులూ, నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా ఋజుమార్గంపై స్థిరంగా ఉండండి, అన్న అల్లాహ్‌ ఆదేశం నన్ను వృద్ధుణ్ణి చేసింది.

Related Post